✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 4
🌻. శక్రాదిస్తుతి - 2 🌻
16. “దేవీ! నీ ప్రసాదంతో ధన్యుడైనవాడు మిక్కిలి ఆదరంతో నిత్యం సర్వధర్మకార్యాలను చేస్తాడు. అందుకే అతడు స్వర్గాన్ని పొందుతాడు.
కాబట్టి దేవి! ముల్లోకాలలో ఫలితాలను ప్రసాదించే తల్లివి నీవే కదా !
17. 'కష్టవేళలలో నిన్ను తలచుకునే వారందరికీ నీవు భయాన్ని నివారిస్తావు. స్వస్థులై సుఖించేవారు నిన్ను తలిస్తే అంతకన్నా శుభాధికమైన బుద్ధిని ఇస్తావు. పేదరికాన్ని, కష్టాలను, భయాన్ని పోగొట్టే ఓ దేవీ! ఎల్లరకు ఉపకారం చేయగల చల్లని చిత్తం నీకు తప్ప మరి ఏ దేవతకు ఉంది?
18. “వీరిని చంపడం వల్ల లోకాలకు సుఖం కలుగుతుంది. వీరు చిరకాలం నరకంలో నుండదగిన పాపాలు చేసినవారైనా, చివరకు (నా తో) యుద్ధంలో మృతులై స్వర్గాన్ని పొందుతారుగాక' అని ఇలా తలచి దేవీ! నీవు (మా) శత్రువులను చంపుతావు..
19. “అసురులందరనీ నీ చూపుమాత్రంతోనే భస్మం చేస్తావు గదా! నీవు వారిపై శస్త్రాలను ప్రయోగించడమెందుకు? అని అంటే 'శత్రువులుగా కూడా ఆ శస్త్రాల చేత పవిత్రత పొంది ఉత్తమ లోకాలను పొందుతారుగాక' అని నీకు వారిపై కూడా గల అత్యంత సాధుచిత్తం ఇటువంటిది.
20. “నీ ఖడ్గం నుండి వెలువడే భయంకరద్యుతుల చేత, నీ శూలాగ్రం నుండి వెలువడే కాంతిసమూహం చేత అసురుల కన్నులు విలయం చెందకుండడానికి కారణం, (చల్లని) కాంతులు వెదజల్లే బాలచంద్రుని పోలు నీ యోగ్యమైన ముఖాన్ని కూడా వారు చూడడమే.
21. “దేవీ! దుష్టుల ప్రవర్తనను అణచడమే నీ స్వభావం. అలాగే ఈ నీ అసమాన సౌందర్యం ఇతరులకు దురవగాహమైనది. దేవతల పరాక్రమాన్ని అపహరించిన వారిని నీ శక్తి నాశనం చేస్తుంది. ఇలా నీవు నీ దయను వైరులపై కూడా ప్రకటించావు.
22. “నీ ఈ పరాక్రమాన్ని దేనితో పోల్చతగుతుంది? అత్యంత మనోహరమయినా, శత్రువులలో భీతిని కలిగించే నీ సౌందర్యం మరెక్కడ కనిపిస్తుంది! హృదయంలో కృప, యుద్ధంలో నిష్ఠురత మరెక్కడ కనిపిస్తుంది! దేవీ! వరప్రదాయినీ! ముల్లోకాలలో నీలో మాత్రమే ఇవి కానిపిస్తాయి.
23. "వైరులను వినాశమొనర్చి నీవు ఈ మూడు లోకాలను రక్షించావు. యుద్ధంలో వధించి శత్రుగణాలను కూడా స్వర్గానికి చేర్చావు. మదోన్మత్తులైన సురవైరుల భయం మాకు తొలగించావు. నీకు ప్రణామాలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 14 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
CHAPTER 4:
🌻 The Devi Stuti - 2 🌻
16. 'By your grace, O Devi, the blessed individual does daily all righteous deeds with utmost care and thereby attains to heaven. Are you not, therefore O Devi, the bestower of reward in all the three worlds?
17. 'When called to mind in a difficult pass, you remove fear for every person. When called to mind by those in happiness, you bestow a mind still further pious. Which goddess but you, O Dispeller of poverty, pain and fear, has an ever sympathetic heart for helping everyone?
18. 'The world attains happiness by the killing of these (foes) and though these (asuras) have committed sins to keep them long in hell, let them reach heaven by meeting death eventually at he battle (with me)- thinking thus, that you, O Devi, certainly destroy our enemies.
19. 'Don't you reduce to ashes all asuras by mere sight? But you direct your weapons against them so that even the inimical ones, purified by the missiles, may attain the higher worlds. Such is your most kindly intention towards them.
20. 'If the eyes of the asuras had not been put out by the terrible flashes of the mass of light issuing from your sword or by the copious lustre of your spear point, it is because they saw also your face resembling the moon, giving out (cool) rays.
21. 'O Devi, your nature is to subdue the conduct of the wicked; this your peerless beauty is inconceivable for others; your power destroys those who have robbed the devas of their prowess, and you have thus manifested your compassion even towards the enemies.
22. 'What is your prowess to be compared to? Where can one find this beauty (of yours) most charming, (yet) striking fear in enemies? Compassion in heart and relentlessness in battle are een, O Devi, O Bestower of boons, only in you in all the three worlds!
23. 'Through the destruction of the enemies all these three worlds have been saved by you. Having killed them in the battle-front, you have led even those hosts of enemies to heaven, and you have dispelled our fear from the frenzied enemies of the devas. Salutation to you!
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithadevi
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
24 Oct 2020
No comments:
Post a Comment