శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 87 / Sri Gajanan Maharaj Life History - 87



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 87 / Sri Gajanan Maharaj Life History - 87 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 18వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః చిద్విలాసా జై, ఓ గోవిందా, శ్రీనివాసా, ఓ ఆనందభండారా, దిగజారినవారి సోదరుడా, నావైపు చూడండి. ఓకేశవా కేశీమర్ధనా, మాధవా, మధుసూధనా, ఓ పూతన సంహారా, పాడురంగా, రుక్మిణీవరా, నాకు ఏదికావాలో మీకుతెలుసు. పైకి చెప్పడం అవసరమా ? మీ భక్తుల కోరికలన్నీ మీరు తీరుస్తారని పురాణాలు చెపుతున్నాయి. పూర్తిగా మీవాడయిన ఈ దాసగణు కోరికలు పూర్తిచెయ్యమని నేను మిమ్మల్ని అర్ధిస్తున్నాను. 

భాయిజాబాయి అనేపేరుగల భక్తురాలు అకోట్ దగ్గర ముండగాంలో ఉండేది. ఆమె హలీమాలి అనే కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి శివరాం, తల్లి భులాబాయి. ఆమెకు చిన్నతనంలోనే వివాహం చెయ్యబడింది. 

ప్రతీదీ వారివారి కర్మప్రకారం అవుతాయి. భాయిజా రజస్వల అయ్యాకా, ఆమె తండ్రి తన అల్లుడి ఇంటికి తీసుకు వెళ్ళాడు, కానీ లాభంలేకపోయింది. ఎందుకంటే ఆ అల్లుడు నపుంసకుడిగా ఉన్నాడు. ఈవిషయం భాయిజా తల్లి తండ్రులను బాధించింది. ఆమె యవ్వన వయసుచూసి భులాబాయి వేరే ఎవరితో అయినా వివాహం చెయ్యమని సలహాఇచ్చింది. 

శివరాం దానికి అంగీకరించక, ఒక్కోసారి కొంతకాలం గడిచాక పురుషత్వం చురుకుగా అవుతుంది అనిఅన్నాడు. కావున వాళ్ళు భాయిజాను ఆమె భర్తదగ్గర వదిలి వేచిచూద్దాం, బహుశా సరి అయిన ఔషదసేవ వల్ల పురుషత్వం రావచ్చునేమో అని నిశ్చయించారు. వాళ్ళిద్దరూ తిరిగి ముండగాం వచ్చేసారు. 

15 / 16 సం. వయసుకల భాయిజా, గోధుమ వర్ణంతో, యవ్వన శరీరం కలిగి ఉంది. ఆమె పొడుగయిన ఖాయం, అందమైన కళ్ళు, సూటిగా ఉన్నముక్కుతో ఏరసికుడినయినా ఆకర్షించే శక్తి కలిగిఉంది. ఆమెభర్త అన్నగారు ఈమె అందానికి మోహితుడై ఆమెతో ప్రేమసాగించాలని అనుకున్నాడు. చాలావిధాలుగా ప్రయత్నించాడు, తనని భర్తగా ఆమెను పరిగణించమని అన్నాడు. జీవితాంతం పోషిస్తానని కూడా ఆమెకు వాగ్దానం చేసాడు. ఆమెను ఊరించడానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధం అయ్యాయి. 

ఈ జరుగుతున్న ఘటనలవల్ల .... ఓభగవంతుడా నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు ? చిన్నప్పటినుండి నేను మీపాద పూజచేసాను, ఇదేనా నేను చేసిన పూజలకు పొందేఫలం ? నాకు వివాహం చెయ్యబడ్డ మనిషి నపుంసకుడిగా రుజువయ్యాడు, మరి నాకు నా భవిష్యత్తు తెలుసు. ఒకవిధంగా ఇది మంచిదే, ఎందుకంటే నేను పూర్తిగా మీపాదాలకు అంకితం అవవచ్చు. వేరే ఏపురుషుడూ నన్ను తాకకూడదు అనేదే నా ఒకేఒక అర్ధింపు అని భాయిజా ప్రార్ధించింది. 

ఒకరోజు రాత్రి ఆమెభర్త అన్నగారు, ఆమెదగ్గరకు వచ్చి తన కోరిక ఆమెకు తెలియ చేసాడు. కానీ అతని ఈ తప్పుపనిని భాయిజా నిరాకరిస్తూ సిగ్గులేని వాడివి అంది. భర్తయొక్క అన్న తండ్రితో సమానం కాబట్టి ఆవిధంగా ప్రవర్తించాలి అని అతనికి సూచించింది. ఆమెమాటలు లెక్కచెయ్యక, ఆమెను పట్టుకోడానికి ప్రయత్నించాడు. 

అప్పుడే అతని కొడుకు మొదటి అంతస్తునుండి క్రిందపడి తలకి బాగా గాయం అవడం విన్నాడు. భాయిజా పరుగున వెళ్ళి ఆపిల్లవాడిని ఒడిలోకి తీసుకుని మందులు రాసింది. తరువాత ఇతర స్త్రీలమీద మోహంమానుకోమని పాఠంనేర్చుకోమని భాయిజా అతనితో అంది. పిల్లవాడి గాయంచూసి, తనుచేసిన పనికి పశ్చాత్తాపడి తరువాత భాయిజాను ఎప్పుడూ విసిగించలేదు.

శివరాం తరువాత తన కూతురును ముండగాం తీసుకుని వెళ్ళాడు. భులాబాయి శ్రీగజానన్ మహారాజు దగ్గరకు వెళ్ళి, భాయిజా భవిష్యత్తు గురించి అడగవలసిందిగా తనభర్తకు సూచనఇచ్చింది. అప్పుడు వాళ్ళు ఇద్దరూ భాయిజాతో కలసి షేగాం వెళ్ళి శ్రీమహారాజు ముందు సాష్టాంగపడి భాయిజాకు పిల్లలు కలగాలని దీవించమంటారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 87 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 18 - part 1 🌻

Shri Ganeshayanmah! Jai to Chidvilasa. O Govinda, Shrinivisa, O Embodiment of Bliss, brother of the fallen, look to me. O Keshava Keshimardana Madhava, Madhusudana, O killer of Putana, Panduranga, consort of Rukmin, you know what I want. Is it necessary to speak it out? Puranas say that you fulfill all the desires of your devotees. So I beseech you to fulfill the wishes of this Dasganu, who is entirely yours. 

There was a devotee named Baijabai at Mundgaon, near Akot. She was born in the family of a Haldi Mali. Her father’s name was Shivram and Bhulabai the mother’s. She was married in her childhood only. Every thing happens as per one's destiny; having attained puberty, Baija was taken by her father to the son in law place, but it was of no use as he was found to be a neuter. 

The fact hurt the parents Baija, but looking to her young age, Bhulabai suggested that she be remarried to somebody else. Shivram did not agree and said that the masculine nature, at times, gets active with the passage of time. So they decided to wait and keep Baija with her husband, expecting that proper medication might revive his masculine character. Both of them then returned to Mundgaon. Baija with her age of 15 to 16, and though wheatish in colour, had a youthful body. 

Her tall figure with beautiful eyes and a sharp nose had the power to attract any sexy person. Her husband's elder brother, enamored by her beauty, wanted to make love with her. He tried many ways to persuade her, saying that he be treated as a husband by her. He even promised to maintain her throughout the life. His all efforts to tempt her were wasted. 

On the background of all of this, Baija prayed, O God why are you troubling me like this? I worshipped your feet since my childhood, and is this the fruit I am getting for my devotion? The man married proved to be a no-man and I understood my fate. In a way it is good, as, now, I can fully devote myself at your feet. Now my only request is that no other man should touch me. 

One night her husband's brother came to her to let her know his intention, but Baija declined his advances by calling him a shameless person. She pointed out that an elder brother of the husband is like a father and as such should behave accordingly. But ignoring her remarks, he tried to catch hold of her. 

When he did so, he heard his elder son failing down from the first floor, causing the child great wound on the head. Baija rushed and took the child on her lap and applied medicine. Then Baija told him to take that as a lesson that it was not good to have desire for other women. 

Looking to the wound of the child, he regretted his actions and did not trouble Baija thereafter. Shivram then took his daughter to Mundgaon. 

Bhulabai suggested her husband to go and ask Shri Gajanan Maharaj about the future of Baija. So both of them, along with daughter Baija went to Shegaon and prostrating before Shri Gajanan Maharaj , requested him to bless Baija with a child.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom

No comments:

Post a Comment