🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 77 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 31
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అథ కుశాపామార్జన విధానమ్ - 2 🌻
రక్షణ చేసే విధానం
వరాహాశేషదుష్టాని సర్వపాపఫలాని వై | మర్ద మర్ద మహాదంష్ట్ర మర్ద మర్ద చ తత్ఫలమ్. 15
నారసింహ కరాలాస్య దన్తప్రాన్తాలోజ్జ్వల | భఞ్జ భఞ్జ నినాదేన దుష్టాన్ పశ్యార్తి నాశన. 16
బుగ్యజుఃసామగర్భాభిర్వాగ్భిర్వామనరూపధృక్ | ప్రశమం సర్వదుఃఖాని నయత్వస్య జనార్దన. 17
ఐకాహికం ద్వ్యాహికం చ తథా త్రిదివసం జ్వరమ్ | చాతుర్థికం తథాత్యుగ్రం తథైవ సతతం జ్వరమ్. 18
దోషోత్ఠం సంనిపాతోత్థం తథైవాగన్తుకం జ్వరమ్ | శమం నయాశు గోవిన్ద చ్ఛిన్ధి చ్ఛిన్ధ్యస్య వేదనామ్. 19
ఓ వరాహమూర్తీ! సమస్తపాపఫలరూపమున వచ్చిన సకలదుష్టరోగములను ఆణచివేయుము; ఆణచివేయుము.
గొప్పకోరలు గల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము; అణచివేయుము. వికట మైన ముఖము గల నీ దంతాగ్రములు అగ్ని వలె ప్రకాశించుచున్నవి.
ఓ ఆర్తివినాశనా! ఆక్రమణము చేయు దుష్టుల వైపు చూడుము; నీ గర్జనముచే వారి నందరిని నశింపచేయుము; నశింపచేయుము.
ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామవేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకలదుఃఖములను శమింపచేయుము గోవిందా! త్రిదోషములవలన కలిగినదియు, సంనిపాతమువలన కలిగినదియ, ఆగంతుకమునుఅగు ఐకాహికజ్వరమును (రోజువిడిచి రోజువచ్చు జ్వరము),
ద్వ్యాహికజ్వరమును (రెండు రోజులకు (వచ్చునది). త్ర్యాహికజ్వరమును, అత్యంతముభయంకర మగు చాతుర్థిక జ్వరమును (నాలుగురోజులకొకసారివచ్చునది), మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింప చేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.
నేత్రదుఃఖం శిరోదుఃఖం దుఃకంచౌరగసంభవమ్ | అనిశ్వాసమతిశ్వాసం పరితాపం సవేపథుమ్. 20
గుదఘ్రాణాఙ్ఘ్రిరోగాంశ్చ కుష్ఠరోగాం స్తథా క్షయమ్ | కామలాదీంస్తథా రోగాన్ ప్రమేహాంశ్చాతిదారుణాన్. 21
భగన్దరాతిసారాంశ్చ ముఖరోగాంశ్చ వల్గులీమ్ | అశ్మరీం మూత్రకృచ్ఛ్రాంశ్చ రోగానన్యాంశ్చ దారుణాన్. 22
యే వాతప్రభవా రోగా యే చ పిత్తసముద్భవాః | కఫోద్భవాశ్చ యే కేచిద్యే చాన్యే సాంనిపాతికాః. 23
ఆగన్తుకాశ్చ యే రోగా లూతావిస్ఫోటకాదయః | తే సర్వే ప్రశమం యాన్తు వాసుదేవస్య కీర్తనాత్. 24
విలయం యాన్తు తే సర్వే విష్ణోరుచ్చారణన చ | క్షయం గచ్ఛన్తు చాశేషాస్తే చక్రాభిహతా హరేః. 25
అచ్యుతానన్తగోవిన్దనామోచ్చరణభేషజాత్ | నశ్యన్తి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్. 26
నేత్రరోగమును, శిరోరోగమును, ఉదరరోగమును, శ్వాసావరోధమును, అతిశ్వాసమును, పరితాపమును, కంపనమును. గుదరోగమును, నాసికారోగమును, పాదరోగమును, కుష్ఠరోగములను, క్షయరోగమును,
కామలాదిరోగములను, అత్యంతముదారుణమైన ప్రమేహమును, భగందర - అతిసారములను, ముఖరోగమును, వల్గులీరోగమును, అశ్మరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛ్రరోగములను, ఇతరములైన భయంకరరోగములను తొలగింపుము.
వాత-పిత్త-కఫలములవలన కలిగిన రోగములును, సంనిపాతములవలన కలిగిన రోగములును, ఆగంతుకరోగములును, లూతా-విస్ఫోటాదిరోగములును భగవంతు డగు వాసుదేవుని నామసంకీర్తనమాత్రముననే తొలగిపోవుగాక.
ఆ రోగము లన్నియు శ్రీ మహావిష్ణు నామోచ్చరణమాత్రముననే నశించి పోవుగాక.
అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. 'అచ్యుత', 'అనంత' 'గోవిన్ద' అను నామములను ఉచ్చరించుట అనెడు ఔషధముచే సకలరోగములును నశించును. నేను చెప్పునది సత్యము: సత్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment