🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శంఖలిఖిత మహర్షులు - 4 🌻
19..ప్రతి ఋషివాక్యానికి ఎంతో లోతైన, విశాలమైన, సమస్త జగత్తుకూ హితంచేకూర్చే భావం కలిగిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు వారు చెప్పినవాటిలో, పితృదేవతలను అర్చించటం ఒక విధి. అంటే చచ్చిపోయిన వాళ్ళను అర్చించటం. ‘బ్రతికిఉన్నవాళ్ళకు అన్నంపెట్టమని చెప్పవచ్చుకదా!’ అని తద్దినాలపై ఒక విమర్శ. బ్రతికేవాడికే అన్నంపెట్టమని వారు చెప్పారు.
20. అయితే చనిపోయినవారి పేరుమీద పెట్టమని, వారిని జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పారు. అంటే చచ్చిపోయిన వాడు తింటాడా? వాడికి తద్దినం ఎందుకు పెట్టాలి? అనే ప్రశ్నలకు; పోయినవాడికి శ్రాద్ధం పెట్టి, ఉన్నవాడికే భోజనం పెట్టమన్నారు. అయితే వారు ఈ ఉద్దేశ్యం మరచిపోయి, ఇటువంటి కుతర్కంతో కూడిన వాదనలు మనవారు కొందరు చేస్తూ ఉంటారు.
21. రోజూ ఒక్కమారైనా దేశం కోసం ప్రార్థనచేయాలి. ‘గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు’ అని రోజూ నమస్కరించాలి.
22. అంటే, “గోవు నుంచి సమస్త పశువులు, బ్రాహ్మణులనుంచి సమస్త మానవులు” అని దాని అర్థం. అంతేకాని, గోవులు, బ్రాహ్మణులుమాత్రమే బాగుండాలి, మిగతావారు అక్కరలేదు అని కాదు. అలా ఉండనేఉండదు వైదికమార్గం. ‘గోవులతో మొదలుపెట్టి క్రిమికీటకాదులవరకు, ఒకరికొకరు హానిచేయకుండా ఎవరిబ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ శాంతితో ఉందురుగాక! విద్యావంతులు, అవిద్యావంతులు, ధనవంతులు, దరిద్రులు, అంతా సుఖంగా ఉందురుగాక!’
23. రోజూ సంధ్యావందనంలో అనవలసిన మాటలివి. వాళ్ళందరూ సుఖపడాలి అని బ్రహ్మణుడు మూడుసార్లు అనాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
31.Aug.2020
No comments:
Post a Comment