2-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 597 / Bhagavad-Gita - 597🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 204, 205 / Vishnu Sahasranama Contemplation - 204, 205🌹
3) 🌹 Daily Wisdom - 16🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 150🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 24 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 171 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 95🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 167 / Sri Lalita Chaitanya Vijnanam - 167🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 508 / Bhagavad-Gita - 508🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 113🌹 
11) 🌹. శివ మహా పురాణము - 313🌹 
12) 🌹 Light On The Path - 66🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 198 🌹 
14) 🌹 Seeds Of Consciousness - 262🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 137🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 101 / Sri Vishnu Sahasranama - 101🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 597 / Bhagavad-Gita - 597 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 14 🌴*

14. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథకే చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||

🌷. తాత్పర్యం : 
కార్యస్థానము (దేహము), కర్త, వివిధేంద్రియములు, వివిధములైన యత్నములు, చివరగా పరమాత్ముడు అనెడి ఈ ఐదును కార్యమునకు కారణములై యున్నవి

🌷. భాష్యము :
ఇచ్చట “అధిష్ఠానమ్” అను పదము దేహమును సూచించుచున్నది. అట్టి దేహమునందున్న ఆత్మ కర్మఫలములకై వర్తించుచున్నందున “కర్త” యని తెలియబడుచున్నది. అట్టి ఆత్మ జ్ఞాత మరియు కర్త యని శృతియందు పేర్కొనబడినది. “ఏషహి ద్రష్టా స్రష్టా” (ప్రశ్నోపనిషత్తు 4.9). 

ఇదే విషయము “జ్ఞోఽత ఏవ” (2.3.18) మరియు “కర్తా శాస్త్రర్థవత్వాత్” (2.3.33) అను వేదాంతసూత్రముల ద్వారా నిర్ధారితమైనది. ఇంద్రియములు కర్మసాధనములు కాగా, ఆత్మ అట్టి ఇంద్రియముల ద్వారా వివిధరీతుల వర్తించుచుండును. ప్రతికార్యమునకు వివిధ యత్నములు అవసరము. 

కాని మనుజుని ఆ కార్యములన్నియును మిత్రుని రూపమున హృదయస్థుడై యున్న పరమాత్ముని పైననే అంత్యమున ఆధారపడియున్నవి. అనగా అతడే కార్యములన్నింటికిని పరమకారణమై యున్నాడు. ఇటువంటి స్థితిలో హృదయస్థుడైన పరమాత్మ నేతృత్వమున కృష్ణభక్తిరసభావనలో వర్తించువాడు సహజముగా ఎటువంటి కర్మ చేతను బంధితుడు కాకుండును. 

అనగా సంపూర్ణముగా కృష్ణభక్తిరసభావితులైనవారు తమ కార్యములకు ఏ విధముగను అంత్యమున బాధ్యులు కారు. ప్రతిదియు దివ్యసంకల్పము (పరమాత్ముడు, దేవదేవుడు) పైననే ఆధారపడియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 597 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 14 🌴*

14. adhiṣṭhānaṁ tathā kartā karaṇaṁ ca pṛthag-vidham
vividhāś ca pṛthak ceṣṭā daivaṁ caivātra pañcamam

🌷 Translation : 
The place of action [the body], the performer, the various senses, the many different kinds of endeavor, and ultimately the Supersoul – these are the five factors of action.

🌹 Purport :
The word adhiṣṭhānam refers to the body. The soul within the body is acting to bring about the results of activity and is therefore known as kartā, “the doer.” That the soul is the knower and the doer is stated in the śruti. Eṣa hi draṣṭā sraṣṭā (Praśna Upaniṣad 4.9). It is also confirmed in the Vedānta-sūtra by the verses jño ’ta eva (2.3.18) and kartā śāstrārthavattvāt (2.3.33). 

The instruments of action are the senses, and by the senses the soul acts in various ways. For each and every action there is a different endeavor. But all one’s activities depend on the will of the Supersoul, who is seated within the heart as a friend. The Supreme Lord is the supercause. 

Under these circumstances, he who is acting in Kṛṣṇa consciousness under the direction of the Supersoul situated within the heart is naturally not bound by any activity. Those in complete Kṛṣṇa consciousness are not ultimately responsible for their actions. Everything is dependent on the supreme will, the Supersoul, the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 204, 205 / Vishnu Sahasranama Contemplation - 204, 205 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻204. అజః, अजः, Ajaḥ🌻*

*ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ*

అజతి గచ్ఛతి భక్తానాం హృదయేషు భక్తుల హృదయములలోనికి పోవును. అజతి క్షిపతి దుష్టాన్ దుష్టులను దూరముగా విసురును.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహిత వీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నీ
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁ బల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! (753)

దామోదరా! వేదాంత వీథుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాలలో ఎల్లపుడూ నిలిచివుండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు. ఈ సమస్త సృష్టికీ కారణమైన నీవు సంసార సాగరాన్ని తరింపజేసేవాడవు.

95. అజః, अजः, Ajaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 204🌹*
📚. Prasad Bharadwaj 

*🌻204. Ajaḥ🌻*

*OM Ajāya namaḥ*

The root Aj has got as meanings both 'go' and 'throw'. Ajati gacchati bhaktānāṃ hr̥dayeṣu / अजति गच्छति भक्तानां हृदयेषु One who goes into the hearts of devotees or Ajati kṣipati duṣṭān / अजति क्षिपति दुष्टान् One who throws the evil doers to a distance or destroys them.

95. అజః, अजः, Ajaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 205/ Vishnu Sahasranama Contemplation - 205🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻205. దుర్మర్షణః, दुर्मर्षणः, Durmarṣaṇaḥ🌻*

*ఓం దుర్మర్షణాయ నమః | ॐ दुर्मर्षणाय नमः | OM Durmarṣaṇāya namaḥ*

🌾దుర్మర్షణః, दुर्मर्षणः, Durmarṣaṇaḥ🌾

దానవాదిభిః దుఃఖేనాపి మర్షితుం సోఢుం న శక్యతే దానవాది దుష్టులచే ఎంత శ్రమచే కూడ సహించబడుటకు శక్యుడు కాడు. అనగా అపరాధులను సహించనివాడూ, వారిని శిక్షించు విష్ణువు దుర్మర్షణః అని చెప్పబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 205🌹*
📚. Prasad Bharadwaj 

*🌻205. Durmarṣaṇaḥ🌻*

*OM Durmarṣaṇāya namaḥ*

Dānavādibhiḥ duḥkhenāpi marṣituṃ soḍuṃ na śakyate / दानवादिभिः दुःखेनापि मर्षितुं सोढुं न शक्यते One whose might the evil doers cannot bear. He is unbearable by the asuras and such.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 16 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 16. Even Space is Brahman 🌻*

Truth being one, it cannot be classed as absolute and relative, except for the sake of human convenience and with reference to subjective changes. It is a sanction of the inability to apprehend Truth, and is not valid with stricter and saner perception. If the one is true, the other must be false. 

If we cannot experience the Absolute, we have to admit our defeat and ignorance, but we cannot thereby take advantage of our limited consciousness and try to prove that what we experience at present also is real independently. 

If Brahman has expressed itself as the world, then, the world cannot exist outside Brahman. How can it express itself when there is no space for it to express or expand? Even space is Brahman. Expression or change becomes impossible.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 150 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 80 🌻*

బోధించాలి అంటే మరి ఒక మెట్టు దిగి వచ్చి వాగ్రూపంగా, శబ్దాన్ని ఆశ్రయించి బోధించాలి, వ్యాఖ్యానించాలి. అట్లా వ్యాఖ్యానించినపుడు ఒక మెట్టు పరమాత్మ స్థితి నుండి క్రిందకి దిగి పోయి విరాడ్రూపంగా, హిరణ్యగర్భ స్థితినుండే బోధించవలసినటువంటి అగత్యం వస్తుంది. 

హిరణ్యగర్భ స్థితి దాటిన తరువాత బోధించటానికి అవకాశం ఉండదు. అవ్యాకృత పరమాత్మలుగా బోధించేటటువంటి అవకాశం లేదు. ఎవరన్నా బోధిస్తున్నారు అన్నా కూడ అది వాచ్యార్ధం తెలియచెప్పటమే కాని, లక్ష్యార్ధం తెలియజెప్పటం కాదు. లక్ష్యార్ధమును మౌనవ్యాఖ్య ద్వారానే అందుకోవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి స్పష్టతను ఇక్కడ అందిస్తున్నారు.

        కారణం ఏమిటటా ?- దానికి రెండు లక్షణములు ఉన్నాయి. రూపరహితమైనటువంటిది, గుణ రహితమైనటువంటిది. అటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి శబ్దము సమర్ధము కాదు. ఆకాశభూతకమైన శబ్దము పంచభూతాత్మకమైన పంచీకరించబడినటువంటి దానిని బోధించగలుగుతుందే కాని, అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మమును, అపంచీకృత భాగమైనటువంటి పరబ్రహ్మమును దానికి విలక్షణమైనటువంటి పరబ్రహ్మమును బోధించటానికి వీలుకాదు.

        కాబట్టి “నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే” అనే సూత్రమును అనుసరించి ఏకాక్షరమైనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అంటే , నీవు తప్పక మౌనవ్యాఖ్యను ఆశ్రయించాలి అనేటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. 

అటువంటి నిర్గుణ పరబ్రహ్మము యొక్క వాస్తవ రూపమును తెలుసుకోవాలి అంటే తప్పక హిరణ్యగర్భ, విరాట్ రూపముల ద్వారానే నీవు తెలుసుకోగలుగుతావు. ఆ అనుభూతి ద్వారా, ఆ నిర్ణయం ద్వారా నీవు దానిని గ్రహించగలుగుతావు అని మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రకంగా నచికేతునికి యమధర్మరాజు బోధిస్తూఉన్నారు.

        నచికేతా! ఎవని నుండి సూర్యుడు ఉదయించుచున్నాడో, ఎవని యందు అస్తమించుచున్నాడో, ఎవని నతిక్రమించుటకు దేవతలు కూడ సమర్ధులుకారో అతనిని బ్రహ్మమని తెలుసుకొనుము. ఇచట ఏది కలదో, అచటను అదియే కలదు. అచట ఏది కలదో ఇచటను అదియే కలదు. ఎవరు ఈ విషయమున అనేకముగా చూచుచున్నారో వారు మరల జనన మరణ రూప సంసారమును పొందుచున్నారు.

        జనన మరణ చక్రం ఎలా జరుగుతుందో కూడ ఇక్కడ బోధిస్తున్నారు. ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు ప్రకాశిస్తూఉన్నాడో, ఎవరి ప్రభావం చేతైతే సూర్యుడు అస్తమిస్తూ విరమిస్తాడో ఆ స్థానం పేరు బ్రహ్మము. అందుకే సూర్యుడును ప్రత్యక్ష సాక్షియని, కర్మసాక్షియని, కర్తవ్యసాక్షియని, త్రిమూర్త్యాత్మకమని, త్రిశక్త్యాత్మకమని, బ్రహ్మమని పిలవబడుతూ ఉన్నది. ఏ బ్రాహ్మీభూత శక్తి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ సూర్యస్థాన నిర్ణయం హిరణ్మయకోశ స్థానము కూడ అయి ఉన్నది. కాబట్టి అది బ్రహ్మము, అలా తెలుసుకోవాలి.

        అలా తెలుసుకున్న తరువాత ఆ హిరణ్మయ స్థానం లో ఎలా అయితే సర్వజీవులు విరమిస్తూ, మరల సృష్టి పునః ప్రాదుర్భవించే కాలంలో ఎలా అయితే మరల పునఃసృష్టి జరుగుతుందో, అక్కడ సృష్టి యొక్క క్రమవిధానం ఎలా ఉన్నదో, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి కూడ భూమి మీద జరిగేటటువంటి సృష్టికూడ అలాగే ఉన్నది. అక్కడ సూక్ష్మమైనటువంటి లోకాదుల సృష్టి ఎలా ఉన్నదో, ఇక్కడ స్థూలమైనటువంటి జీవుల సృష్టి కూడ అదే తీరుగా ఉన్నది.

        కాబట్టి అక్కడ ఏది కలదో ఇక్కడ కూడ అదే కలదు. ఇక్కడ ఏది కలదో అక్కడ కూడ అదే ఉంది. అనగా ఆత్మనిష్టులు, బ్రహ్మనిష్టులు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆ స్థితి నుంచి చూడటం చేత, అక్కడా, ఇక్కడా ఉన్నటువంటి ఏకాత్మతా భావన ఉన్నది. ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతూ ఉంటారు. జ్ఞాత, కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు అనే నిర్ణయాన్ని పొందుతూఉంటారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 24 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 24 🍀*

జప తప్ కర్మ్ క్రియా నేమ ధర్మ్!
సర్వా ఘటీ రామ్ భావ శుద్ధి!!
న సోడీ రే భావో టాకీరే సందేహూ!
రామకృద్దీ టాహూ నిత్య ఫోడీ!!
జాత్ విత్ గోత్ కుళ్ శీళ్ మాత్!
భజే కా త్వరిత్ భావనాయుక్!!
జ్ఞానదేవా ధ్యానీ రామకృష్ణ మనీ!
తేణే వైకుంఠ భువనీ ఘర్ కేలే!!

భావము:
జపము, తపము, కర్మలు, క్రియలు, నేమాలు మరియు ధర్మాలు ఏదైన కాని సర్వ ఘటాలలో రామ భావము పరిశుద్ధిగ కలిగి యుండి నేమాలు ఆచరించవలెను.

భావము వదలకూడదు, సందేహము వదిలి నిత్యము రామకృష్ణుల భజన చేయవలెను.

జాతిని, విత్తాన్ని, గోత్రాన్ని, కులమును, శీలాన్ని మరియు అభిమానాన్ని వదిలి, వేగిరపడి భావ యుక్తముగ భజన చేయుము.

నిరంతరము రామకృష్ణులలో మనసు నిలిపి ధ్యానము చేయుట వలన నేను వైకుంఠ భువనములో నివాసము ఏర్పరుచుకున్నాను అని జ్ఞానదేవులు తెలిపిరి.

*🌻. నామ సుధ -24 🌻*

జపము తపము కర్మ యుక్తము
క్రియయు నేమము మరియ ధర్మము
సర్వఘటములో రామ తత్త్వము
శుద్ధ భావనతో చేయు నేమము
ఎల్లవేళల వదలకు భావము
సందేహమును వదిలి పెట్టుము
రామ కృష్ణులను మరువక యుండుము
నిత్య నేమమున కీర్తన చేయుము
జాతి విత్తము మరియు గోత్రము
కులముశీలము వదిలివేయుము
వేగిర పడి భజన చేయుము
భావన ఎప్పుడు మదిలో నిలుపుము
జ్ఞానదేవుని మనసున ధ్యానము
రామ కృష్ణులది నిరంతరము
దానితో వారికి వైకుంఠ భువనము
లభించినాది లోక ప్రసిద్ధము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 171 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
163

The Guru and the Universe are not separate. Guru is the Universe and the Universe is the Guru. The visible energy that pervades the universe is the Guru alone. That is why, since the Guru and the Universe are one and not separate, Guru has become an integral part of man’s life. We thought they were different, that Guru was separate and the Guru Principle was separate. 

But, that is not the case. When we realize that since the Guru has manifested in this Universe, since the Guru is the Universe and the Universe is the Guru, since man’s life is in the Universe, since man’s life is in accordance with the principles of the Universe and the principle of Time, we can see that the Guru has become a part of man’s life. 

If a limb or a body part is missing, we feel like the body is not functioning correctly. If we can hear through both ears, we feel like it’s stereo sound. If we cannot hear through one ear, it sounds garbled. If we see with only one eye, we do not know if our visual focus is correct. Yes, it is true that when there is a defect in one part of the body, God energizes another part even more. We have seen a lot of people like that. 

A person may be visually impaired in both eyes, but God gives him amazing artistic or other capabilities he can demonstrate with his hands or amazing speaking ability. We marvel at those skills. It seems like even people with two eyes cannot perform those feats. 

Even people with good hands cannot do it. Some people who have a defect or deformity in one hand, use the other hand to do the work of both hands. This is God’s miracle. Such a person may use his sense of smell or sense of hearing to identify objects. This is the energy given by God.

If there is a defect or deformity in some part of the body, do you know how difficult life is? It is very difficult. If one leg is shorter than the other, one finds it very difficult to walk. Similarly, Guru is a part of our life, he is a principle in our lives. If the Principle of Guru is not in one’s life, he will face many difficulties. 

That is why God always takes care of and uplifts those who directly or indirectly place faith in him. The Principle of Guru is such. Some people are blessed directly and visibly by the Guru Principle. God has come in the form of the Guru Principle. 

That is why we say “Guru Brahma, Guru Vishnu, Guru Maheshwara”. (Guru is Brahma, Guru is Vishnu and Guru is Siva). Such a Supreme One, the God of Gods is carrying out all tasks in this universe. He is visible to some and invisible to the others. He benefits some people visibly. The rest are benefited invisibly. 

Just because the disciple can see his own progress, he should not take pride in it. If the disciple is being benefited indirectly, he should never become egoistic thinking that he alone is responsible for his own strength. Neither should a devotee become egoistic realizing that the invisible God is uplifting him.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 95 / Sri Lalitha Sahasra Nama Stotram - 95 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 167 / Sri Lalitha Chaitanya Vijnanam - 167 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |*
*నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖*

*🌻167. 'పాపనాశినీ' 🌻*

భక్తుల పాపములను నశింప చేయునది శ్రీమాత అని అర్థము.

పాప కర్మల నొనర్చువాని పాపముల రాశి, మేరుపర్వతమంత గొప్పదియైనను, కాత్యాయనిని పూజించిన- పూజించిన క్షణ మాత్రములో నశించును అని పురాణములు చెప్పుచున్నవి. “దుర్గా
రాధనాపరుని మహాపాతకముల వలన కలుగు దోషములు తామరాకు మీది నీటి బిందువులవలె అవి అతని నంటవు” అని పద్మ పురాణము తెలుపుచున్నది. 

సర్వ పాపములతో కూడిన వాడైననూ శ్రీదేవి నారాధించు నరుడు పవిత్రుడై పరమపదము పొందును, అని దేవీ భాగవతము తెలుపుచున్నది. దేవీ ఆరాధనము అను అగ్ని మహా పాపములను కూడ తృణాగ్రము వలె నశింపజేయును. అగ్నితాకిన వెంటనే, గడ్డిపోచ కొనవెంటనే, భస్మమగును కదా! పాపములను హరించుటలో శ్రీమాతను మించిన శక్తి లేదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 167 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Pāpanāśinī पापनाशिनी (167) 🌻*

She destroys the sins of Her devotees. Devotee is the one, who always thinks about Her not only at the time of reciting mantra-s, not only at the time of performing rituals but at all the times.  

For such a devotee mantra-s and rituals become meaningless. It is also presumed that Her devotees will not perform those actions that are termed as sins. If knowingly someone commits a sin, She will not come to his rescue. But why does She want to destroy the sins of Her devotees?  

Kṛṣṇa answers this question in Bhagavad Gīta (IV.14) “One who understands this truth (refer the previous nāma) about me, does not become entangled in the results of reactions of work (results of reactions mean karma-s. The concept of karma is based on Newton’s third law – for every action there is an equal and opposite reaction.  

This equal and opposite reaction is karma.).She wants Her devotees to pursue the path of liberation for which sins are impediments. How does She consume their sins? Chāndogya Upaniṣad (V.xxiv.3) says, pāpmānaḥ pradūyante, which means all sins are burnt up.  

The Upaniṣad further says ‘such sins are burnt like dry grass thrown into a fire’. The point driven home here is that when She is worshipped with all sincerity, the devotee gets rid of all his sins except prārabdha karma-s (the sum total of all karma-s accumulated over several past births) that have to be experienced.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 508 / Bhagavad-Gita - 508 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 18 🌴*

18. ఊర్థ్వం గచ్చన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసా: |
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసా: ||

🌷. తాత్పర్యం : 
సత్త్వగుణము నందున్నవారు క్రమముగా ఊర్థ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణము నందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణము నందున్నవారు నరకలోకములకు పతనము చెందుదురు. 

🌷. భాష్యము :
త్రిగుణములయందలి కర్మల వలన కలిగెడి ఫలితములు ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినవి. స్వర్గలోక సమన్వితమైన ఊర్థ్వగ్రహమండల మొకటి కలదు. ఆ లోకములందు ప్రతియొక్కరు ఉదాత్తులై యుందురు. జీవుడు తాను సత్త్వగుణమునందు పొందిన పురోగతి ననుసరించి అట్టి గ్రహమండలమందలి వివధలోకములకు ఉద్ధరింపబడుచుండును. 

ఆ లోకములలో బ్రహ్మలోకము (సత్యలోకము) అత్యంత ఉన్నతమైనది. అచ్చట విశ్వములో ముఖ్యుడైన బ్రహ్మదేవుడు నివసించును. బ్రహ్మలోకమందలి అధ్బుతమైన జీవనస్థితి పరిగణనకు అతికష్టమైనది ఇదివరకే మనము గాంచియున్నాము. కాని అత్యంత ఉన్నతస్థితియైన సత్త్వగుణము ద్వారా అది ప్రాప్తించగలదు.

రజోగుణము సత్త్వ, తమోగుణముల నడుమ యుండుటచే మిశ్రితమైనది. మానవుడు సదా పవిత్రుడై యుండజాలడు. ఒకవేళ అతడు పూర్తిగా రజోగుణమునందున్నచో భూమిపై రాజుగనో, ధనవంతుడుగనో జన్మను పొందుచుండును. 

కాని వాస్తవమునకు రజోగుణము నందును అతడు సర్వదా నిలువలేనందున పతనము చెందుటయు సంభవించును. రజస్తమోగుణ సమన్వితులైన భూలోకవాసులు యంత్రముల ద్వారా బలవంతముగా ఊర్థ్వలోకములను చేరజాలరు. అంతియేగాక రజోగుణమునందున్నవాడు తదుపరి జన్మమున బుద్ధిహీనుడగుటకును అవకాశము కలదు.

అధమమైన తమోగుణము అత్యంత హేయమైనదిగా ఇచ్చట వర్ణింపబడినది. అట్టి తమోగుణఫలితము మిక్కిలి ప్రమాదకరముగా నుండును గనుకనే అది ప్రకృతి యొక్క అధమగుణమై యున్నది. మానవుని స్థాయి క్రింద పక్షులు, మృగములు, సరీసృపములు, వృక్షములు మొదలగు ఎనుబదిలక్షల జీవరాసులు గలవు. 

జీవుని తమోగుణప్రాబల్యము ననుసరించి ఈ వివిధ హేయస్థితుల యందు అతడు ప్రవేశపెట్టబడుచుండును. ఈ శ్లోకమునందు “తామసా:” యను పదము ప్రధానమైనది. ఉన్నతగుణమునకు వృద్ధి చెందకుండా నిరంతరము తమోగుణమునందే కొనసాగుగారిని ఈ పదము సూచించును. అట్టివారి భవిష్యత్తు మిగుల అంధకారమయముగా నుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 508 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 18 🌴*

18. ūrdhvaṁ gacchanti sattva-sthā
madhye tiṣṭhanti rājasāḥ
jaghanya-guṇa-vṛtti-sthā
adho gacchanti tāmasāḥ

🌷 Translation : 
Those situated in the mode of goodness gradually go upward to the higher planets; those in the mode of passion live on the earthly planets; and those in the abominable mode of ignorance go down to the hellish worlds.

🌹 Purport :
In this verse the results of actions in the three modes of nature are more explicitly set forth. There is an upper planetary system, consisting of the heavenly planets, where everyone is highly elevated. According to the degree of development of the mode of goodness, the living entity can be transferred to various planets in this system. 

The highest planet is Satyaloka, or Brahmaloka, where the prime person of this universe, Lord Brahmā, resides. We have seen already that we can hardly calculate the wondrous condition of life in Brahmaloka, but the highest condition of life, the mode of goodness, can bring us to this.

The mode of passion is mixed. It is in the middle, between the modes of goodness and ignorance. A person is not always pure, but even if he should be purely in the mode of passion, he will simply remain on this earth as a king or a rich man.

 But because there are mixtures, one can also go down. People on this earth, in the mode of passion or ignorance, cannot forcibly approach the higher planets by machine. In the mode of passion, there is also the chance of becoming mad in the next life.

The lowest quality, the mode of ignorance, is described here as abominable. The result of developing ignorance is very, very risky. It is the lowest quality in material nature.

 Beneath the human level there are eight million species of life – birds, beasts, reptiles, trees, etc. – and according to the development of the mode of ignorance, people are brought down to these abominable conditions. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -113 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚*

*🍀. ముఖ్య సూత్రములు - 1 🍀*

1. ఇది కావలెను, యిది వద్దు అను భావము లేక జీవితమును గడుపుట సన్న్యాసము.

2. సన్న్యాస పూర్వకమగు కర్మానుష్ఠానము సన్న్యాస యోగము.

3. మననము ద్వారా బ్రహ్మముతో యోగము చెందియుండుట వలన క్రమముగ బ్రహ్మము అనుగ్రహించును.

4. సర్వభూతాత్మల యందలి అంతరాత్మగ బ్రహ్మమును దర్శించుచు జీవించువానికి కర్మబంధమంటదు. అతడు విశుద్ధుడు, జితేంద్రియుడు.

5. బ్రహ్మముతో యోగమును స్మరణ మాత్రమున పొందియున్న యోగి యింద్రియములతో గాని, మనసుతో గాని కర్తవ్యములను యాంత్రికముగ నిర్వర్తించుచు నుండును.

6. బ్రహ్మ స్మరణమున నున్న యోగి దినచర్య యంతయు స్వప్నముగ సాగును. కార్యము లన్నియు నీటి బిందువులవలె పడి జారిపోగా, తాను తామరాకువలె నుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 313 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
77. అధ్యాయము - 32

*🌻. వీరభద్రుడు - 3 🌻*

హే శంభో !నా కుడి భాగములు మరల మరల అదరుచున్నవి. ఈనాడు విజయము నిశ్చితము. హే ప్రభో !కావున నన్ను పంపించుము (41). హే శంభో !నాకు వర్ణింపశక్యము గాని ఆనందము, ఉత్సాహము కలుగుచున్నవి. నా మనస్సు నీ పాదపద్మముల యందు లగ్నమై యున్నది (42). 

నాకు ప్రతి అడుగునందు శుభములు ప్రవాహము వలె ఒకదాని తరువాత మరియొకటి లభించగలవు. మంగళములకు నిధానమగు శంభుని (నీ) యందు ఎవనికి దృఢమగు భక్తి ఉండునో, వానికి ప్రతి దినము విజయము, ప్రతి దినము శుభము కలుగుట నిశ్చయము (43).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఉమాపతి యగు శివుడు వీరభద్రుని ఈ పలుకులను విని సంతసించి, 'వీరభద్రా !నీకు జయమగుగాక!' అని ఆశీర్వదించి, మరల ఆతనితో నిట్లనెను (44).

మహేశ్వరుడిట్లు పలికెను -

వత్సా!వీరభద్రా! నా మాటను మనస్సు లగ్నము చేసి వినుము. నేను చెప్పబోవు కార్యమును ప్రయత్న పూర్వకముగా శీఘ్రమే చేసి, నాకు ఆనందమును కలిగించుము (45). బ్రహ్మకు పుత్రుడు, దుష్టుడు, విశేషించి నన్ను ద్వేషించువాడు, మహా గర్వితుడు, మూర్ఖుడునగు దక్షుడు ఈనాడు యజ్ఞమును చేయుటకు నడుము కట్టినాడు (46). 

ఆ యజ్ఞమును, దాని పరికరములతో సహా భస్మము చేయుము. ఓ గణశ్రేష్ఠా! అట్లు చేసి వెంటనే నా వద్దకు మరలిరమ్ము. దేవతలను, గంధర్వులను, యక్షులను, ఇంకనూ అచటనున్నవారిని వెనువెంటనే ఈనాడే భస్మము చేయుము (48).

అచట విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, యముడు కూడ ఉండవచ్చును (49). వారిని ఈనాడే ప్రయత్న పూర్వకముగా ఎవ్వరినీ విడువకుండగా పడగొట్టుము. దధీచి నా విషయములో చేసిన శపథమును ఉల్లంఘించి, ఎవరైతే (50) అక్కడ ఉన్నారో, వారిని ప్రయత్న పూర్వకముగా భస్మము చేయుము. సందేహించకుము. నీతో బాటు ప్రమథగణములు కూడ రాగలవు. విష్ణువు మొదలగు వారు భ్రమచే అక్కడనే ఉన్నారు (51). 

వారిని వెంటనే నానాకర్షణ మంత్రముతో ఒక చోటకు జేర్చి భస్మము చేయుము. వారు నాకు సంబంధించిన శపథమును ఉల్లంఘించి అక్కడనే గర్వించియున్నారు (52). వారు నాకు ద్రోహము చేసిన వారే. కావున వారిని అగ్ని జ్వాలలతో దహించుము.

దక్షుని యజ్ఞమున జరిగే స్థలములో నున్న వారిని, వారి భార్యలను, వారి యజ్ఞోపకరణులతో సహా అగ్ని జ్వాలలో భస్మము చేసి, శీఘ్రమే మరలి రమ్ము (53).. నీవు అచటికి వెళ్లగానే విశ్వేదేవతలు మొదలగు వారు నిన్ను ఆదరముతో (54) స్తోత్రములను చేసెదరు. అయిననూ వారికి అగ్నికీలలలో భస్మము చేయుము. ద్రోహము చేసిన ఆ దేవతలను కూడా అగ్ని జ్వాలలతో చుట్టు ముట్టి (55), శీఘ్రముగా భస్మము చేయుము. హే వీర !దక్షుడు మొదలగు వారినందరినీ, వారి భార్యలను, బంధువులను కూడ అవలీలగా భస్మము చేసి నీటిని త్రాగుము. యజ్ఞములోని వేదవిధులను పరిరక్షించు బ్రహ్మ అనబడే ఋత్విక్కునైననూ లెక్క చేయ కుండగా సంహరించుము (56).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వేద మర్యాదను రక్షించువాడు, మృత్యువునకు మృత్యువు, సర్వేశ్వరుడునగు శివుడు క్రోధముతో ఎరుపెక్కిన కన్నులు గలవాడై మహావీరుడగు వీర భద్రునితో నిట్లు పలికి విరమించెను (57,58).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితలో రెండవది యగు సతీఖండలో వీర భద్రోత్పత్తి వర్ణ నమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 66 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 11 🌻*

270. One of the finest symbols of brotherhood that I have come across was a vision of one of our members of an Eastern temple supported by many hundreds of pillars. He said: “All these pillars are helping to support the temple, and they are therefore symbols of individual souls who form a part of the temple of humanity. 

Some of these pillars are on the outside, are seen and admired all the time. They also face the sunshine and the rain. Others are far away in the interior of the forest of pillars, never having the sun shining directly upon them at all, never being admired by people as they pass. Some of these pillars are in places where the worshippers gather round and sit leaning against the plinth of the pillar all day long. 

Other pillars are in less approachable places, but each one is an integral part of the temple and is doing its work. That is like the brotherhood of humanity. Some people may feel that they are doing a great deal; others may never know of a single opportunity of help that comes to them, and yet they are all bearing their part and are just as much pillars in the temple as those which are more prominent in the public eye.”

271. Many of our students are eager to claim unity with the Master and the saints, and not so anxious to claim unity with the criminal, the drunkard, the inefficient, the sensual, the cruel. But since humanity is one, we must be one with the less evolved people as well as with the greater; in the one case there is a part of ourselves towards which we must reach up, but in the other case there is a part of humanity which we must try to help. How can we help them? First of all by thinking in the right way about them.

 If we shrink from them with horror, if we hate them, we are making their path more difficult. If we allow the natural and justifiable feeling with regard to the evil that is being done to influence our attitude towards the person who does it, we are making an error. It is scarcely possible to avoid that sometimes, but we can always to some extent reason ourselves out of it.

272. Doctors meet with cases of the most loathsome and horrible diseases – which in many an instance the man concerned has brought entirely upon himself. But no doctor who is really earnest in his work thinks of that when the patient is before him. 

He does not shrink from the man with horror, but regards the disease as an enemy that has to be fought and conquered. That is a very good example of the attitude that we ought to be able to adopt when we have to deal with a degraded person. 

Undoubtedly the probabilities are that we could not produce very much effect upon an absolutely degraded drunkard, whose will is almost gone; but to shrink from him in horror or to feel contempt is not the way to help him. In the same way when a man commits a terrible crime we may have the greatest possible horror of the crime, but not of the criminal. It is difficult for us to separate them, but we have to do it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 198 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దుర్వాసమహర్షి-కందళి - 2 🌻*

06. సుజ్ఞానమనేది ఉంది. అంటే సమ్యక్‌జ్ఞానమన్నమాట. అది కలిగితేకాని సత్కర్మ అనేది జరుగదు. ఏదిమంచో ఏది చేడో తెలుసుకోవడానికి వివేకం ఉండాలి. సుజ్ఞానం కలగాలి. 

07. ఆ తరువాతే మనుష్యుడు సత్కర్మ చేస్తాడు. సత్కర్మ వలన విజ్ఞానం కలుగుతుంది. సత్కర్మ, విజ్ఞానం ఒకదానికొకటి సాధనాలు. సుజ్ఞానం ఉంటేనే వీజ్ఞానం కలుగుతుంది. ఇవి రెండూ పరస్పర ఆధారాలు. ఈ రెండింటికీ ముందర, సదసద్వివేకసంపత్తి-మంచిచెడులవివేకం-ఎంతో అవసరం. సత్కర్మలు అనేవి నాలుగువిధాలుగా ఉంటాయి. 

08. కులధర్మం, బ్రహ్మోపాసన ఈ రెండూ ప్రతివాడూ ఆచరించాలి. నీ కులమేదయినాసరే కులధర్మం ఆచరించు. బ్రహ్మోపాసన చెయ్యి. ఈ రెండూకూడా సాధ్యమే! ఇలా చేసినప్పుడు వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది. బ్రహ్మవస్తువు అంటే ఏమిటనుకున్నావు? సాక్షాత్తూ మహావిష్ణువే. యజ్ఞాది వైదికకర్మలచేత విష్ణుప్రీతి కలుగుతుంది. ఆయన సమస్థఫలాలూ ఇస్తాడు.

09. ఎవరయినా తనకు దోషంలేనంతమాత్రాన ఒక నిషద్ధకార్యాన్ని ఆచరించకూడదు. అన్నిపనులూ చెయ్యకూడదు. తననుచూచి నేర్చుకుంటారు అనే ఆలోచన ఉండాలి. సంఘంకోసం తను నియమబద్ధుడై ఉండాలి.

10. భగవంతుడి అనుగ్రహం ఉంటే సృష్టిలో చేయలేనిపని ఏదీలేదు. అటువంటివాళ్ళను ఎవరూ ఏమీచేయలేరు. ఆపత్కాలంలో శరణుఅనటం సహజంగా భక్తుడికి ఉంటుంది. ఆపద అతి తీవ్రమైనటువంటిదై, ఏ మనిషి ప్రయత్నంచేతనూ అందులోంచి బయటపడెటటువంటి స్థితి లేనప్పుడు-అటువంటిస్థితిలో శరణగతి ఏర్పడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 262 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 111. You want me to say something about the post-'I am' manifestation, while I am driving you to the pre-'I am' Absolute.. 🌻*

Just see how clear the Guru's intentions are, his sole concern is to drive you towards the Absolute, which he says is prior to the 'I am'. What can he say about the post-'I am' manifestation? Since you don't understand the state prior to your 'being', or rather you have never known it or given thought to it, you urge him to say something that you know. 

You know a lot about the post-'I am' manifestation, you are comfortable with it, hence you would like to hear something in that domain only and not outside it. 

 Now put aside all that is post-'I am' manifestation and try to focus on what the Guru is saying, which is about the pre-'I am' or the Absolute.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 137 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 16 🌻*

556. ఆత్మ, పరిణామ దశలలోనికి దిగుటతో అయదార్థపు మాయ ప్రారంభమైనది. విజ్ఞాన భూమికలో ప్రవేశించుటతో యదార్థపు మాయ అంత మగుచున్నది.

557. ఆధి భౌతికమును భగవంతుడే, ఆధ్యాత్మికమును భగవంతుడే. ఈ రెంటికీ అతిశయుడును భగవంతుడే.

558. భగవంతుని చైతన్య రాహిత్య స్థితిలో నున్న భగవంతుడు, స్వీయమైన అనంతలీల ద్వారా, తన స్వీయ సత్యము యొక్క చైతన్యమును పొంది, తన అనంత స్వభావత్రయమును స్థితిలో అనుభవించెను.

559. చైతన్య ప్రవృత్తి:- అనంత సనుత్యాభూతి పొందుటకు నూతన చైతన్యము లేదు. పరాత్పరస్థితిలో అంతర్నిహితమైయున్న చైతన్యమే, పెల్లుబికి క్రమక్రమముగా పరిణామము చెందుచు, పూర్ణమైన సృష్టితో సంగమించి సృష్టి యొక్క అనుభవము నిచ్చినది. 

ఈ పూర్ణ చైతన్యమే అంతర్ముఖమై అనంత సత్యమును ఏకైక సత్యముగా తన నిజమైన స్వీయమైన శాశ్వత అనంత స్థితి యొక్క అనుభవమును కలుగజేసెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 101 / Sri Vishnu Sahasra Namavali - 101 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 101. అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|*
*జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః|| 101 ‖ 🍀*
 
 🍀 941) అనాది: - 
ఆదిలేనివాడు.

🍀 942) భూర్భువ: - 
సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.

🍀 943) లక్ష్మీ: - 
లక్ష్మీ స్వరూపుడు.

🍀 944) సువీర: - 
అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.

🍀 945) రుచిరాంగద: - 
మంగళమైన బాహువులు గలవాడు.

🍀 946) జనన: - 
సర్వ ప్రాణులను సృజించినవాడు.

🍀 947) జన జన్మాది: - 
జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.

🍀 948) భీమ: - 
అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.

🍀 949) భీమ పరాక్రమ: - 
విరోధులకు భయంకరమై గోచరించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 101 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Uttara Bhadra 1st Padam* 

*🌻 101. anādirbhūrbhuvō lakṣmīssuvīrō rucirāṅgadaḥ |*
*jananō janajanmādirbhīmō bhīmaparākramaḥ || 101 || 🌻*

🌻 941. Anādiḥ: 
One who has no beginning because He is the ultimate cause of all.

🌻 942. Bhūrbhuvaḥ: 
'Bhu' means support. One who is the support (Bhu) of even the earth, which is known to support all things.

🌻 943. Lakṣmiḥ: 
He who is the bestower of all that is auspicious to the earth besides being its supporter.

🌻 944. Suvīraḥ: 
One who has many brilliant ways of manifestation.

🌻 945. Ruchirāṅgadaḥ: 
One who has very attractive armlets.

🌻 946. Jananaḥ: 
One who gives brith to living beings.

🌻 947. Jana-janmādiḥ: 
One who is the root cause of the origin of Jivas that come to have embodiment.

🌻 948. Bhimaḥ: 
One who is the cause of fear.

🌻 949. Bhima-parākramaḥ: 
One whose power and courage in His incarnations were a cause of fear for the Asuras.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment