నారద భక్తి సూత్రాలు - 82


🌹. నారద భక్తి సూత్రాలు - 82 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము - సూత్రము - 50

🌻 50. స తరతి స తరతి స లోకాంస్తారయతి ॥ - 1 🌻

అటువంటి పరాభక్తుడు తాను గమ్యం చేరడమే గాక, లోకంలో చాలామంది తరించడానికి ఉపకరణమవుతాడు. ఇట్టివాడు భాగవతోత్తముదై, భగవంతుని చేతిలో పరికరమవుతాడు.

యోగ్యతగల భక్తులకు ఇతని ద్వారా భగవంతుడు అనుగ్రహాన్ని ప్రనాదిస్తాడు. ఈ రకమైన పరాభక్తులు భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు భగవంతునితో సమానులు.

బ్రహ్మ భూతః ప్రసన్నాత్మా నశోచతి న కాంక్షతి

సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ ॥

- (18:54) భగవద్దిత

తా॥ సచ్చిదానందఘన పరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై, ప్రసన్న మనస్మ్కుడైన యోగి దేనికీ శోకించడు. దేనినీ కాంక్షించడు. సమస్త ప్రాణులందు సమభావం ఉన్న యోగి పరాభక్తిని పొందుతాడు. పరే భాగవతోత్తములు.

భక్తుడు యోగ్యుడైతేనె భగవదనుగ్రహం పొందుతాడు. గనుక సాధకుడు సాధించె సాధనా స్థితిగతులను భగవద్గిత తెలియచెస్తున్నది. ఒక్కొక్క స్థితిని ఈ క్రింది విధంగా అధిగమించి, యోగ్యత సంపాదించాలి. చివరకు స్థిరమైన, శాశ్వతమైన పరమప్రేమ స్థితిని పొందుతాడు భక్తుడు.

1) _ ఆత్మ వశ్యైర్విధయాత్మా ప్రసాద మధిగచ్చతి ॥ - (2:64) భగవద్గిత

ఆత్మకు వశమైన బుద్ధితో జీవించడం వల్ల “ప్రసాదం” అనగా ఇచ్చెవాడు, పుచ్చుకునేవాడు అనె విభజన ఉన్న జీవేశ్వర భిన్నత్వం అనె స్థితిని అధిగమిసాడు. ఎ రకంగానూ దుఃఖాన్ని దగ్గరకు చేరకుండా ఉంచే మోదాన్ని ప్రసాదమంటారు. క్రసాద స్థితిలో ఈశ్వరునకు మనసు, బుద్ధి, చిత్తం లొంగి ఉంటాయి.

ఆ బుద్ధి భెద భావాన్ని పాటించదు. మనసు విషయాసక్తం కాదు. ఈ శుద్ధ బుద్ధి ఆత్మ స్థితిని గ్రహించి, దానికి వశమై వర్తిస్తూ జీవేశ్వర భిన్నత్వాన్ని వోగొట్టుకొంటుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

31.Aug.2020

No comments:

Post a Comment