శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 43 / Sri Devi Mahatyam - Durga Saptasati - 43


🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 43 / Sri Devi Mahatyam - Durga Saptasati - 43 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 12

🌻. ఫలశ్రుతి - 1
🌻

1–2. దేవి పలికెను : ఎవడు ఎల్లప్పుడు స్థిర బుద్ధితో ఈ స్తోత్రాల మూలంతో నన్ను స్తుతిస్తాడో వాని సర్వబాధలను నేను నిస్సంశయంగా తీరుస్తాను.

3-5. అలాగే మధుకైటభ నాశనం, మహిషాసుర సంహారం, శుంభ నిశుంభ వధ ఎవరు స్తుతింతురో; అష్టమీ, చతుర్దశీ, నవమీ తిథులనాడు భక్తితో నా మాహాత్మ్యాన్ని గూర్చిన ఈ ఉత్తమ గ్రంథాన్ని, ఏకాగ్రబుద్ధితో ఎవరు వింటారో, అటువంటి వారికి ఏ కొద్దిపాటి పాపం గాని, దానివల్ల కలిగే కీడుగాని, సంభవించవు; దారిద్ర్యం గాని, ఇష్ట జనులతో వియోగం గాని సంభవించవు.

6. శత్రువుల వల్ల, చోరుల వల, రాజుల వల్ల, ఆయుధాల వల, అగ్ని వల్ల, నీటి వెల్లువల వల్ల భయం సంభవించదు.

7. కాబట్టి ఈ నా మాహాత్మ్యం ఏకాగ్రబుద్ధి గలవారు పఠించాలి. ఎల్లప్పుడు భక్తితో వినాలి. శుభానికి ఇది శ్రేష్ఠతమమైన మార్గం.

8. ఈ నా మాహాత్మ్యం మహామారి వల్ల కలిగే అపాయాలైన అంటువ్యాధులన్నింటిని, మూడువిధాలైన ఉత్పాతాలను శమింపజేస్తుంది.

9. ఇది సక్రమంగా ప్రతిదినం పఠించబడే నా ఆలయం నేను ఎన్నడూ వీడి ఉండను. అచట నా ఉనికి సుస్థిరమై ఉంటుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 43 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 12

🌻 Eulogy of the Merits - 1 🌻


The Devi said:

1-2. ‘And whoever with a concentrated mind shall pray to me constantly with these, hymns, I shall without doubt put down every trouble of his.

3. ‘And those who shall laud (the story of) the destruction of Madhu and Kaitabha, the slaughter Nishumbha likewise.

4-5. ‘And those also who shall listen with devotion to this sublime poem on my greatness on the eighth, the fourteenth and on the ninth days of the fortnight with concentrated mind, to them nothing wrong shall happen, nor calamities that arise from wrong doings nor poverty and never separation from beloved ones.

6. ‘He shall not experience fear from enemies, or from robbers and kings, or from weapon, fire and flood.

7. ‘Hence this poem of my greatness must be chanted by men of concentrated minds and listened to always with devotion; for it is the supreme course of well-being.

8. ‘May this poem of my glories quell all epidemic calamities, as also the threefold natural calamities.

9. ‘The place of my sanctuary where this poem is duly chanted everyday, I will never forsake and there my presence is certain.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


24 Nov 2020

No comments:

Post a Comment