🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 16 🌻
122. శాపము-ప్రతిశాపము! ఎందుకంటే జ్ఞానం లేకుండా చేసిన తపస్సు క్షీణించవలసిందే! వివేకములేకుండా పొందిన ధనం నసించవలసిందే! అంటే పుణ్యము, వివేకము రెండూ లేనటువంటి ధనమున్నదే, అది నశిస్తుంది. ధనం క్రమంగా సంపాదించినా, అక్రమంగా సంపాదించినాఖూడా – వివేకం అనేది తతువాతయినా ఉదయిస్తే – అది మనుష్యుడు సద్వినియోగం చేసుకుంటాడు. వివేకహీనుడి ధనము, అధికారము రెండుకూడా దుర్వినియోగం అయి నశిస్తాయి.
123. అసలు పరమేశ్వర సృష్టిలో విద్య, వివేకము చిన్న వయసులోనే సంపాదించుకుని, మధ్యవయస్సు వచ్చిన తరువాత ధనం సంపాదించుకునేటట్లు ఒక పద్ధతి ఉంది.
124. కానీ చిన్నప్పటినుంచీ మనకు ధనసంపాదన కోసమే పనికివచ్చే విద్యనే, ఆ ధ్యేయంతోనే చెపుతూ ఉండటం చేత, వివేకం కోసం వాడుకోవలసిన బాల్యావస్థకూడా ధనసంపాదన ధ్యాసతోనే సరిపోతోంది. అది దాంట్లో భాగమైపోయింది. కనుక ధనం సంపాదిస్తాడు కాని వివేకం సంపాదించలేడు. ధనార్జనమార్గాలే అన్వేషిస్తాడు ఎంత వాడయినప్పటికీ! ఇది అపసవ్యపు విద్య.
125. ఆర్యసంస్కృతిలో అలాలేదు. ధనం సంపాదించుకోవటం అనే ఆలోచన తల్లితండ్రులకుకాని, చిన్న వయసులో ఉన్నవాడికికాని, యౌవనంలో ఉన్నవాడికికాని లేనే లేదు. ఆ తరువాత ఏంచేస్తాము? ఎలా సంపాదిస్తాము? ఎట్లా బతుకుతాము? ఆ ప్రశ్నే లేదు. చిన్నప్పుడు చేయవలసిన పని విద్యాసముపార్జన మాత్రమే! ఇంకోదృష్టిలేనేలేదు. అదీ ఆర్యుల దృష్టి.
126. యోగబలంచేత, తపస్సుచేత శాపం ఇవ్వటానికెంత ఖర్చవుతుందో, దానిని ఉపసమ్హరించుకోవటానికి అంతకు రెట్టింపు ఖర్చవుతుంది. ఉపసంహారం చేసుకోరు అందుకనే!
127. అస్తాన్ని విడవటం సులభమే కాని, దానిని మళ్ళీ వెనక్కు తెచ్చుకోవటం ఎంతో కష్టం! బాణం విల్లులోంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఎవరైనా వెనక్కు తీసుకురాగలరా! అది మంత్రాస్త్రమైతే అంతఃకరణలో దానిపై అదుపు ఉంటుంది కాబట్టి వెనక్కు తెచ్చుకుంటారు కాని, అందుకోసం చాలా తపోబలం కావాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
24 Oct 2020
No comments:
Post a Comment