🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 14 🍀
నిత్య సత్యమిత్ హరిపార్ జ్యాసీ!
కళికాళ్ త్యాసీ న పాహే దృష్టి!!
రామకృష్ణ ఉచ్చార్ అనంతరాశీ తప్
పాపాచే కళప్ పళతీపుడే!!
హరి హరి హరి హా మంత్ర శివాచా!
మణ తీ జే వాచా తయా మోక్ష!!
జ్ఞానదేవా పార్ నారాయణ నామ్!
పావిజే ఉత్తమ్ నిజస్థాన్!!
భావము:
నిత్య సత్యమైన హరి పాఠమును అమితముగా పాడే వారిని కలికాలము కన్నెత్తి కూడా చూడదు.
రామ కృష్ణ నామోచ్చరణ అనునది అనంతరాశుల తప: ఫలముతో సమానము కావున వారి పాప సమూహమంత ముందుకు పారిపోతుంది.
హరి హరి హరి అని శివుడు జపించే ఈ మంత్రమును నాలుకతో పాడే వారికి మోక్షము లభించును. నారాయణ నామాన్ని పాడిన వారు నిజధామాన్ని పొందగలరని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -14 🌻
నిత్య సత్యము మరియు అమితము
హరి పాఠమును పాడు చుండుము
వారి వైపు కలికాలము
కన్నెత్తి చూడదు కనుగొనుము
రామకృష్ణ నామోచ్ఛారణము
అనంత రాశుల తపః ఫలము
అనేక జన్మల పాప సమూహము
పారిపోవును ముందుకు గనుము;
హరి హరి హరి అను మంత్రము
శివుడు జపించెను నిరంతరము
నాలుకతోడ ఎల్లకాలము
జపించు వారికి లభించు మోక్షము
జ్ఞాన దేవుని నిత్య పాఠము
పాడిరి వారు నారాయణ నామము
పొందినారు ఉత్తమ స్థానము
చేరినారు నిజ ధామము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Dec 2020
No comments:
Post a Comment