✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚
🍀. ముఖ్య సూత్రములు - 1 🍀
1. ఇది కావలెను, యిది వద్దు అను భావము లేక జీవితమును గడుపుట సన్న్యాసము.
2. సన్న్యాస పూర్వకమగు కర్మానుష్ఠానము సన్న్యాస యోగము.
3. మననము ద్వారా బ్రహ్మముతో యోగము చెందియుండుట వలన క్రమముగ బ్రహ్మము అనుగ్రహించును.
4. సర్వభూతాత్మల యందలి అంతరాత్మగ బ్రహ్మమును దర్శించుచు జీవించువానికి కర్మబంధమంటదు. అతడు విశుద్ధుడు, జితేంద్రియుడు.
5. బ్రహ్మముతో యోగమును స్మరణ మాత్రమున పొందియున్న యోగి యింద్రియములతో గాని, మనసుతో గాని కర్తవ్యములను యాంత్రికముగ నిర్వర్తించుచు నుండును.
6. బ్రహ్మ స్మరణమున నున్న యోగి దినచర్య యంతయు స్వప్నముగ సాగును. కార్యము లన్నియు నీటి బిందువు వలె పడి జారిపోగా, తాను తామరాకు వలె నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Jan 2021
No comments:
Post a Comment