రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
45. అధ్యాయము - 20
🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 1 🌻
బ్రహ్మోవాచ |
నారద త్వం శృణు మునే శివాగమన సత్తమమ్ | కైలాసే పర్వత శ్రేష్ఠే కుబేరస్య తపోబలాత్ || 1
నిధిపత్వ వరం దత్త్వా గత్వా స్వస్థానముత్తమమ్ | విచింత్య హృది విశ్వేశః కుబేర వరదాయకః || 2
విధ్యంగజ స్వరూపో మే పూర్ణః ప్రలయ కార్యకృత్ | తద్రూపేణ గమిష్యామి కైలాసం గుహ్యకాలయమ్ || 3
రుద్రో హృదయ జో మే హి పూర్ణాంశో బ్రహ్మనిష్కలః | హరి బ్రహ్మాదిభిస్సేవ్యో మదభిన్నో నిరంజనః || 4
తత్స్వ రూపేణ తత్రైవ సుహృద్భూత్వా విలాస్యహమ్ | కుబేరస్య చ వత్స్యామి కరిష్యామి తపో మహత్ || 5
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ నారదమునీ! కుబేరుని తపః ప్రభావము వలన శివుడు పర్వతరాజమగు కైలాసమునకు వచ్చుట అనే పుణ్య వృత్తాంతమును వినుము (1).
విశ్వేశ్వరుడు కుబేరునకు వరములనిచ్చి, శ్రేష్ఠమగు తన ధామను పొంది, హృదయములో నిట్లు ఆలోచించెను (2).
బ్రహ్మ శరీరము నుండి ఆవిర్భవించిన ప్రళయ కర్తయగు రుద్రుడు నా పూర్ణావతారము. నేను ఆ రూపములో గుహ్యకులుండే కైలాసమునకు వెళ్లెదను (3).
నా హృదయము నుండి పుట్టిన రుద్రుడు పూర్ణాంశము గలవాడు, నిర్గుణ పరబ్రహ్మ, హరి బ్రహ్మాదులచే సేవింపబడువాడు, నా కంటె వేరు కానివాడు, దోషరహితుడు (4).
నేను ఆ రూపముతో అచట కుబేరుని మిత్రుడనై విహరించెదను. మరియు గొప్ప తపస్సు చేసెదను (5).
ఇతి సంచింత్య రుద్రోsసౌ శివేచ్ఛాం గంతుముత్సుకః | ననాద తత్ర ఢక్కాం స్వాం సుగతిం నాదరూపిణీమ్ || 6
త్రైలోక్యా మానశే తస్యా ధ్వనిరుత్సాహ కారకః | ఆహ్వానగతి సంయుక్తో విచిత్రస్సాంద్రశబ్దకః || 7
తచ్ఛ్రుత్వా విష్ణుబ్రహ్మాద్యా స్సురాశ్చ మునయస్తథా | ఆగమా నిగమా మూర్తా స్సిద్ధా జగ్ముశ్చ తత్ర వై || 8
సురాసురాద్యాస్స కలాస్తత్ర జగ్ముశ్చ సోత్సవాః | సర్వేsపి ప్రమథా జగ్ముర్యత్ర కుత్రాపి సంస్థితాః || 9
ఇట్లు తలపోసినంతనే, రుద్రుడు శివుని ఇచ్ఛను పూర్తిచేయుటలో ఉత్సాహము గలవాడై, పుణ్యగతిని ఇచ్చే నాదస్వరూపిణియగు తన ఢక్కను నినదించెను (6).
ఉత్సాహమును కలిగించునది, గమనమునకు ఆహ్వానించునది,విచిత్రమైనది, గంభీరశబ్దము గలది అగు ఆ ఢక్క యొక్క ధ్వని ముల్లోకములలో వ్యాపించెను (7).
ఆ ధ్వనిని విని, విష్ణు బ్రహ్మాది దేవతలు, మునులు, ఆగమములు, వేదములు మూర్తి దాల్చి, సిద్ధులు అచటకు వెళ్లిరి (8).
అందరు దేవతలు, రాక్షసులు ఉత్సాహముతో నచటకు వెళ్లిరి. ప్రమథులు (రుద్ర గణములు) ఎక్కడ ఉన్ననూ అచటకు బయలు దేరిరి (9).
గణపాశ్చ మహా భాగాస్సర్వలోక నమస్కృతాః | తేషాం సంఖ్యా మహం వచ్మి సావధానతయా శృణు || 10
అభ్యయాచ్ఛంఖ కర్ణశ్చ గణకోట్యా గణశ్వరః | దశభిః కేకరాక్షశ్చ వికృతోsష్టాభిరేవ చ || 11
చతుష్టఎ్టా్య విశాఖశ్చ నవభిః పారియాత్రకః | షడ్భి స్సర్వాంతక శ్ర్శీమాన్ దుందుభోష్టాభిరేవ చ || 12
జాలంకో హి ద్వాదశభిః కోటి భిర్గణ పుంగవః | సప్త భి స్సమద శ్ర్శీమాంస్త థైవ వికృతాననః || 13
పంచభిశ్చ కపాలీ హి షడ్భి స్సందారకశ్శుభః | కోటి కోటి భిరేవేహ కండుకః కుండకస్తథా || 14
మహాత్ములు, సర్వ జీవులచే నమస్కరింపబడువారు నగు గణపతులు కూడ బయలు దేరిరి. వారి సంఖ్యను నేను చెప్పెదను. సావధానముగా వినుము (10).
శంఖకర్ణుడగు గణనాథుడు కోటి గణములతో బయలుదేరెను. కేకరాక్షుడు పది, వికృతుడు ఎనిమిది (11),
విశాఖుడు అరవై నాలుగు, పారియాత్రకుడు తొమ్మిది, సర్వాంతకుడు ఆరు, శ్రీమాన్ దుందుభుడు ఎనిమిది (12),
గణశ్రేష్ఠుడగు జాలంకుడు పన్నెండు, శ్రీమాన్ సమదుడు ఏడు, వికృతాననుడు కూడ ఏడు (13),
కపాలి అయిదు, శుభకరుడగు సందారకుడు ఆరు, కండుకుడు, కండకుడు ఒక్కొక్కటి కోట్ల గణములతో కూడి వెళ్ళిరి (14).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment