దేవాపి మహర్షి బోధనలు - 24


🌹. దేవాపి మహర్షి బోధనలు - 24 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌻 15. అశ్వము 🌻

జ్యోతిర్మయమైన ద్వాదశ రాశిచక్రమును ఋషులొక యజ్ఞముగ అభివర్ణించిరి. ఈ అశ్వము యొక్క ముఖము అశ్వినీ నక్షత్రము. 

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢలు తోక. సూర్యుడు అశ్వినిలో ప్రవేశించుట, ధనుస్సులో ప్రవేశించుట రెండు విధముల విజ్ఞాన యజ్ఞములకు మూలకారణమై అనంతమగు జ్ఞానరాశికి చిహ్నమై ఒప్పుచున్నది.

ఇందలి రహస్యార్థము గమనింపదగినది. అశ్విని - గుఱ్ఱము శిరస్సగు ఉషస్సు. అది మేషరాశి యొక్క శిరస్సున నుండును. మూల అశ్వము యొక్క జఘనము. 

అది మూలా (ధనురాశి ప్రజ్ఞ)
ధారమున నుండును. ఈ రెండు కేంద్రముల దేవతలే నాసత్య దస్రులు. వీరు ముఖముచే గర్భము ధరించు మొదటి కిరణముల జంట. వెన్నెముక యను నక్షత్ర మండలమునకు ప్రాణములు. 

ఈ రెండు గుఱ్ఱములను కట్టిన రథమే జీవాత్మ శరీరము. అశ్వ (మేష) రాశిలో సూర్యుడు ప్రవేశించిన దినమునుండి యోగసాధన వ్రతములు ఆరంభించుట శాస్త్రరహస్యము. 

అశ్వరాశి నుండి నవమ స్థానము కాలపురుషునకు సర్వ శుభంకరము. సూర్యుడీ భాగలలో ప్రవేశించినపుడు ధనుర్మాసము ఆరంభమగును. అశ్విని నుండి మూలకు, మూల నుండి అశ్వినికి గల మార్గమునందు సమగ్ర యోగము నిక్షిప్తమై యున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

06 Feb 2021

No comments:

Post a Comment