🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 58 / Sri Lalitha Sahasra Nama Stotram - 58 🌹
ప్రసాద్ భరద్వాజ🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 107, 108 / Sri Lalitha Chaitanya Vijnanam - 107, 108 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖
🌻 107. 'తటిల్లతా సమరుచి', 🌻
మెఱపుతీగతో సమానమైన కాంతిగలది శ్రీదేవి అని అర్థము.
మెఱపుతీగల కాంతి క్షణముకన్న దర్శించుటకు వీలుపడదు. అదియును అత్యంత దూరముగ మెఱసినపుడే క్షణకాలము చూడనగును. అట్టి కాంతితో కూడిన శ్రీదేవిని చర్మచక్షువులతో చూడలేము. మహాత్ముల దర్శనమే చర్మచక్షువులకు దుర్లభము. ఒకవేళ అగుపించినను ఆ క్షణముననే కన్నులు గ్రుడ్డి వగును. అంతః చక్షువులను సాధనా మార్గమున పొందినవారు మహాత్ముల దర్శనము చేయవచ్చు నేమోకాని శ్రీదేవి దర్శనమును చేయజాలరు. ఆమె కాంతి నిరుపమానము.
సృష్టి యందలి ఏ కాంతియైనను ఆమె కాంతిలోని మచ్చుతునకయే. సమస్త దేవతా శక్తులు త్రిమూర్తి సహితముగ ఒక కాంతి నూహించినచో అది అమ్మకాంతికి సమానము ఆమె కాంతిపుంజమే విద్యుత్తు. మెఱపు వలె ప్రకాశించినపుడు సుదూరముగ చూడవచ్చును. అందులకే అమ్మ దర్శనమునకు ఆరాట పడుటకన్న, ఆమె పాదముల వేలిగోళ్ల కాంతులను ముందు దర్శించుటకు సిద్ధపడవలెను.
కాంతి దర్శనమునకు ముందు దానితో సరిసమానమైన శక్తి గల శబ్దగర్జన యుండును. మెఱుపు మెఱయుటకు ముందు మహత్తర మగు శబ్దము వినిపించును. అటుపైన మెఱుపుతీగ కనిపించును. మెఱపు గర్జనయే గుండె పగిలినట్లుండును. అట్టి సమయమున అమ్మ కనిపించుటకు ముందు ఎట్టి గర్జన యుండవలెను? అమ్మ కనిపించుటకు ముందు వెలువడు గర్జనయే ఆమె సింహము యొక్క గర్జన.
అమ్మతత్త్వము ఈ భూమిపై 'శైలపుత్రి' రూపమున హిమాలయములలో సంచరించు చుండునట. ఆమె సింహవాహిని యట. ఆమె దర్శనమునకు ముందు మహాత్ములకు సైతము గుండె లదరునట్లు సింహ గర్జనము వినపడి సింహము కనపడునట. అపుడు మహాత్ములు అప్రమత్తులై చేతులు జోడించి, కన్నులు మూసుకొని వారి కేంద్రమున గల మూడవ కన్ను నుండి అమ్మను దర్శించి అమ్మ భాషణమును, ఆదేశమును వినుదురట. విద్యుల్లత వలె మెఱపుతో గూడిన అమ్మ దర్శనము, భాషణము, స్పర్శనము చేయుట యనగా విద్యుత్తును స్పర్శించుటయే. విద్యుత్ సమానమైన కాంతి కలవారే విద్యుత్ స్పర్శనము చేయగలరు.
అట్టి కాంతి దర్శనముతో ఎంతటి అజ్ఞానమైనను నశించునని తెలుపుటలో ఆశ్చర్య మేమున్నది. అది అతిశయోక్తి కానేకాదు. అమ్మ కాంతిని గూర్చి భావన చేయుటయే ఈ నామము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అమ్మ కాంతి నూహింపుడు, భావింపుడు, శక్తికొలది మీ యందు దర్శింపుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 107 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Taḍillatā -samaruciḥ तडिल्लता-समरुचिः (107) 🌻
She shines like a line of lightning. In the advanced stage of Kuṇḍalinī meditation, one can realize the entire spinal cord glowing like a flash of lightning. Till this nāma, this kind of epithet was not used, but used here for the first time as She is now with Her spouse. She shines like a lightning when She is with Śiva.
There are instances of comparing the Brahman to lightning. Kena Upaniṣad (IV.4) explains Brahman beautifully. It says “It is like a flash of lightning…Just as lightning comes in a flash and removes darkness; Self realization dawns in a fraction of a second and removes the darkness of ignorance”. Mahā Nārāyana Upaniṣad (XIII.11) (Nārāyaṇa sūkta) says vidyallokhā meaning flash of light.
Therefore it is apparent that Lalitāmbikā is referred to as the Brahman in this nāma. This nāma fortifies the argument that both Śiva and Śaktī are the Brahman. Śiva is the nirguṇa Brahman and Śaktī is saguṇa Brahman (nirguṇa means without attributes and saguṇa means with attributes). Śaktī attains potency only if She remains with Śiva.
Śiva also becomes inert without Śaktī. This argument is strengthened by this nāma as She is compared to lightning only during Her union with Śiva.
Some texts use Taṭillatā instead of Taḍillatā. However this difference does not alter the meaning.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 108 / Sri Lalitha Chaitanya Vijnanam - 108 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖
🌻 108. 'షట్చక్రోపరి సంస్థితా' 🌻
ఆరు చక్రముల ఉపరితలమున సహస్రార పద్మమందు, సమ్యక్
స్థిత అయినది శ్రీదేవి యని అర్థము.
శ్రీదేవి స్వస్థానము సహస్రార పద్మమని తెలుపబడినది. ఆమె సహస్రార పద్మము నధిష్ఠించి మెఱపువలె మెరయుచుండగ ఆ కాంతియే ఆరు చక్రములందు అవరోహణ క్రమమున అవతరించును. ఆమె ననుసరించియే తెలివి, ప్రాణము వర్షించును. ఆ కాంతియే జీవుల అస్థిత్వము. అస్థిత్వము, తెలివి, ప్రాణము అను మూడు అంశలతో కూడిన శ్రీదేవి తత్త్వము సుషుమ్న నాడియందు సరస్వతీ నదివలె ప్రవహించు చుండును. ఆ ప్రవాహమున ఏర్పడు ఘట్టములు సృష్టియందు, మానవుని యందు లోకములుగ ఏర్పడును.
అవరోహణ క్రమమున పదార్థము సూక్ష్మతమము నుండి, సూక్ష్మతరము, సూక్ష్మము, స్థూలము అగుచుండగ అస్థిత్వ జ్ఞానము, ప్రాణము, తెలివి సన్న గిల్లుచుండును. ఇందు ఒక్కొక్క ఘట్టమునందు దేవి అంశలుగ జ్వాలామాలిని, మంత్రిణి, వారాహి, శ్యామల, బాల ఇత్యాది దర్శనము లగుచుండును. దేవి పరిపూర్ణ దర్శనము మాత్రము సహస్రారము నందే జరుగ గలదు. ప్రాథమికముగ జరుగు దర్శనములు సాధకులకు రుచి కల్పించి ప్రోత్సహించును.
శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర చిత్తముతో ఆరాధించువారికి లోన నిర్మలత్వము పెరిగి, దర్శనకాంతి పెరుగుచుండును. శ్రీదేవి అన్ని కాంతులయందు క్రమముగ దర్శన మిచ్చుచుండును. నలుపు నుండి వజ్రకాంతి వరకు గల సమస్తమగు వర్ణముల కాంతి అమ్మ నుండి ఉద్భవించినవే. అట్టి దర్శనము జీవులకు సర్వ శుభంకరము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 108 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Ṣaṭcakropari-samsthitā षट्चक्रोपरि-सम्स्थिता (108) 🌻
She is above the six cakra-s starting from mūlādhāra to ājñā cakra-s. She is now at sahasrāra, which is not a cakra. As sahasrāra is above the six cakra-s, hence this nāma.
There is another interpretation possible. It has been seen earlier, that She is the Brahman when united with Śiva. To realise the Brahman in sahasrāra, one has to cross the lower cakra-s, all of which are associated with worldly acts.
Sahasrāra is above the worldly acts. That is why She is said to be above these six cakra-s, meaning that the Brahman is above the six cakra-s.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Nov 2020
No comments:
Post a Comment