🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మైత్రేయమహర్షి - 4 🌻
21. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో ఒక సూక్షమముంది. నేను అనే భావనలేదక్కడ. ప్రతివాడికీ గోత్రనామములు, తల్లీతండ్రీ వాడికిచ్చిన ఒక నామము, దేహము, పుట్టుక, పెరుగుదల, చావు – ఇవన్నీ ఉంటాయి.
22. వాటిని ఆధారం చేసుకుని కర్మచేస్తే, అది మళ్ళీ ఆ జీవుడికి బంధనహేతువవుతుంది. అటువంటివాడికి పునర్జన్మ తప్పదు. కాని, కృష్ణుడి విషయంలో, ఆ జీవుడు చేసే కర్మ ఏదయినప్పటికీ, సాక్షిమాత్రుడుగా తానుంటాడు. ఆ జీవుడొక యంత్రం. ఆ దేహంలో ఉండే మనిషి ఒక యంత్రం. ఒక కర్మసాధనం అది.
23. అంటే, ఉదాహరణకు – సృక్స్రువములు యజ్ఞానికి కర్మ సాధనములు. అవి ఎట్లాంటివో ఈ దేహంకూడా అట్లాంటిదే! ఒకరు యజ్ఞం చేస్తే, వాటికి ఏమయినా కర్మఫలం అంటుతుందా! ఏమీ అంట్డం లేదు. యజ్ఞవేదిక ఏమయిపోతున్నది? తవ్వి తీసేస్తాం. ఆ తరువాత అక్కడ ఏమీ ఉండదు.
24. దానికి ఏం ఫలం అంటుతుంది? అట్లాంటప్పుడు, నశించేటటువంటి ఈ దేహానికి మాత్రం ఆ ఫలం ఎందుకు అంటుతుంది? ఆ సృక్స్రువములు ఎత్లాంటివో ఈ దేహముకూడా అట్లాంటిదే! ఈ దేహంలో ఉండేతటువంటి జీవుడు, జీవత్వము, అంతా నశ్వరమే – నశించేదే. దానికీ కర్మఫలమనేది ఉండకూడదు.
25. ‘నేను పరమాత్మను’ అని తనకు తెలుసు ఈ విషయం. కృష్ణ స్వరూపంగా ఉండేటటువంటి ఈ దేవకీనందనుడు లోకకల్యాణహేతువని, సత్యము, ధర్మము అను అనుకున్న పని చేయిస్తాడు. దాని ఫలం-లోకంలో నశించేటటువంటి జీవులకు ఫలం-ముట్టుతుంది.
26. ఈ ప్రాతిపదికన అతడు చేసినటువంటి కృష్ణావతార కాలంనాటి కార్యక్రమంయొక్క ఫలంకూడా శాశ్వతంకాదు. యజ్ఞఫలం అనేది శాశ్వతంగా ఎలా ఉంటుంది? అసలు యజ్ఞమే నశ్వరమయినది కదా! కృష్ణావతారకాలం సమాప్తి అయ్యేందుకు మరికొంతకాలం పట్టింది. ఆ కాలంలో అధర్మం మరికొంత పెరిగింది.
27. అయినప్పటికీ, నశ్వరమైన ఈ దేహానికికూడా, లోకం విషయంలో పుణ్యకార్యం చేసేటటువంటి బాధ్యత ఉంటుంది! అందువల్లనే, నశించే జీవలక్షణం కలిగిన ఆ శరీరానికికూడా ఈ జన్మలోనే ఏదో పవిత్రకార్యం చేయటంవలన ఆ జీవత్వానికి పవిత్రత.
28. కర్మచివర, ‘సర్వం ఈశ్వరార్పణం’ అంటాం మనకు తెలుసు. అదే లోకానికి చెందుతుంది. స్వవిషయంలోకూడా అతడే కర్మఫల ప్రదాత కదా! ఆ రహస్యాన్ని మైత్రేయమహర్షికి శ్రీకృష్ణుడు బోధించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Feb 2021
No comments:
Post a Comment