భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 198


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 198 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దుర్వాసమహర్షి-కందళి - 2 🌻


06. సుజ్ఞానమనేది ఉంది. అంటే సమ్యక్‌జ్ఞానమన్నమాట. అది కలిగితేకాని సత్కర్మ అనేది జరుగదు. ఏదిమంచో ఏది చేడో తెలుసుకోవడానికి వివేకం ఉండాలి. సుజ్ఞానం కలగాలి.

07. ఆ తరువాతే మనుష్యుడు సత్కర్మ చేస్తాడు. సత్కర్మ వలన విజ్ఞానం కలుగుతుంది. సత్కర్మ, విజ్ఞానం ఒకదానికొకటి సాధనాలు. సుజ్ఞానం ఉంటేనే వీజ్ఞానం కలుగుతుంది. ఇవి రెండూ పరస్పర ఆధారాలు. ఈ రెండింటికీ ముందర, సదసద్వివేకసంపత్తి-మంచిచెడులవివేకం-ఎంతో అవసరం. సత్కర్మలు అనేవి నాలుగువిధాలుగా ఉంటాయి.

08. కులధర్మం, బ్రహ్మోపాసన ఈ రెండూ ప్రతివాడూ ఆచరించాలి. నీ కులమేదయినాసరే కులధర్మం ఆచరించు. బ్రహ్మోపాసన చెయ్యి. ఈ రెండూకూడా సాధ్యమే! ఇలా చేసినప్పుడు వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది. బ్రహ్మవస్తువు అంటే ఏమిటనుకున్నావు? సాక్షాత్తూ మహావిష్ణువే. యజ్ఞాది వైదికకర్మలచేత విష్ణుప్రీతి కలుగుతుంది. ఆయన సమస్థఫలాలూ ఇస్తాడు.

09. ఎవరయినా తనకు దోషంలేనంతమాత్రాన ఒక నిషద్ధకార్యాన్ని ఆచరించకూడదు. అన్నిపనులూ చెయ్యకూడదు. తననుచూచి నేర్చుకుంటారు అనే ఆలోచన ఉండాలి. సంఘంకోసం తను నియమబద్ధుడై ఉండాలి.

10. భగవంతుడి అనుగ్రహం ఉంటే సృష్టిలో చేయలేనిపని ఏదీలేదు. అటువంటివాళ్ళను ఎవరూ ఏమీచేయలేరు. ఆపత్కాలంలో శరణుఅనటం సహజంగా భక్తుడికి ఉంటుంది. ఆపద అతి తీవ్రమైనటువంటిదై, ఏ మనిషి ప్రయత్నంచేతనూ అందులోంచి బయటపడెటటువంటి స్థితి లేనప్పుడు-అటువంటిస్థితిలో శరణగతి ఏర్పడుతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2021

No comments:

Post a Comment