📚. ప్రసాద్ భరద్వాజ
🌻 272. బృహద్రూపః, बृहद्रूपः, Br̥hadrūpaḥ🌻
ఓం బృహద్రూపాయ నమః | ॐ बृहद्रूपाय नमः | OM Br̥hadrūpāya namaḥ
బృహద్రూపః, बृहद्रूपः, Br̥hadrūpaḥ
బృహన్మహద్వరాహాదిరూపమస్యేతి కేశవః ।
నైకేషు చావతారేషు బృహద్రూప ఇతీర్యతే ॥
బృహత్, మహత్, లేదా పెద్దదియగు వరాహాది రూపములు గల కేశవుడు, బృహద్రూపుడు.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
మ. సకలాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజంబైన రూపంబుతో
నకలంకస్థితినుండి శైలిమిదె మీ రర్చింప రం' డంచుఁ దా
నొక శైలాకృతిఁ దాల్చి గోపకులతో నొండొండ పూజించి గో
పక దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్షశైలాకృతిన్. (891)
శ్రీ కృష్ణుడు ఎప్పటి రూపుతో గొల్లల నడుమ నిశ్శంకంగా నిష్కళంకంగా ఉంటూ, వారితో "ఇదిగో! పర్వతం. దీనిని పూజించడానికి మీరంతా రండి" అని తాను తత్‍క్షణం పర్వతాకృతి ధరించాడు. ఆ గోపాలకులతోనే కలిసి గిరిరూపం దాల్చిన హరి తన్ను తానే ప్రత్యేకంగా పూజించుకుంటూ గొల్లలిడిన నైవేద్యమంతా ఆరగించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 272🌹
📚. Prasad Bharadwaj
🌻272. Br̥hadrūpaḥ🌻
OM Br̥hadrūpāya namaḥ
Br̥hanmahadvarāhādirūpamasyeti keśavaḥ,
Naikeṣu cāvatāreṣu br̥hadrūpa itīryate.
बृहन्महद्वराहादिरूपमस्येति केशवः ।
नैकेषु चावतारेषु बृहद्रूप इतीर्यते ॥
Since Keśava has adopted big forms like the Varāha or Boar incarnation, He is known by the divine name Br̥hadrūpaḥ.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 24
Kr̥ṣṇastvanyatamaṃ rūpaṃ gopaviśrambhaṇaṃ gataḥ,
Śailo’smīti bruvanbhūri balimādadbr̥hadvapuḥ. (35)
:: श्रीमद्भागवते दशम स्कन्धे, पूर्वार्धे चतुर्विंऽशोध्यायः ::
कृष्णस्त्वन्यतमं रूपं गोपविश्रम्भणं गतः ।
शैलोऽस्मीति ब्रुवन्भूरि बलिमादद्बृहद्वपुः ॥ ३५ ॥
Kṛṣṇa then assumed an unprecedented, huge form to instill faith in the cowherd men. Declaring "I am Govardhana Mountain!" He ate the abundant offerings.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 273/ Vishnu Sahasranama Contemplation - 273🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 273. శిపివిష్టః, शिपिविष्टः, Śipiviṣṭaḥ🌻
ఓం శిపివిష్టాయ నమః | ॐ शिपिविष्टाय नमः | OM Śipiviṣṭāya namaḥ
శిపివిష్టః, शिपिविष्टः, Śipiviṣṭaḥ
శిపయః పశవస్తేషు విశతి ప్రతిష్ఠతి ।
యజ్ఞరూపేణేతి విష్ణు శ్శిపివిష్ట ఇతీర్యతే ॥
పశువులకు 'శిపి' అని నామము. వానియందు యజ్ఞము అను రూపముతో నారాయణుడే ప్రవేశించి యుండును అను అర్థమున 'శిపి-విష్టః' అనగా శిపులయందు ప్రవేశించియుండువాడు అను శబ్దము నిష్పన్నమగును. అనగా శ్రీ విష్ణువు తానే యజ్ఞములరూపమున యజ్ఞార్థము ఉపయోగించబడు పశువులయందు ప్రవేశించియుండి యజ్వలు ఆచరించు యజ్ఞములకు సమగ్రతను కలిగించి వానిని ఫలవంతములనుగా చేయుచు యజమానులకు ఫలదానము చేయుచున్నాడు అని భావము.
యజ్ఞో వై విష్ణుః - పశవః శిపిర్యజ్ఞ ఏవ పశుషు ప్రతితిష్ఠతి (తైత్తిరీయ సంహిత 1-7-4)
యజ్ఞమే విష్ణువు. పశువులు 'శిపి' అనబడును; యజ్ఞమే (యజ్ఞరూపుడగు విష్ణువే) పశువులయందు నిలుచుచున్నది అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 273 🌹
📚. Prasad Bharadwaj
🌻273. Śipiviṣṭaḥ🌻
OM Śipiviṣṭāya namaḥ
Śipayaḥ paśavasteṣu viśati pratiṣṭhati,
Yajñarūpeṇeti viṣṇu śśipiviṣṭa itīryate.
शिपयः पशवस्तेषु विशति प्रतिष्ठति ।
यज्ञरूपेणेति विष्णु श्शिपिविष्ट इतीर्यते ॥
Śipi means Cow. In the form of Yajña, Lord Nārāyaṇa Himself resides in them. 'Śipi-viṣṭa' means contained in Śipi. Thus Lord Viṣṇu residing in Cows in the form of Yajña, leads to successful completion of the sacrificial Yajña rituals yielding the anticipated results to those performing them.
Yajño vai viṣṇuḥ - paśavaḥ śipiryajña eva paśuṣu pratitiṣṭhati (Taittirīya Saṃhita 1-7-4)
यज्ञो वै विष्णुः - पशवः शिपिर्यज्ञ एव पशुषु प्रतितिष्ठति (तैत्तिरीय संहित १-७-४)
Verily the Yajña is Viṣṇu. 'Śipi' is Cow. Yajña is established in Cows. One who has entered into them is Śipiviṣṭa.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥
Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
06 Feb 2021
No comments:
Post a Comment