శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 167 / Sri Lalitha Chaitanya Vijnanam - 167


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 167 / Sri Lalitha Chaitanya Vijnanam - 167 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖


🌻167. 'పాపనాశినీ' 🌻

భక్తుల పాపములను నశింప చేయునది శ్రీమాత అని అర్థము.

పాప కర్మల నొనర్చువాని పాపముల రాశి, మేరుపర్వతమంత గొప్పదియైనను, కాత్యాయనిని పూజించిన- పూజించిన క్షణ మాత్రములో నశించును అని పురాణములు చెప్పుచున్నవి. “దుర్గా

రాధనాపరుని మహాపాతకముల వలన కలుగు దోషములు తామరాకు మీది నీటి బిందువులవలె అవి అతని నంటవు” అని పద్మ పురాణము తెలుపుచున్నది.

సర్వ పాపములతో కూడిన వాడైననూ శ్రీదేవి నారాధించు నరుడు పవిత్రుడై పరమపదము పొందును, అని దేవీ భాగవతము తెలుపుచున్నది. దేవీ ఆరాధనము అను అగ్ని మహా పాపములను కూడ తృణాగ్రము వలె నశింపజేయును. అగ్నితాకిన వెంటనే, గడ్డిపోచ కొనవెంటనే, భస్మమగును కదా! పాపములను హరించుటలో శ్రీమాతను మించిన శక్తి లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 167 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Pāpanāśinī पापनाशिनी (167) 🌻

She destroys the sins of Her devotees. Devotee is the one, who always thinks about Her not only at the time of reciting mantra-s, not only at the time of performing rituals but at all the times.

For such a devotee mantra-s and rituals become meaningless. It is also presumed that Her devotees will not perform those actions that are termed as sins. If knowingly someone commits a sin, She will not come to his rescue. But why does She want to destroy the sins of Her devotees?

Kṛṣṇa answers this question in Bhagavad Gīta (IV.14) “One who understands this truth (refer the previous nāma) about me, does not become entangled in the results of reactions of work (results of reactions mean karma-s. The concept of karma is based on Newton’s third law – for every action there is an equal and opposite reaction.

This equal and opposite reaction is karma.).She wants Her devotees to pursue the path of liberation for which sins are impediments. How does She consume their sins? Chāndogya Upaniṣad (V.xxiv.3) says, pāpmānaḥ pradūyante, which means all sins are burnt up.

The Upaniṣad further says ‘such sins are burnt like dry grass thrown into a fire’. The point driven home here is that when She is worshipped with all sincerity, the devotee gets rid of all his sins except prārabdha karma-s (the sum total of all karma-s accumulated over several past births) that have to be experienced.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2021

No comments:

Post a Comment