శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 201 / Sri Lalitha Chaitanya Vijnanam - 201


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 201 / Sri Lalitha Chaitanya Vijnanam - 201 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |*
*సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖*

*🌻 201. 'సద్గతిప్రదా' 🌻*

సద్గతిని ప్రసాదించునది శ్రీదేవి అని అర్థము.

సత్యమునకు దారి చూపుట శ్రీదేవి ఆశయము. దానిని ప్రసాదించుట ఆమె అనుగ్రహము. సత్యమును చేరుటయే జీవుల గమ్యము. జన్మ పరంపర లన్నియూ జీవులను సత్యము వైపునకే నడిపించును. రకరకముల అనుభవములను పొందుచూ, సమగ్రత్వము చెందుచూ, జీవుడు పరిణామమున ముందుకు సాగుచు నుండును. 

నిరుపమానమైన ఓర్పుతో ప్రేమతో కరుణతో శ్రీదేవి జన్మ పరంపరల నొసగుచూ జీవులను సద్గతివైపు నడిపించు చుండును. “జీవులు దేనిని అభిలషించుచునైననూ చివరకు నన్నే చేరుచున్నారు. దేని నన్వేషించు వారైననూ నన్ను గూర్చియే అన్వేషించు చున్నారు. వారి ఆనందాన్వేషణము నన్ను చేరుటకే.” ఇట్లు చేరుటకు దేహము లావశ్యకములు. 

జన్మ పరంపర లావశ్యకము. ప్రకృతి రూపమున శ్రీదేవి ఇట్టి జన్మల ననుగ్రహించుచూ అనుభవమును, అనుభూతిని కలిగించుచూ జీవులను సత్యము వైపునకు నిరంతరము నడిపించుచునే యున్నది. అజ్ఞానవశులైన వారు కూడ సత్యపథముననే నడుచు చున్నారని తెలియుట సమగ్ర జ్ఞానము. అనుభవ లేమియే అజ్ఞానము కాని అది దుష్టత్వము కాదు. 

అజ్ఞాని, జ్ఞాని కూడ వారి వారి అనుభవముల ననుసరించుచూ క్రమముగ దైవమును చేరుటయే సృష్టి కథ. మాతృభావము కలిగినవారే తెలిసిన వారిని, తెలియని వారిని కూడా ఒకే ప్రేమతో నడిపింతురు. అట్టి కరుణామయి శ్రీదేవి అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 201 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

🌻 Sadgati-pradā सद्गति-प्रदा (201) 🌻

She guides Her devotees in the right path to reach the right target (salvation). The target is realizing the Brahman. To realize the Brahman one needs to have higher spiritual knowledge. This knowledge is provided by Her. She can only provide the knowledge, but receiving the knowledge and act as per the knowledge gained, is in the hands of Her devotees. Sadgati is the path pursued by wise men. This is the stage where ignorance is destroyed and knowledge alone prevails. Viṣṇu Sahasranāma nāma 699. sadgatā.

Kṛṣṇa explains this in Bhagavad Gīta (XVII.26). “The name of God Sat is employed in the sense of truth and goodness. And the word Sat is also used in the sense of praiseworthy act.”

Liṅga Purāṇa (II.15.3) says, “The wise speak of Śiva of the form of sat (existing) and asat (non-existing).”

Sat means all-pervading and is both eternal and non-eternal. It is also said that Sat and Asat refers to manifest and unmanifest.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


06 Feb 2021


No comments:

Post a Comment