శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 50, 51 / Sri Lalitha Chaitanya Vijnanam - 50, 51

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 29 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 50, 51 / Sri Lalitha Chaitanya Vijnanam - 50, 51 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత

శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ

🌻 50. 'అనవద్యాంగీ' 🌻

శ్రీదేవి నింద్యములు కాని మంచి లక్షణములతో కూడిన అంగములు కలదని అర్థము. ఆమె రూపము మొత్తము అన్ని అవయవములతో కూడి సలక్షణములు అని తెలియవలెను. దోష రహితములు అని తెలియవలెను. సౌందర్య నిధానములు అని తెలియవలెను.

సృష్టి యందలి అందమంతయు శ్రీదేవిగా దర్శించవలెను. అందమును ఆరాధనము చేయుటవలన ఉపాసకుని యందు కాలుష్యము తగ్గును. చైతన్యము ఉబుకును. పొంగిన చైతన్యము ముఖమునందు, పాదముల యందు, హస్తముల యందు, ప్రత్యేకించి దరహాసము నందు, చూపులయందు గోచరించును. శ్రీదేవి ఉపాసకుడు దేవీ సౌందర్యముతో కళకళలాడుచుండును. అతని కన్నులు చూపరులను ఆకర్షించును. అతని నవ్వు, మాట ఎదుటివారిని ముగ్ధులను చేయును.

అతని పాదములు, హస్తములు కోమలముగ నుండును. గులాబీవర్ణముతో అందముగ నుండును. సుకుమారముగ నుండును. అతని దేహచ్ఛాయ క్రమశః పెరిగి నిమ్మపండు ఛాయవలె కాంతివంతముగ నుండును. అతడు అన్ని విధముల సుకుమారుడిగ దీప్తించును. అతడు దేవి పుత్రుడుగ జీవించును.

కేవలము శ్రీదేవియే ఉపాసకుని రూపముగ నున్నదని తెలియవలెను. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. అట్టి దివ్యమూర్తులు. వారు వివరణము త్రిమూర్త్యాత్మకము అయిన అమ్మరూపమే. అందము నారాధించుటలో

ఇట్టి వైభవమున్నది.

అందమును చూచి ఆరాధించకపోగ కామించుట దౌర్భాగ్యము, పతన కారణము. ధర్మవిరుద్ధమగు కామము అందము ఎడల కలిగినచో, అది అత్యంత అశుభవాసన. దానియందు ప్రేరణ కలిగినచో పతనము తథ్యము. తాను పతనము చెందుటయేకాక తాను కారణముగ తన వారందరు పతనము చెందుదురు.

సంతతి పతనము చెందును. తాను కులనాశకుడుగ శాశ్వత అపఖ్యాతి పొందును. రావణుని కథ ఇదియే. అందమును, అందును అందమగు కులస్త్రీని అవమానించుట కూడా పై విపత్తునకు కారణము. దుర్యోధనునకు, అతని అనుయాయులకు సర్వభ్రష్టత్వము స్త్రీ నవమానించుట వలననే.

అందము ఆరాధన అంశము. దానియందు కామము గాని, ద్వేషముగాని కలిగినవాడు దుఃఖపడును. అవమానించినవాడు భంగపడును. ఆరాధించినవాడు సుఖపడును. సంపదను పొందును. కీర్తి యశస్సును పొందును. సకల శ్రేయస్సును పొందును. పై కారణముగనే దాదాపు 38 నామములు అమ్మవారి అందమును గూర్చిన ఆరాధన నీయబడినవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 50  🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 50. Anavadyāṅgī अनवद्याङ्गी (50) 🌻

Every part of Her body is flawless and in accordance with samudrikā lakśana or śāstra.

She is nirguṇa Brahman (without attributes) as well as saguṇa Brahman (with attributes).

When She is known as saguṇa Brahman She is with form and attributes. Saguṇa Brahman is discussed here. Brahman is always flawless.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 51 / Sri Lalitha Chaitanya Vijnanam - 51 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 😘

21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత

శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ

🌻 51. 'సర్వాభరణభూషితా' 🌻

శిరస్సు నుండి పాదముల వ్రేళ్ళ వరకు ఆభరణములచే అలంకరింపబడినది, ఆభరణములను ధరించినది అని భావము. శ్రీదేవి కాంతియే మూల పదార్థముగ స్త్రీ రూపమును ఊహించినచో సమస్త అంగములు కాంతిమయములుగ గోచరించి ఆభరణములు ధరించినదిగ అగుపించును.

శ్రీదేవి అనుగ్రహము పొందిన సిద్ధజీవులకే అట్టి కాంతి యుండును. ఇక శ్రీదేవిని గూర్చి చెప్పనేల. ఉదాహరణకు సిద్ధుడు, చిరంజీవియగు హనుమంతుని దేహము బంగారు వర్ణముతో దగదగ మెరయుచుండును. ఆ బంగారపుకాంతి అతని సహజ చైతన్య స్థితి. అతని కన్నులు మణిమయ కాంతులను వెదజల్లుచుండును.

ఇట్లు దివ్యానుగ్రహము పొందినవారందరు సహజ ఆభరణ భూషితులుగ గోచరింతురు. లలితా దేవి విషయమున ఇక చెప్పవలసిన దేమున్నది? ఆమె విశ్వశాంతి, విశ్వ చైతన్యము. ఆమె రూపాత్మిక అయినప్పుడు సర్వాంగములు ఆభరణములు ధరించినట్లు కాంతులు విరజిమ్ము చుండును.

దివ్యమంగళరూపులకు ఆభరణములు అలంకారప్రాయము కావు. వారి అంగ సౌష్ఠవము కాంతి ఆభరణములకే శోభ కూర్చును. అమ్మ సహజ కాంతిని దర్శించు ప్రయత్నము, భక్తులు ఆమెను నలుబది నాలుగు ఆభరణములతో అలంకరింతురు. క్రమశః ఆమె సహజ కాంతిని దర్శింతురు.

అమ్మ తన కాంతితో ఏడు లోకములను ధరించును. స్థితి భేదమును బట్టి ఒక్కొక్క లోకము ఒక్కొక్క వర్ణముగ గోచరించును. అందుచే ఆమె ధరించినటు వంటి ఆభరణములు ఇంద్రధనుస్సువలె ఏడురంగులు కలిగి యుండును. సప్తలోక సృష్టి ధారణమే అమ్మ ఆభరణములు ధరించినట్లుగ తెలియబడుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 51 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 51. Sarvābharaṇa-bhūṣitā सर्वाभरण-भूषिता (51) 🌻

She is adorned with all types of ornaments. The Kālika Purāṇa mentions forty types of ornaments.

Parasurāma Kalpa Sūtra, one of the authoritative texts on Śrī Cakra pūja (ritual worship) mentions more number of ornaments that adorn Her. The nāma 140 in Lalitā Triśatī conveys the same meaning.

Though many believe that the description of her physical form ends with this nāma, some scholars are of the opinion that physical description ends with nāma 55 only. However 48 to 51 describe Her form of prakāśa and vimarśa combine.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹




Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹

https://t.me/srilalithadevi


Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



24 Oct 2020

No comments:

Post a Comment