✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని శరీరి : నాల్గవ పాత్ర (రూపధారణము) - 2 🌻
114. ఒకేసారి సంస్కారములు లేని ఆత్మకు, ప్రథమముగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమముగా చైతన్యమును కలిగినవి. ఇట్లు కలిగిన ప్రథమ సంస్కారము పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారము.
115. అనంత శాశ్వత (A) పరమాత్మ పొందిన చైతన్యము అత్యంత పరిమితమైన స్థూల సంస్కారము మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమేగాని అది ... ... తన అనంత స్థితియొక్క చైతన్యమునుగాదు, లేక (B) స్థితిలోని అనంతపరమాత్మయైన తన స్వీయ చైతన్యమును గాదు.
116. అవిభాజ్యమైన ఆత్మయొక్క తొలి చైతన్యము, తొలి రూపము ద్వారా తొలి సంస్కార అనుభవమును పొందుచూ, ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. అదియేమనగా - పరమాణు ప్రమాణములో పరిమితము, స్థూలము అయిన తొలిరూపముతోడనే తన శాశ్వత అనంత పరమాత్మతో సాహచర్యము చేసి, తాదాత్మ్యము చెందునట్టి ప్రవృత్తిని సృష్టించుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
31.Aug.2020
No comments:
Post a Comment