✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 03 🌻
339 . దేవతలు :- వీరు అమరులు, భగవంతుని సంకల్పమునకు స్వయంగమన మూర్తులు భగవంతుడు వాంఛించనిదే, ప్రోత్సహింసనిదే వీరు ఏమియును చేయరు. అనగా వీరు భగవంతుని సంకల్ప స్వరూపులు.
340. దేవతలు, స్థూలకాయముతో అపవిత్రులు కానీ పవిత్ర జీవులు. ఈ సందర్బములో దేవతలు సామాన్య మానవులకంటే శ్రేష్ఠులు.
341. దేవతలు మానవుడు పొందగల సత్యస్థితి చేరుకొనుటకు ముందుగా దేవత్వమును వీడి మానవులు కావలసినదే. అట్లే మానవుడు మానవత్వమును "వీడి నేను భగవంతుడను" అనేది స్థితిలో ప్రేవేశించవలసినదే.
342. అసంఖ్యాక జనన--మరణముల అనంతరము, భౌతిక చైతన్యము గల మానవాత్మ చిట్టచివరకు తప్పనిసరిగా భగవంతుని యొద్దకు తీసుకొనిపోవు జ్ఞానమార్గము వంకకు మరలును.
343. ఆత్మ యొక్క చైతన్యము, భౌతిక ప్రపంచము నుండి విడిపోవుటకుగల పరిపక్వత రాగానే,స్వస్థానమునకు మరలుటకై ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించును.
344. ఆధ్యాత్మిక మార్గము ఆరుభూమికలతో కూడియున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
24 Oct 2020
No comments:
Post a Comment