🌹. శివగీత - 37 / The Siva-Gita - 37 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము
🌻. విభూతి యోగము - 1 🌻
శ్రీరామ ఉవాచ : -
భగవం స్తత్రమే చిత్రం - మహాదేత త్ప్రజాయతే, శుద్ధ స్పటిక సంకాశ - స్తినేత్ర శ్చంద్ర శేఖర: 1
మూర్త స్త్వంతు పరిచ్చిన్నా - కృతి: పురుష రూప దృత్, అమ్బయా సహితో త్రైవ - రమసే ప్రమధై స్సహా 2
త్వం కధం పంచ భూతాది - జగదేత చ్చరా చరమ్, తద్బ్రూహి గిరిజా కాంత! - యది తేను గ్రహొ మయి 3
శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు :-
ప్రభూ ! ఓ మహాదేవా! మీరిప్పుడు చెప్పిన విషయమునందు గొప్ప విభ్రాంతి కలుగుచున్నది. నీవు స్వచ్చమైన స్పటిక మణి మాదిరిగా తెల్లనైన వాడు, పరిభిన్న స్వరూపుడవు.
ఉమాదేవితో కూడి ప్రమదులతో నిక్కడ విరాజిల్లు చున్నావు. పంచ భూతాత్మక మగున ప్రపంచము నెట్లు సృష్టించితివి?
నాకు విస్తారముగా తెలియ పరచి నన్ననుగ్రహింపుము.
శృణు రామ! మహాభాగ - దుర్జేయ మమరైరపి, తత్ప్ర వక్ష్యామి యత్నేన - బ్రహ్మ చర్యేణ సువ్రత 4
పారం యాస్య స్య నాయాసా - ద్యేన సంసార నీరదే:, దృశ్యంతే యాని చాన్యాని - స్థావ రాణి చరాణి చ . 6
గంధర్వా: ప్రమధా నాగా - స్సర్వేతే మద్వి భూతాయః , పురా బ్రహ్మాద యో దేవా - ద్రష్టు కామా మమా కృతిమ్ 7
ఓయీ రామా! బహు ముఖ్యమైన విషయమునే ఆలోచించి ప్రశ్నించితివి.
ఇది దేవతలకు కూడా తెలియదు. కావున అట్టి గోప్యమైన విషయమును నీకు వివరించెదను. అవధరింపుము.
ఈ కన్నుల కగు పడుచున్నట్టి (దృగ్గో చరమగునట్టి ) పంచ భూతములు,
పదునాలుగు భువనములు, సప్త సముద్రములు , సప్త పర్వతములు, ముక్కోటి దేవతలు, దానవులు, మరియు నీ చరా చరాత్మకము లైన జీవ రాసులు, గంధర్వులు, ప్రమధులు , సర్పములు మొదలగున వన్నియు నా యంశ భూతములే.
మొట్ట మొదట బ్రహ్మాది దేవతలు నా నిజ స్వరూపమున కనుగొన నిష్ఠ పడిన వారై నాకెంతగానో ఇష్టమైన మందార పర్వతమున కరగిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 37 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 06 :
🌻 Vibhooti Yoga - 1 🌻
SriRama Enquired: O Lord! O Mahadeva! I am confused with the statements that you made recently.
You are as clear as a crystal in complexion, you have a distinctive appearance.
You are seated with your consort Umadevi here together with your servants. How do you create this entire universe which is formed of five elements? Kindly explain me in detail and enlighten me.
Sri Bhagavan said: O Rama! Very wisely, you have asked a very significant question indeed! The answer to this is not known to the very Gods. Therefore I would detail out to you that secret information, Listen carefully!
All these visible five elements, fourteen worlds, seven oceans, seven mountains, all gods, demons, sages, entire mobile and immobile creation, gandharvas, Pramadhas, Nagas, everything has manifested from my portion only.
At first Brahma and other deities desired to know my true form, assembled near the mandara mountain which is my favorite mountain.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment