శ్రీ మదగ్ని మహాపురాణము - 76


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 76 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻.అథ కుశాపామార్జన విధానమ్‌ - 1 🌻

రక్షణ చేయు విధానం

అగ్ని రువాచ :

రక్షాం స్వస్య పరేషాం వక్ష్యేతాం మార్జనాహ్వయామ్‌ |యయా విముచ్యతే దుఃఖైః సుఖం చ ప్రాప్నుయాన్నరః. 1

ఓం నమః పరమార్థాయ పురుషాయ పరమాత్మనే | అరూపబహురూపాయ వ్యాపినే పరమాత్మనే. 2

నిష్కల్మషాయ శుద్ధాయ ధ్యానయోగరతాయ చ | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మ వచః. 3

వరాహాయ నృసింహాయ వామనాయ మహాత్మనే | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మే వచః. 4

త్రివిక్రమాయ రామాయ వైకుణ్ఠాయ నరాయ చ | నమస్కృత్య ప్రవక్ష్యామి యత్తత్సిధ్యతు మేవచః. 5

అగ్నిదేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పచున్నాను. దీనికి ''మార్జనము'' లేదా ''అపామార్జనము'' అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును.

సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును, అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను.

కల్మషరహితుడును, పరమశుద్ధుడును, నిత్యధ్యానయోగనిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి రక్షావిషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక. భగవంతు డైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రక్షావిషయమున చెప్పెదను.

నా వాక్యము సిద్ధించుగాక. భగవతంతుడైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రక్షావిషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.

వరాహనరసింహేశ వామనేశ త్రివిక్రమ | హయగ్రీవేశ సర్వేశ హృషీ కేశ హరాశుభమ్‌. 6

అపరాజితచక్రా ద్యైశ్చతుర్భిః పరమాయుధైః| అఖణ్డితానుభావైస్త్వం సర్వదుఃఖహరో భవ. 7

హరాముకస్య దురితం సర్వం చ కుశలం కురు | మృత్యుబన్ధార్తిభయదం దురితస్య చ యత్ఫలమ్‌. 8

ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీకేశా! నా నమస్త అశుభములను హరింపుము.

ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! ఆకుంఠితశక్తి గల నీ చక్రావ్యాయుధములు నాలిగింటిచే సమస్తదుష్టుల సంహారము చేయుము.

ఓ ప్రభూ! ఫలానావాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశలక్షేమము ను ప్రసాదించుము. పాపములవలన కలుగు మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.

పరాభిధ్యానసహితైః ప్రయుక్తం చాభిచారికమ్‌ | గరస్పర్శమహారోగప్రయోగం జరయా జర. 9

ఓం నమో వాసుదేవాయ నమః కృష్ణాయ ఖడ్గినే | నమః పుష్కరనేత్రాయ కేశవాయాదిచక్రిణ. 10

నమః కమలకిఞ్జిల్కపీతనిర్మలవాసనే | మహాహవరిపుస్కన్ధఘృష్టచక్రాయ చక్రిణ. 11

దంష్ట్రోద్ధృతక్షితిభృతే త్రయిమూర్తి మతే నమః | మహాయజ్ఞవరాహాయ శేషభోగాఙ్కశాయినే. 12

తప్తహాటక కేశాన్తజ్వలత్పావకలోచన | వజ్రాధికనఖస్పర్శ దివ్యసింహ నమో7స్తు తే. 13

కాశ్యపాయాతిహ్రస్వాయ బుగ్యజుఃసామభూషిణ | తుభ్యం వామనరూపాయాక్రమతే గాం నమో నమః. 14

ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమిశ్రాన్నపానములను, వారు కల్పించిన మహారోగములను జరాజీర్ణములుగ చేసి వాటి నన్నింటిని నశింపచేయుము.

ఓం భగవంతు డైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమలనేత్రుడును, ఆది చక్రధారియు అగు కేశవునకు సమస్కారము.

పద్మముల కింజల్కముల వలె పసుపు రంగు గల నిర్మలవస్త్రములు ధరించిన, భగవంతుడైన పీతాంబరునకు నమస్కారము. ఘోరసంగ్రామములలో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము.

కోరపై లేవదీయబడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును శేషశయ్యపై శయనింఉవాడును అగు మహాయజ్ఞవరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్యసింహమూర్తీ! నీ కేశాంతములు కరిగించిన బంగారము వలె ప్రకాశించుచున్నవి.

నేత్రములు అగ్ని వలె ప్రజ్వంచుచున్నవి. నీ నఖముల స్పర్వ వజ్రస్పర్శకంటె గూడ ఎక్కువ తీక్షణమైనది. నీకు నమస్కారము. చాల చిన్న శరీరము కలిగి, బుగ్వజుఃసామవేదముచే అలంకృతుడ వైన కాశ్యపకుమారా! వామనా! నమస్కారము.

పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం

25.Aug.2020

No comments:

Post a Comment