సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 24
🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 24 🌹
🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 24 🍀
జప తప్ కర్మ్ క్రియా నేమ ధర్మ్!
సర్వా ఘటీ రామ్ భావ శుద్ధి!!
న సోడీ రే భావో టాకీరే సందేహూ!
రామకృద్దీ టాహూ నిత్య ఫోడీ!!
జాత్ విత్ గోత్ కుళ్ శీళ్ మాత్!
భజే కా త్వరిత్ భావనాయుక్!!
జ్ఞానదేవా ధ్యానీ రామకృష్ణ మనీ!
తేణే వైకుంఠ భువనీ ఘర్ కేలే!!
భావము:
జపము, తపము, కర్మలు, క్రియలు, నేమాలు మరియు ధర్మాలు ఏదైన కాని సర్వ ఘటాలలో రామ భావము పరిశుద్ధిగ కలిగి యుండి నేమాలు ఆచరించవలెను.
భావము వదలకూడదు, సందేహము వదిలి నిత్యము రామకృష్ణుల భజన చేయవలెను.
జాతిని, విత్తాన్ని, గోత్రాన్ని, కులమును, శీలాన్ని మరియు అభిమానాన్ని వదిలి, వేగిరపడి భావ యుక్తముగ భజన చేయుము.
నిరంతరము రామకృష్ణులలో మనసు నిలిపి ధ్యానము చేయుట వలన నేను వైకుంఠ భువనములో నివాసము ఏర్పరుచుకున్నాను అని జ్ఞానదేవులు తెలిపిరి.
🌻. నామ సుధ -24 🌻
జపము తపము కర్మ యుక్తము
క్రియయు నేమము మరియ ధర్మము
సర్వఘటములో రామ తత్త్వము
శుద్ధ భావనతో చేయు నేమము
ఎల్లవేళల వదలకు భావము
సందేహమును వదిలి పెట్టుము
రామ కృష్ణులను మరువక యుండుము
నిత్య నేమమున కీర్తన చేయుము
జాతి విత్తము మరియు గోత్రము
కులముశీలము వదిలివేయుము
వేగిర పడి భజన చేయుము
భావన ఎప్పుడు మదిలో నిలుపుము
జ్ఞానదేవుని మనసున ధ్యానము
రామ కృష్ణులది నిరంతరము
దానితో వారికి వైకుంఠ భువనము
లభించినాది లోక ప్రసిద్ధము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
02 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment