గీతోపనిషత్తు - సాంఖ్య యోగము : 13. ఆత్మ - అద్భుతము - ఆశ్చర్యము


🌹.  13. ఆత్మ - అద్భుతము - ఆశ్చర్యము  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 29 📚

ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యó |

ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శృణోతి
శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్‌ || 29

ఆత్మను గూర్చి చెప్పుచున్ననూ, వినుచున్ననూ, చదువు చున్ననూ, అట్లెన్నిసార్లు ఒనర్చిననూ ఆత్మాను భవము కలుగదు. ఆచరణ పూర్వక మైనచో అనుభూతమై పూర్ణముగ తెలియును. లేనిచో గాలిని మూట కట్టుకొనినట్లు ఎప్పికప్పుడు దానిని గూర్చిన భ్రాంతియే మిగులును.

సృష్టియందు అన్నికన్నా

అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది 'ఆత్మ' ఒక్కటియే! ఇంద్రియ నిగ్రహము, బాహ్య విషయముల యెడ నైరాశ్యము మరియు వైరాగ్యము, చిత్త నైర్మల్యము, అంతర్ముఖ తపస్సు సాధించిన ధీరునికే ఆత్మదర్శనము కలుగును. అట్టి వాడు

దుర్లభుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

26 Aug 2020


No comments:

Post a Comment