భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 166


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 166 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 4 🌻



643. సద్గురువులు అనంత జ్ఞాన స్థితిలో తమకు తామై నెలకొని అనంతానందము అనుభవించుచు తమ అనంత శక్తిని (అధికారమును) ఉపయోగించుటకు తమ అనంత జ్ఞానమును వినియోగించుటలోనే తర తమ భేదములున్నవి గాని సచ్చిదానంద స్థితి అనుభవములో పై నలుగురు సమానులే.


644. అన్ని యుగములలో అన్ని కాలములలో ఈ భూమి మీద 56గురు శివాత్మలు (బ్రహ్మీభూతులు) ఉందురు. ఈ యేబది ఆరుగురిలో చాలా హెచ్చు మంది బ్రహ్మీభూతస్థితిలో నుందురు. కొలది మంది 'దివ్యకూడలి' యైన 'తురీయావస్థ' లో నుందురు. బహు కొలది మంది తురీయావస్థను దాటి ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో నుందురు. 5గురు మాత్రమే మానవ రూపములో మానవుల మధ్య భగవజ్జీవితమును గడుపుచుందురు.వారే సద్గురువులు.


645. సద్గురువును ఆరాధించినచో, అనంతగుణ విశిష్టుడైన భగవంతుని ఆరాధించినట్లే.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


06 Feb 2021

No comments:

Post a Comment