శివగీత - 122 / The Siva-Gita - 122


🌹. శివగీత - 122 / The Siva-Gita - 122 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 16

🌻. మొక్షాదికారి నిరూపణము - 3 🌻


విప్రస్యాను పనీతస్య - విదిరేవ ముదా హృతః ,

నాభి వ్యాహార యేద్బ్రహ్మ - స్వదానిన యనాదృతే 11


సశూద్రేణ సమస్తావ - ద్వావ ద్వేదాన్న జాయతే,

నామ సంకీర్తనే ధ్యానే - సర్వ ఏనాది కారిణః 12


సంసారా న్యుచ్యతే జంతు - శ్శివ తాదాత్మ భావనాత్,

తధా దానం తపో వేదా - ధ్యయనం చాన్య కర్మవా 13


సహస్రాంశం తు నార్హంతి -సర్వదా ధ్యాన కర్మణః,

జాతిమాశ్రమం గాని - దేశం కాల మదా పివా 14


అసనాదీని కర్మాణి - ధ్యానం నాపేక్షతే క్వచిత్,

గచ్చం స్తిష్టం శ్చర న్వాపి - శయానో వాన్య కర్మణి. 15


అనుపవీత బ్రాహ్మణునికి ఇట్లు చెప్పబడినది : స్వధా దానాది పితృకార యముల దప్ప ఇతర సమయములో వేదము నుచ్చరింప నీయ కూడదు.

వేద కర్మ వలన జన్మ లేని వరకు నా బ్రాహ్మణుడు శూద్రునితో సమానుడు. నామ సంకీర్తనము వలన ధ్యానము వలనను సమస్త జనులకు నధికార ముండును.

శివతాదాత్మ్య భావన వలన నరుడు సంసారము నుండి ముక్తుడగును. కుక ధ్యానము కంటే దాన -తపో – వేదధ్యయనములు వేయిరెట్లు తక్కువనుట,

జాతియాశ్రమము, యమని యమా ద్యష్టాంగములు, దేశము కాలము, ఆసనము కర్మలు మొదలగు వానిని ధ్యానమపేక్షించదు (వాటితో ధ్యానము చేయువాని కనవసరములు ) నడచుచు, నిలుచుచు, పోవుచు, శయనించుచు వేరు పని యందుండి యు పాపముతో (మైలతో ) కూడిన వాడైనను ధ్యానము చేయుట వలన సంసార బంధము నుండి ముక్తుడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 122 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 16

🌻 Mokshadhikari Nirupanam - 3 🌻

A Brahmana whose Upanayanam ritual is not performed (who doesn't have a sacred thread on his body), he should not be allowed to chant vedas in any rituals except for the Swadha, Daana, and Pitrukaryam kind of rituals. Devoid of Vedic Karmas such a Brahmana is equivalent to a Shudra.

Every class of people (from all castes and creeds) have rights on doing Nama sankeertanam (chanting), and Dhyanam (meditation). By connecting oneself with Shiva through meditation, the human gets liberated from the samsaara.

Therefore, danam (donations), tapas (penance), Vedadhyayanam (studying vedas) are thousand times inferior that Dhyana (meditation). One who meditates (on Shiva) while walking, standing, sleeping, or doing any work, even while indulging in sinful activities, he becomes ferried from the bondages of the samsaara.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


24 Nov 2020

No comments:

Post a Comment