🌹. నారద భక్తి సూత్రాలు - 77 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము - సూత్రము - 46
🌻 46. _ కస్తరతి కస్తరతి మాయమ్ ? యః సంగం త్వజతి,
యో మహానుభావం సేవతే, నిర్మమో భవతి ॥ 🌻
భాగము - 1
ఆ మాయా సముద్రాన్ని ఎవరు దాటగలరు? సంనార బంధాన్ని ఎవరు త్రెంచుకొనగలరు? ఎవరైతే మమకారాన్ని జయించి, మహాను భావులను సేవిస్తారో వారే మాయను దాటగలరు.
విష్ణు మాయకు లోబడిన రాక్షసులు అమృతవానం చేయలేక పోయారు. అది దేవతలకే దక్కింది. కనుక అసుర గుణాలున్నంతవరుకు అమృతమైన మోక్షం దక్కదని తెలుస్తున్నది. దైవి గుణాలున్న వారికి భగవదనుగ్రహం ఉంటుందని ఈ కథ చెప్తున్నది. కథగా చూస్తే విష్ణుమూర్తి మోహినీ రూపంలో రాక్షసులను మోసం చేశాదని, దేవతల పక్షపాతం వహించాదనిపిస్తుంది.
అంతరార్ధం గమనిస్తే విష్ణు మాయ వలన మోహం జనిస్తుందని, అసుర గుణాలున్న వారైతే ఆ మోహానికి లొంగి, మోక్షానికి దూరమవుతారని తెలుస్తుంది. భగవంతునికి శరణాగతి చెందిన సజ్జనులను ఆ భగవంతుడు వారి యెడల మాయను ఉపసంహరిస్తాడు. అదే భగవదనుగ్రహం.
భగవంతుడు అవతరించడానికి కారణమే దుష్ట శిక్ష శిష్ట రక్షణ. అందువల్ల మనం భావించినట్లుగా ఆయన మోసం చేయడం, అనుగ్రహించడం లాంటివి ఆయన అవతార ప్రణాళిక అవుతుంది గాని, ఆయనకు పక్షవాత బుద్దిని అంటగట్టరాదు.
శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అనుకుంటారు. కౌరవులను మోసం చేసినట్లు కనబడుతుంది.
కౌరవులనగా కర్మచక్రమందు తిరిగేవారని అర్ధం. వాందవులనగా సత్వగుణ సంపన్నులు. అందువలన శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అయ్యాడు. అదే దైవానుగ్రహం. ఈ విధంగా మనం కథలోని అంతరార్జాన్ని గ్రహించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
26 Aug 2020
No comments:
Post a Comment