🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 93 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరాశర మహర్షి - 12 🌻
67. జ్ఞానోదయం అనేది అనేక దశలలో ఉంది. బ్రహ్మజ్ఞానం అనేది ఒక్కమాటే కలుగదు. వివేకము వెంటనేరాదు. కామక్రోధాదులు కూడా కొంతవరకు శాంతిని పొందుతాయి. వాటికి అవకాశంవస్తే, నిదురించే సర్పాలు లేచినట్లు మళ్ళీ లేస్తాయి. జ్ఞాని తనంతట తను దేనియందూ కూడా కామ క్రోధాదులు కలిగి ఉండడు.
68. అయితే దానివలనకూడా మనిషి గర్వాన్ని పొందవచ్చు. గర్విష్ఠికావచ్చు. “అటువంటి గర్వం నీకు కలిగిననాడు నీవు ఉపశాంతి పొంది దానిని విడిచిపెట్టు. గర్వాన్ని నువ్వు ప్రోత్సహించుకోకు.
69. అంటే శాంతిని ఎప్పుడయితే పొందుతావో, ఆ తరువాత నీకు జ్ఞానంలో అభివృద్ధిపొందే శక్తి కలుగుతుంది. ఎంత జ్ఞానముందో అంత శాంతిని పొందుతావు.
70. “ఒకసారి మొలక మొలిచేదాకా దానిని జాగ్రత్తగా చూచుకుని ఆ తరువాత దానికి తగిన నేల, నీరు, సమ్రక్షణ ఇస్తే అది మహావృక్షంగా ఎలా పెరుగుతుందో – జ్ఞానము, శాంతి పరస్పర అవలంబనంతోటి, ఆలంబనంతోటి అలా పెరుగుతాయి. వానిని సంరక్షించుకోవాలి. దానికి భంగకరమయిన పరీక్ష వచ్చినప్పుడు పరీక్షకు నిలబడు” అని ఆయన బోధ.
71. “మనిషిలో షోడశ వికారాలు ఉన్నాయి. జితేంద్రియుడై వాటన్నిటినీ నెమ్మదిగా జయించి, క్రమంగా శాంత స్వరూపుడయిన మహేశ్వరుడిని ఆరాధనచేస్తే ఆ ఈశ్వరారాధనతో మనిషి ముక్తి పొందుతాడు” అని బోధించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
26.Aug.2020
No comments:
Post a Comment