✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 16, 17 📚
సృష్టిలో లేనిది భావమునకే రాదు. ఉన్నది భావమునకు రాకపోదు. అందుకే చమత్కారముగా ''సృష్టిలో లేనిదంటూ లేదు'' అని అంటారు. లేనిది భావనకే రాదు. భావనలోకి వచ్చినది ఉండకుండ పోదు.
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః | ఉభయోరపి దృష్టో-ంత స్త్వనయో స్తత్త్వదర్శిభిః || 16
అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతమ్ | వినాశ మవ్యయ స్యాస్య న కశ్చి త్కర్తు మర›తి || 17
అందుకే దైవము లేనుట తెలివి తక్కువ. లేనిచో భావమునం దెట్లేర్పడును? లేనిది భావమునకు రాదు కదా ! ఉన్నది మనకి కనప నప్పుడు లేదందుము. మనకు కనపడనిది లేదనుట పసితనము.
దయ్యములు ఉన్నవా? అను ప్రశ్న వచ్చినపుడు కూడ సమాధాన మిదియే. లేనిది భావించము కదా! మనకు తెలిసిన విషయము లన్నియు ఉన్నవియే. కానిచో కొందరికి ఉండవచ్చు.
కొందరికి ఉండకపోవచ్చు. ఉండుట, లేకుండుట, గ్రహించువాని స్థితిని బట్టి ఉండును. కొందరికి సూక్ష్మ లోకములున్నవి. వాని అనుభూతి కూడ ఉన్నది. కొందరికి లేదు.
అనుభూతి లేనివారు లేవందురు. అనుభూతి కలుగనంత వరకు లేదన్నది వారికి సత్యము కాని, శాశ్వత సత్యము కాదు.
అటులనే ఏదియైునను ఒకప్పుడుండుట, మరియొకప్పుడు ఉండ కుండుట ఉండదు. మన తాత ముత్తాతలు, మన ముందు
తరముల వారు, ముందు యుగముల వారు ఉన్నారా అను ప్రశ్నకు సమాధానము ఉన్నారనియే!
ఉండుట కేవలము భౌతికము కాదని తెలియవలెను. సృష్టి యందలి ప్రతివస్తువూ స్థూలముగ గాని, సూక్ష్మముగగాని శాశ్వతముగ ఉండి యుండును. స్థూలమున అగుపించినపుడు ఉన్నదను కొనుట, అగుపించనపుడు లేదను కొనుట అవివేకము.
దశరథుని అంత్యక్రియల అనంతరము ఇపుడు దశరథుండు లేు కదా! కావున రాజ్యము చేపట్టుము అని పలికిన మంత్రి జాబాలికి రాముడు ఇచ్చిన సమాధానము ఈ
సూత్రము ననుసరించియే యుండును.
నిజమునకు సృష్టియందు పుట్టునది, పోవునది ఏమియు లేదు. స్థూలముగ అగుపించినపుడు సృష్టినదందుము, సూక్ష్మస్థితి చెందినపుడు పోయినదందుము. ఇది పరిమితమైన అవగాహనము. ప్రళయమున కూడ లోకములు, లోకేశులు, లోకస్థులు బీజప్రాయముగ నుండి సృష్టి ఆరంభమున దివ్య సంకల్పము నుండి మరల పూర్వ పద్ధతినే దిగివచ్చుచుందురు. కావున ఉన్నది లేకపోలేదు.
లేనిది ఎప్పికినీ లేదు. జీవుల ప్రళయమున దైవము నందుండు టయే ఉండునుగాని, కరగిపోవుట, కలయుట లేదు. అట్లగుపించును.
అందువలన తెలిసినవారు ఈ సమస్తమును ఎప్పుడునూ ఉన్నదిగను, శాశ్వతముగను భావింతురు. కాలచక్రమున సూక్ష్మము నుండి స్థూలమునకు, స్థూలము నుండి సూక్ష్మమునకు వచ్చిపోవుచుండును గాని, అసలు లేకుండుట ఉండదని వారి జ్ఞానము.
గ్రహమునకు గ్రహమునకూ మధ్య గల చోటు యందు ఏమియు లేదని ఇటీవలి వరకు శాస్త్రజ్ఞులు అనుచుండిరి. అది అంతయు దైవముతో నిండియున్నదని ఆత్మజ్ఞానులు తెలుపుదురు.
ఈ శతాబ్దమున చోటంతయూ శాన్యము కాదని, పూర్ణమని శాస్త్రజ్ఞులు తెలుసుకొనుచున్నారు. అటులనే సూక్ష్మ లోకముల వికాసము లేనివారు, దివ్య శరీరధారులైన మహర్షులు, పరమ గురువులు, దేవతలు లేరనుచుందురు. క్రమ వికాసమున వీరందరు ఉన్నారని ఒప్పుకొనక తప్పదు.
పదార్థమయ ప్రపంచము కూడ లేకపోవుట లేదని గమనించవలెను. వేదాంతులు పదార్థమును, పరమార్థమును రెండు విషయములుగ తెలుపుచు ఒకటి నిరాకరించి, రెండవ దానిని ఆదరింతురు. నిజమునకు అవి రెండును ఒకిటియే!
పరమార్థము స్థూలస్థితి చెందినపుడు పదార్థమగును. పదార్థము సూక్ష్మత చెందినపుడు పరమార్థ మగును. ఒకియే స్థితి భేదముచే రెండుగా అగుపించును గాని రెండు లేవు. మంచుగడ్డ అగుచున్నది మరల నీరగు చున్నది అని తెలియవలెను.
గీతోపనిషత్తునందు స్థాపింపబడిన అత్యంత ప్రధానమైన మూల సూత్రములలో ఈ సూత్ర మొకటి. ఈ సూత్రమును గూర్చి బాగుగ ధ్యానము చేయవలసిన అవసరము విద్యార్థులకు కలదు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment