విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 184, 185 / Vishnu Sahasranama Contemplation - 184, 185


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 184, 185 / Vishnu Sahasranama Contemplation - 184, 185 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻184. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ🌻

ఓం సతాంగతయే నమః | ॐ सतांगतये नमः | OM Satāṃgataye namaḥ

సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ

సతాం వైదిక సాధూనాం పురుశార్థపదోహరిః ।

సతాంగతిరితిప్రోక్తః స్వానుభూత్యా బుధోత్తమైః ॥

వేద ప్రమాణమును అంగీకరించి వేద విహితమార్గానుయాయులు అగు సాధుజనులకు లేదా సత్పురుషులకు గతిః అనగా పురుషార్థస్థితిగా నుండు విష్ణువు సతాంగతిః అని చెప్పబడును.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::

క. శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర, జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్‍

భూపతియు యాదవశ్రే, ణీ పతియున్ గతియునైన నిపుణు భజింతున్‍. (65)

లక్ష్మికీ, యజ్ఞానికీ, ప్రజలకూ, బుద్ధికీ, జగత్తుకూ, భూమికీ, యాదవ వర్గానికీ, పతీ గతీ అయిన భగవంతుని సేవిస్తాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 184🌹

📚. Prasad Bharadwaj


🌻184. Satāṃgatiḥ🌻

OM Satāṃgataye namaḥ

Satāṃ vaidika sādhūnāṃ puruśārthapadohariḥ,

Satāṃgatiritiproktaḥ svānubhūtyā budhottamaiḥ.

सतां वैदिक साधूनां पुरुशार्थपदोहरिः ।

सतांगतिरितिप्रोक्तः स्वानुभूत्या बुधोत्तमैः ॥

He who causes the realization of the Puruśārthās by those who are Sat i.e., vaidikās who have learnt and led the life as indicated by the Vedās.

Śrīmad Bhāgavata Canto 4, Chapter 30

Yatra nārāyaṇaḥ sākṣādbhagavānnāyāsināṃ gatiḥ,

Saṃstūyate satkathāsu muktasaṅgaiḥ punaḥ punaḥ. (36)

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे त्रिंषोऽध्यायः ::

यत्र नारायणः साक्षाद्भगवान्नायासिनां गतिः ।

संस्तूयते सत्कथासु मुक्तसङ्गैः पुनः पुनः ॥ ३६ ॥

Lord Nārāyaṇa, is present among devotees who are engaged in hearing and chanting His holy name. Lord Nārāyaṇa is the ultimate goal of those in the renounced order of life and Nārāyaṇa is worshiped through this sańkīrtana by those who are liberated from material contamination. Indeed, they recite the holy name again and again.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 185 / Vishnu Sahasranama Contemplation - 185 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ🌻

ఓం అనిరుద్ధాయ నమః | ॐ अनिरुद्धाय नमः | OM Aniruddhāya namaḥ

అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ

నకేనాపి ప్రాదుర్భావేషు నిరుద్ధః తన ప్రాదుర్భావ సందర్భములందు ఎవని చేతను అడ్డగించబడువాడుకాదు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::

ఉ.తెంపరివై పొరిం బొరిని దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలంజంపితి వింకనైన నుపశాంతి వహింపక ఱాలమీఁద నొప్పింపఁగ నిస్సిరో యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్‍జంపెడు వీరుఁ డొక్క దెస్ సత్కృతి నొందెడు వాఁడు దుర్మతీ! (154)

(దేవకీ దేవి అష్టమ గర్భమునందు జన్మించినది ఆడ శిశువు అని భావించి, ఆ బిడ్డను రాతికేసి కొట్టి హతమార్చబోతున్న కంసునితో దుర్గా దేవి...) "దుర్మార్గుడా! మహాకోపంతో ఈ దేవకీదేవి బిడ్డలను ఆరుగురిని వధించావు. మహా పరాక్రమవంతుడవు! పోనీ అంతటితో శాంతించక పసిబిడ్డను రాతిమీద కొట్టి చంపడానికి పూనుకొన్నావు. ఛీ! ఛీ! ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటే జన్మించి మరో దిక్కున మహాగౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే!"

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 185🌹

📚. Prasad Bharadwaj


🌻185. Aniruddhaḥ🌻

OM Aniruddhāya namaḥ

Nakenāpi prādurbhāveṣu niruddhaḥ / नकेनापि प्रादुर्भावेषु निरुद्धः One who has never been obstructed by anyone or anything from manifesting in various forms.

Śrīmad Bhāgavate - Canto 10, Chapter 4

Kiṃ mayā hatayā manda jātaḥ khalu tavāntkr̥t,

Yatra kva vā pūrvaśatrurmā hiṃsīḥ kr̥paṇānvr̥thā. (12)

:: श्रीमद्भागवते दशम स्कन्धे, पूर्वार्धे, चतुर्थोऽध्यायः ::

किं मया हतया मन्द जातः खलु तवान्त्कृत् ।

यत्र क्व वा पूर्वशत्रुर्मा हिंसीः कृपणान्वृथा ॥ १२ ॥

(Goddess Durgā addressing Kaṃsā who was about to kill the girl child) O Kaṃsā, you fool, what will be the use of killing me? He who has been your enemy from the very beginning and who will certainly kill you, has already taken His birth somewhere else. Therefore, do not unnecessarily kill other children.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

Continues....


🌹 🌹 🌹 🌹 🌹


23 Dec 2020

No comments:

Post a Comment