1) 🌹 శ్రీమద్భగవద్గీత - 587 / Bhagavad-Gita - 587 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 184 185 / Vishnu Sahasranama Contemplation - 184, 185🌹
3) 🌹 Daily Wisdom - 7🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 140🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 14 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 161🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 85 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 157 / Sri Lalita Chaitanya Vijnanam - 157🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 498 / Bhagavad-Gita - 498🌹
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 106🌹
11) 🌹. శివ మహా పురాణము - 304 🌹
12) 🌹 Light On The Path - 58🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 191 🌹
14) 🌹. చేతనత్వ బీజాలు - 255 / Seeds Of Consciousness - 255 🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 130🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 95 / Sri Vishnu Sahasranama - 95 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 04 🌴*
04. నిశ్చయం శ్రుణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పరుషవ్యాఘ్ర త్రివిధ: సమ్ప్రకీర్తిత:
🌷. తాత్పర్యం :
ఓ భరతశ్రేష్టా! పురుషవ్యాఘ్రా! త్యాగమును గూర్చిన నా నిర్ణయమును ఇప్పుడు ఆలకింపుము.శాస్త్రములందు అట్టి త్యాగము మూడువిధములని తెలుపబడినది.
🌷. భాష్యము :
త్యాగమును గూర్చి పలు అభిప్రాయములున్నను శ్రీకృష్ణభగవానుడిచ్చట దాని యెడ తన నిర్ణయమును తెలియజేయనున్నాడు. దానినే తుది నిర్ణయముగా భావింపవలెను. సత్యమెరిగినచో వేదములనునవి భగవానుడు ఒసగిన వివిధ నియమములే. అట్టి భగవానుడే ప్రత్యక్షముగా నిలిచియుండి పలుకుచున్నందున అతని వాక్యమును తుది నిర్ణయముగా స్వీకరింపవలెను.
ఏ గుణమునందు నిర్వహింపబడినదనెడి విషయము ననుసరించి త్యాగమును గుర్తింపవలెనని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 587 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 04 🌴*
04. niścayaṁ śṛṇu me tatra tyāge bharata-sattama
tyāgo hi puruṣa-vyāghra tri-vidhaḥ samprakīrtitaḥ
🌷 Translation :
O best of the Bhāratas, now hear My judgment about renunciation. O tiger among men, renunciation is declared in the scriptures to be of three kinds.
🌹 Purport :
Although there are differences of opinion about renunciation, here the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, gives His judgment, which should be taken as final. After all, the Vedas are different laws given by the Lord. Here the Lord is personally present, and His word should be taken as final.
The Lord says that the process of renunciation should be considered in terms of the modes of material nature in which it is performed.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 184, 185 / Vishnu Sahasranama Contemplation - 184, 185 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻184. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ🌻*
*ఓం సతాంగతయే నమః | ॐ सतांगतये नमः | OM Satāṃgataye namaḥ*
సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ
సతాం వైదిక సాధూనాం పురుశార్థపదోహరిః ।
సతాంగతిరితిప్రోక్తః స్వానుభూత్యా బుధోత్తమైః ॥
వేద ప్రమాణమును అంగీకరించి వేద విహితమార్గానుయాయులు అగు సాధుజనులకు లేదా సత్పురుషులకు గతిః అనగా పురుషార్థస్థితిగా నుండు విష్ణువు సతాంగతిః అని చెప్పబడును.
:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
క. శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర, జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవశ్రే, ణీ పతియున్ గతియునైన నిపుణు భజింతున్. (65)
లక్ష్మికీ, యజ్ఞానికీ, ప్రజలకూ, బుద్ధికీ, జగత్తుకూ, భూమికీ, యాదవ వర్గానికీ, పతీ గతీ అయిన భగవంతుని సేవిస్తాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 184🌹*
📚. Prasad Bharadwaj
*🌻184. Satāṃgatiḥ🌻*
*OM Satāṃgataye namaḥ*
Satāṃ vaidika sādhūnāṃ puruśārthapadohariḥ,
Satāṃgatiritiproktaḥ svānubhūtyā budhottamaiḥ.
सतां वैदिक साधूनां पुरुशार्थपदोहरिः ।
सतांगतिरितिप्रोक्तः स्वानुभूत्या बुधोत्तमैः ॥
He who causes the realization of the Puruśārthās by those who are Sat i.e., vaidikās who have learnt and led the life as indicated by the Vedās.
Śrīmad Bhāgavata Canto 4, Chapter 30
Yatra nārāyaṇaḥ sākṣādbhagavānnāyāsināṃ gatiḥ,
Saṃstūyate satkathāsu muktasaṅgaiḥ punaḥ punaḥ. (36)
:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे त्रिंषोऽध्यायः ::
यत्र नारायणः साक्षाद्भगवान्नायासिनां गतिः ।
संस्तूयते सत्कथासु मुक्तसङ्गैः पुनः पुनः ॥ ३६ ॥
Lord Nārāyaṇa, is present among devotees who are engaged in hearing and chanting His holy name. Lord Nārāyaṇa is the ultimate goal of those in the renounced order of life and Nārāyaṇa is worshiped through this sańkīrtana by those who are liberated from material contamination. Indeed, they recite the holy name again and again.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥
Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 185 / Vishnu Sahasranama Contemplation - 185 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ🌻*
*ఓం అనిరుద్ధాయ నమః | ॐ अनिरुद्धाय नमः | OM Aniruddhāya namaḥ*
అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ
నకేనాపి ప్రాదుర్భావేషు నిరుద్ధః తన ప్రాదుర్భావ సందర్భములందు ఎవని చేతను అడ్డగించబడువాడుకాదు.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
ఉ.తెంపరివై పొరిం బొరిని దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలంజంపితి వింకనైన నుపశాంతి వహింపక ఱాలమీఁద నొప్పింపఁగ నిస్సిరో యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్‍జంపెడు వీరుఁ డొక్క దెస్ సత్కృతి నొందెడు వాఁడు దుర్మతీ! (154)
(దేవకీ దేవి అష్టమ గర్భమునందు జన్మించినది ఆడ శిశువు అని భావించి, ఆ బిడ్డను రాతికేసి కొట్టి హతమార్చబోతున్న కంసునితో దుర్గా దేవి...) "దుర్మార్గుడా! మహాకోపంతో ఈ దేవకీదేవి బిడ్డలను ఆరుగురిని వధించావు. మహా పరాక్రమవంతుడవు! పోనీ అంతటితో శాంతించక పసిబిడ్డను రాతిమీద కొట్టి చంపడానికి పూనుకొన్నావు. ఛీ! ఛీ! ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటే జన్మించి మరో దిక్కున మహాగౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే!"
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 185🌹*
📚. Prasad Bharadwaj
*🌻185. Aniruddhaḥ🌻*
*OM Aniruddhāya namaḥ*
Nakenāpi prādurbhāveṣu niruddhaḥ / नकेनापि प्रादुर्भावेषु निरुद्धः One who has never been obstructed by anyone or anything from manifesting in various forms.
Śrīmad Bhāgavate - Canto 10, Chapter 4
Kiṃ mayā hatayā manda jātaḥ khalu tavāntkr̥t,
Yatra kva vā pūrvaśatrurmā hiṃsīḥ kr̥paṇānvr̥thā. (12)
:: श्रीमद्भागवते दशम स्कन्धे, पूर्वार्धे, चतुर्थोऽध्यायः ::
किं मया हतया मन्द जातः खलु तवान्त्कृत् ।
यत्र क्व वा पूर्वशत्रुर्मा हिंसीः कृपणान्वृथा ॥ १२ ॥
(Goddess Durgā addressing Kaṃsā who was about to kill the girl child) O Kaṃsā, you fool, what will be the use of killing me? He who has been your enemy from the very beginning and who will certainly kill you, has already taken His birth somewhere else. Therefore, do not unnecessarily kill other children.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥
Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 6 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 6. The Love for the Eternal 🌻*
The love for the Eternal is the essential passion that burns in the heart of all things. Beings know it not, and so they suffer. When we turn our face away from this one Reality, we open the door to self-imprisonment. No achievement, either on earth or in heaven, no greatness pertaining to the world of name and form, is worth considering.
The love of life is based on the love of the Self. All actions are done for the sake of the Self, not for external persons and things. “Not, verily, for the love of the all is the all dear, but for the love of the Self is the all dear."—Brih. Up., II. 4. 5.
All actions are done for the sake of the Self, not for external persons and things.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 140 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 70 🌻*
కాబట్టి, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ప్రాదుర్భవించింది? అంటే, ప్రాణ చలనం చేత ప్రారంభమయ్యింది. అసలు ప్రాణ చలనమే లేకపోతే? ఏ జీవులూ లేరు. కాబట్టి, విశ్వయోని నుంచి జీవ సృష్టి అంతా వచ్చింది అన్నారు.
‘విశ్వయోని’ అనే పేరు పెట్టడంలోనే తెలుసుకోవాలన్నమాట. సాకారం కాదు. నిరాకార పద్ధతి. నిరీంద్రియ పద్ధతి. ప్రాణచలన ప్రభావ రూపమైనటువంటి హంస యొక్క చలనం ప్రారంభమయ్యింది. తద్వారా జీవపదార్థం జీవాణువుల యొక్క చలనం ప్రారంభమయ్యింది.
లేకపోతే శుక్ల శోణితాలు తమంత తాము ఎలా చెలిస్తున్నాయి? తమంతట తాము ఎట్లా కలుస్తున్నాయి? తమంతట తాము సంవిత్ బిందువుగా ఎలా ఏర్పడుతున్నాయి? తమంతట తాము జీవాణువులుగా మరలా ఎలా విభజన పొందుతున్నాయి? కాబట్టి, చలనమంతా ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఈ వాయుచలనం మీద ఆధారపడి ఉంది.
కదల్చగలిగేటటువంటి శక్తి, ఎండించ గలిగేటటువంటి శక్తి, లయింప జేయగలిగే శక్తి, దేనినైనా కూడా తనయందు ఇమిడ్చుకో గలిగినటువంటి శక్తి, అంతా కూడా ఈ వాయువు చేతిలోనే ఉంది. పోషించాలన్నా ఈ వాయువే. లయింప చేయాలన్నా కూడా ఈ వాయువే. సమస్త అగ్ని పంచకము, సూర్యుడులో ఉన్నటువంటి ప్రాణశక్తి ‘రై’ అనేటటువంటి శక్తిగా విడుదల అవుతు ఉంటుంది.
ప్రళయకాలమందు అంటే ఈ సూర్యుడు మొత్తం నవగ్రహాలను వెనుకకు తీసుకుని, తన ఆత్మరక్షణను విరమిస్తాడు. ఆ వెంటనే ఎలా అయితే ఇది ఇప్పటి వరకూ తమ తమ కక్ష్యలలో పనిచేస్తూ ఉన్నాయో, కక్ష్యలన్నీ కొలాప్స్ [collapse] అయిపోతాయి. తన యందు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఢీకొని విరమణ చెంది, మరలా ఆ సూర్యుడి యందు లయమైపోతాయి.
ఆ సూర్యుడు కూడా లేకుండా పోతాడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా! ఆ నక్షత్రం కాస్తా డెడ్ స్టార్ [Dead Star] అయిపోతుంది. బ్లాక్‌హోల్ [Black Hole] అయిపోతుంది. కృష్ణబిలం అయిపోతుంది. వెంటనే ఆ కృష్ణ శక్తి వలన అప్పటి వరకూ ఉన్న సమస్త బ్రహ్మాండ సృష్టి కూడా తనలోనికి లాగేసుకునింది. లాగేసుకునేప్పటికి ఎక్కడినుంచైతే విచ్ఛిన్నమై, ఉత్పన్నమైనాయో మరలా ఆ స్థానమునందే ప్రళయకాలమందు లయించబడిపోతాయి.
చిట్ట చివరికి లయించబడేది ఏమిటంటే ఆకాశ పంచకం. ఆ ఆకాశ పంచకం ఎట్లా లయించబడుతుంది?
ఆకాశంలో ఆకాశం - గురుమూర్తి చెప్పుకున్నాంగా!
ఆకాశంలో వాయువు - చంద్రుడు,
ఎవరమ్మా? ఆకాశంలో వాయువు?
చంద్రుడు - ఆ మనస్సు కదా!
మనస్సు యొక్క అధిదేవత - చంద్రుడు.
కాబట్టి, ఈ చంద్రుడు కూడా వెళ్ళి పోతాడు. ఈ రకంగా బృహస్పతి వెళ్ళిపోతాడు. ఆ రకంగా రుద్రడు వెళ్ళి పోతాడు. ఇట్లా అందరూ ఈ అధిష్ఠాన దేవతాగణం అంతా చిట్ట చివరికి జ్ఞాత స్థానంలోకి లయం అయిపోతుంది. క్షేత్రజ్ఞుడు వెళ్ళిపోతాడు. క్షేత్రములు వెళ్ళిపోతాయి. ఆ అక్షర పురుష స్థితిలోకి చేరిపోతాయి. బ్రహ్మము అయినటువంటి గురుమూర్తి స్థితిలోకి చేరిపోతాయి.
ఆ బ్రహ్మము కూటస్థుడు. ఈ అధిష్ఠాన దేవత సముదాయము, పంచతన్మాత్రలు, పంచశక్తులు, పంచబ్రహ్మలు ఇదంతా బ్రహ్మాండం అన్నమాట. ఇదంతా సూక్ష్మాతి సూక్ష్మం. ఆదిదైవతం. ఇదేమో బ్రహ్మాండం. పిండాండానికి వచ్చేటప్పటికి ఆ యా రకములైనటువంటి గోళకములు, ఏమిటి?
కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, అంతరేంద్రియాలు ఆ రకమైనటువంటి ఇంద్రియ వ్యవస్థ అంతా కూడా పిండాండం. ఈ రకమైనటువంటి దేవతా వ్యవస్థీకరణ అంతా కూడా బ్రహ్మాండం. ఇదంతా కూడా ఆదిదైవతం అన్నమాట. ఇది బ్రహ్మాండ పంచీకరణ.
ఈ రకంగా పిండాండము, బ్రహ్మాండము.... ఒక దానియందు ఒకటి ఇమిడి ఉన్నట్లుగా తోస్తూఉన్నది. ఈ రకంగా ఈ సమస్థ సృష్టి, స్థితి, ప్రళయములకు ముందున్నటువంటి .... ఎందుకని ఆ పైన 1, 2, 3 అని వేసి ఉంటుంది. ఒకటి, రెండూ, మూడు ఏమిటి?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 14 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అభంగ్ - 14 🍀*
నిత్య సత్యమిత్ హరిపార్ జ్యాసీ!
కళికాళ్ త్యాసీ న పాహే దృష్టి!!
రామకృష్ణ ఉచ్చార్ అనంతరాశీ తప్
పాపాచే కళప్ పళతీపుడే!!
హరి హరి హరి హా మంత్ర శివాచా!
మణ తీ జే వాచా తయా మోక్ష!!
జ్ఞానదేవా పార్ నారాయణ నామ్!
పావిజే ఉత్తమ్ నిజస్థాన్!!
భావము:
నిత్య సత్యమైన హరి పాఠమును అమితముగా పాడే వారిని కలికాలము కన్నెత్తి కూడా చూడదు.
రామ కృష్ణ నామోచ్చరణ అనునది అనంతరాశుల తప: ఫలముతో సమానము కావున వారి పాప సమూహమంత ముందుకు పారిపోతుంది.
హరి హరి హరి అని శివుడు జపించే ఈ మంత్రమును నాలుకతో పాడే వారికి మోక్షము లభించును. నారాయణ నామాన్ని పాడిన వారు నిజధామాన్ని పొందగలరని జ్ఞానదేవులు తెలిపినారు.
*🌻. నామ సుధ -14 🌻*
నిత్య సత్యము మరియు అమితము
హరి పాఠమును పాడు చుండుము
వారి వైపు కలికాలము
కన్నెత్తి చూడదు కనుగొనుము
రామకృష్ణ నామోచ్ఛారణము
అనంత రాశుల తపః ఫలము
అనేక జన్మల పాప సమూహము
పారిపోవును ముందుకు గనుము;
హరి హరి హరి అను మంత్రము
శివుడు జపించెను నిరంతరము
నాలుకతోడ ఎల్లకాలము
జపించు వారికి లభించు మోక్షము
జ్ఞాన దేవుని నిత్య పాఠము
పాడిరి వారు నారాయణ నామము
పొందినారు ఉత్తమ స్థానము
చేరినారు నిజ ధామము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 161 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
153
Some people want to chant the Guru Gita just to fulfill their desires. That’s tantamount to buying the Guru Gita for money. Just because you want to always feed the hungry, you should not wish for everyone to become poor. Just because you want to donate money, you can’t wish that people become penniless. That means that even though there is no need, you want to feel great doing these donations.
You may think, “Everybody should become utterly poor, they should all get hungry, so that I can donate food”. You should never wish for such things. Similarly, just for you to become Guru, you should not give initiation to just anyone. People keep giving initiation to whoever they like. That is also wrong. But, your Swamiji doesn’t let go of anyone, he even takes the ineligible ones, makes them eligible and gives them initiation.
Sloka:
Atyanta pkava cittasya sraddha bhakti yutasya ca | Pravaktavya prayatnena mamatma priyate tada ||
A man with a fully mature mind and a man with dedication and devotion should definitely be taught this. Siva says to Parvati that he’s very happy when this happens.
Earlier they said that you should not pine to become a Guru. In the next 3 slokas, they are instructing us not to seek refuge in unqualified and rogue Gurus.
Sloka:
Guravo bahavassanti sisya vittapa harakah | Durlabhassa gururloke sisya santapa harakah ||
There are many Gurus in the world who rob the disciples of their money. But it is very difficult to get a Guru who robs the disciples of their sins.
Sloka:
Jnanahino gurum manyo mithyavadi vidamabakah | Svavistrantim na janati parasantim karoti kim ||
A man without knowledge who calls himself Guru, uttering falsehood, and moving about with fanfare doesn’t get any peace of mind. Can he give any peace of mind to others?
Generally, we make our bed a little soft. If we make our bed a little hard, it may take a little longer, but we will eventually fall asleep. It means that we got accustomed to that hard bed. Similarly, based on the situation at hand, how God should be worshiped is to be understood, and followed accordingly.
This verse is specifically telling us that one should not accept as Guru one who can neither do good to others, nor to himself and one who is greedy for others’ sake and greedy for his own sake as well.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 85 / Sri Lalitha Sahasra Nama Stotram - 85 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 157 / Sri Lalitha Chaitanya Vijnanam - 157 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*46. నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |*
*నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ‖ 46 ‖*
*🌻157. 'రాగమథనీ'🌻*
రాగద్వేషాది క్లేశములను మథించునది శ్రీదేవి అని అర్థము. ఇచ్ఛా పరిపూర్తి గూర్చి ముందు నామములో తెలుపబడినది. అట్టి సాధనమున, కాలమును, కర్మమును బట్టి రాగద్వేషములు ఏర్పడుచుండును. కామక్రోధములు కలుగుచుండును. లోభమోహములు ఆవరించుచుండును. విజయము కలిగినప్పుడెల్ల మదమున కవకాశముండును. ఇతరులకు విజయము కలిగినపుడు మాత్సర్య భావములు కలుగును. ఇవి అన్నియూ తన వృద్ధికై జీవుడు పనిచేయుచున్న సమయమున కలుగు మలినములు. వీటి వలన దుఃఖము, బంధము కలుగును.
జీవుడు తన కొరకై తాను పాటుపడుట సహజము. ఇహపర సౌఖ్యమునకు ప్రయత్నించువాడు జీవుడు. ఇది సత్సంకల్పమే. అట్టి సంకల్పమును నిర్వర్తించు సమయమున పై విధమగు క్లేశములుండుట సృష్టి ధర్మము. వానిని తొలగించుకొనుట జీవుని కర్తవ్యము. అవి తొలగింపబడుటకు శ్రీదేవి ఆరాధనము ఎంతయో తోడ్పడగలదు.
అసురశక్తులను మథించి, సురశక్తులను వృద్ధి గావించి, జీవుల వృద్ధికి తోడ్పాటు చేయునది శ్రీదేవి. దైవీశక్తులు జీవుల యందు పెంపొందింప బడుటకు అసురశక్తుల మథనము కూడ ముఖ్యమై ఉన్నది. భండాసురాది అసురశక్తులను వధించుటలో శ్రీమాత సిద్ధహస్త. ఆమె ఆరాధనముననే అసురశక్తులు మథింపబడగలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 157 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻Rāgamathanī रागमथनी (157) 🌻*
She destroys the desires of Her devotees. This is the first of various benefits accruing out of worshipping Her Brahman form (the formless form). Desire is the prime impediment in spiritual pursuit that keeps a person bonded to worldly attachments.
Patañjali Yoga Sūtra (II.3) says, “The five pain bearing obstacles in one’s life are ignorance and its effects. The effects are egoism, attachment, aversion, clinging to life.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 498 / Bhagavad-Gita - 498 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 8 🌴*
08. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ||
🌷. తాత్పర్యం :
ఓ భరతవంశీయుడా! అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము ఎల్లదేహధారులకు మోహకారణమని యెరుంగుము. జీవుని బంధించునటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర యనునవి ఈ తమోగుణపు ఫలములై యున్నవి.
🌷. భాష్యము :
ఈ శ్లోకమునందలి “తు” అను ప్రత్యేక పదప్రయోగమునకు మిక్కిలి ప్రాముఖ్యము కలదు. జీవునికి తమోగుణము ఒక అత్యంత విచిత్ర లక్షణమని తెలియజేయుటయే దాని భావము. వాస్తవమునకు తమోగుణము సత్వగుణమునకు సంపూర్ణముగా విరుద్ధమైనది.
సత్త్వగుణమునందు జ్ఞానాభివృద్ది కారణముగా మనుజుడు ఏది యెట్టిదో తెలియగలుగుచుండ, తమోగుణమునందు దానికి వ్యతిరేకఫలములను పొందుచుండును. అనగా తమోగుణమునందున్న ప్రతివాడును బుద్ధిహీనతను కలిగియున్నందున ఏది యెట్టిదో ఎరుగకుండును. తత్కారణముగా ప్రగతికి బదులు పతనము నొందును.
అట్టి తమోగుణము వేదవాజ్మయమునందు “వస్తుయాథాత్మ్యజ్ఞానావరకం విపర్యయజ్ఞానజనకం తమ:” అని నిర్వచింపబడినది. అనగా అజ్ఞానకారణముగా మనుజుడు దేనిని కూడా యథాతథముగా అవగాహనము చేసికొనజాలడు. ఉదాహరణమునకు ప్రతియొక్కడు తన తాత మరణించుయుండెననియు, తానును మరణింతుననియు, మానవుడు మరణించు స్వభావము కలవాడనియు ఎరిగియుండును.
అలాగుననే అతని సంతానము సైతము మరణించును. అనగా మరణమనునది అవివార్యము. అయినప్పటికిని జనులు నిత్యమైన ఆత్మను పట్టించుకొనక రేయింబవళ్ళు కష్టపడచు ధనమును వెర్రిగా కూడబెట్టుచుందురు.
ఇదియే బుద్ధిహీనత యనబడును. ఇట్టి బుద్ధిహీనత లేదా మూర్ఖత కారణముగా వారు ఆధ్యాత్మిక ప్రగతి యెడ విముఖులై యుందురు. అట్టివారు అతి సోమరులై యుందురు. ఆధ్యాత్మికావగాహనకై సత్సంగమునకు ఆహ్వానించినప్పుడు వారు ఆసక్తిని చూపరు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 498 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 08 🌴*
08. tamas tv ajñāna-jaṁ viddhi mohanaṁ sarva-dehinām
pramādālasya-nidrābhis tan nibadhnāti bhārata
🌷 Translation :
O son of Bharata, know that the mode of darkness, born of ignorance, is the delusion of all embodied living entities. The results of this mode are madness, indolence and sleep, which bind the conditioned soul.
🌹 Purport :
In this verse the specific application of the word tu is very significant. This means that the mode of ignorance is a very peculiar qualification of the embodied soul. The mode of ignorance is just the opposite of the mode of goodness.
In the mode of goodness, by development of knowledge, one can understand what is what, but the mode of ignorance is just the opposite. Everyone under the spell of the mode of ignorance becomes mad, and a madman cannot understand what is what.
Instead of making advancement, one becomes degraded. The definition of the mode of ignorance is stated in the Vedic literature. Vastu-yāthātmya-jñānāvarakaṁ viparyaya-jñāna-janakaṁ tamaḥ: under the spell of ignorance, one cannot understand a thing as it is. For example, everyone can see that his grandfather has died and therefore he will also die; man is mortal.
The children that he conceives will also die. So death is sure. Still, people are madly accumulating money and working very hard all day and night, not caring for the eternal spirit. This is madness. In their madness, they are very reluctant to make advancement in spiritual understanding.
Such people are very lazy. When they are invited to associate for spiritual understanding, they are not much interested. They are not even active like the man who is controlled by the mode of passion. Thus another symptom of one embedded in the mode of ignorance is that he sleeps more than is required.
Six hours of sleep is sufficient, but a man in the mode of ignorance sleeps at least ten or twelve hours a day. Such a man appears to be always dejected and is addicted to intoxicants and sleeping. These are the symptoms of a person conditioned by the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -106 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 39 - 1
*🍀 34 - 1. శ్రద్ధ - శ్రద్ధయనగ పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. శ్రద్ధ కలవాడు తాను చేయు పనియందే మనసు లగ్నము చేసి యుండును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచటైనను విషయములు సూటిగ గోచరించుట, అవగాహన యగుట యుండును. సూక్ష్మమగు విషయములు కూడ సులభముగ అర్థమగును. శ్రద్ధ గలవా డన్ని విషయము లందును శ్రద్ధగ నుండును. 'శ్రద్ధ' అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును. జ్ఞానమునకు కూడ శ్రద్ధయే ప్రధానము. చేయు పనియందు శ్రద్ధ, ఫలముల యందనాసక్తి ముఖ్యమని తెలియవలెను. 🍀*
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి మచిరే ణాధిగచ్ఛతి || 39
శ్రద్ధగలవాడు, తదేక నిష్ఠగలవాడు, యింద్రి యార్థము లందు చిక్కుకొననివాడు ఈ జ్ఞానమును పొందగలడు. జ్ఞానమును పొందినవాడు త్వరితగతిని పరమశాంతిని పొంద గలడు. జ్ఞానమునకు మూడరతతీ శ్లోకమున చెప్పబడినవి. అందు మొదటిది శ్రద్ధ, రెండవది నిష్ఠ. మూడవది యింద్రియ నియమము.
1. శ్రద్ధ :
శ్రద్ధయనగ పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. ఆసక్తి లేనిదే ఎవ్వడును ఏ పనియు చేయడు. ఆసక్తి పూర్ణముగ నున్నచో మనసు పరిపూర్ణముగ ఒక పనియందర్పింప బడును. శ్రద్ధగ పనిచేయు వానికి మనసు పనియందు సమర్పితమగుట చేత యితర విషయములపై ప్రసరింపదు. పరిసరములందేమి జరుగుచున్నను అతనికి వాటి అస్థిత్వముండదు.
అర్జునుడు బాణము ఎక్కు పెట్టినపుడు పిట్టకన్ను మాత్రమే కనిపించుట, యితరములు గోచరింపకుండుట జరిగినది. ఇది శ్రద్ధకు తార్కాణము. అటులనే శ్రీరాముడు తాటి చెట్టు ఏడుతలలను కొట్టుట, పదునాలుగువేల రాక్షసుల నొక్క బాణముతో చంపుట శ్రద్ధకు తార్కాణము. శ్రద్ధ కలవాడు తాను చేయు పనియందే మనసు లగ్నము చేసి యుండును.
ఎన్ని సంవత్సరములైనను చేయు పనియందే శ్రద్ధ గోచరించును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచటైనను విషయములు సూటిగ గోచరించుట, అవగాహన యగుట యుండును. సూక్ష్మమగు విషయములు కూడ సులభముగ అర్థమగును. శ్రద్ధ గలవా డన్ని విషయము లందును శ్రద్ధగ నుండును.
కొన్ని విషయములందు శ్రద్ధ, కొన్ని విషయములందు అశ్రద్ధ యుండదు. రాముని జీవితమే దీనికి తార్కాణము. (భరతు నెట్లాద రించెనో, గుహుని కూడ అట్లే ఆదరించెను.) శ్రద్ధగలవాడు ప్రస్తుతమునందే యుండును. భవిష్యత్తు లోనికి తొంగిచూచుట, గతమును నెమరువేయుట యుండదు. శ్రద్ధ గలవానికి ఎదుట నున్న కర్తవ్యమే దైవము.
శ్రద్ధ అను గుణము చిన్నతనముననే నేర్చినవారు కార్యము లందు సులభముగ విజయమును సాధింపగలరు. మరపు గల వారందరు శ్రద్ధ లేనివారే.
ప్రస్తుత కాలమున మర పెక్కువ. అనగ శ్రద్ధ తక్కువ. నిజమునకు 'శ్రద్ధ' అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును. జ్ఞానమునకు కూడ శ్రద్ధయే ప్రధానము. చేయు పనియందు శ్రద్ధ, ఫలములయందనాసక్తి ముఖ్యమని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 305 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
74. అధ్యాయము - 29
*🌻. దక్ష యజ్ఞములో సతి - 3 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి, పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను (42). అపుడా సతి మిక్కిలి కోపించి దక్షునితో , విష్ణువు మొదలగు దేవతలతో, మరియు మునులతో అందరితో నిశ్శంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను (43).
సతీదేవి ఇట్లు పలికెను -
తండ్రీ! నీవు శంభుని నిందించితివి. తరువాత దుఃఖించెదవు. ఇహ లోకములో మహాదుఃఖముననుభవించి, మరణించిన తరవాత నరకయాతనలను పొందెదవు (44). ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రాణిగాని, ప్రియుడగు ప్రాణిగాని లేడో, అట్టి అజాత శత్రువగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరు కక్ష గట్టెదరు? (45) దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కాని మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గలవారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు (46).
ఏ మానవులు ఒక్కసారి 'శివ' అను రెండక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నియూ వెనువెంటనే నశించును (47). అమంగళుడవు, దుష్టుడవు అగు నీవు పవిత్రమగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప శక్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము (48).
మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు (49). శివుడు భక్త జనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఖత వలన నీవు ద్వేషమును చూపుచున్నావు (50). శివుడు (మంగళ స్వరూపుడు) అమంగళ##వేషధారియా? బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుట లేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు (51).
విశాల హృదయుడగు ఆయన, జటలను విరబోసుకొని, భూతములతో గూడి, శ్మశానమునందు కపాలధారియై, కపాలమాలను, భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు (52). ఈ సత్యము నెరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి, ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు (53).
వేదములో ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు (54). ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక, ఒకే వ్యక్తి ఒకే కాలములో రెండింటినీ అనుష్ఠింపజాలడు. పరబ్రహమ్మయగు శంభునియందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు (55).
ఓ తండ్రీ !ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలననుష్ఠించి ధూమ్రమార్గమును పొందెదరు. మావంటి ఆత్మ జ్ఞానపరులు మాత్రమే కర్మ ఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు (56). ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున, ఓ తండ్రీ! నీవు దుర్బుద్ధితో చూచి, అహంకారమును పొందకుము (57).
ఇన్ని మాటలేల ? నీవి దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనమేమియూ లేదు (58). మహాత్ములను పరిపరివిధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసుడు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను (59).
భగవాన్ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనుక దాక్షాయణి అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును (60). కావున, నీ శరీరమునుండి ఉద్భవించిన ఈ దేహము శవమువలె మిక్కిలి అశుచియైనది, నిందితమైనది, కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను (61).
ఓ దేవతలారా! మునులారా! మీరందరు నా మాటను వినుడు. దుష్ట బుద్ధిగల మీరందరు సర్వధా అనుచితమగు పనిని చేయుచున్నారు (62). శివుని నిందించి, కలిని ప్రేమించు మీరందరు మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణమగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మ ఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు (63).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడా సతి యజ్ఞశాలయందు దక్షుని, ఇతరులను ఉద్ధేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను (64).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీ ఖండలో సతీ వాక్య వర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 59 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 4 🌻*
251. After a man has taken the first Initiation the sense of separateness is one of the failings which have to be entirely conquered before he can take the second. It is the first of the ten sanyojana or fetters which he has to cast off on his way up the steps of the Path.
It is made possible for ‘him finally and irrevocably to cast it off by the experience which is part of that first Initiation. He gets then merely a touch of the buddhic consciousness. It does not mean necessarily that he can go back into that condition of consciousness whenever he will, but at least he has experienced it, and having once felt the unity, he knows that it exists even though he may be incapable of re-entering it without the aid of the Master.
He knows, therefore, that the sense of separateness is an illusion. It is practically impossible for us down here in the physical body to grasp that really. We constantly speak of it and we try to persuade ourselves that we feel it, but as long as one is in a physical body and until one has had that higher experience, frankly I do not think one can feel it. We persuade ourselves of it intellectually but really to feel it is a different thing.
252. When a man begins to function on the buddhic plane, he enters it at its lowest level, but he is unable at first to make the most even of that lowest sub-plane. He will feel an intensity of bliss which no words can express, and an extension of consciousness which by contrast with anything which he has ever felt before, will no doubt give the idea that the whole world is included.
Nevertheless it is not so at all. When he is sufficiently accustomed to this higher level to analyze it, he will find that the extension of consciousness, though a very great one, is by no means as yet full or universal. Gradually he extends the sphere which he can effectively occupy. It is somewhat like the way in which an army occupies a conquered territory.
He establishes himself first, and then gradually extends that part over which he has definite power, until it includes the entire country. He then proceeds to try to push his consciousness into the next sub-plane; but even after he has worked his way through sub-plane after sub-plane until he reaches the highest, he has not necessarily built the buddhic vehicle. The man who has the buddhic consciousness within his reach by meditation or by effort can always raise himself into that condition.
The man who has definitely built a buddhic vehicle has that consciousness all the time in the background of his lower physical, astral or mental consciousness. That is another and separate achievement and a difficult one, because to do that the causal body must be eliminated, must be destroyed as a separating wall.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 191 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 4 🌻*
17. బ్రహ్మతేజోబలమే నిజమైన బలం, క్షత్రియ బలంకాదు అన్నది. “ధిక్ క్షత్రియబలం, బ్రహ్మతేజోబలం బలం” అనుకున్నాడు విశ్వామిత్రుడు. క్షాత్రం అంటే సృష్టిలో ఉండే శక్తులు. ఇవన్నీ సృష్టిలోని పదార్థాలే. ఈ పదార్థమంతా దేనియందుపుట్టి, దేనిలో స్థితికలిగి ఉండి, దేనిలో తిరిగి లయం చెందుతున్నదో; అటువంటి బ్రహ్మోపాసన చేసినవాడి బలం అనంతం. బలమంటే అదే.
18. బ్రహ్మజ్ఞాని అయిన వసిష్ఠుడికి దుఃఖం రావడమేమిటి? ఆత్మహత్యాప్రయత్నం చేయడమేమిటి? అనే సందేహాలు కలుగవచ్చు. అదంతా శరీరము, సంసారము యొక్క లక్షణమంతే. మరి బ్రహ్మజ్ఞానికి దుఃఖం అంటదంటారు కదా అని ప్రశ్న. దుర్భరమైన దుఃఖం ఆవేశించినా అది జ్ఞానికి ఒక్క క్షణమే. క్షణంలోనే దానిని ఉపసంహారం చేసుకుంటారు.
19. ఆ క్షణంలో ఏదయినా జరుగవచ్చు. ప్రకృతియొక్క ప్రభావం ఎంతటివాడిపైననైనా ఉంటుందని చెప్పటానికి మాత్రమే ఈ గాథలు ఏర్పడ్డాయి. వసిష్టుడికి వచ్చిన ఆగ్రహం, దుఃఖం ఒక్క ఘడియ, అంతే. ప్రకృతికి జ్ఞానిపై అంతవరకే ప్రభావం. ‘జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా | బలాదాకృష్య మోహాయ మహా మాయా ప్రయఛ్ఛతి||’ అని అందుకే అన్నారు. అంటే ఎంతటి నిగ్రహం కల వానినైనా, జ్ఞానినైనా ఒక్కక్షణం అజ్ఞానం ఆవరించవచ్చు. అది ప్రకృతియొక్క లక్షణం.
20. ఈ ప్రకృతిపట్ల అభినివేశంతో, ఈ సంసారం నాది అనే భావన ఒక్క క్షణం కలిగి, అంటే ఆత్మవిస్మృతి కలిగినపుడు ఒక్క తృటి దుఃఖం లేదా ఆగ్రహం జ్ఞానికి కూడా కలుగవచ్చు. అయితే సామాన్యులకు, జ్ఞానులకు భేదమేమిటంటే; శరీరమున్నంతసేపూ మనస్సు, బుద్ధి, చిత్తము బ్రహ్మజ్ఞాని యందుకూడా ఉన్నప్పటికీ, ప్రకృతియొక్క వికారము వారి మనోబుద్ధుల యందే క్షణంపాటు ఆవరిస్తుందే తప్ప, అది వారి ఆత్మయందు ప్రవేశించదు.
21. ఇంకా విశదంగా చెప్పాలంటే, సామాన్యుడికొచ్చే ఆగ్రహం అహంకారంగా జీవాత్మయందు ప్రవేశించి, కర్మచేయించి, దానిఫలాన్ని ఉత్తరజన్మకు ఇస్తుంది. అయితే జ్ఞానికి వచ్చే ఆగ్రహం కేవలం మనోబుద్ధులవరకు మాత్రమే పరిమితంకాని, వారి ఆత్మవస్తువుయందు ప్రవేశించదు, కర్మఫలహేతువుకాదు.
వసిష్ఠుడిని “యోగం అంటే ఏమిటి?” అని అడిగాడు జనక చక్రవర్తి. “యోగమంటే ధ్యానమే! అది రెండువిధాలుగా ఉంటుంది.
22. ప్రాణాయామపూర్వకంగా ఉంటుంది. మనస్సున ఏకాగ్రవృత్తి అనేదొకటుంది. సగుణభావంతో ప్రాణాయామము ఫలప్రదమవుతుంది, నిర్గుణభావంలో ఏకాగ్రత లభిస్తుంది. ఈ రెండూ యోగంవల్ల సాధ్యమవుతాయి” ‘మితాక్షర’ను ఆధారం చేసుకునే ‘హిందూ లా'(Himdu Law) పుట్టింది. బ్రిటీష్ హిందూ లా వచ్చింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 255 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻104. This 'I am' or Balkrishna state has great potential. Here 'Bal' means the child food body and 'Krishna' means 'non-knowing'. 🌻*
The Guru further goes on to explain this ignorant-child principle or the Balkrishna state, which is nothing else but the 'I am', as having great potential. Why so? Because it is the primary concept or illusion on which is constructed everything else about you and your life.
And, not only you, but this 'I am' has created the entire universe or cosmos. In its absence none of these exist. 'Bal' means the child food body, which also implies strength or power and 'Krishna' means 'non-knowing', which implies not knowing its own strength.
This Balkrishna is very powerful and its potential for creation is enormous, just like the small seed that is quite unaware of its potential for creating a large banyan tree.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 130 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 9 🌻*
535 - 2. పరమాత్మయైన ఆత్మ, అనంత అపార నిస్సీమ మహాసాగరము నుండి ఎన్నడు బయటపడజాలదు. ఎందుచేత?
ఆత్మయనెడు బిందులవలేశము, పరమాత్మయనెడు మహాసాగరములో నున్నంతవరకు, అది మహాసాగరములో కలిసియే యున్నందున ఆత్మ కూడా పరమాత్మయే.
సాగరము నుండి బిందు లవలేశమును వెలికి తీసినప్పుడు అది ఆత్మయైనది. నీటి ఉపరితలమున బుడగగా ఏర్పడినప్పుడు దానికి పరిమితి రూపము, ఆకృతి, రంగు ఏర్పడుచున్నవి.
అనగా - ఆత్మయనెడి లవలేశము, అనంత అపార సాగరము నుండి వేరుపడినప్పుడే దానికి బిందురూపము లేక బుద్బుదరూపము యేర్పడి పరిమిత వ్యక్తిత్వము కలుగుచున్నది.
ఇట్లు వేరైన బిందులవలేశము తిరిగి సాగరజలములో కలిసి పోయినప్పుడు, అది కూడా సాగరమే యైనది కనుక వాస్తవమునకు "ఆత్మయే పరమాత్మ".
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 94 / Sri Vishnu Sahasra Namavali - 94 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*శతభిషం నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*
*🍀 94. విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |*
*రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ‖ 94 ‖ 🍀*
🍀 876) విహాయన గతి: -
ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.
🍀 877) జ్యోతి: -
తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింప చేయువాడు.
🍀 878) సురుచి: -
అందమైన ప్రకాశము గలవాడు.
🍀 879) హుతభుక్ -
యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
🍀 880) విభు: -
సర్వ లోకములకు ప్రభువైనవాడు.
🍀 881) రవి: -
తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.
🍀 882) విలోచన: -
వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.
🍀 883) సూర్య: -
ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.
🍀 884) సవితా: -
సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.
🍀 885) రవిలోచన: -
సూర్యుడు నేత్రములుగా కలవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 94 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Sathabisham 2nd Padam*
*🌻 94. vihāyasagatirjyōtiḥ surucirhutabhugvibhuḥ |*
*ravirvirōcanaḥ sūryaḥ savitā ravilōcanaḥ || 94 || 🌻*
🌻 876. Vihāyasa-gatiḥ:
One who is the support of Vishupada.
🌻 877. Jyotiḥ:
One who is the light of self-luminous consciousness that reveals oneself as well as other things.
🌻 878. Suruciḥ:
The Lord whose Ruchi i.e. brilliance or will, is of an attractive nature.
🌻 879. Hutabhuk:
One who eats, that is, receives, whatever is offered to whatever deities (Devas) in all sacrifices.
🌻 880. Vibhuḥ:
One who dwells everywhere. Or one who is the master of all the three worlds.
🌻 881. Raviḥ:
One who absorbs all Rasas (fluids) in the form of the Sun.
🌻 882. Virōcanaḥ:
One who shines in many ways.
🌻 883. Sūryaḥ:
One who generates Shri or brilliance in Surya. Or Agni (Fire) is what is called Surya.
🌻 884. Savitā:
One who brings forth (Prasava) all the worlds.
🌻 885. Ravi-lōcanaḥ:
One having the sun as the eye.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment