భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 130


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 130 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 9 🌻


535 - 2. పరమాత్మయైన ఆత్మ, అనంత అపార నిస్సీమ మహాసాగరము నుండి ఎన్నడు బయటపడజాలదు. ఎందుచేత?

ఆత్మయనెడు బిందులవలేశము, పరమాత్మయనెడు మహాసాగరములో నున్నంతవరకు, అది మహాసాగరములో కలిసియే యున్నందున ఆత్మ కూడా పరమాత్మయే.

సాగరము నుండి బిందు లవలేశమును వెలికి తీసినప్పుడు అది ఆత్మయైనది. నీటి ఉపరితలమున బుడగగా ఏర్పడినప్పుడు దానికి పరిమితి రూపము, ఆకృతి, రంగు ఏర్పడుచున్నవి.

అనగా - ఆత్మయనెడి లవలేశము, అనంత అపార సాగరము నుండి వేరుపడినప్పుడే దానికి బిందురూపము లేక బుద్బుదరూపము యేర్పడి పరిమిత వ్యక్తిత్వము కలుగుచున్నది.

ఇట్లు వేరైన బిందులవలేశము తిరిగి సాగరజలములో కలిసి పోయినప్పుడు, అది కూడా సాగరమే యైనది కనుక వాస్తవమునకు "ఆత్మయే పరమాత్మ".

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


23 Dec 2020

No comments:

Post a Comment