భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 137


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 137 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 16 🌻


556. ఆత్మ, పరిణామ దశలలోనికి దిగుటతో అయదార్థపు మాయ ప్రారంభమైనది. విజ్ఞాన భూమికలో ప్రవేశించుటతో యదార్థపు మాయ అంత మగుచున్నది.

557. ఆధి భౌతికమును భగవంతుడే, ఆధ్యాత్మికమును భగవంతుడే. ఈ రెంటికీ అతిశయుడును భగవంతుడే.

558. భగవంతుని చైతన్య రాహిత్య స్థితిలో నున్న భగవంతుడు, స్వీయమైన అనంతలీల ద్వారా, తన స్వీయ సత్యము యొక్క చైతన్యమును పొంది, తన అనంత స్వభావత్రయమును స్థితిలో అనుభవించెను.

559. చైతన్య ప్రవృత్తి:- అనంత సనుత్యాభూతి పొందుటకు నూతన చైతన్యము లేదు. పరాత్పరస్థితిలో అంతర్నిహితమైయున్న చైతన్యమే, పెల్లుబికి క్రమక్రమముగా పరిణామము చెందుచు, పూర్ణమైన సృష్టితో సంగమించి సృష్టి యొక్క అనుభవము నిచ్చినది.

ఈ పూర్ణ చైతన్యమే అంతర్ముఖమై అనంత సత్యమును ఏకైక సత్యముగా తన నిజమైన స్వీయమైన శాశ్వత అనంత స్థితి యొక్క అనుభవమును కలుగజేసెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jan 2021

No comments:

Post a Comment