శ్రీ మదగ్ని మహాపురాణము - 73


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 73 🌹

✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. అధ మండల విధి - 2 🌻

పాయూపస్థౌ చ సంపూజ్య మాసానాం ద్వాదశాధిపాన్‌ |

పురుషోత్తమాదిషడ్వింశాన్‌ బాహ్యావరణ కే యజేత్‌. 10
చక్రాబ్జే తేషు సంపూజ్యా మాసానాం పతయః క్రమాత్‌ | అష్టౌ ప్రకృతయః షడ్వా పఞ్చాథ చతురోపరే. 11
రజఃపాతం తతః కుర్యాల్లిఖితే మణ్డలే శృణు | కర్ణికాపీతవర్ణా స్యాద్రేవాః సర్వాః సితాః సమాః. 12
ద్విహస్తేఙ్గుష్ఠమాత్రాః స్యుర్హస్తే చార్ధసమాః సితాః | పద్మం శుక్లేన సన్ధీంస్తు కృష్ణేన శ్యామతో7థవా. 13
కేసరా రక్తపీతాః స్యుః కోణాన్రక్తేన పూరయేత్‌ | భూషయేద్యోగపీఠం తు యథేష్టం సార్వవర్ణికైః. 14
లతావితానపత్రాద్యైర్వీథికాముప శోభయేత్‌ | పీఠద్వారే తు శక్లేన శోభారక్తేన పీతతః. 15
ఉపశోభాం చ నీలేన కోణసంఖ్యాశ్చ వై సితాన్‌ | భద్రకే పూరణం ప్రోక్తమేవమన్యేషు పూరణమ్‌. 16
త్రికోణం సితరక్తేన కృష్ణేన చ విభూషయేత్‌ | ద్వికోణం రక్తపీతాభ్యాం నాభిం కృష్ణేన చక్ర కే. 17

పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను.

మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను.

ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను.

ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను.

కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను.

పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము.

ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వికోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను.

చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

No comments:

Post a Comment