🌹. శివగీత - 48 / The Siva-Gita - 48 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ఏడవ అధ్యాయము
🌻. విశ్వరూప సందర్శన యోగము - 2 🌻
శ్రీభగవానువాచ:-
మయి పర్వం యథా రామ! - జగచ్చైత చ్చరా చరమ్,
వర్తతే తద్దర్శయామి - నద్రుష్టం క్షమతే భవాన్ 10
దివ్యం చక్షు: ప్రదాస్యామి - తుభ్యం దాశరథాత్మజః !
తేన పశ్య భయం త్యక్త్వా - మత్తేజో మడలం ధ్రువమ్ 11
న చర్మ చక్షుషా ద్రష్టుం - శక్యతే మామకం మహః,
నరేణ వా సురేణాపి - తన్మ మాను గ్రహం వినా 12
ఓ రామా! ఈ చరాచరాత్మక మైన ప్రపంచ మంతయు నా యుదరంబున లీనంబైయున్నది. దానిని నీవు చూచుటకై నీకు శక్తి చాలదు. ఈ చర్మ చక్షువులతో మానవుడైనను దేవుడైనను నా కరుణాకటాక్షము లేక నా తేజో మండలమును కనుగొనలేడు. కావున, ఓయీ! దాశరథీ ! నీకు దివ్యదృష్టిని ఇచ్చుచున్నాను. నిర్భయుండవై నా తేజస్సును చక్కగా చూడుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 48 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 07 :
🌻 Vishwaroopa Sandarshana Yoga - 2 🌻
Sri Bhagavan said:
O Rama! This entire mobile and immobile creation dwells inside my belly. You do not have enough strength and capability to witness that scene. With these eyes of flesh neither human nor god can ever be able to see my brilliant cosmic form without my grace.
Therefore, O son of Dashratha! I'm giving you divine eyes (divya drishti) do not fear and properly see my divine cosmic form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
31.Aug.2020
No comments:
Post a Comment