11) 🌹. శివ మహా పురాణము - 342🌹
12) 🌹 Light On The Path - 95🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 227🌹
14) 🌹 Seeds Of Consciousness - 291🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 166🌹
16) 🌹. శ్రీమద్భగవద్గీత - 21 / Bhagavad-Gita - 21 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 22 / Lalitha Sahasra Namavali - 22🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 22 / Sri Vishnu Sahasranama - 22 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -142 - 144 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 27
*🍀 25. అంతర్ముఖుడు - బాహ్యమందలి స్పర్శాది విషయములను వెలుపలనే వదిలి ప్రాణాపానములను సమానము గావించి, చూపును అంతర్ముఖముగ నాసికాగ్రమున నిలిపి ముక్తుడై యుండుట తెలుపబడినది. ఇంద్రియముల అమరిక సృష్టింపక మునుపు జీవుడు అంతర్ముఖుడై, అంతరంగముననే యుండెడివాడు. ప్రచేతసులు అను ప్రజ్ఞల రూపమున యింద్రియ ప్రజ్ఞల నేర్పరచి, అంతః చేతనను బహిరంగముగ ప్రకటితము గావించుట జరిగినది. ఇంద్రియముల ద్వారా బాహ్యమున కలవాటుపడిన జీవులు, బాహ్యోన్ముఖులై అంతరంగమందలి స్వస్థానమును మరచిరి. మానవుని ప్రజ్ఞ అంతర్ముఖ మగుటకు ప్రధానమగు ఉపాయము శ్వాసను గమనించుట, శ్వాసపై మనసు లగ్నము చేయుట. శ్వాసమార్గము బహిర్ముఖమైన మనోప్రజ్ఞను అంతర్ముఖము చేయుటకు ఉపయోగపడును. శ్వాసపై మనసు నిలుపుట వలన శ్వాస ననుసరించుచు మనసు శ్వాస పుట్టుక స్థానమునకు పయనించును. 🍀*
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।।
బాహ్యమందలి స్పర్శాది విషయములను వెలుపలనే వదిలి ప్రాణాపానములను సమానము గావించి, చూపును అంతర్ముఖముగ నాసికాగ్రమున నిలిపి ముక్తుడై యుండుట తెలుపబడినది.
శబ్ద స్పర్శాది. విషయము లన్నియు బాహ్య ప్రపంచ సంబంధితము. పంచేంద్రియముల మూలమున మానవుడు వీని ననుభవించు చున్నాడు. ఇంద్రియ సుఖము లన్నియు బాహ్య సుఖములే. పంచేంద్రియములే లేనిచో జీవునకు బాహ్యస్మృతి యుండదు. ఇంద్రియముల అమరిక సృష్టిలో ఒక ప్రధాన ఘట్టము. ఇంద్రియముల అమరిక సృష్టింపక మునుపు జీవుడు అంతర్ముఖుడై, అంతరంగముననే యుండెడివాడు.
ప్రచేతసులు అను ప్రజ్ఞల రూపమున యింద్రియ ప్రజ్ఞల నేర్పరచి, అంతః చేతనను బహిరంగముగ ప్రకటితము గావించుట జరిగినది. ఇంద్రియముల ద్వారా బాహ్యమున కలవాటుపడిన జీవులు, బాహ్యోన్ముఖులై అంతరంగమందలి స్వస్థానమును మరచిరి. ఇల్లు మరచి రాత్రింబవళ్లు పోకిరిగా తిరుగు పిల్లలను సంఘమున చూచుచున్నాము కదా! వారికి యిల్లు పట్టదు.
అట్లే సర్వ సామాన్య ముగ మానవులకు బహిరంగముననే జీవిత మంతయు గడిచి
పోవును. అంతరంగ అనుభూతి వారికి కలిగించుటయే ప్రధానోద్దేశ్యముగ యోగవిద్య ఏర్పడినది. మానవుని ప్రజ్ఞ అంతర్ముఖ మగుటకు ప్రధానమగు ఉపాయము శ్వాసను గమనించుట, శ్వాసపై మనసు లగ్నము చేయుట. శ్వాసమార్గము బహిర్ముఖమైన మనోప్రజ్ఞను అంతర్ముఖము చేయుటకు ఉపయోగపడును. శ్వాసపై మనసు నిలుపుట వలన శ్వాస ననుసరించుచు మనసు శ్వాస పుట్టుక స్థానమునకు పయనించును.
క్రమముగ మనసు స్పందన ప్రక్రియను చేరును. మనసు స్పందనమును గమనించుట యందు ఏకాగ్రత కలిగిన కొద్దీ, ప్రాణాపానములు సమన్వయింపబడి ఉదాన ప్రాణము ద్వారమున అంతరంగమున ఊర్ధ్వ ముఖమై జనును. భ్రూమధ్యమును చేరును. భ్రూమధ్యమును నాసికాగ్ర కేంద్రముగ కూడ తెలుపుదురు. అచ్చట అంతర్ముఖుడై చరించు చుండును. (ప్రాణాయామ యజ్ఞముగ దీనినే భగవంతుడు ముందు అధ్యాయ
ములలో బోధించినాడు.)
అచ్చట అంతర్జ్యాతిని దర్శించుచు, అంతరారాముడై, అంతః సుఖమును పొందుచు నుండువాడు సన్న్యాసియని 24వ శ్లోకమున తెలుపబడినది. అట్లు అంతర్ముఖముగ భ్రూమధ్యమునకు చేరుటకు ఉపాయమును దైవమీ శ్లోకమున ప్రతిపాదించినాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
*🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹*
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 343 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
87. అధ్యాయము - 42
*🌻. దక్షుని ఉద్ధారము -1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు కలిసి అనునయించగా, పరమేశ్వరుడగు శంభుడు ప్రసన్నుడాయెను (1). కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు విష్ణువు మొదలగు దేవతలను ఓదార్చి, చిరునవ్వు నవ్వి, గొప్ప అనుగ్రహమును ఇచ్చువాడై ఇట్లు పలికెను (2).
శ్రీ మహాదేవుడిట్లు పలికెను -
దేవశ్రేష్ఠులారా! మీరిద్దరు నా మాటను సావధానముగా వినుడు. వత్సలారా! మీకు నేను సత్యమును చెప్పెదను. మీరు చూపిన క్రోధమును నేను సర్వదా సహించితిని (3). బాలురు చేయు పాపములను నేను పరిగణించను. వారి బాల్యమును మాత్రమే పరిగణించెదను. వారు నా మాయచే పరాజితులై యుందురు గనుక, వారి యందు దండమును ప్రయోగించను (4). దక్షుని యజ్ఞమును ధ్వంసము చేసిన వాడను నేను కాదు. ఇతరుల అభివృద్ధిని ద్వేషించు వ్యక్తి తాను స్వయముగా భ్రష్ఠుడగును (5). కావున ఎప్పుడైననూ ఇతరులను నొప్పించే పనిని చేయరాదు. శిరస్సును కోల్పోయిన దక్షుడు మేక తలను పొందును గాక! (6).
భగదేవత మిత్రుని నేత్రముతో యజ్ఞభాగమును దర్శించగలడు. వత్సలారా! పూషన్ అను దేవతకు దంతములు పోయినవి గదా! ఆయన యజమానుని దంతములతో మెత్తని పిండి రూపములోనున్న యజ్ఞ భాగమును (7). భక్షించగలడు. నేను చెప్పు వచనము యథార్థము. నాపై విరోధమును బూనిన భృగువు మేక యొక్క గెడ్డమును పొందగలడు (8).
నా యందు విరోధమును ప్రదర్శించిన దేవతలు అందరూ తమ అవయవములను యథాపూర్వకముగా పొందగలరు. ఇతర ఋత్విక్కులు అశ్వినీ దేవతల బాహువులతో, పూషన్ యొక్క హస్తములతో యజ్ఞ కార్యములను (9) చక్కబెట్టగలరు. ఈ వ్యవస్థను మీ యందలి ప్రీతిచే నేను ప్రకటించితిని (10).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దయానిధి, చరాచర జగత్ర్పభువు, ప్రకాశస్వరూపుడు, సర్వులపై సమ్రాట్, వేద మార్గానుయాయి అగు పరమేశ్వరుడిట్లు పలికి మిన్నకుండెను (11). అపుడు విష్ణువు, బ్రహ్మ, దేవతలు, ఇతరులు అందరు శంకరుని మాటలను విని సంతసించినవాహై'సాధు సాధు' అని పలికిరి (12).
అపుడు విష్ణువు, నేను, దేవతలు, ఋషులు కూడి శంభుని వెంటనిడుకొని మిక్కిలి ఆనందముతో మరల ఆ యజ్ఞవాటికకు వెళ్లితిమి (13). ఈ తీరున విష్ణువు మొదలగు దేవతలు ప్రార్థించగా శంభుడు దక్షప్రజాపతి యొక్క కనఖలమనే యజ్ఞ వాటిక వద్దకు వెళ్లెను (14).
వీరభద్రుడు ఆ యజ్ఞమును ధ్వంసము చేసి దేవతలను, ఋషులను పరాజితులను గావించిన తీరున అపుడు రుద్రుడు దర్శించెను (15). స్వాహా, స్వధా, పూషన్, తుష్టి, ధృతి, సరస్వతి, ఇతర ఋషులు, పితృదేవతలు, అగ్నులు (16),
ఇంతేగాక అక్కడకు వచ్చిన యక్ష గంధర్వ రాక్షసాదులు ఎంతోమంది అవయవములను గోల్పోయిరి. కొందరి కేశములు ఊడబెరుకబడెను. ఆ రణరంగములో మరికొందరు మరణించిరి (17). ఆ విధముగా నున్న యజ్ఞశాలను చూచి శంభువు గణాధ్యక్షుడు, మహావీరుడునగు వీరభద్రుని పిలిపించి, నవ్వుతూ ఆతనితో నిట్లనెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 95 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 7 - THE 14th RULE
*🌻 14. Desire peace fervently. The peace you shall desire is that sacred peace which nothing can disturb. - 5 🌻*
366. A few thousand years are as nothing in the long life of the soul, but we do not want to be delayed in that way. In the Lives of Alcyone we find, for example, the case of one young man who had remarkably good opportunities in connection with one, of the great Masters in a temple in Egypt.
367. He foolishly wasted his time, threw away his opportunities and lost them. The Master said then that He would always be ready to take him again when he came back. It is only in this life, six thousand years later, that he has come back. That carelessness lost him a good deal of time.
Think of what might have been done in that six thousand years, if he had taken the offer. At that time the Master who made it had not yet attained Adeptship. Certainly if the pupil had accepted, he might have now been very far on the road to Adeptship himself.
It cannot be a matter of indifference whether a man takes such a step as that six thousand years earlier or later. The man who took it so much earlier would have all the work of intervening years on the very highest levels to his credit – it seems impossible that it can be the same thing.
368. I do not know how far in the counsels of the Eternal what we call time matters. There is a point of view to which one may rise in which past and present and future all seem one eternal now, but even in that eternal now there are some things which are more opened and others which are less opened,
and therefore the acceptance or the neglect of an opportunity must make a difference, though there may be some way in which a mistake of that kind may be adjusted in the future, in which somehow the man’s regret that he did not succeed may be a force enabling him to work doubly well to try to overtake the past.
One can only guess at it, only attempt to imagine how such a thing would work; but there is very distinct reason to suppose that there will be a position in which the past can be rectified.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 227 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. మైత్రేయమహర్షి - 4 🌻*
21. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో ఒక సూక్షమముంది. నేను అనే భావనలేదక్కడ. ప్రతివాడికీ గోత్రనామములు, తల్లీతండ్రీ వాడికిచ్చిన ఒక నామము, దేహము, పుట్టుక, పెరుగుదల, చావు – ఇవన్నీ ఉంటాయి.
22. వాటిని ఆధారం చేసుకుని కర్మచేస్తే, అది మళ్ళీ ఆ జీవుడికి బంధనహేతువవుతుంది. అటువంటివాడికి పునర్జన్మ తప్పదు. కాని, కృష్ణుడి విషయంలో, ఆ జీవుడు చేసే కర్మ ఏదయినప్పటికీ, సాక్షిమాత్రుడుగా తానుంటాడు. ఆ జీవుడొక యంత్రం. ఆ దేహంలో ఉండే మనిషి ఒక యంత్రం. ఒక కర్మసాధనం అది.
23. అంటే, ఉదాహరణకు – సృక్స్రువములు యజ్ఞానికి కర్మ సాధనములు. అవి ఎట్లాంటివో ఈ దేహంకూడా అట్లాంటిదే! ఒకరు యజ్ఞం చేస్తే, వాటికి ఏమయినా కర్మఫలం అంటుతుందా! ఏమీ అంట్డం లేదు. యజ్ఞవేదిక ఏమయిపోతున్నది? తవ్వి తీసేస్తాం. ఆ తరువాత అక్కడ ఏమీ ఉండదు.
24. దానికి ఏం ఫలం అంటుతుంది? అట్లాంటప్పుడు, నశించేటటువంటి ఈ దేహానికి మాత్రం ఆ ఫలం ఎందుకు అంటుతుంది? ఆ సృక్స్రువములు ఎత్లాంటివో ఈ దేహముకూడా అట్లాంటిదే! ఈ దేహంలో ఉండేతటువంటి జీవుడు, జీవత్వము, అంతా నశ్వరమే – నశించేదే. దానికీ కర్మఫలమనేది ఉండకూడదు.
25. ‘నేను పరమాత్మను’ అని తనకు తెలుసు ఈ విషయం. కృష్ణ స్వరూపంగా ఉండేటటువంటి ఈ దేవకీనందనుడు లోకకల్యాణహేతువని, సత్యము, ధర్మము అను అనుకున్న పని చేయిస్తాడు. దాని ఫలం-లోకంలో నశించేటటువంటి జీవులకు ఫలం-ముట్టుతుంది.
26. ఈ ప్రాతిపదికన అతడు చేసినటువంటి కృష్ణావతార కాలంనాటి కార్యక్రమంయొక్క ఫలంకూడా శాశ్వతంకాదు. యజ్ఞఫలం అనేది శాశ్వతంగా ఎలా ఉంటుంది? అసలు యజ్ఞమే నశ్వరమయినది కదా! కృష్ణావతారకాలం సమాప్తి అయ్యేందుకు మరికొంతకాలం పట్టింది. ఆ కాలంలో అధర్మం మరికొంత పెరిగింది.
27. అయినప్పటికీ, నశ్వరమైన ఈ దేహానికికూడా, లోకం విషయంలో పుణ్యకార్యం చేసేటటువంటి బాధ్యత ఉంటుంది! అందువల్లనే, నశించే జీవలక్షణం కలిగిన ఆ శరీరానికికూడా ఈ జన్మలోనే ఏదో పవిత్రకార్యం చేయటంవలన ఆ జీవత్వానికి పవిత్రత.
28. కర్మచివర, ‘సర్వం ఈశ్వరార్పణం’ అంటాం మనకు తెలుసు. అదే లోకానికి చెందుతుంది. స్వవిషయంలోకూడా అతడే కర్మఫల ప్రదాత కదా! ఆ రహస్యాన్ని మైత్రేయమహర్షికి శ్రీకృష్ణుడు బోధించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 291 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 140. In order to stabilize in the 'I am' or 'Turiya' you must understand this birth-principle. 🌻*
The Guru once again stresses the importance of understanding the 'Turiya', or the 'I am', in order to get stabilized in it. For this you will have to repeatedly go back to that moment when the 'I am' first appeared on you.
The 'Turiya', which lay dormant from the day of your conception, suddenly or spontaneously popped up and you came to know that 'you are'. This wordless state of 'Turiya' prevailed for some time wherein you only knew that 'I am' and 'I am not'.
Gradually, as a process of your conditioning, the 'I am' soon identified itself with the body and you became an individual (Mr. or Ms. 'so-and-so') living in the world. The three states of waking, dreaming and deep sleep took over and you forgot the background 'Turiya'.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 166 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 4 🌻*
643. సద్గురువులు అనంత జ్ఞాన స్థితిలో తమకు తామై నెలకొని అనంతానందము అనుభవించుచు తమ అనంత శక్తిని (అధికారమును) ఉపయోగించుటకు తమ అనంత జ్ఞానమును వినియోగించుటలోనే తర తమ భేదములున్నవి గాని సచ్చిదానంద స్థితి అనుభవములో పై నలుగురు సమానులే.
644. అన్ని యుగములలో అన్ని కాలములలో ఈ భూమి మీద 56గురు శివాత్మలు (బ్రహ్మీభూతులు) ఉందురు. ఈ యేబది ఆరుగురిలో చాలా హెచ్చు మంది బ్రహ్మీభూతస్థితిలో నుందురు. కొలది మంది 'దివ్యకూడలి' యైన 'తురీయావస్థ' లో నుందురు. బహు కొలది మంది తురీయావస్థను దాటి ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో నుందురు. 5గురు మాత్రమే మానవ రూపములో మానవుల మధ్య భగవజ్జీవితమును గడుపుచుందురు.వారే సద్గురువులు.
645. సద్గురువును ఆరాధించినచో, అనంతగుణ విశిష్టుడైన భగవంతుని ఆరాధించినట్లే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 21 / Bhagavad-Gita - 21 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴*
శ్లోకము 21
అర్జున ఉవాచ
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ||
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత |
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను :
ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్నా ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.
ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము.
🌷. బాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 21 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 1 - Vishada Yoga 🌴*
Verse 21
arjuna uvāca :
hṛṣīkeśaṁ tadā vākyam idam āha mahī-pate
senayor ubhayor madhye rathaṁ sthāpaya me ’cyuta
🌷 Translation :
Arjuna said:
O King, after looking at the sons of Dhṛtarāṣṭra drawn in military array, Arjuna then spoke to Lord Kṛṣṇa these words.
O infallible one, please draw my chariot between the two armies.
🌷Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 22 / Sri Lalita Sahasranamavali - Meaning - 22 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 22. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా |*
*చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ‖ 22 ‖ 🍀*
🍀 55) సుమేరు శృంగమధ్యస్థా -
మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
🍀 56) శ్రీమన్నగర నాయికా -
శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి.
🍀 57) చింతామణి గృహాంతఃస్థా -
చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
🍀 58) పంచబ్రహ్మాసనస్థితా -
ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 22 🌹
📚. Prasad Bharadwaj
*🌻 sumeru-madhya-śṛṅgasthā śrīmannagara-nāyikā |*
*cintāmaṇi-gṛhāntasthā pañca-brahmāsana-sthitā || 22 || 🌻*
🌻 55 ) Summeru Madhya sringastha - She who lives in the central peak of Mount Meru
🌻 56 ) Sriman nagara nayika - She who is the chief of Srinagara(a town)
🌻 57 ) Chinthamani grihanthastha - She who lives in the all wish full filling house
🌻 58 ) Pancha brahmasana sthitha - She who sits on the five brahmas viz., Brahma, Vishnu, Rudra, Esana and Sadashiva
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 22 / Sri Vishnu Sahasra Namavali - 22 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*ఆరుద్ర నక్షత్రం 2వ పాద శ్లోకం - నిత్యం 108 సార్లు*
*🍀 22. అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః|
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా|| 🍀*
🍀 198) అమృత్యుః -
నాసనము లేనివాడు.
🍀 199) సర్వదృక్ -
సర్వమును చూచువాడు.
🍀 200) సింహః -
పాపములను హరించువాడు.
🍀 201) సంధాతా -
జీవులను వారి కర్మఫలములను అనుసంధానము చేయువాడు.
🍀 202) సంధిమాన్ -
సకల జీవులలో ఐక్యమై యుండువాడు.
🍀 203) స్థిరః -
స్థిరముగా నుండువాడు, నిశ్చలుడు, నిర్వికారుడు.
🍀 204) అజః -
పుట్టుకలేనివాడు, అజ్ఞానము హరించువాడు, అక్షరాలకు మూలమైనవాడు.
🍀 205) దుర్మర్షణః -
తిరుగులేనివాడు, ఎదురులేనివాడు, అడ్డు లేనివాడు.
🍀 206) శాస్తా -
బోధించువాడు, జగద్గురువు, అధర్మవర్తులను శిక్షించువాడు.
🍀 207) విశ్రుతాత్మా -
వివిధ రూపాలతో, వివిధ నామాలతో కీర్తింపబడువాడు.
🍀 208) సురారిహా -
దేవతల (సన్మార్గులు) యొక్క శతృవులను హరించువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 22 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Midhuna Rasi, Arudra 2nd Padam**
* 🌻 22. amṛtyuḥ sarvadṛk siṁhaḥ sandhātā sandhimān sthiraḥ |*
*ajō durmarṣaṇaḥ śāstā viśrutātmā surārihā || 22 || 🌻*
🌻 198) Amṛtyuḥ:
One who is without death or its cause.
🌻 199) Sarvadṛk:
One who sees the Karmas of all Jivas through His inherent wisdom.
🌻 200) Simhaḥ:
One who does Himsa or destruction.
🌻 201) Sandhātā:
One who unites the Jivas with the fruits of their actions.
🌻 202) Sandhimān:
One who is Himself the enjoyer of the fruits of actions.
🌻 203) Sthiraḥ:
One who is always of the same nature.
🌻 204) Ajaḥ:
The root 'Aj' has got as meanings both 'go' and 'throw'. So the name means One who goes into the hearts of devotees or One who throws the evil Asuras to a distance, i.e. destroys them.
🌻 205) Durmarṣaṇaḥ:
One whose might the Asuras cannot bear.
🌻 206) Śasta:
One who instructs and directs all through the scriptures.
🌻 207) Vishrutatma:
One who is specially known through signifying terms like Truth, Knowledge, etc.
🌻 208) Surārihā:
One who destroys the enemies of Suras or Devas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment