🌷. శ్రీ శివ మహా పురాణము - 101 🌷

🌷. శ్రీ శివ మహా పురాణము - 101 🌷
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. విద్యేశ్వర సంహితా 🌴 
అధ్యాయము - 25
🌻. రుద్రాక్ష మహాత్మ్యము - 1 🌻

సూత ఉవాచ |

శౌనకర్షే మహాప్రాజ్ఞ శివరూప మహాపతే | శృణు రుద్రాక్ష మహాత్మ్యం సమాసాత్కథయామ్యహమ్‌ || 1

శివప్రియతమో జ్ఞేయో రుద్రాక్షః పరపావనః | దర్శనాత్‌ స్పర్శనాజ్ఞాప్యాత్సర్వ పాపహరస్స్మృతః || 2

పురా రుద్రాక్ష మహిమా దేవ్యగ్రే కథితో మునే | లోకోపకరణార్థాయ శివేన పరమాత్మనా || 3

సూతుడిట్లు పలికెను -

శౌనక మహర్షీ! నీవు గొప్ప జ్ఞానివి. శివ స్వరూపడవు. గొప్పవారిలో గొప్పవాడివి. నేను రుద్రాక్ష మహిమను సంగ్రముగా చెప్పెదను వినుము (1). 

మిక్కిలి పవిత్రమగు రుద్రాక్ష శివునకు ఎంతయూ ప్రియమైనది. రుద్రాక్షను చూచినా, స్పృశించినా, మాలతో జపము చేసినా పాపములన్నియు తొలగునని ఋషులు చెప్పిరి. (2). 

ఓ మహర్షీ! పూర్వము శివపరమాత్మ లోకోప కారము కొరకై పార్వతీ దేవికి రుద్రాక్ష మహిమను చెప్పియున్నాడు (3).

శృణు దేవి మహేశాని రుద్రాక్ష మహిమాం శివే | కథయామి తవ ప్రీత్యా భక్తానాం హితకామ్య యా|| 4

దివ్య వర్ష సహస్రాణి మహేశాని పునః పురా | తపః ప్రకుర్వతస్త్రస్తం మనస్సంయమ్య వై మమ || 5

స్వతంత్రేణ పరేశేన లోకోపకృతి కారిణా | లీలయా పరమేశాని చక్షురున్మీలితం మయా || 6

పుటాభ్యాం చారు చక్షర్భ్యాం పతితా జలబిందవః | తత్రాశ్రు బిందవో జాతా వృక్షా రుద్రాక్ష సంజ్ఞ కాః || 7

ఓ మహేశానీ!దేవీ!శివే! భక్తుల హితమును గోరి, నేను నీకు ప్రీతితో రుద్రాక్ష మహిమను చెప్పెదను వినుడు (4). 

ఓ మహేశ్వరీ! పూర్వము నేను వేలాది దివ్య సంవత్సరములు సంయమముతో తపస్సు చేయుచుండగా, నామనస్సు భయపడినది (5) 

హే పరమేశ్వరి! పరమేశ్వరుడు, స్వతంత్రుడు, లోకములకు ఉపకారమును చేయువాడునగు నేనులీలగా నేత్రములను తెరచితిని (6). 

సుందరమగు ఆ నేత్ర పుటముల నుండి నీటి బిందువులు జారినవి. ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష అను పేరు గల వృక్షములైనవి (7).

స్థావరత్వమను ప్రాప్య భక్తాను గ్రహకారణాత్‌ | తే దత్తా విష్ణు భక్తే భ్యశ్చతుర్వర్ణేభ్య ఏవ చ || 8

భూమౌ గౌండోద్భవాంశ్చక్రే రుద్రాక్షాన్‌ శివవల్లభాన్‌ | మథురాయామయోధ్యాయాం లంకాయాం మలయే తథా || 9

సహ్యాద్రౌ చ తథా కాశ్యాం దశేష్వన్యేషు వా తథా | పరానసహ్యాపాపౌఘభేదనాన్‌ శ్రుతినోదనాన్‌ || 10

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శ్శూద్రా జాతా మమాజ్ఞయా | రుద్రాక్షాస్తా పృథివ్యాం తు తజ్జాతీయాశ్శుభాక్ష కాః || 11

ఆ కన్నీటి బిందువులు భక్తుల అనుగ్రహము కొరకై వృక్షరూపమును పొందినవి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే గాక సర్వవర్ణముల వారికి ఇచ్చెను (8). 

శివునకు ప్రీతికరములగు రుద్రాక్షలు భూలోకములో గౌడ దేశమునందు పుట్టినవి. శివుడు వాటిని మథుర, అయోధ్య, లంక, మలయ (9) 

సహ్య పర్వతములు, కాశీ మాత్రమే గాక, ఇంకనూ, పది స్థానములలో లభ్యమగునట్లు చేసెను. వేద సమ్మతములగు రుద్రాక్షలు శ్రేష్ఠమైనవి, సహింప శక్యము కాని పాప సమూహములను నశింపజేయును (10). 

నా ఆజ్ఞచే ఈ శుభకరములగు రుద్రాక్షలు భూలోకములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర అనే నాల్గు భేదములతో ప్రవర్తిల్లుచున్నవి (11).

శ్వేతరక్తాః పీతకృష్ణా వర్ణా జ్ఞేయాః క్రమాద్బుధైః | స్వజాతీయం నృభిర్ధార్యం రుద్రాక్షం వర్ణతః క్రమాత్‌ || 12

వర్ణైస్తు తత్ఫలం ధార్యం భుక్తిముక్తి ఫలేప్సు భిః | శివభక్తైర్విశేషేణ శివయోః ప్రీతయే సదా || 13

ధాత్రీఫల ప్రమాణం యచ్ఛ్రేష్ఠమేతదుదాహృతమ్‌ | బదరీఫల మాత్రం తు మధ్యమం సంప్రకీర్తితమ్‌ || 14

అధమం చణమాత్రం స్యాత్ర్పక్రియైషా పరోచ్యతే | శృణు పార్వతి సుప్రీత్యా భక్తానాం హితకామ్యయా || 15

రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అను నాల్గు రంగులు గలవు. మానవులు తమకు యోగ్యమైన రంగు గల రుద్రాక్షలను స్వీకరించి ధరించవలెను (12). 

భుక్తిని, ముక్తిని, గోరు శివభక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రీతి కొరకై ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరించవలెను (13).

 పెద్ద ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష ఉత్తమమనియు, రేగిపండు ప్రమాణము గలది మధ్యమమనియు (14), 

సెనగగింజ ప్రమాణముగలది అధమమనియు వ్యనస్థ గలదు. ఓ పార్వతీ! భక్తుల హితమును గోరి నేను చెప్పే విషయమును ప్రీతితో వినుము (15).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. ఋగ్వేద సంహిత వచనము - 57 🌹

🌹. ఋగ్వేద సంహిత వచనము - 57 🌹 
✍️. రచన : దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ
 
🌻. మండలము 1, అధ్యాయము 4, అనువాకము 10, సూక్తము - 12 🌻
🌴 56వ సూక్తము 🌴

ఏబది ఆరవ సూక్తము, ఋషి-సవ్యుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-జగతి.

    1. యజమాని చమసములలో సోమరూపములగు అన్నములను ఉంచినాడు. మగ గుఱ్ఱము ఆడు గుఱ్ఱమును చేరదీసినట్లు ఇంద్రుడు ఆ సోమములను అందుకున్నాడు. బంగారు రథము నెక్కినాడు. సర్వకార్య సాధకము అగు సోమమును త్రావినాడు.

    2. ధనము కోరిన వర్తకులు యానమునకు సంద్రమును ఆశ్రయింతురు. స్తోత్రము చేయు యాజకులు సర్వవ్యాపకుడయిన ఇంద్రుని ఆశ్రయింతురు. స్తోత్రా ! వృద్ధి కలిగించువాడును, యజ్ఞపతియు అయిన ఇంద్రుని స్తోత్రము చేయుడు. స్త్రీలు, పూలు, పండ్లకొఱకు పర్వతమును ఆశ్రయింతురు. అట్లే ఇంద్రుని స్తుతులతో ఆశ్రయింపుడు.

    3. ఇంద్రుడు ఇనుప కవచము తొడిగినాడు. శాత్రవులను దూలించినాడు. సోమము త్రావినాడు. మత్తెక్కినాడు. తన బలమును సర్వమును శోషింప చేసినాడు. మాయావులను సంకెలలందు ఇరికించినాడు. ఇంద్రుని దోషరహితమయిన బలము యుద్ధములందు పర్వత శిఖరమువలె ప్రకాశించుచున్నది.

    4. ఇంద్రుని బలమునకు ఎదురులేదు. అతడు తిమిర రూపుని వధించినాడు. యాజకులు ఇంద్రుని బలము వర్ధిల్లుటకు స్తోత్రపాఠములు చేసినారు. అవి సూర్యుడు ఉషస్సును చేరినట్లు ఇంద్రుని చేరినవి. అపుడు ఇంద్రుని శత్రువులు హింసలు అనుభవించినారు.

    5. జలములు నాశరహితములు. ప్రాణాధారములు. వాటిని వృత్రుడు మూసిపెట్టినాడు. ఇంద్రుడు జలములను విడిపించినాడు. ద్యులోకమున నిలిపినాడు. ధనార్థమయిన యుద్ధమున హర్షోల్లాసమున ఇంద్రుడు వృత్రుని కొట్టినాడు. అప్పుడు ఇంద్రుడు మేఘములను అధోముఖముగ వర్షింపచేసినాడు.

    6. ఇంద్రా ! జలము భూమికి ఆధారభూతము. ఆ జలమును నీవు ద్యులోకమున ఉండి ధరించుచున్నావు. నీవు సోమము సేవించినావు. మదమెక్కినావు. వృత్రుని శిలతోబద్దలు కొట్టినావు. వర్షము కలిగించుచున్నావు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 30 🌹. 🌻. ముండకోపనిషత్తు - 1 🌻

🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 30🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ముండకోపనిషత్తు - 1 🌻

🌷. ప్రథమ ముండకం - ప్రథమ ఖండం : 

1. ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ: సంబభూవ 
విశ్వస్య కర్తా భువనస్య గోప్తా !
స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్టామ్ 
అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ !!

సృష్టికర్తా, జగద్రక్షకుడూ ఐన బ్రహ్మ దేవతలందరికంటే ముండు పుట్టాడు. ఆయనే జగత్తు సృష్టికర్త, రక్షకుడు. ఆయన సకలశాస్త్రాలకూ ఆధారభూతమైన బ్రహ్మవిద్యను తన పెద్ద తనయుడైన అథర్వునకు అనుగ్రహించాడు. 

2. అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మా-
థర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మవిద్యామ్ !
స భారద్వాజాయ సత్యవహాయ ప్రాహ
భారద్వాజోంగిరసే పరావరామ్ !!

బ్రహ్మ అథర్వునకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను ప్రాచీన కాలంలో అథర్వుడు అంగిరునకు బోధించాడు. ఆ విద్యనే భరద్వాజగోత్రుడైన సత్యవహుడు అంగిరుని వద్ద గ్రహించాడు. ఇలా పరంపరగా వస్తున్న అపరావిద్యను సత్యవాహుడు అంగిరసునికు అందజేశాడు. 

3. శౌనకో హ వై మహాశాలోంగిరసం 
విధివదుపసన్న: పప్రచ్ఛ !
కస్మిన్ను భగవో విజ్ఙాతే 
సర్వమిదం విజ్ఞాతం భవతీతి !!

శునక ఋషి కుమారుడూ ఉత్తమ గ్రహస్థుడని పేరు పొందిన వాడూ ఐన శౌనకుడూ శాస్త్రోక్తరీతిగా అంగీరస మహర్షిని సమీపించి వినమృడై ‘‘హే భగవన్, దేనిని తెలుసుకోవడం చేత ఈ ప్రపంచం అంతా తెలుసుకోబడుతుంది?’’ అని అడిగాడు. 

4. తస్మైస హోవాచ ! ద్వే విద్యే వేదితవ్యే ఇతిహస్మ యద్ 
బ్రహ్మవిదో వదంతి, పరా చైవాపరాచ !!

అంగిరసుడు శౌనకునికి ఇలా బదులు చెప్పాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోవలసిన విద్యలు రెండు వున్నాయని బ్రహ్మవిదులు చెబుతారు. 

5. తత్రాపరా, ఋగ్వేదో యజుర్వేద: 
సామవేదో ధర్వవేద: శిక్షాకల్పో 
వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి !
అథ పరా, యయా తదక్షర మధిగమ్యతే !!

ఈ రెండు విద్యల్లో నాలుగు వేదాలూ, వేదంగాలైన శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సూ, జ్యోతిషమూ అన్నీ అపరా విద్యలే. ఇక శాశ్వతమూ అమరమూ ఐన తత్త్వాన్ని అందించే విద్యే పరావిద్య. 

6. యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్రమ్ అవర్ణమ్ 
అచక్షు: శ్రోత్రం తదపాణిపాదమ్ !
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం 
తదవ్యయం యద్ భూతయోనిం పరిపశ్యంతిధీరా: !!

కళ్లు మొదలైన జ్ఞానేంద్రియాలకు గోచరంకానిదీ, చేతులు మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిదీ, ఉత్పత్తిలేనిదీ, రంగు లేనిదీ, కళ్లు చెవులు చేతులు కాళ్లు లేనిదీ, శాశ్వతమైనదీ, అంతటా వ్యాపించినదీ, అత్యంతమూ సూక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనది ఐన ఆ అక్షరతత్త్వాన్ని జ్ఙానులు సకల జగత్తుకూ మూలంగా అంతటా చూడగలరు. 

7. యథోర్ణనాభి: సృజతే గృహ్ణతే చ 
యథా పృథివ్యామ్ ఓ షధయ: సంభవంతి !
యథా సత: పురుషాత్ కేశలోమాని 
తథా క్షరాత్ సంభవతీహ విశ్వమ్ !!

సాలెపురుగు ఎలా తన గూడును నోటి నుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీద, శరీరంమీద ఏ ప్రయత్నం లేకనే వెంట్రుకలు ఎలా పెరుగుతాయో అలాగే ఆ అక్షరతత్త్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమౌతుంది. 

8. తపసా చీయతే బ్రహ్మతతో న్నమభిజాయతే !
అన్నాత్ ప్రాణో మన: సత్యంలోకా: కర్మసు చామృతమ్ !!

తపస్సు వల్ల బ్రహ్మ పెంపొందుతుంది. ఆ బ్రహ్మంనుండి అన్నం పుడుతుంది. ఆ అన్నం నుండి ప్రాణశక్తి, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు అన్నీ ఉద్భవించాయి. 

9. య: సర్వజ్ఞ: సర్వవిద్యస్య జ్ఞానమయం తప: !
తస్మాదేతద్ బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే !!

సృష్టికర్త, సర్వవిదుడు, జ్ఞానమే తపంగా గల బ్రమ్మ సకల ప్రాణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మంనుండి ఉద్భవిస్తున్నవి. 

(ఇది మొదటి ముండకంలోని మొదటి ఖండం) 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 14 🌹🌻. 12. శ్రీ మాణిక్యాంబ దేవి - 12వ శక్తి పీఠం - ద్రాక్షారామం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 🌻📚.

శ్రీ భీమేశ్వర శ్రీ మాణిక్యాంబ దేవి 🙏 


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 14 🌹
🌻. 12. శ్రీ మాణిక్యాంబ దేవి - 12వ శక్తి పీఠం - ద్రాక్షారామం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. శ్రీ మాణిక్యాంబ దేవి దివ్యస్తుతి 🌴

స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబాతదైవ చ |
సప్తర్షిస్సమానీతం సప్త గోదావరం శుభం |
సూర్యేణసేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః |
భక్తరక్షణ సంవ్యగ్రా దక్షవాటికే ||12 మాణిక్యాంబ

🌻. ద్రాక్షారామ మాణిక్యాంబ:
రక్షమాం ద్రాక్షారామ పురవాసినీ – భీమే శురాణీ
పాలయమాం గోదావరీతటి వాసినీ – శక్తి స్వరూపిణీ

మాణిక్యాంబ … ఆహా ! ఎంత చల్లని పేరు. అంబ అనగా అమ్మ, మాణిక్యముల వంటి చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలందించే అమృతమూర్తి. 

సతీదేవి “కణత” పడిన శక్తి ప్రదేశమై భీమేశ్వరుడు, మాణిక్యాంబ ఒకేసారి స్వయం ప్రతిష్ఠ పొందిన ప్రదేశమే ద్రాక్షారామం. 

ఈ ప్రాంతాన్నే “త్రిలింగ” పిఠం అంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీశైల, శ్రీకాళహస్తి, ద్రాక్షారామ క్షేత్రాలను మూడింటిని కలిపి “త్రిలింగ దేశం” అంటారు. 

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కి||మీ|| దూరంలో, రాజమండ్రికి 60 కి||మి|| దూరంలో ఉన్న ఈ ద్రాక్షారామ శక్తి పీఠాధినేత్రి మాణిక్యాంబ, స్వయంభూ లింగాకారుడు భీమేశ్వరుడు, దక్షుడు యాగం చేసిన ప్రదేశం కనుక దక్షారామమయింది. దక్షవాటిక అనే మరో పేరు కూడా కలదు.

దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరోపేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు “భీమేశ్వరుడై” స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం.

ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.

తెలుగు వెలుగుల పదమునకు సత్యపదమై అమరేవిధంగా అక్షర సత్య నిరూపణ చేసిన భీమ కవి ఈ భీమేశ్వర మాణిక్యాంబలను సేవించి, అక్షర శక్తిని సంపాదించాడు.

ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించారు. ఊరిమధ్యనగల ఈ ఆలయం 3 ప్రాకారాలతో , 4 గాలిగోపురాలతో శివభక్తితో ధీటుగా నిలచింది. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. 

ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం. 

జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన ఈ శక్తి స్వరూపిణి మాణిక్యాంబాలయం, స్వయంభూ భీమేశ్వరాలయం యొక్క విశిష్ఠత చేరి కొలవవలెనే గాని చెప్పనలవికాదు. శివోహం !

🌻. స్థలపురాణం : 
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. 

సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. 

ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. 

లోక కల్యాణం కోసం తారకాసురుడిని సంహరించ వలసిన బాధ్యత కుమారస్వామికి అప్పగించడం జరిగింది. 

తారకాసురుడి హృదయ స్థానంలో వున్న శివుడి అమృత లింగాన్ని కుమారస్వామి తన 'శక్తి' ఆయుధంతో ఛేదించడంతో, ఆ అమృత లింగం అయిదు ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడింది. ఆ అయిదు భాగాలు పడిన ప్రదేశాల్లోనే దేవతలు వాటిని ప్రతిష్ఠించగా అవి 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి.

ఇక కాశీ నుంచి బహిష్కరించబడిన వ్యాసుడు, దక్షిణ ప్రాంతానికి చేరుకొని అగస్త్య మహర్షితో కలిసి ఇక్కడి భీమేశ్వరుడిని పూజించాడట. ఈ దేవాలయానికి చుట్టుపక్కల కనిపించే సోమేశ్వర ఆలయాలు చంద్రుడు ప్రతిష్ఠించినవిగా చెబుతారు.

🌷. మరిన్ని విశేషాలు : 

🌻. ద్రాక్షారామంలో 'భీమేశ్వర స్వామి'ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. 

🌻. ఇక ఇప్పుడున్న మాణిక్యాంబాదేవి విగ్రహాన్ని ఆది శంకరుల వారు ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఆధారాలు వున్నాయి. 

🌻 · ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు. 

🌻 · ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.

🌻· గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు.

🌻· ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.

🌻 · ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.

🌻 · ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు.

🌻· ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.

🌻 · అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita - 321 🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 321 / Bhagavad-Gita - 321 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 02 🌴

02. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది మరియు సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమపవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షజ్ఞానము కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై యున్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది.

🌷. భాష్యము :
పూర్వము తెలుపబడిన సకల సిద్ధాంతములు మరియు తత్త్వముల సారమైయున్నందున భగవద్గీత యందలి ఈ అధ్యాయము విద్యలకెల్ల రాజుగా పిలువబడుచున్నది. 

భారతదేశమునందలి తత్త్వవేత్తలలో గౌతముడు, కణాడుడు, కపిలుడు, యాజ్ఞవల్క్యుడు, శాండిల్యుడు, వైశ్వానరుడు మరియు వేదాంతసూత్ర రచయితయైన వ్యాసదేవుడు అతిముఖ్యులు. కనుక ఇచ్చట ఆధ్యాత్మికజ్ఞానమునందు గాని లేదా తత్త్వమునందు గాని ఎట్టి కొరతయు లేదు. 

అట్టి సమస్తజ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణభగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు పలు తత్త్వాధ్యయనము వలన కలిగెడి జ్ఞానము యొక్క సారమై యున్నది. 

గుహ్యము లేదా దివ్యము నైన జ్ఞానము దేహము మరియు ఆత్మల నడుమ గల భేదమును అవగాహన చేసికొనుట యందు కేంద్రీకరింపబడను గావున ఈ నవమాధ్యాయము రాజగుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజగుహ్యజ్ఞానము భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.

సాధారణముగా జనులు ఇట్టి గుహ్యమైన జ్ఞానమునందు గాక, భౌతికమైన జ్ఞానమునందు ప్రవీణులై యందురు. 

లౌకికవిద్యకు సంబంధించినంతవరకు జనులు రాజనీతి, సామాజికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము, యంత్రశాస్త్రముల వంటి వాటితోనే సంబంధమును కలిగియున్నారు. 

ప్రపంచమనదంతటను పలు విజ్ఞానశాఖలు మరియు విశ్వవిద్యాలయములు ఉన్నను దురదృష్టవశాత్తు వారికి ఆత్మను గూర్చి విద్యగరువు విశ్వవిద్యాలయముగాని లేక విద్యాసంస్థగాని ఎచ్చోటను లేదు. కాని వాస్తవమునకు దేహమునందు ఆత్మ అత్యంత ముఖ్యాంశమై యున్నది. 

ఆత్మ లేని దేహము నిరుపయోగమును, విలువరహితమును కాగలదు. అయినను జనులు ముఖ్యమైన ఆత్మను గూర్చి పట్టించుకొనక దేహావసరములకే ఎక్కువ ప్రాముఖ్యము నొసగుచున్నారు.

భగవద్గీత ( ముఖ్యముగా ద్వితీయాధ్యాయము నుండి) ఆత్మ యొక్క ప్రాముఖ్యమును నొక్కి చెప్పుచున్నది. దేహము నశ్వరమనియు మరియు ఆత్మ అవ్యయమనియు శ్రీకృష్ణభగవానుడు ఆదిలోనే తెలిపియుండెను (అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా: శరీరిణ: ). 

ఆత్మ దేహము కన్నను అన్యమైనదనియు మరియు అది నిర్వికల్పము, నాశరహితము, శాశ్వతమనియు తెలియగలుగుటయే జ్ఞానమునందలి గుహ్యభాగము. కాని వాస్తవమునకు ఇది ఆత్మను గూర్చిన పూర్తి విషయమును తెలుపజాలదు. 

ఆత్మ దేహము కన్నను వేరుగా నుండి, దేహము నశించిన పిమ్మట లేదా మోక్షము ప్రాప్తించిన పిమ్మట శూన్యమునందు నిలిచి నిరాకారమగునని కొందరు భావింతురు. కాని వాస్తవమునకు అది సత్యము కాదు. 

దేహమునందు నిలిచియున్నప్పుడు చైతన్యపూర్ణమై యుండు ఆత్మ దేహము నుండి ముక్తిని పొందిన పిదప ఎట్లు చైతన్యరహితమగును? అనగా ఆత్మ నిత్యము చైతన్యపుర్ణమే. ఆత్మ నిత్యమేయైనచో, అది శాశ్వతముగా చైతన్యపుర్ణమై యుండవలెను. 

భగవద్దామమునందు ఆ నిత్యమైన ఆత్మ యొక్క కార్యకలాపములే ఆధ్యాత్మికజ్ఞానపు పరమగుహ్యభాగమై యున్నవి. కనుకనే ఆత్మ యొక్క కార్యకలాపములు ఇచ్చట రాజవిద్యగా (పరమగుహ్యజ్ఞానము) పేర్కొనబడినవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 321 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 02 🌴

02 . rāja-vidyā rāja-guhyaṁ
pavitram idam uttamam
pratyakṣāvagamaṁ dharmyaṁ
su-sukhaṁ kartum avyayam

🌷 Translation : 
This knowledge is the king of education, the most secret of all secrets. It is the purest knowledge, and because it gives direct perception of the self by realization, it is the perfection of religion. It is everlasting, and it is joyfully performed.

🌹 Purport :
This chapter of Bhagavad-gītā is called the king of education because it is the essence of all doctrines and philosophies explained before. Among the principal philosophers in India are Gautama, Kaṇāda, Kapila, Yājñavalkya, Śāṇḍilya and Vaiśvānara. 

And finally there is Vyāsadeva, the author of the Vedānta-sūtra. So there is no dearth of knowledge in the field of philosophy or transcendental knowledge.

Continues in page 2...

Cont.. From Page 1... 
🌹 🌹.. Bhagavad-Gita 321, ch. 9- 2

Now the Lord says that this Ninth Chapter is the king of all such knowledge, the essence of all knowledge that can be derived from the study of the Vedas and different kinds of philosophy. 

It is the most confidential because confidential or transcendental knowledge involves understanding the difference between the soul and the body. And the king of all confidential knowledge culminates in devotional service.

Generally, people are not educated in this confidential knowledge; they are educated in external knowledge. 

As far as ordinary education is concerned, people are involved with so many departments: politics, sociology, physics, chemistry, mathematics, astronomy, engineering, etc. 

There are so many departments of knowledge all over the world and many huge universities, but there is, unfortunately, no university or educational institution where the science of the spirit soul is instructed. 

Yet the soul is the most important part of the body; without the presence of the soul, the body has no value. Still people are placing great stress on the bodily necessities of life, not caring for the vital soul.

The Bhagavad-gītā, especially from the Second Chapter on, stresses the importance of the soul. In the very beginning, the Lord says that this body is perishable and that the soul is not perishable (antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ). 

That is a confidential part of knowledge: simply knowing that the spirit soul is different from this body and that its nature is immutable, indestructible and eternal. But that gives no positive information about the soul. 

Sometimes people are under the impression that the soul is different from the body and that when the body is finished, or one is liberated from the body, the soul remains in a void and becomes impersonal. 

But actually that is not the fact. How can the soul, which is so active within this body, be inactive after being liberated from the body? 

It is always active. If it is eternal, then it is eternally active, and its activities in the spiritual kingdom are the most confidential part of spiritual knowledge. 

These activities of the spirit soul are therefore indicated here as constituting the king of all knowledge, the most confidential part of all knowledge.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 245 / Yoga Vasishta - 245 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 245 / Yoga Vasishta - 245 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 42 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 8 🌻

తేజోరూపుడనై, అనేక దశల విహరించుచు, జిహ్వాదులద్వారా, ప్రతి గృహమందు సమస్త జీవులందు సమస్త లోకములను ప్రకాశింపజేయుట యందు, సూర్యచంద్రాదుల కిరణములచే అంధకారమును తొలగించుట గాంచితిని. 

ఆ ప్రకారము, సర్వపదార్ధములను ప్రకాశింపజేయునదియు మరియు ధాతువులందు సువర్ణము, మనుజులందు పరాక్రమము, మెరుపులు, దావాలనమువలె కనిపించినది. 

ఎపుడీ దృశ్యమంతయు నాకు నిరామయమగు బ్రహ్మరూపమే అగునో, అపుడు బ్రహ్మరూపస్ధుడనగునేను నవ్విధముగ గాంచితిని.

ఈ విధముగ తేజోరూపములో నేను పరమాణువు యొక్క దేశమందును, అనేక జగత్తులను గాంచితిని. 

అవియును, జగత్తు చిదాకాశముకంటే భిన్నములు కావు. అట వాయుధారణచే వాయురూపమొంద, అద్దాని కర్మయొక్క విస్తారము; పిదప ఆకాశధారణచే ఆకాశరూపముగ స్వయంలో స్థితినొందుట వర్తించబడినది. 

వాయుధారణ ద్వారా వ్యాపించి విస్తరించిన వాడనై, లతలను, కమల, వుత్పల, కుందాది పుష్ప సమూహముయొక్క సుగంధముల నాస్వాదించితిని. శీఘ్రముగామియగుటచే, అవయవరహితమైనను సర్వావయవములందు యున్నది. 

సంచలనముచే చందనవనమునకు ఆనందమును గొల్పునది, సమస్త శబ్ధములలో సోదరునివంటిదియగు వాయువునందు, ప్రతిసూక్ష్మాణువునందు అనేక జగత్తులను నేను వీక్షించితిని. ఆ జగత్తులందు, వివిధ రూపధారిణినై నేనే యుంటిని. 

ప్రతి పరమాణువునందు సృష్టిసమూహములు చలించుచుండెను. తదుపరి ఆకాశరూపములో ప్రతి పదార్ధములోను,ప్రతి అణువు పరమాణువునందును ఆకాశమునందు నేను గాంచితిని. 

ఇట్లు సమస్త ప్రదేశములందు, పంచభూతములందు సర్వరూపమైయున్నప్పటికిని, నేను చిన్మాత్రుడనై యుంటిని. ఈ విధముగ పంచభూతములందు చైతన్యమువలె నుంటిని. 

ఆహా| మాయయొక్క ప్రభావము అమోఘము. ఆకాశమందలి ప్రతి పరమాణువునందు అసంఖ్యాకములగు జగములు గాంచితిని. ప్రతి పరమాణువునందు ఆకాశము గలదు. 

అట్లే ప్రతి ఆకాశపరమాణువునందు అసంఖ్యాక జగములను గాంచితిని. యధార్ధముగ అనంతమైన, సద్రూపమగు బ్రహ్మమే గలదు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 245 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 75 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 6 🌻

All the thoughts of Jivas will flit away from them, they not having had practice in the direction of concentrating their minds; but knowledge in those having the eye of Jnana, will be firmly imprinted in their minds, though arising only once and will ever be on its increase through ardent love for it, like seeds sown in a fruitful soil.  

Like waters in a full river or ocean, Atman which is of all forms and non-dual will shine in all potencies. Know yourself as that essence which merges all the worlds into the non-dual Sat without the hosts of ceaseless thoughts.‟

Again the Muni continued „So long as Alma rests in the desire for sensual enjoyments, so long is it termed Jiva.  

These material desires arise through Aviveka (non-discrimination) and will not arise voluntarily. Desires will become extinct with the rise of discrimination.  

When desires cease, Jiva s state becomes extinct and Atman attains the state of the stainless Brahman. This (Jiva) Atman has been going from heaven to hell and vice versa.  

Oh King, do not become the water-pot swinging in the cord of thought in the picotta of existence.  

What sensible man will approach the illusions of actions which confirm him in the conception that such and such an object is his or that he is the agent therein? Such deluded persons, deserve to go to still lower depths.  

But persons who have eliminated from themselves, through their higher intelligence, the diverse delusions of agency and ownership of objects or the differentiation of that person, or this person, I or others are able to journey on to Moksha, the Highest of the high.‟   

„Having a firm grip of your Reality, the self-shining Atman, may you look upon this universe as your all-full form.  

Only when Jnana dawns thus in your heart as non-dual, without any heterogeneities only then can you free yourself from re-births and become Parameswara (the supreme lord) himself. 

Know also the fact that I am also working my way up to merge into this Jnana which Brahma, Vishnu, the victorious Rudra and others with their five 142 Krityas (actions) attain, after merging into the one Tatwa.  

Whatever appearances take place at stated times and whatever truths are said to occur therein, all these are no other than the sweet sport of Jnana.  

Those who are of a stainless mind and have conquered time (death), having the attribute of Chinmatra, will have none to compare with them in the alt- full bliss they enjoy.‟  

 „Know that this universe neither exists nor nonexists; is neither of the nature of Atman nor nonAtman. When the Reality is reached, Maya existing from the archaic period will perish.  

But Moksha has neither space nor time in itself; nor is there (in it) any state, external (or internal). If the illusory idea of I or Ahankara perishes, then the end of Bhavana (thoughts) which is Maya is Moksha.  

He alone will earn Salvation who does not undergo the diverse pains arising from the study of Sastras which do entail ever-fluctuating pleasures in trying to understand their meaning.  

Such a person will ever be in his indestructible and equal Atman and enjoy bliss. He alone will shine as an emperor over all the world, who is indifferent as to what he wears or eats or where he sleeps. 

Note : 142. The five Krityas are creation, preservation, destruction, disappearance and grace.   

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర - 19 / Life and Teachings of Bhagavan Venkaiah Swamy - 19 🌹

🌹. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర - 19 / Life and Teachings of Bhagavan Venkaiah Swamy - 19 🌹
🌻. లీలామృతం - 7 🌻
సంకలనం : సాయి శ్రీనివాస్ .
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. సృష్టి చీటి 🌴

స్వామివారి స్వగ్రామమైన నాగుల వెల్లటూరు వాస్తవ్యులు వేలూరు రామా నాయుడు తనకు 7వ సంవత్సరం వయస్సు వచ్చిన దగ్గర నుండి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.అప్పుడే స్వామి వారంటే గౌరవం భక్తీ శ్రద్దలు కలిగాయి. తనకి 10వ సంవత్సరం వయస్సు లో ఒక రోజు కూచి చిన్నమ్మ వాళ్ళు స్వామి వారి దగ్గర కు వెళుతున్నారు అని తెలిసి వాళ్ల వెంట ఇతను బయలు దేరాడు.

స్వామి బద్వేలు లో ఏటి లో కట్ట పని చేస్తున్నారు వెళ్ళాడు తాను సహకరించాలని అడిగితే అయ్యా పైవాళ్ళు నీకు వేరే పని చెప్పారయ్యా. నువ్వు వెళ్లి పాక లో కూర్చో అన్నారు.నువ్వు పిల్ల వాడివి ఎండ దెబ్బ తాకుతుంది తాటి మట్ట వేసుకుని కూర్చోమని చెప్పారు. 

స్వామి ఎండ లో పని చేస్తుంటే నేను నీడ న ఉండటం బాగాలేదు అని అనుకుంటుండగానే స్వామి వారు వచ్చి అయ్యా నువ్వు చేయాల్సింది చాలా ఉంది గదయ్యా అని కాగితాలు పెన్ను ఇచ్చి వ్రాయమన్నారు.

స్వామి పెద్ద పార తో ఇసుకను కట్ట మీదకు ఎగేస్తూ అతన్ని వ్రాయ మని చెప్పారు.

ఈ భూమి పుట్టక ముందు ఎలా ఉంది , తరువాత ఎలా తయారయింది, కొన్నివేల సంవత్సరాలకు ఈ భూమి కొండలు మరిగిపోయి సముద్రం కావడం, సముద్రం భూమి కొండలు ఏర్పడటం, మగ్గం వేసేటప్పుడు ఒక నాడి క్రిందికి పోతే ఒక నాడి పైకి వచ్చి నట్లుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొన్నిసార్లు జరిగిన తర్వాత భూమి నీళ్ళ లో కలిసిపోతుంది.

నీళ్లు గాలి లో కలిసి పోతాయి. గాలి అగ్ని లో కలిసి పోతుంది. అగ్ని ఆకాశంలో కలుస్తుంది. అలా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమి లేకుండా పోతాయి.ఈ ఆకాశం అంతా చీకటి అయిపోతుంది. 

మనం శరీరము అంతా అలసిపోయేటట్లు కష్టం చేస్తే ఏ విధంగా గుర్తు తెలియ కుండా నిద్ర పోతామో అదే మాదిరిగా తెలియని స్థితి లోకి వెళ్లిపోతాము. అలా మెలుకువ లేని నిద్రలో కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఈ భూమి మీదకు కొత్త జన్మ తీసుకుని వస్తాము. చర్విత చరణం మాదిరిగా చావు పుట్టుక లు తప్పవు సృష్టి చక్రము పరిభ్రమిస్తూ ఉంటుంది.

ఈ కాల చక్రమునకు ఆది అంతం లేదు.నిరంతర నియబద్ద మైన పరిణామ క్రమంలో ప్రకృతిని నడిపిస్తుంది. తరువాత మానవులు తదితర జీవరాసులు వృక్షాలు ఒకదాని తర్వాత ఒకటి సృష్టించబడతాయి. 

తనతో వచ్చిన వాళ్ళు మంచి చెడులు చెప్పించుకోవాలని స్వామి దగ్గరకు వస్తున్నారు అది చూసి అయ్యా తూకం సముద్రానికి ఆనింది. నీవు పోయి కనిపెట్టుకొని ఉండు మళ్ళీ చెప్పుకుందాం అని వాళ్ల తో ఈ విషయాలు ఏవి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యారు.

ఇక్కడ స్వామి వారి సృష్టి స్థితి లయ ల వ్యాఖ్యానం ఎంత సులభంగా ఉంది. ఒక చిన్న పిల్ల వాడికి అర్థం అయ్యేలా చెప్పారు. వారి వారి యోగ్యత ను బట్టి స్వామి వారు ఆయా విషయాలను భోదిస్తున్నారు. 

అది మనకు చక్కటి అనుగ్రహ భాషణం కదా. అరటి పండు వలిచి పెట్టినట్లు గా సులభంగా చిన్న చిన్న మాటలలో ప్రకృతిలో జరిగే సృష్టి లయ ల పరిణామాలను వివరించారు. 

సద్గురువు లు ఏ సమాచారాన్ని ఏ సమయంలో ఎవరి ద్వారా తెలియ పరచాలో వారి ద్వారా ఆయా విషయాలను చర్చించారు. స్వామి వారి లీలామృతం లో ఉన్న మధురానుభూతిని అందరికీ పంచి వారి అనుగ్రహ పాత్రుల మవుదాం.

ఓం నారాయణ.    ఆదినారాయణ
దర్శించండి.  తరించండీ
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం
గొలగమూడి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Life and Teachings of Bhagavan Venkaiah Swamy - 19 🌹
✍️. P. Subbaramaiah
📚. Prasad Bharadwaj

🌻. THE WAY GURUDEVA TAKES FOOD - 2 🌻

It seemed as if he used to invite them fearlessly, thus setting an example for us that all these troubles are for the body and the soul is not affected. Such was our father, Gurudeva. One day Swamy was sitting on the platform (mandapam) at Lord Sree Rama Devastanam.    

Using harsh words, Sri Kannam Vekama Naidu a native of that village with a few other ignorant persons slapped Swamy and threw him out of the Mandapam, saying, “You, who eat the food of harijans have no right to enter the temple premises”.    

After this incident Swamy lost interest in the village. Later on Sri Kannam Venkama Naidu faced many troubles, went on losing weight and breathed his last. 

One day some wicked people of that village who were of Swamy’s age called him for lunch.  

Swamy accepted their invitation. Wishing to insult Swamy, the mean persons cooked meat and were awaiting Gurudeva’s arrival.  

What is that the Divine Master cannot know? To teach them a lesson the divinity incarnate placed burning faggots on his head and two more on his shoulders and came to the place of invitation as the Fire-God personified. Seeing the Master as a deity of death, afraid the wicked people ran away. 

From that day Swamy made a bullock cart which was lying idle in his fields as his bed. His family members used to bring food for him there itself.    

He used to work in the fields when required and at other times used to live according to his wishes. Generally in day time to avoid others, he used to stay alone behind a big bundle of “Jonna Choppa”.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 31 🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 31 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. ప్రసాద్ భరద్వాజ  
  
     *ప్రభువు యొక్క అద్భుతలీల చూసి బీదర్ నివాసులకు ప్రభువుపై శ్రద్ధ, భక్తి రెట్టింపయింది. శ్రద్ధ ఉన్న ముసల్మాను భక్తులు ఎవరు ప్రభువు అలౌకిక సామర్ధ్యాన్ని చవిచూశారో వారు భక్తితో రోజూ ఝరణికి వచ్చేవారు. కొంతమంది ముస్లింలకు ప్రభువు కీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్ళు ప్రభువును ఇంతగా పూజ్యనీయులుగా భావించడం చూసి ఎలాగైనా ప్రభువును అవమానించాలని ఉపాయం ఆలోచించారు. ప్రభువు యొక్క సామర్ధ్యం వాళ్లకు తెలుసు కాని ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని, ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభువు దగ్గరికి వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైకి మాత్రం వినయంతో ఇతర మతాల వాళ్ళను ఎలా పావనం చేసారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు.*

   *ప్రభువుకు వాళ్ళ అంతరంగ ఆలోచన తెలుసు. కానీ, ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరిస్తాను అని చెప్పారు. ప్రభువు ఇలా మాట ఇవ్వగానే అందరూ తమ ఇళ్లకు వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. మరుసటిరోజు అనుకున్నట్లుగానే తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకొని వెళ్లి ఒక సింహాసనంపైన కూర్చోపెట్టారు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభు మెడలో పూలదండలు వేశారు. పళ్ళాలలో మాంసంతో చేసిన పదార్ధాలను కావాలనే రుమాళ్ళు కప్పి ప్రభువు ముందు ఉంచారు. ప్రభువుని తినమని చెప్తూ, హిందువులు ముస్లింలు ప్రభువుకి సమానమే అని జై కొడుతున్నారు. అందుకని మేము సమర్పిస్తున్న ఈ పదార్ధాలను కూడా తినాలని ప్రభువుకి చెప్పారు. ప్రభువు తింటే, ప్రభు కులం భ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ళ శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని వాళ్ళ దురాలోచన. అక్కడున్న ముస్లింలలో ఈ చర్య కొంతమందికి ఇష్టం లేదు. కానీ ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయారు.*

  *ప్రభువుకి వాళ్ళ కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పళ్ళాలపై మూసిన రుమాళ్ళు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరూ శిష్యులు భయంతో చూస్తున్నారు. చిమన్యా భయంతో పళ్లెంపై నుండి రుమాళ్ళు తీసేసరికి ఆ పళ్ళాలలో పువ్వులు, ఖర్జురపళ్ళు మొదలైనవి ఉన్నాయి. వాటిని ప్రసాదంగా అందరికీ ప్రభువు పంచారు. దానితో కపట ముస్లింలకు గర్వభంగం అయ్యింది. ప్రభువులో దైవ సామర్ధ్యం ఉందని వాళ్లకు అర్ధమై అందరూ ప్రభువును శరణువేడుకొన్నారు. ప్రభువు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తి పరీక్ష ఇలా చేయరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవసామర్ధ్యం మరియు ప్రభువు యొక్క మనస్సు ఉదారస్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి "పీరానే పీర్ దస్తగీర్" అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. బీదర్ లో ప్రభువు యొక్క గాదీ ముస్లింల ప్రాంతంలోనే స్థాపించారు.*

తరువాయి భాగము రేపు చదువుకుందాము.... 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 18 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 18 🌹
అధ్యాయము : ఆత్మలోకం 
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ

Q:-- ఆత్మలోకం లో ఆత్మలు ఏ పనులు చేస్తాయి?

A:-- ఆత్మలోకం లో వుండే ఆత్మలకు కోరికలు, ఆకలి దాహం, అలసట ఉండదు, వారి లక్ష్యం సేవ, ఆత్మకు సూర్యకాంతి అవసరం, అక్కడ పళ్ళు రకరకాల వాసనలతో లభిస్తాయి.

ఆత్మకు ఆహారం అవసరం ఉండదు, కానీ ఆ పళ్లలోని అమృతరసం సానుకూల శక్తి ఇస్తుంది, ఇక్కడి ఆత్మలు నిరంతరం ఆరోగ్యంగా వుంటారు. 

వీరికి పునఃశక్తి కావలిసినప్పుడు సరస్సులో మునుగుతారు, ఆ నీటికి స్వస్థత చేకూర్చే గుణం ఉంటుంది, నీళ్ళల్లో నుండి బయటకు రాగానే పొడిగా, శక్తివంతంగా వుంటారు,

ఆత్మలోకంలో ఆత్మలు చేసే కొన్ని పనులు :

1) మనం దైవ నియమాలు అర్థం చేసుకునేలా telepathy కమ్యూనికేషన్ చేస్తారు.
2) మార్గదర్శకుల రూపంలో భూలోక ఆత్మలకు సహాయపడతారు.
3) భూలోక ఆత్మలకు ఉపచేతనాత్మక మనస్సు ద్వారా సందేశాలు పంపుతారు
4) కొంతమంది విశ్రాంతి మందిరంలో పనిచేస్తారు.
5) ఆకాశిక్ రికార్డ్స్ తాలూకు విషయాలు నమోదు చేయడం.
6) ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానవుల కోసం ప్రార్ధించడం, వారికి సందేశాలు పంపడం.
7) ప్రేమ, శ్రద్ధ, ఏకాగ్రత తో వ్యతిరేక ఆత్మలకు అర్ధమయ్యేలా శిక్షణ ఇవ్వడం.
8) జ్ఞాన మందిరంలో శిక్షణ పొందడం.
9) కింది ఆవరణలు కు సహాయపడడం.
10) మళ్ళీ జన్మించాలకునేవాళ్లకు మార్గదర్శకంగా ఉండడం.
11) భూలోకంలో వారికి మహిమలు చూపించడం.
12) భూలోక ఆత్మలను సన్మార్గంలో పెట్టడానికి భూలోకానికి రావడం.
13) భూలోకంలో మరణించే ముందే వారిని సముదాయించడానికి ఇక్కడికి వస్తారు.
14) మరణించే వారికి సానుకూలంగా ఆత్మలోకానికి రావడానికి వీలైనంత సౌకర్యం కుదురుస్తారు.
15) స్వస్థత చేకూర్చే నూతన విధానాలు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని కనుగొంటారు.
16) నృత్యం, సంగీతం, పాటలు, క్రీడలు, వివిధ అంశాలలో పాల్గొంటారు.
17) ఉద్యానవనాలు పెంచుతారు.
18) భూలోక చరిత్ర ను ఇతర గ్రహ చరిత్రను చర్చిస్తారు.

ఇవన్నీ సృష్టికర్త సేవ చేయడానికి వారికిచ్చిన అవకాశం గా భావిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

దేవతగా మారుట అనగా దయ

🌹. అంతర్యామి నిరంతర కరుణా స్వరూపము. దానిని పొందుటకు అర్హత దయా హృదయమే. దేవతగా మారుట అనగా అట్టి దయను మనం అలవరచు కొనుటయే 🌹
✍🏼. మాస్టర్ ఇ.కె.
భాగవతము 3-212
📚. ప్రసాద్ భరద్వాజ

అంతర్యామియైన భగవంతుడు దయామయ స్వరూపుడు.

జీవులు తమ మనస్సులచే జీవితమును దుర్బలము చేసికొనవచ్చును గాని, మరల అంతర్యామిని స్మరించునపుడు తాము కల్పించుకొనిన దుఃఖమునుండి విమోచనము చెందుదురు.

అదియే దేవుని దయాగుణము. అది ఎపుడును మనకందుబాటులో నుండును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తిపీఠములు - దివ్యస్తుతులు 🌹

🌹. అష్టాదశ శక్తిపీఠములు - దివ్యస్తుతులు 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

రావణ స్తుతి సంతుష్టా కృతాలంకాధివాసినీ |
సీతాపహరణరోషేణ త్యక్తలంకామహేశ్వరీ |
సజ్జన స్తితి సంతుష్టా కదంబవన వాసినీ |
లంకాయం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణా ||1 శ్రీ శాంకరీదేవి

శివనేత్రిని మీల్యైవ ధృతాకాత్యాయనీవపుః |
గంగాప్లావసముద్విగ్నా సైకతం లింగమాశితా |
భక్తానామిష్టదానిత్యం కామాక్షీ కాంచికాపురే |
ఏకాంరనాథ గృహిణీ శుభం కుర్యాన్మహేశ్వరీ ||2

విశృంఖలాస్వయందేవీ భక్తానుగ్రహకారిణీ |
భక్యానాంశృంఖలా హర్త్రీ స్వయం బద్దాకృపాపరా |
శృంఖలాకటికబద్దా చ జగన్మాతాయశశ్విని |
మాంగల్యదా శుభకరీ వేదమార్గాను పాలినీ |
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ఏౠష్యశృంగసమర్చితా |
శుభం తనోతుసాదేవీ కరుణాపూరవాహినీ ||3

మహిషంసంహృత్యదేవీ కంట కం త్రిషుజమసు |
చండీ కాళీ స్వరూపేణ దుర్గారూపేణ శాంకరీ |
అథితాసిలోకరక్షణార్ధం చాముండాక్రౌంచ పట్టణే |
దేవీ త్వం ప్రసీదాస్మాన్ సర్వదా సర్వదాశుభే ||4

అలంపురం మహాక్షేత్రేం తుంగాచోత్తర వాహినీ |
బాలబ్రహ్మేశ్వరోదేవః జోగులాంబా సమంవితః |
తీర్ధం పరశురాశ్య నవబ్రహ్మసమంవితం |
అలంపురే జోగులాంబా విశాలాక్ష్యా సమాశ్మృతా |
భువికాశ్యాసమంక్షేత్రం సర్వదేవ మర్చితం ||5 జోగులాంబ (అలంపురం )


భ్రమరైరరుణం హత్వా భ్రామ్యంతీ శ్రీగిరౌస్థితా |
భక్తానుకంపినీదేవీ మల్లికార్జున తోషిణీ |
శివానుగ్రాహ సంధాత్రీ బ్ఘక్తరక్షణ తత్పరా |
సానః పాయాత్ సదామాతా శ్రీశైలే భ్రమరాంబికా ||6 శ్రీశైల భ్రమరాంపికా

కోల్హాతపః ప్రీతా దేవీ వరదానమహోజ్వలా |
మహాలక్ష్మీ ర్మహామాతాలోకానుగ్రహకారిణీ |
దత్తాత్రేయఆది సుప్రీతా నానాతీర్ధ నిషేవితా |
కరవీరసుమారాధ్యా కోల్హాసద్గతిదాయినీ |
భావానీచామలాదేవి కరవీరసువాసినీ |
కోల్హాపురే మహాలక్ష్మీర్మమాస్తు శుభదాయినీ || 7 మహాలక్ష్మీ (కోల్హాపురం)

దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా |
ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ |
రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ |
కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || 8 ఏకవీర్యాదేవి

త్రిపురాసురసంహర్తా మహాకాలోత్రవర్తతే |
యస్యాట్టహాస సందగ్ధం దుస్సహంతత్ పురత్రయం |
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా |
ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా స్దా ||9 ఉజాయిని మహాకాళీ

ఏలర్షిపూజిత పూజితశ్శంభుః తస్మై గంగామదాత్ పురా |
రురువాకుక్కుటోభుత్వా భగవాన్ కుక్కుటేశ్వరః |
దేవీ చాత్ర సమాయతా భర్తృచిత్తానుసారిణీ |
పురుహుత సమార్ధా పీఠయాం పురుహుతికా || 10 పురుహుతికా

ఓడ్యాణేగిరిజాదేవీపిత్రర్చనఫలప్రదా |
బిరజా పరపర్యాయా స్థితావైతరణీ తటే |
త్రిశక్తి స్వరూపా చైవ లోకత్రాణపరాయణా |
నిత్యం భవతు సాదేవీ వరదా కులవర్దినీ ||11

స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబాతదైవ చ |
సప్తర్షిస్సమానీతం సప్త గోదావరం శుభం |
సూర్యేణసేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః |
భక్తరక్షణ సంవ్యగ్రా దక్షవాటికే ||12 మాణిక్యాంబ

కామేఖ్యే కామదే ద్వివి నీలాచల నివాసిని |
కామస్యసర్వదేమాతః మాతృసప్తక సేవితే |
జామదగ్న్యస్యరామస్య మాతృహత్యా విమోచినీ |
పంచ శంకర సంస్థాణ భక్త పాలన తత్పరా |
కల్యాణదాయినీ మాతా విప్రదర్శిత నర్తనా |
హర్షిక్షేత్రే కామరూపే ప్రసన్నాభవ సర్వదా ||13 కామరూపాదేవి

త్రివేణీ సంగమోద్భుతా త్రిశక్తీనాం సమాహృతిః |
ప్రజాపతికృత్యా శేష యాగమాభిలాషాభి వందితా |
బృహస్పతికరాంతస్థ పీయూష పరిసేవితా |
ప్రయాగే మాధవీ దేవీ సదాపాయాత్ శుభాకృతిః ||14 మధవీ దేవీ

కాలపర్వతాగ్రే జ్వాలారూపాను భాససే |
జ్వాలాముఖీతి విఖ్యాతా జ్యోతిర్మూర్తి నిదర్శనా |
రాధేశ్యామేతి నాదేనవర్ధమానాత్విషాంతితః |
జ్వాలాయాం వైష్ణవీదేవీ సదారక్షతు శాంకరీ ||15 జ్వాలాముఖీ

గదాధరసహోదరీ గయా గౌరీ నమోస్తుతే |
పితౄణాంచ సకర్తౄణాంచ దేవి సద్గత్తిదాయినీ |
త్రిశక్తి రూపిణీ మాతా సచ్చిదానంద రూపిణీ |
మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్య గౌరికా ||16 గయా మాంగల్య గౌరీ

కాశీంతు పునరాగత్య సంహృష్టంతాండవోన్ముఖం |
విశ్వేశందేవ మాలోక్య ప్రీతివిస్తారితేక్షణా|
సానురాగాచ సాగౌరీ దద్యాత్ శుభ పరంపరాం |
వారాణస్యాం విశాలక్షీ అన్నపూర్ణా పరాకృతిః |
అన్నం జ్నానం చ దదతి సర్వాన్ రక్షతినిత్యశః |
త్వత్పసాదాన్మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే ||17

సరస్వతి నమస్తుభ్యం సర్వవిద్యా స్వరూపిణి |
రాగ ద్వేషాదియుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్చసి |
కాశ్మీరదేశ వద్రమ్యా విశదాభవదాకృతిః |
సాంత్వయంతీ మహాదేవీం తదుక్త్యా శారికా అభూః |
ప్రసన్నతాం సమాంబుద్ధిం విశదాం పాండితీశుభాం |
విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరశ్వతీ ||18
🌹 🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 13 🌹🌻. 11. శ్రీ గిరిజ దేవి - 11వ శక్తి పీఠం - ఓఢ్యాణము., ఒరిస్సా 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 13 🌹
🌻. 11. శ్రీ గిరిజ దేవి  - 11వ శక్తి పీఠం -  ఓఢ్యాణము., ఒరిస్సా  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ శ్రీ గిరిజ దేవి దివ్యస్తుతి 🌴

ఓడ్యాణేగిరిజాదేవీపిత్రర్చనఫలప్రదా |
బిరజా పరపర్యాయా స్థితావైతరణీ తటే |
త్రిశక్తి స్వరూపా చైవ లోకత్రాణపరాయణా |
నిత్యం భవతు సాదేవీ వరదా కులవర్దినీ ||11

ఓఢ్యాణే గిరిజా దేవి:
ఆత్మయే శంకరుడు. బుద్ధియే గిరిజాదేవి. కావున జగద్గురు ఆదిశంకరాచార్యులవారిలా “గిరిజా శంకరులను” స్తోత్రంతో అర్చించారు. 

“ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం పూజతే విషయోప భోగ రచనా నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన్‌ం “.

“శంభో! నా ఆత్మవు నీవు, నామతి గిరిజాదేవి, పంచప్రాణాలు నీకు పరిచారికలు, శరీరము అనే ఈ గృహంలో మీ ఆదిదంపతులను నిలిపిన. నాకు ఏఏ విషయోప భోగాలందాసక్తి కలదో అవన్నీ నీకు నిత్యపూజలు, నా నిద్రా స్థితి నీ ధ్యాన సమాధి స్థితి. నా పాదాలు భూమిని సంచరించినదంతా నీకు భక్తి ప్రదక్షిణలు. నే పలికే ప్రతి పలుకు నీ స్తోత్ర గానాలే నేను ఏఏ కర్మలొనర్చినా అవి నీకు ఆరాధనలే. కనుక నిత్యం నీపై నుండి దృష్టి మరలని వరమీయి” అని ప్రార్థించారు. 

మనము కూడా మన తనువును “శక్తి ఆలయం”గా మలచుకొని బుద్ధి అనే అర్చనతో “శక్తి”నుపాసించి మనసు “శక్తి” దక్షిణగా ఇచ్చినచో “శక్తి” సంపన్నులమౌతాము.

గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.

విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్‌కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.

గిరిజా దేవినేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది.ఈ ప్రాంతాన్ని వైతరణీపురం అని కూడా అంటారు.

ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్డు నుంచి 20కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయానికి చేరుకోవచ్చు.సతీ దేవి "నాభీస్థానం" ఇక్కడ పడిందని అంటారు.అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు.

 సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 

ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.

🌻. స్థల పురాణం : 
ఒరిస్సా - జాజ్ పూర్ టౌను సమీపంలోగల 'ఓడ్యాణం' అనే ప్రాంతంలో ఈ శక్తి పీఠం దర్శనమిస్తుంది. ఇక్కడ సతీదేవి 'నాభి'భాగం పడినట్టుగా చెప్పుకుంటారు. బ్రహ్మదేవుడి కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ 'గిరిజాదేవి' పేరున కొలువుదీరినట్టు స్థల పురాణం చెబుతోంది. స్థానికులు అమ్మవారిని గిరిజా దేవనీ ... బిరజాదేవని పిలుచుకుంటూ ఉంటారు.

ఇక్కడ వైతరణి అనే ఊరుతోపాటు, అదే పేరుతో పిలవబడే నది కూడా ప్రవహిస్తూ వుంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంలో యమలోక ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వైతరణి నది వస్తుంది. ఆ నది అంశగా ఇక్కడ ఈ వైతరణి ప్రవహిస్తోందని విశ్వసిస్తుంటారు. ఇక్కడ జరిగే ఆబ్దిక క్రియలు పితృ దేవతలను నరకం నుంచి బయటపడేసి స్వర్గ ప్రవేశాన్ని కలిగిస్తాయని అంటారు.

వైతరణీ నదిలోని ఓ ప్రదేశంలో 'శ్వేత వరాహ విష్ణుమూర్తి' ఆలయం వుండటం ఒక విశేషం. ఇక అమ్మవారు దుర్గాష్టమి రోజున ప్రత్యేక దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 12 🌹🌻. 10. శ్రీ పురుహూతిక దేవి - 10వ శక్తి పీఠం - పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 12 🌹
🌻. 10. శ్రీ పురుహూతిక దేవి  - 10వ శక్తి పీఠం - పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ పురుహూతిక దేవి దివ్యస్తుతి 🌴
ఏలర్షిపూజిత పూజితశ్శంభుః తస్మై గంగామదాత్ పురా |
రురువాకుక్కుటోభుత్వా భగవాన్ కుక్కుటేశ్వరః |
దేవీ చాత్ర సమాయతా భర్తృచిత్తానుసారిణీ |
పురుహుత సమార్ధా పీఠయాం పురుహుతికా || 10 పురుహుతికా

పీఠికాయాం పురుహూతికా:
ఓం శ్రీ కుక్కుటేశ్వర సమేత శ్రీ పురుహూతికాయై నమః

అది అందమైన తల్లి పీఠము. బంగారు తల్లి పేరు పురుహూతికా దేవి. ఆ బంగారు తల్లిని చేపట్టినవాడు కుక్కుటేశ్వరస్వామి. పిఠపురం అనాదిగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఎందుకంటే ఇక్కడి శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటమనగా కోడి. పైగా ఏలముని యోగానికి సారమైనది. అత్యద్భుతమైన మహితమలకు ఆలవాలమైనది. పాదగయ అని ఇక్కడి ప్రాంతానికి మరోపేరు. ప్రప్రథమంగా దేవేంద్రునిచే ఆరాధించబడిన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం.

ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది.

భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.

సత్ చిదానంద శక్తి క్షేత్రమైన ఈ పిఠాపురం దర్శనం పరమం పవిత్రం !

పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. 

ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని చెబుతుంటారు. 

ఈ పీఠాన్ని అష్టాదశ పీఠాల్లో 10వ పీఠంగా పేర్కొంటారు. 

ఒక పురాణ గాధ ప్రకారం పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు. తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు. శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఈ క్షేత్రం అపరకర్మలకు ప్రసిద్ధి.

🌻. స్థలపురాణం :
అష్టాదశా శక్తి పీఠాల్లో ఒకటైన 'శ్రీ పురుహూతికా దేవి' శక్తి పీఠం పిఠాపురంలో భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. సతీదేవి 'ఎడమ హస్తం'ఈ ప్రాంతంలో పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి అమ్మవారు పురుహూతికాదేవి గా పూజలు అందుకోవడానికి, సాక్షాత్తు సదాశివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా కొలువుదీరడానికి వెనుక ఇంకొక పురాణగాధ కూడా చెప్తారు.

పూర్వం 'గయాసురుడు'అనే రాక్షసుడు, ఇంద్రుడి సింహాసనాన్ని సొంతం చేసుకుని దేవతలందరినీ పీడించసాగాడు. దాంతో త్రిమూర్తులు బ్రాహ్మణ పండితుల వేషాలను ధరించి గయాసురుడి దగ్గరికెళ్లి తాము ఒక యజ్ఞం చేస్తున్నామని చెప్పారు. భూమాత ఆ వేడిని తట్టుకోలేదనీ ... దానిని అతని దేహం మాత్రమే భరించగలదని అన్నారు. తన దేహాన్ని యజ్ఞ వాటికగా ఉంచడానికి గయాసురుడు అంగీకరించడంతో, వారం రోజుల పాటు సాగే ఈ యజ్ఞానికి ఎలాంటి పరిస్థితుల్లోను భంగం కలగకూడదనీ ... అదే జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు.

గయాసురుడి తల దగ్గర విష్ణువు ... నాభి దగ్గర బ్రహ్మ ... పాదాల చెంత శివుడు కూర్చుని యజ్ఞాన్ని ప్రారంభించారు. ఏడో రోజు అర్ధరాత్రి వరకూ కూడా ఆ యజ్ఞం వేడిని గయాసురుడు భరిస్తూ వచ్చాడు. దాంతో తెల్లవారితే మళ్లీ గయాసురుడిని నియంత్రించడం కష్టమని భావించిన శివుడు, పార్వతీదేవిని అక్కడికి ఆహ్వానించాడు. ఆమె సూచనమేరకు శివుడు అర్ధరాత్రివేళ కోడిలా కూశాడు. తెల్లవారిందనుకుని గయాసురుడు కదలడంతో యజ్ఞ భంగం జరిగింది.

దాంతో బ్రాహ్మణ పండితులు గయాసురుడి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. వాళ్లు తనని సంహరించడానికి వచ్చిన త్రిమూర్తులని గయాసురుడు గ్రహించి సంతోషించాడు. అతని దేహం నశించక తప్పదనీ, ఆ ప్రదేశంలో తాము క్షేత్ర దేవతలుగా కొలువుదీరతామని త్రిమూర్తులు అనుగ్రహించారు.

 శివుడు కోడిలా కోసిన ప్రదేశం కాబట్టి కుక్కుటేశ్వర క్షేత్రంగా ... గయాసురుడి పాదాల చెంత కూర్చుని శివుడు యజ్ఞం చేసిన కారణంగా 'పాదగయ'గా ఈ శక్తి పీఠం పిలవబడుతోంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 11 🌹🌻. 9. శ్రీ మహాకాళి దేవి - 9వ శక్తి పీఠం - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 11 🌹
🌻. 9. శ్రీ మహాకాళి దేవి  - 9వ శక్తి పీఠం - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴.  శ్రీ మహాకాళీ: దేవి దివ్యస్తుతి 🌴
త్రిపురాసురసంహర్తా మహాకాలోత్రవర్తతే |
యస్యాట్టహాస సందగ్ధం దుస్సహంతత్ పురత్రయం |
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా |
ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా స్దా ||9  ఉజాయిని మహాకాళీ

9. ఉజ్జయిన్యాం మహాకాళీ:
మహామంత్రాధి దేవతాం ధీగంభీరతాం|
మహా కాళీ స్వరూపిణీం. మాం పాలయమాం||

ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, అదే దేవతల స్థానం. ఎప్పుడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో ఆ అజ్ఞానాన్ని ద్రుంచే విజ్ఞాన స్థానమే కాళీ నిలయం.

ధర్మగ్లాని జరిగే వేళ దేవతల ప్రార్థనతో అంబిక నవదుర్గ రూపాలలో దుష్ట శిక్షణకై బయలుదేరింది. ఆ నవదుర్గ రూపాలలో అతి భీకరమైనదీ కాళీ స్వరూపం.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. 

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. 

సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.

ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.

ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.

అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.

అప్పుడు మనకి లభించేది సత్ + చిత్ ఆనంద మోక్షపురి. అదే ఉజ్జయిని, (విజయవంతమైన) మహాపురి, శివపురి.

సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 50కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి ఆలయం ఉన్నాయి.

🌻. స్థలపురాణం.
పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధం చేస్తాడు.కానీ బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుని రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు.

అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుధ్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుకను చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 10 🌹🌻. 8. శ్రీ ఏకవీరాదేవి - 8వ శక్తి పీఠం - మహార్, మహారాష్ట్ర 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 10 🌹
🌻. 8. శ్రీ  ఏకవీరాదేవి  - 8వ శక్తి పీఠం - మహార్, మహారాష్ట్ర  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. శ్రీ  ఏకవీరాదేవి దివ్యస్తుతి 🌴

దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా |
ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ |
రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ |
కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా || 8 

 పెన్‌గంగా అనబడే పంచగంగా నది తీరాన అమ్మవారు ఏకవీర దేవిగా ఆవిర్భవించినట్లు ఇక్కడ పురాణాలు చెపుతున్నాయి. అమ్మవారిని ఇక్కడ భక్తులు ఏకవీర దేవిగా, రేణుకాదేవిగా పిలుస్తారు. 

ఈ క్షేత్రం నాందేడ్‌ పట్టణానికి 127 కి.మీ. దూరంలో ఉంది.  ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలోని మహుర్లో వెలసియున్నది. సతీదేవి యొక్క కుడిచేయు ఇక్కడ పడినది చెబుతారు. మిగతా శక్తిపీఠాలలో లోగా ఇక్కడ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ ప్రధాన దేవత రేణుకా దేవి. 

ఏకవీరాదేవి రేణుకాదేవి పెద్ద సోదరి అని భావిస్తారు. ఇక్కడ ఈ ఇద్దరే దేవతలే కాక పరశురామ ఆలయం. దత్తాత్రేయస్వామి ఆలయం, అనసూయామాత ఆలయం, అత్రి మహర్షి, మాతృతీర్ధం మరియు దేవదేవేశ్వరుని మందిరాలు కూడా ఉన్నవి. ఇక్కడి ప్రత్యేకత ప్రసాదం. తమలపాకులు, వక్కపొడి నూరి ఇస్తారు.

ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి.

  మూడవ శిఖరం సతీదేవి కుడిస్తం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది. 

అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. 

జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి మనసు చెదిరిందని ఆగ్రహించి ఆమె తల తీసేయమని కొడుకైన పరశురాముడిని ఆదేశిస్తాడు. తండ్రి మాటను పరశురాముడు శిరసావహిస్తాడు. ఫలితంగా మొండెం నుంచి వేరైన రేణుకామాత తల అక్కడికి దగ్గరలో వున్న ఓ గూడెంలో పడుతుంది. 

రేణుకామాత పాతివ్రత్యం గురించి ముందుగానే తెలిసి వుండటం వలన, ఆ గూడెం ప్రజలు ఆమె తల పడిన ప్రదేశంలో గుడికట్టి పూజించడం మొదలు పెట్టారు. అలా ఇక్కడి అమ్మవారు పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అని కూడా అంటారు.

అయితే ఇది రేణుకా మాత ఆలయమేగానీ శక్తి పీఠం కాదనే మాట ప్రచారంలో వుంది. అక్కడికి దగ్గరలోనే అంటే మాహొర్ కి 10 కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తి పీఠం ఉందనేది స్థానికుల విశ్వాసం. 

పొలాల మధ్య చిన్న గుడిలో వెలసిన ఈ అమ్మవారి ప్రతిమ కూడా ముఖం వరకు (తల భాగం ) మాత్రమే ఉండటం విశేషం. నిజమైన శక్తి పీఠం ఇదేనని చెప్పే ఆధారాలు ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు. ఏదేవైనా ఈ ప్రాంతానికి వెళితే రేణుకా మాత క్షేత్రంతో పాటు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించిన భాగ్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

  ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది.

  ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.

  సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక.

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 72వ నామం ఏకవీరాదేవిది వస్తుంది. 

అర్ధ మాత్రా పరాసూక్ష్మా, సూక్ష్మార్ధార్ధ పరాపరా
ఏకవీరా విశేషాఖ్యా షష్టీ దేవీ మనస్వినీ        72
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 9 🌹🌻. 7. శ్రీ మహాలక్ష్మి - 7వ శక్తి పీఠం - కొల్హాపూర్, మహారాష్ట్ర 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 9 🌹
🌻. 7. శ్రీ మహాలక్ష్మి - 7వ శక్తి పీఠం -  కొల్హాపూర్, మహారాష్ట్ర  🌻
📚. ప్రసాద్ భరద్వాజ

కొలాహపురి మహాలక్ష్మీ:
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||

తా|| శ్రీ పీఠముపై సుఖముగా కూర్చొని యుండి, శంఖము, చక్రము, గద మరియు అభయ హస్తముద్రతో నుండి మాయను మటుమాయం చేసే మహామాయగా దేవతల రత్న కిరీట కాంతులతో మొరయుచున్న పద్మపాదములుగల తల్లి, దేవతలచే పూజింపబడుతున్న మహాలక్ష్మికి భక్తిపూర్వక నమస్కారము.

అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. 

ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ.9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన.

ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

పద్మావతి పురంవంటి కొలాహపురంలో కొలువైనది, కరుణ మాత్రమున వీరత్వము నొసగే కరవీర పురవాసిని, విభూతి అనగా ఐశ్వర్యప్రదమైన శివలింగమును కిరీటంపై ధరించి, వాత్సల్యంతో కోరిన వారికి సంపదనొసగే సచ్చిదానంద స్వరూపిణీ, ఓ లక్ష్మిదేవీ నీకు జయమగుకాక…

మాత లుంగం గదాం ఖేటం పానపాత్రం చ భిభ్రతే|
నాగలింగం చ యోనించ భిభ్రతీ నృప మూర్థని||

కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగి ఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం. 

అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సర్వసౌభాగ్యదాయినీం|
వందే కరవీరపురస్థితాం మహాలక్షీం మానసార్చిత వందనం||

ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. 

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి.  కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. 

కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. 

మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు. 

🌻. స్థల పురాణం  :
మహారాష్ట్రలోని కొల్హాపురంలో పంచగంగా నదీ సమీపంలో ఈ శక్తి పీఠం విరాజిల్లుతోంది. 

సిరిసంపదలను ప్రసాదించే ఈ శక్తి పీఠం గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని కరవీరుడు పాలిస్తూ వున్న కారణంగా ఇది 'కరవీరపురం'గా ప్రసిద్ధి చెందింది.

కరవీరుడు అతని ముగ్గురు సోదరులు ప్రజలను నానాకష్టాలు పెడుతూ ఉండటంతో, రాక్షస కుమారులైన ఆ నలుగురిని కూడా శివుడు సంహరించాడు. 

దాంతో కరవీరుడి తండ్రి అయిన కొల్హుడు ప్రతీకారంతో రగిలిపోతూ దేవతలపైకి దండెత్తాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి అతణ్ణి సంహరించింది. కొల్హుడి అభ్యర్ధన మేరకు ఆ ప్రాంతానికి అతని పేరు స్థిరపడేలా అనుగ్రహించింది.

ఇక్కడి అమ్మవారు మూడు అడుగుల ఎత్తులో శివలింగాకారంలో దర్శనమిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. 

మహిమాన్వితమైనటువంటి ఈ శక్తి పీఠానికి క్షేత్ర పాలకుడు కపిలేశ్వరుడు, ముందుగా ఆయనను దర్శించిన తరువాతనే అమ్మవారిని దర్శించాలి. 

అమ్మవారికి చెరో వైపున మహాకాళి - మహా సరస్వతి ఆలయములు వున్నాయి. నవదుర్గల ఆలయాలు ... నవగ్రహాల ఆలయాలతో పాటు, సాక్షి గణపతి .. సూర్యనారాయణుడు .. దత్తాత్రేయుడు ఇక్కడ కొలువుదీరి కనిపిస్తారు.

 దత్తాత్రేయుడు ఈ అమ్మవారి దగ్గరే ప్రతి రోజు బిక్ష స్వీకరించేవాడని స్థల పురాణం చెబుతోంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹🌻. 6. భ్రమరాంబిక దేవి - 6వ శక్తి పీఠం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 🌻

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 8 🌹
🌻. 6. భ్రమరాంబిక దేవి - 6వ శక్తి పీఠం - శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ,ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమర

అష్టాదశ శక్తిపీఠలలో ఆరవ శక్తి పీఠమై భ్రామరి శక్తితో విరాజిల్లుతున్న శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా విశిష్ట స్థానం పొంది యున్నది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

ఆంధ్రరాష్ట్రంలోని కర్ణూలు జిల్లాలో గల శ్రీశైలం సముద్రమట్టానికి చుట్టూ నాలుగు ప్రధాన గోపురాలతో కోట గోడల్లాంటి ఎతైన ప్రాకారంలో 279300 చ.అడుగుల విశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయ ప్రాకారం 2121 అడుగుల పొడవుతో దాదాపు 20 అడుగుల ఎత్తుగల కోట గోడ పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలచి ఉన్నది.

 కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. 

అందుకే “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే” అని ఆర్యోక్తి. శ్రీశైలము అనగా వరములనిచ్చె శివ కైలాసము. సతీదేవి కంఠభాగము ఈ ప్రదేశంలో పడిందని చరిత్ర ఆదారం.

విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. 

అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించిందట. 

అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు. 

  ఒకరోజున సౌందర్యలహరి అయిన జగజ్జనని అరుణాసురుని కంటపడింది. ఓ సుందరీ ! నీకీ కానలలో పని ఏమి? నేను లోకాల నేలేటి అరుణాసురుడను. నా సామ్రాజ్ఞ్‌వై నాతో సుఖించు అని ఆమె చేయిపట్టుకోబోగా ఆమె చుట్టూ తిరుగుతున్న భ్రమరాల (తుమ్మెదలు) అరుణాసురునిపై దాడిచేసి, చంపివేసి వాడి రాజ్యంలో వున్న రక్కసులందరినీ తుదముట్టించాయి.

   కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీరూపంతో, పద్దెనిమిది భుజములతో వెలసి వాడిని తుదముట్టించింది.రెండవసారి మహిషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళిగా ఎనిమిది చేతులతో అవతరించి వాడిని సంహరించింది. 

మూడవసారి మహిషుడు పుట్టి ‘అమ్మా! రేండు జన్మలలో నీచేత సంహరింపబడి నా అజ్ఞానం పొగొట్టుకున్నాను. ఇప్పటికైనా నన్ను కటాక్షించి నీ వాహనంగా నన్ను సేవచేయనీ, అని ప్రార్థించగా వాడిని తన పాదల క్రింద తొక్కి ఉంచింది భ్రమరాంబాదేవి.

  ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటినుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.

  శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారములు కలవు. అవి త్రిపురాంతకము,సిద్ధవటము, అలంపురము, ఉమామహేశము అనునవి.

  ఇక్కడి పాతాళగంగ భక్తుల పాపాలు కడిగే పావనగంగ. నల్లమలై అడవిలోపల గల “ఇష్టకామేశ్వరి” ఆలయం కాకుండా ఆరుబయటే ఆ దేవి ఉంటుంది. ఇష్టకామేశ్వరీ దేవి నొసట కుంకుమ దిద్దినపుడు మనిషి నుదురువలె మెత్తగా ఉంటుంది. ఇంకా చంద్రావతి నిర్మించిన “వృద్ధ మల్లికార్జునాలయము” అలా అడుగడుగునా అలరారే వన సౌందర్యాలు, ఔషధీ విలువలు, ఆరోగ్య ప్రశాంతతో అలరారే శ్రీశైలం నిజంగా భూతల కైలాసం.

చంద్రమతి అనే రాజకుమార్తె, శివుని ధ్యానించి ప్రసన్నం చేసుకుని, తాను మల్లికగా మారి శివుని జటాజూటంలో ఉండే వరాన్ని పొందింది.

పద్మ పురాణం, మత్స్యపురాణం, స్కాంద పురాణం, దేవీ భాగవతం వగైరా అనేక పురాణాలలో ప్రస్తుతించబడిన ఈ క్షేత్రం భూమండలానికి నాభిస్ధానం అని స్ధల పురాణం చెబుతోంది.  ప్రతి పూజ, వ్రతం ముందు మనం చెప్పుకునే సంకల్పంలో మనమున్న స్ధలం శ్రీశైలానికి ఏ దిశగా వున్నదో చెప్పుకోవటం ఈ క్షేత్రం యొక్క ప్రాచీనత్వానికి నిదర్శనం. 

శ్రీశైలంలో స్వామి ఆలయం వెనుక వున్న  శ్రీ భ్రమరాంబాదేవి ఆలయ మండపంలో అద్భుత శిల్ప కళతో అలరారే స్తంభాలున్నాయి.  పూర్వం ఈ ఆలయంలో వామాచార పధ్ధతి వుండేది.  విశేషంగా  జంతుబలి  జరిగేది.  

గుడిలోకి ప్రవేశించగానే, ముందుగా అయ్యేది అయ్య, మల్లికార్జునస్వామి దర్శనమే.  ఉపాలయాలలో శ్రీరాముడు ప్రతిష్టించిన సహస్ర లింగేశ్వరస్వామి, వృధ్ధ మల్లికార్జునస్వామి, రాజేశ్వరి, రాజేశ్వరుడు, సీతాదేవి ప్రతిష్టించిన సహస్రలింగేశ్వరస్వామి, ఇంకా పాండవులు ప్రతిష్టించిన శివ లింగాలు, వగైరా అనేక దేవతా మూర్తుల దర్శనం చేసుకోవచ్చు.

అంతేకాదు, ఈ చుట్టు పక్కల చూడవలసిన ప్రదేశాలు అనేకం వున్నాయి.  సాక్షి గణపతి, శిఖరం, పాల ధార, పంచధార, హటకేశ్వరం, శ్రీ పూర్ణానందస్వామి ఆశ్రమం, అందులో కామేశ్వరీ ఆలయం, ఇష్ట కామేశ్వరి వగైరాలు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 7 🌹🌻. 5. జోగులాంబ - 5వ శక్తి పీఠం - అలంపురం , మహబూబ్‌నగర్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 7 🌹
🌻. 5. జోగులాంబ - 5వ శక్తి పీఠం - అలంపురం , మహబూబ్‌నగర్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

అలంపురే జోగులాంబ:
అష్టాదశ క్షేత్రాలలో ఐదవది. అలంపురం పూర్వనామం హలంపురం, మరో పేరు హేమలాపురం. ఈ అలంపురంలోని శక్తిపీఠం జోగులాంబా దేవి శక్తిక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కలదు. ఆదియుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిల్లింది. కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగా అలంపురంలో వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.

అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన “రససిద్ది వినాయకుడు” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.

తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది.

ఎంతో అద్భుత మహిమల చరిత్రల అలంపురం క్షేత్రాన్ని 7,8 శతాబ్దాలలో చాళుక్య రాజులు; 9వ శతాబ్దంలో రాష్ట్రకూటం రాజులు; 10,11 శతాబ్దాలలో కళ్యాణ, చాళుక్య రాజులు అభివృద్ధిపరచారు. కాని బహుమని సుల్తానుల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణస్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ అలంపురాన్ని అభివృద్ధిప్రిచాడు. ఇలా కాలమనే ఆటుపోటులకు తట్టుకుంటు నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలచిన అలంపురం చూసి తీరవలసిన మహిమాన్విత పర్యాటక కేంద్రం.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. ఇది హరిక్షేత్రం.

9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 6 🌹🌻. 4. శ్రీ చాముండేశ్వరీ దేవి - 4వ శక్తి పీఠం - మైసూరు 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 6 🌹
🌻. 4. శ్రీ చాముండేశ్వరీ దేవి - 4వ శక్తి పీఠం - మైసూరు 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

క్రౌంచపట్టణ చాముండేశ్వరి:
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం|
చాముండేశ్వరి, చిత్కళవాసిని! శ్రీ జగదీశ్వరి రక్షయమాం||

అంటూ క్రౌంచి పట్టణమందున్న చాముండేశ్వరి ఆలయం భక్తజన జయజయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రౌంచి పట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఈనాటి మైసూరు పట్టణం. కర్నాటక రాష్ట్రంలోగల మైసూరు పట్టణమందు మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ మాతగా తన చల్లని దేవెనలు కురిపిస్తూ, భక్తజన మనోభీష్టాలనీడేరుస్తూ నిత్యసేవా కైంకర్యాల నందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరాశక్తి చాముండేశ్వరికి నిత్యం మనః పూర్వక వందనం.

శ్రీ చాముండేశ్వరీ దేవి… ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. 

దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. 

మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

 కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని మైసూరులో మైసూరు ప్యాలెస్ కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉన్నది. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి. 

ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గ అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. మైసూరు మహరాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కుల దేవతగా ఆరాధీస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. సంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. 

తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతుంది. 

నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు.

🌻. ప్రచారంలో ఉన్న పురాణ కథ:

పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.

ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై శక్తి వెలికివచ్చింది. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది.

ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.

అమ్మ చాముండేశ్వరి దేవీ, “చాముండి కొండ” అనబడే ఒక పర్వతము పై కొలువై ఉంటుంది.

‘స్కంద పురాణం' మరియు ఇతర పురాతన గ్రంథాలు ఈ క్షేత్రాన్ని ఎనిమిది కొండల చుట్టూ ఉన్న 'త్రిముత క్షేత్రం' అనే పవిత్ర ప్రదేశం అని ప్రస్తావించాయి. ఆ ఎనిమిది కొండలలో ఒకటైన ఈ చాముండి కొండ పశ్చిమ దిశలో ఉంటుంది. 

పూర్వ రోజులలో, ఈ కొండ పై వెలసిన మహాబలేశ్వర స్వామి) గౌరవార్ధం, ఈ కొండను 'మహాబలద్రి' అని అనేవారు.తరువాతి రోజులలో, “దేవి మహత్యం” యొక్క ప్రధాన దేవత చాముండి గౌరవార్థం 'చాముండి కొండా అని పిలువబడింది.

దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల్లో నుండి అనేకమంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దేవత వారి కోరికలను నెరవేర్చును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 5 🌹🌻. 3. శృంఖలాదేవి. - 3వ శక్తి పీఠం - ప్రద్యుమ్నం - పశ్చిమబెంగాల్ 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 5 🌹
🌻. 3. శృంఖలాదేవి. - 3వ శక్తి పీఠం - ప్రద్యుమ్నం - పశ్చిమబెంగాల్ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రద్యుమ్నం శృంఖలా దేవి 🌷

“ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలానామ భూషితే!
శ్రీవిశ్వమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ!!

ఈ చరాచర ప్రపంచానికంతటకు తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి. ‘శృంఖలా దేవి ‘కొలువు దీరిన దివ్యక్షేత్రం – ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠములలో మూడవది అయిన శృంఖలాదేవి శక్తిపీఠము.

నేటి బెంగాల్ బంగ్లా దేశముగా, వంగ దేశముగా విడిపోయి ఉన్నది. హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలోని దేవినే “శృంఖలాదేవి” అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లొని హుగ్లీ జిల్లాలోగల కలకత్తా (కోల్‌కతా) పట్టణానికి సుమారు 80 కి.మీ. దూరంలో పాండవ ప్రాంతమయిన “ప్రద్యుమ్న” అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉండేదని ఆర్యుల ప్రామాణికం. దాన్ని అనుసరిస్తే కలకత్తాకు 135 కి.మీ. దూరంలో గల గంగా సాగర్ క్షేత్రం శక్తి పీఠముగా పిలువబడుతోంది. ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరూ, స్థనము పడిందని మరికొందరి వాదన.

త్రేతాయుగంలో ‘ఋష్యశృంగ మహర్షి ‘ శృంఖలా దేవిని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ. 

ఈ క్షేత్రంలో వెలిసిన దేవీ విగ్రహంలో కనిపించే మాతృప్రేమను అర్ధం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగా కనిపించేది. కనుక పూర్వంకాలం నాటి గురువులు తమ శిష్యులలో నిర్వికారులైన ఉత్తమమైన వారిని మాత్రమే ఈ క్షేత్రదర్శనానికి అనుమతించేవారు. దీనికి పురాణకాలం నాటి కథ ఒకటి ఆలంబనగా ఉంది.

స్థలపురాణం:
త్రేతాయుగంలో దశరథుని పుత్రిక ఐన శాంతను వివాహం చేసుకున్న రుష్యశృంగ మహర్షి సతీసమేతుడై దేవిని చాలాకాలం ఉపాసించాడు. ఆయనకు దేవి యొక్క విచిత్రమైన ఆజ్ఞ మనస్సులో వినిపించసాగింది. అపుడు రుష్యశృంగ మహర్షి అక్కడనుండి దక్షిణ పశ్చిమ దిశగా వచ్చాడు. శృంఖలాదేవి యొక్క దివ్వశక్తి రుష్యశృంగ మహర్షిలో ఉంది. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరపై తపస్సు చేసి ఆత్మానందం పొందుతాడు. తరువాత ఆ శృంగగిరి ప్రాంతంలో కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించుతాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక సాధకులు ఆ దేవతలను శృంఖలా దేవతలుగా పిలిచారు.

శ్రుంఖలము అనగా బందనం అని అర్థము. బాలింత కట్టుకొనే నడి కట్టుని కూడా శ్రుంఖళ అనవొచ్చు. అమ్మవారు జగన్మాత కాబట్టి ఇక్కడ ఒక బాలింత రూపము లో నడి కట్టు తో ఉంటారు. అందువలనే శృంఖలా దేవి అని పేరు వచ్చింది అని అంటారు.

మరికొందరు ఈ దేవి ని విశృంఖల అని కొలుచుకుంటారు. విశృంఖల అంటే ఎటువంటి బంధనాలు లేని తల్లి అని అర్థము.

సమస్త జగత్తను కన్న తల్లి గా, బాలింత నడి కట్టు తో అలరారే ఈ తల్లి నీ శాంతా సమేతముగా రుష్య శ్రుంగ మహర్షుల వారు పూజించారు అని, అమ్మ వారి పూజకు మెచ్చి అనుగ్రహించింది అని అంటారు. ఆ ఋషి పేరు మీదగా శృంఖల అని అమ్మ పేరు అని కొందరు అంటారు.

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా (శృంగళా)దేవిగా భావిస్తారు. 

కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. 

పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

ఇంకొక కధనం ప్రకారం జమ్మూకి దగ్గరలోని జింద్రాహ ప్రాంతంలోని నాభాదేవి ఆలయం అమ్మవారి నాభి పడిన ప్రాంతంగా చెబుతారు. 

కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతీ నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ అమ్మ శక్తితరంగాలకు లోనవుతాడు. తరువాత ఈ ప్రాంతంలోనే శారదా మాతను ప్రతిష్టిస్తాడు.

శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరుపొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు. దీనికే శృంఖల అనే పేరు వుండడం వల్ల క్రొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు -4. 🌹 🌻. 2. శ్రీ కామాక్షి దేవీ - 2వ శక్తి పీఠం - కాంచీపురం 🌻


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 4 🌹

🌻. 2. శ్రీ కామాక్షి దేవీ - 2వ శక్తి పీఠం - కాంచీపురం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. 

అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది కంచిలోని కామాక్షీదేవి ఆలయం . కంపా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి.. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే అమ్మగా ఆమె ఇక్కడ విలసిల్లింది. 

ఇక్కడే శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న పుణ్యపావన క్షేత్రం ఈ శక్తి పీఠం. శ్రీ కామాక్షి దేవి ని 'కామాక్షి తాయి' అని 'కామాక్షి అమ్మణ్ణ్ ' పిలుస్తారు.

పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు. కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.

“కా” అంటే “లక్ష్మి”, “మా” అంటే “సరస్వతి”, “అక్షి” అంటే “కన్ను”. కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి) మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు.

చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా.. విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, పుష్పాలు మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. 

కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించింది అని , మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు.

🌻. స్థల పురాణము:

కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేయుటకు ఘోర తపము చేసిందని చెబుతారు. శివుడు పెట్టిన అనేక పరీక్షలకు నిలిచి, ఆయనను మెప్పించి పరిణయమాడినది .

మొదట ప్రసన్నంగ ఉన్న అమ్మవారు, తరువాత కొన్ని పూజా పద్దతులలో వచ్చిన మార్పులు వల్ల చాలా ఉగ్రంగా ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి పూజా పద్ధతిని సవరించి, అమ్మ ను శంతపరచి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు.

భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆది శంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.

ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. 

గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.

శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(విష్ణువు), అర్ధనారీశ్వర, అన్నపూర్ణ, రాజ శ్యామలా దేవి, క్షేత్రపాలకుడు అయిన పూర్ణ పుష్కల సమేత ధర్మ శాస్త, కామాక్షి దేవి పూజ పద్ధతిని తొలుత నిర్ణయించిన దుర్వాస మహర్షి, ఆ పద్ధతిని పునః ప్రతిష్ట చేసిన ఆది శంకరులను దర్శనం చేసుకోవచ్చు.

ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న పంచ తీర్థం అనే కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.

అష్టాదశ శక్తి పిఠాలలో రెండవ శక్తిపీఠమైన ఈ కంచి దేవాలయంలోని బంగారు బల్లి, వెండి బల్లి రూపాలను తాకి తరించే భాగ్యం ఈ క్షేత్రాన్ని దర్శించే వారికి కలుగుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 3 🌹. 1. శ్రీ శాంకరీ దేవి


🌹. అష్టాదశ శక్తి పీఠాలు - 3 🌹

🌻 1. శ్రీ శాంకరీ దేవీ - ప్రథమ శక్తి పీఠం - శ్రీ లంక 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

స్థల పురాణము

లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకు వెళ్ళాలని భావించి, కైలాసమునకు వెళ్ళి బలవంతంగా పార్వతీ దేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా, కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేసింది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. 

రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా – తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యమును రక్షిస్తూ వుండమని వరం కోరాడు. అందుకు పార్వతీదేవి –

“రావణా! నీవు అనేక అకృత్యాలు చేస్తున్నావు. అందువల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుచించుకుపోతుంది. నీకు వరం ప్రసాదించి నేను వచ్చి నీ రాజ్యంలో వుంటాను. అయితే నీవు అకృత్యాలు చేయనంతకాలం నేను నీ రాజ్యంలో వుంటాను. 

నీవు మళ్ళీ అకృత్యాలు చేసిన మరుక్షణం నేను నీ రాజ్యం వదిలివెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమై, నీ పాలన అంతమొందుతుంది.” అని పలికింది.

అందుకు రావణాసురుడు అంగీకరించగా – పార్వతీ దేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకో సాగింది.

తర్వాత కొంత కాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకొనివచ్చి అశోకవనంలో బంధించాడు. ఆ మరునాడు శాంకరీదేవి దర్శనమునకు వెళ్ళి రావణాసురునితో –

“రావణా! సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు. నీవు ఆమెను వదిలిపెట్టు. లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను” అని పలికింది.

శాంకరీ దేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయక పోవడంతో లంకను వదిలి వెళ్ళిపోసాగింది. 

ఈ సమయంలో మహర్షులు లంక వదిలివెళ్ళినా భూలోకం వదలి వెళ్ళవద్దని ప్రార్థించడంతో ఆదేవి దక్షిణం నుంచి ఉత్తరమునకు సాగిపోయి హిమాలయం, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయిందని చెప్తారు. మహర్షులు ఆ దీవిని “బనశంకరీ” అని పిలిచారు. 

ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తారు. కొందరు రావణ సంహారానంతరం శాంకరీ దేవీ తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది అని భావిస్తారు.

అయితే అనేక వివాదాలు ఉన్న ప్రస్తుతం శ్రీలంక దేశంలోని “ట్రింకోమలి” పట్టణంలో వున్న దేవీ ఆలయమును ప్రథమ శక్తి పీఠంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి కాలిగజ్జెలు పడినట్లు కొందరు చెబుతారు, కానీ అమ్మవారి "తొడభాగం" పడిన స్థలంగా ప్రతీతి ఈ క్షేత్రం.

శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని కోనేశ్వరం లో త్రిముకోమలై వద్ద వుందని చెప్పబడుతుంది . దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు .

అయితే ప్రస్తుతం, ఈ ప్రదేశంలో .. ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు.

ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.

అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.

ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు.

త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల - ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు.

ఆ శివాలాయం ప్రక్కనే… ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 2 🌹


🌹. అష్టాద‌శ శ‌క్తి పీఠాలు - 2 🌹

🌴. ప్రదేశాల సంక్షిప్త వివరాలు 🌴
📚. ప్రసాద్ భరద్వాజ 

హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు. వాటి వివ‌రాలు మీ కోసం.. 

🌻. 1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

🌻. 2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🌻. 3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

🌻. 4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

🌻. 5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

🌻. 6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

🌻. 7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

🌻. 8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

🌻. 9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

🌻. 10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

🌻. 11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

🌻. 12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

🌻. 13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

🌻. 14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

🌻. 15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

🌻. 16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

🌻. 17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

🌻. 18. సరస్వతి - జమ్ము, కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.
🌹 🌹 🌹 🌹 🌹