✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చలాచలభోధ
తృతీయాధ్యాయము - సూత్రము - 41
🌻. 41... తస్మిన్ తజ్జనే భేదాభావాత్ ॥ - 2 🌻
🌻. విరోధ స్వరూపం :
1) స్వరూప విరోధి :
శరీరమే జీవుడనే భావన. అన్య దేవతా దాస్యం (శ్రీ హరిని కాదని) భగవంతుడెంత గొప్పవాడైతే నాకేమి ? అని, భగవంతుడితో నాకేమి ప్రయోజనం ? అని ఉదాసీన భావన.
2) పరత్వ విరోధి :
శ్రీమన్నారాయణుని తక్కువగా చూడడం, శివ కేశవులు సమానమనడం, అవతార పురుషులను మానవ మాత్రులనుకొనడం, అర్వ్సావతారాలను (ప్రతిమలను, శిలాతామములనుకొని వాటిని భగవంతునిగా (గ్రహించకపోవటం, హరి సర్వోత్తముదని భావించక నిరాకరించడం.
3) పురుషార్ధ విరోధి :
4) మోక్షం కోరకపోవటం :
భగవత్రైంకర్యం ముఖ్య పురుషార్ధమని తలపకపోవటం, శాస్ర్తీయ పద్ధతిని విడచి తనకిష్టమైన పద్ధతిని పాటించడం, కైంకర్యంలో లోపం, మొదలగునవి.
5) ఉపాయ విరోధి :
పురుషోత్తమునియందు ప్రపత్తి చేసితిని గాని, అంత మాత్రం చెతనే మోక్షం లభించునా ? అని సంశయం, నిరుత్సాహపడడం, నావంటి పాపాత్ముడిని ప్రభువు క్షమించునా? అని భయపడడం భగవంతుడు మాత్రమె సిద్దాపాయమనె విశ్వాసం లేకపోవటం.
6) ప్రాప్తి విరోధి :
భగవంతుని యెడల తెలియక చేసిన, తెలిసి చేసిన అపచారాలు, రహస్యంగా చేసిన అపచారాలు, అలాగే భాగవోత్తముల యెడల చేసిన అపచారాలు భగవత్రాప్తిక విరోధాలు. ఈ ఐదింటిని తొలగించుకొంటె భగవంతునికి దూరంగా జరుగం. ఇక దగ్గరగా జరిగే ఉపాయాలు చెప్తున్నారు.
🌻. ఉపాయ స్వరూపం :
1) కర్మ :
వ్రతాలు, దాన ధర్మాలు, యాగ హోమాలు, తపస్సు, స్వాధ్యాయం, తీర్ధాటనం మొదలగు సత్మర్మలను నిష్కామంగా, నిస్వార్ధంగా అమితమైన భక్తి ప్రపత్తులతో చెయాలి. తీర్ధ యాత్రలు వినోద విహార యాత్రలుగా చేయరాదు.
2) జ్ఞానం ;
జ్ఞానం వలన యోగం, యోగ బలంచే వాసుదేవని హృదయ కమలమందు సాక్షాత్మరింప జేసికొని ధ్యానించడం.
3) భక్తి :
సర్వదేశ, సర్వకాలాల్లో సర్వావస్ధల్లో తైలధారవలె తెంపు లేకుండా భగవంతుని యెడల స్మృతి కలిగి సేవించడం. సాంసారిక, ప్రాపంచిక విషయాలందు ప్రీతిని వదలి, భగవంతునియందు ప్రేమ కలిగి ఉండడం. చిత్తం మాధవుని యందు చేర్చి, పురుషోత్తమునితో ఏకీకృత మవడం.
4) ప్రపత్తి :
కర్మ జ్ఞానాదులందు శక్తిని ఉపయోగించలేనివారు దేహాన్ని ఆత్మను రక్షించే భారం శియఃపతి యందుంచడం, తదీయ గుణానుభవాలను భగవత్షైంకర్యం చేసి ఉండటం.
5) ఆచార్యాభిమానం :
జ్ఞానానువాన పరాయణుని ఆశ్రయించి, నిరంతరం ఆయనకు పరిచర్య చేస్తూ, ఆయన కృపకు పాత్రుడవటం (శబరి మాత శ్రీరాముని ఆశ్రయించినట్ట్లు.)
ఈ విధంగా భక్తులు ఈ ఐదు ఉపాయాల వలన భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇవిగాక, భక్త ప్రహ్లాదుని ఉపాయాన్ని చూడండి. ఇది సర్వుల యెడ భేద భావం హరిస్తున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment