ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు - ధ్యాన పద్ధతులు - 2


🌹. ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు - ధ్యాన పద్ధతులు - 2 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పాత భయాలను పోగొట్టే ధ్యానం: 🌻

చిన్నప్పుడు వేరే అతి లేక ఒప్పుకొన్న పాత విధానాలనే నేను ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుసుకొన్నాను. నువ్వు ఎందుకూ పనికిరావు అని నా తల్లిదండ్రులు నన్ను తిట్టినపుడు నోరెత్తకుండా పారిపోయి ఎవరి అవసరం లేకుండా నేను ఒంటరిగా ఏదైనా చెయ్యగలను అనే భావనతో నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇపుడు నేను నా స్నేహితుల పట్ల అదే విధంగా స్పందిస్తున్నాను.

అది కేవలం మీలో చాలా గట్టిగా పాతుకుపోయిన ఒక పాత అలవాటు. ఈ ధ్యానానికి కావలసినది దానికి వ్యతిరేకంగా చెయ్యడం. ప్రయత్నించండి. ఏదైనా చెప్పాలనుకొంటే చెప్పకండి. ఎక్కడికైనా వెళ్లాలనుకొంటే వెళ్లకండి. మాట్లాడకూడదు అనుకొంటే మరింత గట్టిగా మాట్లాడండి. వాదించకూడదు అనుకొంటే మరింత గట్టిగా వాదించండి.

దాచాలనుకున్న దానిని బయట పెట్టండి.
ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడూ చాలా భయాన్ని కలిగిస్తుంది. అపుడు మీ ముందు కేవలం రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటాయి. పోరాడడం, లేదా పారిపోవడం. పోరాడడమే భయానికి మందు. పారిపొవడం కాదు.  

సంప్రదాయ దేశాలలో ప్రత్యేకించి లోక సంప్రదాయాల హద్దులకు పరిమితమైన దేశాలలో, కుటుంబాలలో పసివాడు ఏమాత్రం పోరాడలేదు. అందువల్ల వాడు ఏమాత్రం నోరెత్తకుండా తనని తాను రక్షించుకుంటాడు. అదే స్వేచ్ఛా సమాజంలో , చివరికి తల్లిదండ్రులు కూడా పారిపోయే స్థాయిలో ఆ పసివాడు పోరాడ గలడు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹


06 Feb 2021

No comments:

Post a Comment