✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 33
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అథ పవిత్రారోపణ విధానమ్ - 2 🌻
ఆచార్యాణాం చ సూత్రాణి పితృమాత్రాదిపుస్తకే. 12
నాభ్యన్తం ద్వాదశగ్రన్థిం తథా గన్ధపవిత్రకే | అఙ్గలాత్కల్పనాదౌద్విర్మాలా చాష్టోత్తరం శతమ్. 13
అథవార్కచతుర్వింశషట్త్రింశన్మాలికా ద్విజ | అనామామధ్యమాఙ్గుష్ఠైర్మన్దాద్యైర్మాలికార్థిభిః. 14
కనిష్ఠాదౌ ద్వాదశ వా గ్రన్థయః స్యుః పవిత్రకే | రవేః కుమ్భహుతాశాదేః సమ్భవీ విష్ణువన్మతమ్. 15
పీఠస్య పీఠమానం స్యాన్మేఖలాన్తే చ కుణ్డకే | యథాశక్త సూత్రగ్రన్థిః పరిచారే7థ వైష్ణవే. 16
సూత్రాణి వా సప్తదశ సూత్రేణ త్రివిభక్త కౌ |
ఆచార్యునికొరకును, తలిదండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకొరకును నిర్మింపబుడు పవిత్రకమునాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను.
వనమాలయందు రెండేసి అంగుళములదూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను.
మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను.
(తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను.
విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.
ఏకాదశ్యాం యాగగృహే భగవన్తం హరిం యజేత్. 18
సమస్తపరివారాయ బలిం పీఠే సమర్చయేత్ | క్షౌం క్షేత్రపాలాయ ద్వారాన్తే ద్వారోపరి శ్రియమ్. 19
ధాత్రే దక్షే విధాత్రే చ గఙ్గాం చ యమునాం తథా | శఙ్ఖపర్మనిధీ పూజ్య మధ్యే వాస్త్వపసారణమ్. 20
సారఙ్గాయేతి భూతానాం భూతశుద్ధిం స్థితశ్చరేత్ |
ఓం హూం హః ఫట్ హ్రూం గన్ధతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రరూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః.
ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః.
పఞ్చోద్ఘాతైర్గన్థతన్మాత్రస్వరూపం భూమిమణ్డలమ్ |
చతురస్రం చ పీతం చ కఠినం వజ్రలాఙ్ఛితమ్.
ఇన్ద్రాధిదైవతం పాదయుగ్మమధ్యగతం స్మరేత్ |
శుద్ధం చ రసతన్మాత్రం ప్రవిలాప్యాథ సంహరేత్ 7
రసమాత్రం రూపమాత్రే క్మరమేణానేన పూజకః. 22
పవిత్రమును గోరోచనముతోను, అగురుకర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజగృహము వ్రవేవించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను.
విష్ణువుయొక్క సమస్తపరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజింపవలెను. ద్వారముయొక్క అంతమునందు ''క్షం క్షేత్రపాలాయ నమః'' అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను.
ద్వారము పై భాగమున ''శ్రియై నమః'' అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున ''ధాత్రే నమః'' ''గంగాయై నమః'' అను మంత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున ''విధాత్రే నమః'' ''యమునాయై నమః'' అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను.
ఇదే విధముగ ద్వారముయొక్క కుడి-ఎడమ ప్రదేశములందు క్రమముగ ''శఙ్ఖనిధయే నమః'' పద్మనిధయే నమః''అని చెప్పుచు శంఖపద్మనిధులను పూజింపవలెను.
[పిదప మండపములోపల కుడి హిదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను].
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం
31.Aug.2020
No comments:
Post a Comment