🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కణ్వమహర్షి - 3 🌻
14. భారతదేశంలో అనేక స్మృతులు, అనేక వేదశాఖలు ఉండేవి. వాటిలో చాలావరకు నశించాయి. అధర్వణజాతి ఎంతో ఉండేది కాశ్మీరులో. అయితే కాశ్మీరు ఇప్పుడు భారతదేసంలోనిదేనా అని సందేహపడే పరిస్థితి వచ్చింది. ఏమయిపోయింది మన సంస్కృతి!
15. కాశ్మీరులో ఈనాడు అన్నీ మనం చూడగలమా? అక్కడ ఇప్పుడు హిందూమతమే లేదు. ఇక స్మృతులు ఎక్కడున్నాయి? వేదాలెక్కడున్నయి? ఏ శాఖలెక్కడున్నాయి? ఎక్కడా కనబడటంలేదు. ఆనవాలుకూడా లేదు అక్కడ. శివసూత్రములలో అక్కడ దొరికిన సూత్రములు కొన్ని ఉన్నాయి. లల్లాదేవి అనేటటువంటి ఒక శివయోగిని శివధర్మములు, సూత్రములు చెప్పింది.
16. అవన్నీ ఒక గ్రంధరూపంలో ఉంది కాశ్మీరీభాషలో శారదా లిపిలో ఆ గ్రంథం ఒకటి ఉంది. శివయోగాన్ని గురించి ఎన్నోఅద్భుతాలను ఆవిడ చెప్పింది. శివయోగములు, పతంజలియోగము, ఇంకా అనేకమయిన మార్గములు సమన్వయపరచి చెప్పిందావిడ. అందులో శివాద్వైతాన్ని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన నిర్గుణమైన బ్రహ్మవస్తువుగా భావించింది.
17. పంచాక్షరీమంత్రమ్యొక్క అర్థం ఏమిటంటే, సృష్తి మొత్తంలో అమంగళకరమయినదంతా తీసేస్తే మంగళప్రదమయిన వస్తువు ఏది ఉందో, దేనివల్ల శాశ్వతమైన సుఖాన్ని బ్రహ్మాదులు కూడా పొందుతారో దాని పేరే ‘శివ’శబ్దం. ఆ ప్రతిపాదన అదే చెబుతోంది. మనస్సులో శివ శబ్దాన్ని ధరించి యోగాన్ని అనుసంధానంచేస్తే మోక్షం కరతలామలకం, అది ఈ జన్మలోనే కలుగుతుంది అని చెప్పింది లల్లాదేవి.
18. శ్రీనగర్ దగ్గర ఒక కొండమీద ఆదిశంకరులవారు తపస్సుచేసారు. ఆ శంకరతీర్థంలోనే ఆయన బోధ చేసాడు. శారదాపీఠం అక్కడే ఉండేది. సరస్వతీపీఠాన్ని అక్కడే అధిరోహించారని, కాశ్మీరులోని శ్రీనగర్‌లోనే సర్వజ్ఞపీఠాన్ని ఆయన అలంకరించారని చెపుతారు. ఆ సర్వజ్ఞపీఠాం ఏమిటో – అది ఎక్కడుండేదో, అక్కడ ఎవరు ఉండేవారో, ఆ పరిషత్తు ఏమిటో ఆ వివరాలేవీ నేడూ మనకు తెలియదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Nov 2020
No comments:
Post a Comment