🌹 18. గీతోపనిషత్ - అనర్హుడు - మనస్సుచే మోసగింపబడిన వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు. 🌹
భోగైశ్వర్యప్రసక్తానం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధి: సమాధౌ న విధీయతే || 44
భగవంతుడు రస స్వరూపుడు. రసాస్వాదనము చేయుటకే జీవనము. అదియే వైభవము. అట్టి వైభవమును పొందుటకు ఈ క్రిందివారనర్హులని భగవానుడు బోధించుచున్నాడు.
1) కర్మఫలములం దాసక్తి గలవాడు,
2) పుణ్యము కొరకు మంచిపని చేయువాడు,
3) కోరికలతో నిండిన మనస్సు కలవాడు,
4) భోగములయం దాసక్తి కలవాడు,
5) జ్ఞాన సముపార్జన చేయనివాడు,
6) ఐశ్వర్యములను సంపాదించుటకు ప్రయాస పువాడు,
7) తెలిసినదానిని ఆచరించనివాడు.
పైవారందరూ వారి మనస్సుచే మోసగింపబడినవారు. వారు దైవ ధ్యానమును చేయలేరు. రసానుభూతిని పొందలేరు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
31.Aug.2020
No comments:
Post a Comment