రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 4 🌻
జీవతస్తేన దక్షో హి తత్ర సర్వే హి సత్కృతాః | పునస్స కారితో యజ్ఞ శ్శంకరేణ కృపాలునా || 39
రుద్రశ్చ పూజితస్తత్ర సర్వై ర్దేవైర్వి శేషతః | యజ్ఞే విష్ణ్వాదిభిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే || 40
సతీదేహ సముత్పన్నా జ్వాలా లోక సుఖావహా | పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయినీ || 41
జ్వాలా ముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రదా | బభూవ పరమా దేవీ దర్శనా త్పాపహారిణీ || 42
ఆయన దక్షుని జీవింపజేసి, అందరినీ సత్కరించెను. కృపానిధి యగు శంకరుడు మరల ఆ యజ్ఞమును చేయించెను (39).
ఆ యజ్ఞములో దేవతలందరు విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి (40).
ఓ మహర్షీ! సతియొక్క దేహము నుండి పుట్టినట్టియు, లోకములకు సుఖమనిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును (41).
ఆ పర్వతమునందు సర్వకామనలనీడేర్చునట్టియు, దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖియను పేర ప్రసిద్ధిని గాంచెను (42).
ఇదానీం పూజ్యతే లోకే సర్వకామఫలాప్తయే | సంవిధాభి రనేకాభిః మహోత్సవ పురస్సరమ్ || 43
తతశ్చ సా సతీ దేవీ హిమాలయ సుతాsభవత్ | తస్యాశ్చ పార్వతీ నామ ప్రసిద్ధమభవత్తదా || 44
సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై | తమేవ పరమేశానం భర్తారం సముపాశ్రితా || 45
ఏ తత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 46
ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీసంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమః అధ్యాయః (1).
ఇప్పటికీ ఆమె లోకమునందు, కోర్కెలన్నియు ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పుజింపబడుచున్నది (43).
ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయుని కుమార్తె అయెను. అపుడామెకు పార్వతియను పేరు ప్రఖ్యాతమాయెను (44).
ఆమె మరల కఠోరమగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను (45).
ఓమునిశ్రేష్ఠా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములనన్నిటినీ చెప్పతిని. దీనిని విన్నవారి పాపములన్నియు తొలగిపోవుననటలో సందేహము లేదు (46).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితములో రెండవ ఖండలో సతీసంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
31.Aug.2020
No comments:
Post a Comment