24-NOVEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 558 / Bhagavad-Gita - 558 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 126, 127 / Vishnu Sahasranama Contemplation - 126, 127🌹
3)🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 43 / Sri Devi Mahatyam - Durga Saptasati - 43🌹 
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 112🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 131🌹
6) 🌹. శివగీత - 122 / The Siva-Gita - 122🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 58 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 106, 107 / Sri Lalita Chaitanya Vijnanam - 106, 107🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 470 / Bhagavad-Gita - 470🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 83 📚
11) 🌹. శివ మహా పురాణము - 281🌹
12) 🌹 Light On The Path - 36🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 168🌹 
14) 🌹 Seeds Of Consciousness - 232 🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 107🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasranama - 71 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 558 / Bhagavad-Gita - 558 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 01 🌴*

01. అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితా: |
తేషాం నిష్టా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమ: ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు ప్రశ్నించెను : ఓ కృష్ణా! శాస్త్రనియమములను పాటింపక తమ మానసిక కల్పనల ననుసరించి పూజలనొనర్చు వారి స్థితి యెట్టిది? వారు సత్త్వగుణులా, రజోగుణులా లేక తమోగుణులా? 

🌷. భాష్యము :
ఏదేని ఒక ప్రత్యేక పూజా విధానమున శ్రద్ధను గూడి నియుక్తుడైనవాడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపబడి పూర్ణశాంతిని, శ్రేయస్సును పొందగలడని భగవద్గీత యందలి చతుర్థాధ్యాయపు ముప్పదితొమ్మిదవ శ్లోకమున తెలుపబడినది. 

ఇక గడచిన షోడశాధ్యాయమున శాస్త్రనియమములను అనుసరింపనివాడు అసురుడనియు, శాస్త్ర నియమములను శ్రద్ధతో పాటించువాడు దైవస్వభావము కలవాడనియు నిర్ణయింపబడినది. అట్టి యెడ మనుజుడు శాస్త్రమునందు తెలుపునటువంటి నియమములను శ్రద్ధతో అనుసరించినచో అతని స్థితి ఏమగును? అది ఎట్టిది? అర్జునుని ఈ సందేహమును శ్రీకృష్ణభగవానుడే తీర్చగలడు. 

ఎవరో ఒక మానవుని భగవానుడని భావించి అతని యందు శ్రద్ధను నిలుపువారలు సత్త్వగుణమునందు పూజించువారలా, రజోగుణమునందు పూజించువారలా లేక తమోగుణమునందు పూజించువారలా? అట్టివారు జీవన పూర్ణత్వస్థితిని పొందగలరా? నిజమైన జ్ఞానమునందు స్థితిని కలిగి తమను తాము అత్యున్నత పూర్ణత్వస్థితికి ఉద్ధరించుకొనుట వారికి సాధ్యమగునా? 

ఈ విధముగా శాస్త్రనియమములను ఏ మాత్రము పాటింపక దేని యందో శ్రద్ధను కలిగి వివిధదేవతలను మరియు మనుష్యులను పూజించువారు తమ యత్నములందు జయమును సాధింపగలరా? ఈ ప్రశ్నలన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని ముందుంచుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 558 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 01 🌴*

01. arjuna uvāca
ye śāstra-vidhim utsṛjya
yajante śraddhayānvitāḥ
teṣāṁ niṣṭhā tu kā kṛṣṇa
sattvam āho rajas tamaḥ

🌷 Translation : 
Arjuna inquired: O Kṛṣṇa, what is the situation of those who do not follow the principles of scripture but worship according to their own imagination? Are they in goodness, in passion or in ignorance?

🌹 Purport :
In the Fourth Chapter, thirty-ninth verse, it is said that a person faithful to a particular type of worship gradually becomes elevated to the stage of knowledge and attains the highest perfectional stage of peace and prosperity. 

In the Sixteenth Chapter, it is concluded that one who does not follow the principles laid down in the scriptures is called an asura, demon, and one who follows the scriptural injunctions faithfully is called a deva, or demigod. Now, if one, with faith, follows some rules which are not mentioned in the scriptural injunctions, what is his position? This doubt of Arjuna’s is to be cleared by Kṛṣṇa. 

Are those who create some sort of God by selecting a human being and placing their faith in him worshiping in goodness, passion or ignorance? Do such persons attain the perfectional stage of life? Is it possible for them to be situated in real knowledge and elevate themselves to the highest perfectional stage? 

Do those who do not follow the rules and regulations of the scriptures but who have faith in something and worship gods and demigods and men attain success in their effort? Arjuna is putting these questions to Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 126, 127 / Vishnu Sahasranama Contemplation - 126, 127 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻126. జనార్దనః, जनार्दनः, Janārdanaḥ🌻*

*ఓం జనార్దనాయ నమః | ॐ जनार्दनाय नमः | OM Janārdanāya namaḥ*

జనాన్ దుష్టానర్దయతి హినస్తి నరకాదికాన్ సంప్రాపయత్యభ్యుదయం నిశ్శ్రేయసమథాపి వా పుమర్థం యాచత ఇతి జనార్ధన ఇతీరితః దుర్జనులను హింసించును; దుర్జనులను నరకాది లోకములకు పోవునట్లు చేయును. పురుషార్థముల కొఱకు అర్థింపబడువాడు కావున ఆతడు జనార్దనుడు.

:: మహాభారతము - ఉద్యోగ పర్వము, సనత్సుజాత పర్వము ::
పుణ్డరీకం పరంధామ నిత్యమ్ అక్షయమ్ అక్షరమ్ ।
తద్భావాత్ పుణ్డరీకాక్షో దస్యు త్రాసాజ్ జనార్దనః ॥ 6 ॥

సర్వోత్కృష్టమూ, శాశ్వతమూ నిత్యమూ అయిన ధామమును పుణ్డరీకమందురు. అట్టి అనశ్వరమైన పుణ్డరీకము గలవాడు గనుక, ఆయన పుణ్డరీకాక్షుడని పిలువ బడుతాడు. అట్టి పుణ్డరీకాక్షుడు దుర్జనుల హృదయముల యందు భయమును కలుగజేయును గనుక, ఆతను జనార్దనుడని పిలువ బడును.

:: పోతన భాగవతము - దశమ స్కందము, పూర్వ భాగము ::
శా.ఏ పుణ్యాతిశయప్రభావముననో యీ జన్మమం దిక్కడన్
నీ పాదంబులఁ గంటి ని న్నేఱిఁగితిన్ నీవుం గృపాళుండవై
నాపై నర్మిలిఁ జేసి మాన్పఁ గదవే నానాధనాగార కాం
తా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణీ.

భక్తులపాలిటి చింతామణివైన శ్రీకృష్ణా! ఏ మహాపుణ్య మహిమవల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ చరణపద్మాలు దర్శించగల్గినాను. నిన్ను తెలుసుకొన గల్గినాను. నీవును దయాస్వభావుడవై నాయెడనున్న ప్రేముడిచే నాకు గృహ విత్త దార సుతాదుల మీది మోహపాశమును తొలగించుము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 126🌹*
📚. Prasad Bharadwaj

*🌻126. Janārdanaḥ🌻*

*OM Janārdanāya namaḥ*

Janān duṣṭānardayati hinasti narakādikān saṃprāpayatyabhyudayaṃ niśśreyasamathāpi vā pumarthaṃ yācata iti janārdhana itīritaḥ / जनान् दुष्टानर्दयति हिनस्ति नरकादिकान् संप्रापयत्यभ्युदयं निश्श्रेयसमथापि वा पुमर्थं याचत इति जनार्धन इतीरितः He who oppresses the evil doers; sends them to hell. He who is sought for salvation or worldly happiness.

Mahābhārata - Book V, Section LXX
Puṇḍarīkaṃ paraṃ dhāma nityam akṣayam akṣaram,
Tadbhāvāt puṇḍarīkākṣo dasyu trāsāj janārdanaḥ. (6)

:: महाभारत - उद्योग पर्व, सनत्सुजात पर्व ::
पुण्डरीकं परं धाम नित्यम् अक्षयम् अक्षरम् ।
तद्भावात् पुण्डरीकाक्षो दस्यु त्रासाज् जनार्दनः ॥ ६ ॥

He is called Puṇḍarīkākṣa from Puṇḍarīka implying his high and eternal abode, and Akṣa implying 'indestructible'; and he is called Janārdana because he strikes fear into the hearts of all wicked beings.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 48
Diṣṭayā janārdana bhavāniha naḥ pratīto
   Yogeśvarairapi durāpagatiḥ sureśaiḥ,
Chindhyāśu naḥ sutakalatradhanāptageha
   Dehādimoharaśanāṃ bhavadīyamāyām. (27)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे अष्टचत्वारिंशोऽध्यायः ::
दिष्टया जनार्दन भवानिह नः प्रतीतो
   योगेश्वरैरपि दुरापगतिः सुरेशैः ।
छिन्ध्याशु नः सुतकलत्रधनाप्तगेह
   देहादिमोहरशनां भवदीयमायाम् ॥ २७ ॥

It is by our great fortune, Janārdana, that You are now visible to us, for even the masters of yoga and the foremost gods can achieve this goal only with great difficulty. Please quickly cut the ropes of our illusory attachment for children, wife, wealth, influential friends, home and body. All such attachment is simply the effect of Your illusory material energy.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 127 / Vishnu Sahasranama Contemplation - 127🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻127. వేదః, वेदः, Vedaḥ🌻*

*ఓం వేదాయ నమః | ॐ वेदाय नमः | OM Vedāya namaḥ*

వేదో వేదస్వరూపత్వా ద్వేత్తి వేదయతీతి వా వేదరూపుడు లేదా తనకు ఎవరిపై అనుగ్రహము కలుగునో వారికి స్వస్వరూప జ్ఞానము కలిగించును.

:: భగవద్గీత - విభూతి యోగము ::
తేషామేవానుకమ్పార్థ మహమజ్ఞానజం తమః ।
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ॥ 11 ॥

భక్తులకు దయజూపుట కొఱకు నేనే వారి అంతఃకరణమునందు నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపముచేత, అజ్ఞానజన్యమగు అంధకారమును నశింపజేయుచున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 127🌹*
📚. Prasad Bharadwaj

*🌻127.Vedaḥ🌻*

*OM Vedāya namaḥ*

Vedo vedasvarūpatvā dvetti vedayatīti vā / वेदो वेदस्वरूपत्वा द्वेत्ति वेदयतीति वा He who is the form of Veda or one who bestows Jñāna i.e., knowledge on the Jīvās.

Bhagavad Gītā - Chapter 10
Teṣāmevānukampārtha mahamajñānajaṃ tamaḥ,
Nāśayāmyātmabhāvastho jñānadīpena bhāsvatā. (11)

:: श्रीमद्भगवद्गीता - विभूति योग ::
तेषामेवानुकम्पार्थ महमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥ ११ ॥

Out of compassion for them alone, I, residing in their hearts, destroy the darkness born of ignorance with the luminous lamp of Knowledge.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः ।वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥

సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః ।వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥

Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ ।Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 43 / Sri Devi Mahatyam - Durga Saptasati - 43 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 12*
*🌻. ఫలశ్రుతి - 1 🌻*

1–2. దేవి పలికెను : ఎవడు ఎల్లప్పుడు స్థిర బుద్ధితో ఈ స్తోత్రాల మూలంతో నన్ను స్తుతిస్తాడో వాని సర్వబాధలను నేను నిస్సంశయంగా తీరుస్తాను. 

3-5. అలాగే మధుకైటభ నాశనం, మహిషాసుర సంహారం, శుంభ నిశుంభ వధ ఎవరు స్తుతింతురో; అష్టమీ, చతుర్దశీ, నవమీ తిథులనాడు భక్తితో నా మాహాత్మ్యాన్ని గూర్చిన ఈ ఉత్తమ గ్రంథాన్ని, ఏకాగ్రబుద్ధితో ఎవరు వింటారో, అటువంటి వారికి ఏ కొద్దిపాటి పాపం గాని, దానివల్ల కలిగే కీడుగాని, సంభవించవు; దారిద్ర్యం గాని, ఇష్ట జనులతో వియోగం గాని సంభవించవు.

6. శత్రువుల వల్ల, చోరుల వల, రాజుల వల్ల, ఆయుధాల వల, అగ్ని వల్ల, నీటి వెల్లువల వల్ల భయం సంభవించదు. 

7. కాబట్టి ఈ నా మాహాత్మ్యం ఏకాగ్రబుద్ధి గలవారు పఠించాలి. ఎల్లప్పుడు భక్తితో వినాలి. శుభానికి ఇది శ్రేష్ఠతమమైన మార్గం.

8. ఈ నా మాహాత్మ్యం మహామారి వల్ల కలిగే అపాయాలైన అంటువ్యాధులన్నింటిని, మూడువిధాలైన ఉత్పాతాలను శమింపజేస్తుంది.

9. ఇది సక్రమంగా ప్రతిదినం పఠించబడే నా ఆలయం నేను ఎన్నడూ వీడి ఉండను. అచట నా ఉనికి సుస్థిరమై ఉంటుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 43 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 12* 
*🌻 Eulogy of the Merits - 1 🌻*

 The Devi said:

1-2. ‘And whoever with a concentrated mind shall pray to me constantly with these, hymns, I shall without doubt put down every trouble of his.

3. ‘And those who shall laud (the story of) the destruction of Madhu and Kaitabha, the slaughter Nishumbha likewise.

4-5. ‘And those also who shall listen with devotion to this sublime poem on my greatness on the eighth, the fourteenth and on the ninth days of the fortnight with concentrated mind, to them nothing wrong shall happen, nor calamities that arise from wrong doings nor poverty and never separation from beloved ones.

6. ‘He shall not experience fear from enemies, or from robbers and kings, or from weapon, fire and flood.

7. ‘Hence this poem of my greatness must be chanted by men of concentrated minds and listened to always with devotion; for it is the supreme course of well-being.

8. ‘May this poem of my glories quell all epidemic calamities, as also the threefold natural calamities.

9. ‘The place of my sanctuary where this poem is duly chanted everyday, I will never forsake and there my presence is certain. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 111 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -41 🌻*

ఎందుకంటే అవతార్ మెహెర్ బాబా ఏమంటున్నారు? నీవు నాలుగు దివ్యయానాల ద్వారా పరిణామం చెందాలి అంటున్నాడు. నీవు మానవుడు అవడం ద్వారా, ఒకటవ దివ్యయానం పూర్తి అయ్యింది. 

మనవోపాధిని ధరించడం ద్వారా రెండవ దివ్యయానంలో ప్రవేశించి, ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గం లోకి ప్రయాణం చేసి నిర్వాణ స్థితిని అనుభవిస్తారో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు రెండవ దివ్యయానం పూర్తి చేసినట్లు అన్నమాట. వాళ్ళు బ్రహ్మానుసంధానానికి అర్హులు. బ్రహ్మ నిష్ఠ కు అర్హులు. ఆ బ్రహ్మ నిష్ఠ పొందడం ద్వారా తృతీయ దివ్యయానాన్ని పూర్తి చేస్తారు. తద్వారా జీవన్ముక్తులు అవుతారు. 

ఆ స్థితి నుంచి చిట్టచివరిదైనటువంటి చతుర్ధ దివ్యయానం జన్మరాహిత్య స్థితికి దేశికేంద్రుల యొక్క కృప చేత చిట్టచివరిదైనటువంటి బట్టబయలు స్థితికి చేరుతారు. ఈ రకంగా నాలుగు దివ్యయానాలు పూర్తి చేయాలి మానవుడు. అట్లా పూర్తి చేసినవాడే జన్మ రాహిత్య స్థితికి చేరుతాడు.

        మరి శ్రవణ, మనన నిధి ధ్యాసలు ఒకదాని యందు ఒకటి అంతర్భూతములై వున్నవి కదా! ఒక దాని మీద ఒకటి ఆధారపడి వున్నాయి కదా! ఈ శ్రవణం అన్నది చతుర్విధ శుశ్రూషలలో భాగం కదా! 

మనన నిధి ధ్యాసలు ఇంకా అంతకంటే చాలా ముఖ్యమైనవి కదా! ఇట్లా ఒకదాని పరిణామ ఫలముగా మరొకటి లభిస్తున్నది. శ్రవణం బాగా చేసినటువంటి వాడికి మననం బాగా తొందరగా కుదురుతుంది. మననం బాగా స్థిరమైనటువంటి బుద్ధితో చేసినటువంటి వాడికి నిధి తొందరగా లభిస్తుంది. ఆ నిధి స్థితిలో సహజంగా ఉన్నటువంటి వాడు సమాధి నిష్ఠలో తొందరగా చేరగలుగుతాడు. 

అప్పుడు 24 గంటలూ ఇంద్రియములు ఒకవేళ బయటకు బహిర్ముఖములై వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క అంతర్ముఖమైనటు వంటి మనో బుద్ధులు మాత్రము సదా ఆత్మ నిష్ఠలోనే వుంటాయి. వాడికి మనో బుద్ధులు బయటకు రావు. ఇంద్రియములు విడిపోతాయి అప్పుడు. గోళకములు విడిపోతాయి అప్పుడు. అవి బయటకు బహిర్ముఖముగా వ్యవహరిస్తూ ఉండవు.

        సామాన్య వ్యవహారం చేస్తూ వుంటాడు. కానీ చేశాడనేటటువంటి జ్ఞప్తిలో లేకుండా చేస్తాడు. ఆ జ్ఞానం లేకుండా చేస్తాడు. అంటకుండా చేస్తాడు. సాక్షిగా వుండి చేస్తాడు. స్థిరంగా వుండి చేస్తాడు. అసలు మనోబుద్ధులు వాడికి తోచనే తోచవు. గుణత్రయాలు తోచనే తోచవు. ‘ఉన్నాడు అంటే ఉన్నాడు’ అంతే లేక్కేసుకోవడానికి. 

వాస్తవానికి సామాజికంగా లెక్కేస్తే, కుటుంబంగా లెక్కేస్తే, సంసారంలో లెక్కేస్తే వాడిని ఒక శాల్తీ క్రింద లేక్కేయాలే తప్ప వాడి వల్ల ఏమి ప్రయోజనం లేదు. ఎందుకని అంటే వ్యవహారశీలి కాదు. కాని సమాధి నిష్టలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటాడు. మరి ఇప్పుడు వాడిని పరిగణ లోనుంచి తీసేద్దామా? ఎందుకని అంటే మానవ జన్మ ధన్యత చెందాలి అంటే వాడిలాగానే అవ్వాలి. 

జగత్తంత నిత్య వ్యవహార శీలి అయిపోయి వ్యవహారంలో బలవత్తరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటివాడు మరి జనన మరణ చక్రంలో పడిపోతున్నాడుగా! కర్మబంధంలో పడిపోతున్నాడు గా! కర్మ బంధం తొలగాలి అంటే నిధి ధ్యాసలు చాలా అవసరం కదా మరి! అ కర్మ బంధం తొలగదు కదా లేకపోతె! కర్మలు రద్దు కావు కదా! 

కాబట్టి శ్రవణ మననాలకంటే నిధిధ్యాసలకు చాల విలువ ఉంది. జ్ఞానాగ్నిని రగిలింప చేయగలిగేటటు వంటి శక్తి నిధి ధ్యాసలకు వుంది. శ్రవణ మననాదులు బాహ్య సాధనాలు. నిధి ధ్యాసలు ఆంతరిక సాధనాలు. మనో బుద్ధులవరకే పని చేస్తాయి శ్రవణ మననాలు. దాని అవతల అంతా నిధి ధ్యాసలె ఉన్నది. 

మహాత్తత్వాన్ని అవ్యక్తాన్ని ప్రత్యగాత్మ స్థితులకు చిట్ట చివరి స్థితులకు చేరాలి అంటే మరి నీవు ఆ స్థితిలో వుండాలిగా! నిధి ధ్యాసలు లేకుండా వాటిని ఎవరు సాధించలేరు. సాక్షిత్వాన్ని సాధించలేరు. కాబట్టి లక్ష్య సిద్ధి కొరకు నాలుగు అవసరమే. ఈ స్థితిలో ఏది వాడాలో తెలుసుకొని వాడాలి. - విద్యా సాగర్ స్వామి  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 132 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
124

The Guru is not bound by any rules. However, there are hidden meanings behind the footwear and robes he adorns. We should observe carefully. 

For instance, ochre robes indicate sacrifice and righteousness. The white flowers symbolize the fragrance and beauty of dharma combined with truth. The white sandalwood paste shows the state that’s beyond the dualities of passion and hatred. 

The necklace of pearls indicates that he is beyond all planetary effects. If he is completely adorned in white, it means he is imparting knowledge. The greatness of the Guru is clearly described again in the next two slokas. 

Sloka:
Yasmin srsti sthiti dhwamsa nigrahanugrahatmakam |Krtyam pancavidham sasvat bhasate tam gurum bhajet ||

The Guru who shines with the power of creation, preservation and destruction restraint and grace should be served.

Sloka:
Na guroradhikam na guroradhikam na guroradhikam na guroradhikam |Siva sasanatah siva sasanatah siva sasanatah siva sasanatah ||

There is no one superior to a Guru. This is the ruling of Lord Siva himself. Until now, we’ve been initiated into the path of meditating on the Guru. Now, we will be initiated into the path of worshiping the Guru through Jnana (knowledge) Yoga.

Sloka:
Jneyam sarvam vilapyeta visuddha jnana yogatah |Jnatrtva mapi cinmatre nanyah pantha dvitiyakah ||

All that reveals itself (Jneyam) should be burnt with the purified Jnana Yoga. Finally, the “Jnatrtvam” also should be burnt. There is no way other than this. “Jnatrtvam” is the ego that leads one to believe “I am the one gaining knowledge”. 

The paths of worship also vary depending on the differences between the practicants and their eligibility.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 122 / The Siva-Gita - 122 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 16
*🌻. మొక్షాదికారి నిరూపణము - 3 🌻*

విప్రస్యాను పనీతస్య - విదిరేవ ముదా హృతః ,
నాభి వ్యాహార యేద్బ్రహ్మ - స్వదానిన యనాదృతే 11
సశూద్రేణ సమస్తావ - ద్వావ ద్వేదాన్న జాయతే,
నామ సంకీర్తనే ధ్యానే - సర్వ ఏనాది కారిణః 12
సంసారా న్యుచ్యతే జంతు - శ్శివ తాదాత్మ భావనాత్,
తధా దానం తపో వేదా - ధ్యయనం చాన్య కర్మవా 13
సహస్రాంశం తు నార్హంతి -సర్వదా ధ్యాన కర్మణః,
జాతిమాశ్రమం గాని - దేశం కాల మదా పివా 14
అసనాదీని కర్మాణి - ధ్యానం నాపేక్షతే క్వచిత్,
గచ్చం స్తిష్టం శ్చర న్వాపి - శయానో వాన్య కర్మణి. 15

అనుపవీత బ్రాహ్మణునికి ఇట్లు చెప్పబడినది : స్వధా దానాది పితృకార యముల దప్ప ఇతర సమయములో వేదము నుచ్చరింప నీయ కూడదు.

 వేద కర్మ వలన జన్మ లేని వరకు నా బ్రాహ్మణుడు శూద్రునితో సమానుడు. నామ సంకీర్తనము వలన ధ్యానము వలనను సమస్త జనులకు నధికార ముండును. 

శివతాదాత్మ్య భావన వలన నరుడు సంసారము నుండి ముక్తుడగును. కుక ధ్యానము కంటే దాన -తపో – వేదధ్యయనములు వేయిరెట్లు తక్కువనుట,

జాతియాశ్రమము, యమని యమా ద్యష్టాంగములు, దేశము కాలము, ఆసనము కర్మలు మొదలగు వానిని ధ్యానమపేక్షించదు (వాటితో ధ్యానము చేయువాని కనవసరములు ) నడచుచు, నిలుచుచు, పోవుచు, శయనించుచు వేరు పని యందుండి యు పాపముతో (మైలతో ) కూడిన వాడైనను ధ్యానము చేయుట వలన సంసార బంధము నుండి ముక్తుడగును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 122 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 16
*🌻 Mokshadhikari Nirupanam - 3 🌻*

A Brahmana whose Upanayanam ritual is not performed (who doesn't have a sacred thread on his body), he should not be allowed to chant vedas in any rituals except for the Swadha, Daana, and Pitrukaryam kind of rituals. Devoid of Vedic Karmas such a Brahmana is equivalent to a Shudra. 

Every class of people (from all castes and creeds) have rights on doing Nama sankeertanam (chanting), and Dhyanam (meditation). By connecting oneself with Shiva through meditation, the human gets liberated from the samsaara. 

Therefore, danam (donations), tapas (penance), Vedadhyayanam (studying vedas) are thousand times inferior that Dhyana (meditation). One who meditates (on Shiva) while walking, standing, sleeping, or doing any work, even while indulging in sinful activities, he becomes ferried from the bondages of the samsaara.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 58 / Sri Lalitha Sahasra Nama Stotram - 58 🌹*
*ప్రసాద్ భరద్వాజ*


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 107, 108 / Sri Lalitha Chaitanya Vijnanam - 107, 108 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |*
*మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖*

*🌻 107. 'తటిల్లతా సమరుచి', 🌻*

మెఱపుతీగతో సమానమైన కాంతిగలది శ్రీదేవి అని అర్థము.

మెఱపుతీగల కాంతి క్షణముకన్న దర్శించుటకు వీలుపడదు. అదియును అత్యంత దూరముగ మెఱసినపుడే క్షణకాలము చూడనగును. అట్టి కాంతితో కూడిన శ్రీదేవిని చర్మచక్షువులతో చూడలేము. మహాత్ముల దర్శనమే చర్మచక్షువులకు దుర్లభము. ఒకవేళ అగుపించినను ఆ క్షణముననే కన్నులు గ్రుడ్డి వగును. అంతః చక్షువులను సాధనా మార్గమున పొందినవారు మహాత్ముల దర్శనము చేయవచ్చు నేమోకాని శ్రీదేవి దర్శనమును చేయజాలరు. ఆమె కాంతి నిరుపమానము. 

సృష్టి యందలి ఏ కాంతియైనను ఆమె కాంతిలోని మచ్చుతునకయే. సమస్త దేవతా శక్తులు త్రిమూర్తి సహితముగ ఒక కాంతి నూహించినచో అది అమ్మకాంతికి సమానము ఆమె కాంతిపుంజమే విద్యుత్తు. మెఱపు వలె ప్రకాశించినపుడు సుదూరముగ చూడవచ్చును. అందులకే అమ్మ దర్శనమునకు ఆరాట పడుటకన్న, ఆమె పాదముల వేలిగోళ్ల కాంతులను ముందు దర్శించుటకు సిద్ధపడవలెను. 

కాంతి దర్శనమునకు ముందు దానితో సరిసమానమైన శక్తి గల శబ్దగర్జన యుండును. మెఱుపు మెఱయుటకు ముందు మహత్తర మగు శబ్దము వినిపించును. అటుపైన మెఱుపుతీగ కనిపించును. మెఱపు గర్జనయే గుండె పగిలినట్లుండును. అట్టి సమయమున అమ్మ కనిపించుటకు ముందు ఎట్టి గర్జన యుండవలెను? అమ్మ కనిపించుటకు ముందు వెలువడు గర్జనయే ఆమె సింహము యొక్క గర్జన.

అమ్మతత్త్వము ఈ భూమిపై 'శైలపుత్రి' రూపమున హిమాలయములలో సంచరించు చుండునట. ఆమె సింహవాహిని యట. ఆమె దర్శనమునకు ముందు మహాత్ములకు సైతము గుండె లదరునట్లు సింహ గర్జనము వినపడి సింహము కనపడునట. అపుడు మహాత్ములు అప్రమత్తులై చేతులు జోడించి, కన్నులు మూసుకొని వారి కేంద్రమున గల మూడవ కన్ను నుండి అమ్మను దర్శించి అమ్మ భాషణమును, ఆదేశమును వినుదురట. విద్యుల్లత వలె మెఱపుతో గూడిన అమ్మ దర్శనము, భాషణము, స్పర్శనము చేయుట యనగా విద్యుత్తును స్పర్శించుటయే. విద్యుత్ సమానమైన కాంతి కలవారే విద్యుత్ స్పర్శనము చేయగలరు. 

అట్టి కాంతి దర్శనముతో ఎంతటి అజ్ఞానమైనను నశించునని తెలుపుటలో ఆశ్చర్య మేమున్నది. అది అతిశయోక్తి కానేకాదు. అమ్మ కాంతిని గూర్చి భావన చేయుటయే ఈ నామము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అమ్మ కాంతి నూహింపుడు, భావింపుడు, శక్తికొలది మీ యందు దర్శింపుడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 107 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Taḍillatā -samaruciḥ तडिल्लता-समरुचिः (107) 🌻*

She shines like a line of lightning. In the advanced stage of Kuṇḍalinī meditation, one can realize the entire spinal cord glowing like a flash of lightning. Till this nāma, this kind of epithet was not used, but used here for the first time as She is now with Her spouse. She shines like a lightning when She is with Śiva.  

There are instances of comparing the Brahman to lightning. Kena Upaniṣad (IV.4) explains Brahman beautifully. It says “It is like a flash of lightning…Just as lightning comes in a flash and removes darkness; Self realization dawns in a fraction of a second and removes the darkness of ignorance”. Mahā Nārāyana Upaniṣad (XIII.11) (Nārāyaṇa sūkta) says vidyallokhā meaning flash of light.  

Therefore it is apparent that Lalitāmbikā is referred to as the Brahman in this nāma. This nāma fortifies the argument that both Śiva and Śaktī are the Brahman. Śiva is the nirguṇa Brahman and Śaktī is saguṇa Brahman (nirguṇa means without attributes and saguṇa means with attributes). Śaktī attains potency only if She remains with Śiva. 

 Śiva also becomes inert without Śaktī. This argument is strengthened by this nāma as She is compared to lightning only during Her union with Śiva.

Some texts use Taṭillatā instead of Taḍillatā. However this difference does not alter the meaning.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 108 / Sri Lalitha Chaitanya Vijnanam - 108 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |*
*మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ‖ 40 ‖*

*🌻 108. 'షట్చక్రోపరి సంస్థితా' 🌻*

ఆరు చక్రముల ఉపరితలమున సహస్రార పద్మమందు, సమ్యక్
స్థిత అయినది శ్రీదేవి యని అర్థము.

శ్రీదేవి స్వస్థానము సహస్రార పద్మమని తెలుపబడినది. ఆమె సహస్రార పద్మము నధిష్ఠించి మెఱపువలె మెరయుచుండగ ఆ కాంతియే ఆరు చక్రములందు అవరోహణ క్రమమున అవతరించును. ఆమె ననుసరించియే తెలివి, ప్రాణము వర్షించును. ఆ కాంతియే జీవుల అస్థిత్వము. అస్థిత్వము, తెలివి, ప్రాణము అను మూడు అంశలతో కూడిన శ్రీదేవి తత్త్వము సుషుమ్న నాడియందు సరస్వతీ నదివలె ప్రవహించు చుండును. ఆ ప్రవాహమున ఏర్పడు ఘట్టములు సృష్టియందు, మానవుని యందు లోకములుగ ఏర్పడును. 

అవరోహణ క్రమమున పదార్థము సూక్ష్మతమము నుండి, సూక్ష్మతరము, సూక్ష్మము, స్థూలము అగుచుండగ అస్థిత్వ జ్ఞానము, ప్రాణము, తెలివి సన్న గిల్లుచుండును. ఇందు ఒక్కొక్క ఘట్టమునందు దేవి అంశలుగ జ్వాలామాలిని, మంత్రిణి, వారాహి, శ్యామల, బాల ఇత్యాది దర్శనము లగుచుండును. దేవి పరిపూర్ణ దర్శనము మాత్రము సహస్రారము నందే జరుగ గలదు. ప్రాథమికముగ జరుగు దర్శనములు సాధకులకు రుచి కల్పించి ప్రోత్సహించును. 

శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర చిత్తముతో ఆరాధించువారికి లోన నిర్మలత్వము పెరిగి, దర్శనకాంతి పెరుగుచుండును. శ్రీదేవి అన్ని కాంతులయందు క్రమముగ దర్శన మిచ్చుచుండును. నలుపు నుండి వజ్రకాంతి వరకు గల సమస్తమగు వర్ణముల కాంతి అమ్మ నుండి ఉద్భవించినవే. అట్టి దర్శనము జీవులకు సర్వ శుభంకరము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 108 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Ṣaṭcakropari-samsthitā षट्चक्रोपरि-सम्स्थिता (108) 🌻*

She is above the six cakra-s starting from mūlādhāra to ājñā cakra-s. She is now at sahasrāra, which is not a cakra. As sahasrāra is above the six cakra-s, hence this nāma.  

There is another interpretation possible. It has been seen earlier, that She is the Brahman when united with Śiva. To realise the Brahman in sahasrāra, one has to cross the lower cakra-s, all of which are associated with worldly acts.  

Sahasrāra is above the worldly acts. That is why She is said to be above these six cakra-s, meaning that the Brahman is above the six cakra-s.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 470 / Bhagavad-Gita - 470 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 15 🌴*

15. సర్వేన్ద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||

🌷. తాత్పర్యం : 
పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తిలేనట్టివాడు. అతడు ప్రకృతిగుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయియున్నాడు.

🌷. భాష్యము :
జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను భగవానుడు అట్టి జీవుల భౌతికేంద్రియముల వంటివాటిని కలిగియుండడు. 

వాస్తవమునకు జీవులు సైతము ఆధ్యాత్మికమైన ఇంద్రియములనే కలిగియున్నను, బద్ధస్థితిలో అవి భౌతికాంశములచే ఆవరింపబడి యుండుట వలన వాటి ద్వారా భౌతికకర్మలే ప్రకటితమగుచుండును. 

కాని భగవానుని ఇంద్రియములు ఆ విధముగా ఆచ్ఛాదితము కాకపోవుట వలన దివ్యములై నిర్గుణములని పిలువబడుచున్నవి. గుణమనగా ప్రకృతి త్రిగుణములని భావము.

 అనగా అతని ఇంద్రియములు భౌతికఆచ్ఛాదనారహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతము చేసికొనగలవు. మన ఇంద్రియ కార్యకలాపములన్నింటికి అతడే కారణుడైనను అతడు మాత్రము గుణరహితమైన దివ్యేంద్రియములను కలిగియున్నాడు.

 ఈ విషయమే “అపాణిపాదో జవనో గ్రహీతా” యని శ్వేతాశ్వతరోపనిషత్తు (3.19) నందలి శ్లోకములో చక్కగా వివరింపబడినది. అనగా భగవానుడు భౌతికగుణ సంపర్కము కలిగిన హస్తములను కాక దివ్యహస్తములను కలిగియుండి, తనకు అర్పించినదానిని వాని ద్వారా స్వీకరించును. 

ఇదియే బద్ధజీవునకు మరియు పరమాత్మునకు నడుమ గల భేదము. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 470 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 15 🌴*

15. sarvendriya-guṇābhāsaṁ
sarvendriya-vivarjitam
asaktaṁ sarva-bhṛc caiva
nirguṇaṁ guṇa-bhoktṛ ca

🌷 Translation : 
The Supersoul is the original source of all senses, yet He is without senses. He is unattached, although He is the maintainer of all living beings. He transcends the modes of nature, and at the same time He is the master of all the modes of material nature.

🌹 Purport :
The Supreme Lord, although the source of all the senses of the living entities, doesn’t have material senses like they have. 

Actually, the individual souls have spiritual senses, but in conditioned life they are covered with the material elements, and therefore the sense activities are exhibited through matter. The Supreme Lord’s senses are not so covered. 

His senses are transcendental and are therefore called nirguṇa. Guṇa means the material modes, but His senses are without material covering. 

It should be understood that His senses are not exactly like ours. Although He is the source of all our sensory activities, He has His transcendental senses, which are uncontaminated. 

This is very nicely explained in the Śvetāśvatara Upaniṣad (3.19) in the verse apāṇi-pādo javano grahītā. The Supreme Personality of Godhead has no hands which are materially contaminated, but He has His hands and accepts whatever sacrifice is offered to Him. 

That is the distinction between the conditioned soul and the Supersoul. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 83 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 21. బ్రహ్మ యజ్ఞము - బ్రహ్మమే యిన్ని రూపములుగా ఏర్పడి, యిన్ని రకములుగా నిర్వర్తించు కొనుచున్నాడు. మొదలున్నది బ్రహ్మమే. సంకల్పము బ్రహ్మమే. కర్మనిర్వహణము బ్రహ్మమే. అది బ్రహ్మమునకే సమర్పణము. చివరకు మిగులునది బ్రహ్మము. ఇది ఒక బ్రహ్మ ఉపాసనా మార్గము. ఇట్లు భావించుచూ జీవించుటయే ఈ ఉపాసన.🍀*

*📚. 4. జ్ఞానయోగము - 24 📚*

*బ్రహ్మార్పణం బ్రహ్మహవి ర్ర్బహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |*
*బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా || 24*

సమస్తమును బ్రహ్మమే అని తెలుపు శ్లోకము ఇది. ప్రతినిత్యము పఠింపవలసిన శ్లోకము. నిర్వర్తించు సర్వమును బ్రహ్మమున కర్పణము చేయుము అని యీ శ్లోక నిర్దేశము. నిర్వర్తించుటకు వినియోగించు సర్వ శక్తులు, వనరులు, శరీరము, మేధస్సు, ధనము అంతయూ బ్రహ్మమే. 

వానినట్లు వినియోగించుట దినచర్యయందలి హోమము. కార్యము నందు సమర్పింప బడిన వన్నియు (అనగా వనరులు, శక్తులు మొదలగునవి) హోమ ద్రవ్యములు. సమర్పణము కర్తవ్య నిర్వహణమున గనుక అది బ్రహ్మాగ్ని. నిర్వర్తించు యజమాని బ్రహ్మ. ఎవరి కొరకు నిర్వర్తించు చున్నాడో వారునూ బ్రహ్మమే. చేయువాడు, చేయబడు పని, అందు వినియోగింపబడినవి, దాని నుండి ఫలము పొందినవారు, అంతయూ బ్రహ్మమే. 

బ్రహ్మమే యిన్ని రూపములుగా ఏర్పడి, యిన్ని రకములుగా నిర్వర్తించు కొనుచున్నాడు. మొదలున్నది బ్రహ్మమే. సంకల్పము బ్రహ్మమే. కర్మనిర్వహణము బ్రహ్మమే. అది బ్రహ్మమునకే సమర్పణము. చివరకు మిగులునది బ్రహ్మము. ఇది ఒక బ్రహ్మ ఉపాసనా మార్గము. 

ఇట్లు భావించుచూ జీవించుటయే ఈ ఉపాసన. ఇట్టివారు సమముగా, ఇందలి సత్యమును రుచి చూడగలరు. దీనిని బ్రహ్మయజ్ఞము అందురు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 280 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
67. అధ్యాయము - 22

*🌻. సతీ శివుల విహారము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఒకనాడు వర్షర్తువు వచ్చినపుడు కైలాస పర్వతము యొక్క మైదానము నందు ఉన్న వృషభధ్వజునితో దాక్షాయణి ఇట్లు పలికెను (1).

సతి ఇట్లు పలికెను -

దేవ దేవా ! మహాదేవా ! శంభో! నా ప్రాణప్రియా! నాథా! నా అభిమానమును రక్షించువాడా! నామాటను విని, అట్లు చేయుము (2). మిక్కలి దుస్సహమగు వర్షర్తువు ఇదిగో ఆరంభ##మైనది. అనేక వర్ణముల మేఘముల గుంపులు గర్జనలతో దిక్కులను, ఆకాశమును నింపుచున్నవి (3). వేగము గల గాలులు కదంబ పుష్పముల రేణువులను ఎగుర గొట్టుచూ, నీటి బిందువులను ఆకర్షించుచూ, హృదయమునకు భయము కలుగునట్లు వీచు చున్నవి (4). 

కుండపోతగా జలమును వర్షిస్తూ, మెరుపు తీగలే పతాకములుగా కలిగి, తీవ్రమగు గర్జనలము చేయు ఈ మేఘములను చూచినచో, ఎవని మనస్సు అధికముగా కంగారు పడదు?(5). సూర్య చంద్రులు మేఘములచే కప్పబడి కనబడుట లేదు. వియోగము గలవారికి దుఃఖమునిచ్చే ఈ కాలములో పగలు కూడ రాత్రి వలె ఉన్నది (6).

ఓ శంకరా! గాలిచే త్రోయబడే ఈ మేఘములు ఒకచోట స్థిరముగా నుండవు. గర్జించు ఈ మేఘములు మానవుల శిరస్సుపై పడునా యన్నట్లు కన్పట్టు చున్నవి (7). ఓ హరా! కాముకులచే కోరబడే మహావృక్షములు గాలిచే కొట్ట బడినవై ఆకాశముందు నాట్యము చేయుచున్నవా యన్నట్లు ఉన్నవి. భయస్వభావము గల వారికి భయమును గొల్పుచున్నవి (8).

 దట్టని కాటుక వలె నల్లనైన మేఘ సమూహము వెనుక ఎత్తుతో కొంగల వరుస ఎగురుచూ, యమునా నదిలోని తెల్లని నురగ వలె ప్రకాశించుచున్నది (9). నల్లని ఆకాశమునందు తెల్ల వారగనే ఉదయించే సూర్యుడు సముద్రములో మండు చున్న బడబాగ్ని వలె కన్పట్టు చున్నాడు (10).

ఓ ముక్కంటీ! ఇంటి వాకిళ్ల యందు కూడా ధాన్యపు మొక్కలు మొలుచు చున్నవి. పంట చేలలో సస్యములు పెరుగు చున్నవని నేను చెప్పనేల ?(11). స్వచ్ఛమైన హిమవత్పర్వతముపై నల్లని, తెల్లని, ఎర్రని మేఘములు వాలు చుండగా, ఆ పర్వతము మందర పర్వతమునాశ్రయించిన మేఘముల గుంపులతో కూడియున్న పాల సముద్రము వలె భాసించెను (12). 

సౌందర్యము చాల కుటిలమైనది. ఇతర పుష్పముల నన్నిటినీ వీడి కింశుక పుష్పముల నాశ్రయించినది. ఇది కలియందు లక్ష్మీదేవి సత్పురుషులను వీడి దుష్టుల నాశ్రయించి నట్లు న్నది (13). వనములన్నింటియందు నెమళ్లు మేఘగర్జన శబ్దమును విని, చాల ఆనందించినవై కేకాధ్వనులను నిరంతరముగా చేయుచూ పింఛమును పైకెత్తి నాట్యము చేయుచున్నవి (14).

మేఘములను చూచి ఉల్లాసమును పొందే చాతకపక్షులకు ఈ వర్షము మధురము. ఈ కాలము మనోహరము. కాని పథికులు కుండపోత వర్షము పడు చున్ననూ వియోగతాపమును అనుభవించెదరు (15). ఈ మేఘముల పొగరును పరికించుము. ఇవి వడగళ్లతో నా దేహమును కప్పివేయు చున్నవి. నా వెంట నడచిన నెమళ్లపై, మరియు చాతకములపై వడగళ్లను వర్షించుచున్నవి (16). 

ఈ విషమకాలమునందు కాకులు, చకోరములు కూడ గూళ్లను కట్టుకొను చున్నవి. కాని నీవు ఇంటిని నిర్మించలేదు. నీకు శాంతి ఎట్లు లభించగలదు? (18). ఓ పినాక పాణీ! మేఘములు ఆకసములో నిండుచుండగా నాకు భయము అధికమగుచున్నది. కాన నీవు నా మాటను పాటించి ఆలస్యము లేకుండా ఇంటిని నిర్మించే ప్రయత్నమును చేయుము (19).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ దాక్షాయణి ఇట్లు అనేక పర్యాయములు చెప్పగా, శంభుడు శిరస్సుపై నున్న చంద్రుని కాంతులు చిరునవ్వు శోభను పెంచుచుండగా నవ్వెను (21). నవ్వుచే విడివడిన పెదవుల సంపుటము కలిగిన వాడు, మహాత్ముడు, సర్వతత్త్వముల నెరింగినవాడు అగు పరమేశ్వరుడు ఆమెను సంతోషపెట్టువాడై సతీదేవితో నిట్లనెను (22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 36 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
*🌻KILL OUT AMBITION - Work as those work who are ambitious - 16 🌻*

165. Whether a man is really working as part of His Life will be shown by his perfect contentment whether he succeeds or fails. If that contentment is perfect, without a shadow of dissatisfaction, he has been working absolutely for the maintenance of mankind; then the work does not bind him and he has solved the problem of inaction in the midst of action. He has learned the use of the vehicles and the gunas, without identifying himself with them. 

In ordinary cases the gunas work the man, but the man on the Path works the gunas. Most men are carried about by the energies of nature; they work as those energies are active. But the man on the Path takes those energies as instruments of labour and, standing behind them, utilizes them. 

The ambitious man is driven by the gunas when he thinks that he is working, but the man who has transcended them is directing them along the road of evolution traced by Ishvara, and does not identify himself with them. This is thus taught in the Gita:

166. Having abandoned attachment to the fruit of action, always content, nowhere seeking refuge, he is not doing anything, although doing actions.

167. Hoping for naught, his mind and self controlled, having abandoned all greed, performing action by the body alone, he doth not commit sin.

168. Content with whatsoever he obtaineth without effort, free from the pairs of opposites, without envy, balanced in success and failure, though acting he is not bound.

169. Of one with attachment dead, harmonious, with his thoughts established in wisdom, his works sacrifices, all action melts away.

170. So the man who finds himself at the point of balance, of indifference, must discover some means to increase the higher influences within himself, so that these may spur him into this life of spiritual action. 

He must use meditation; he must try to utilize whatever emotion he may possess; he must deliberately take every opportunity of service. He must move even without the desire to move, and even against the desire not to move. He must move.

 If he can find anyone for whom he has reverence, whose example inspires him to activity, that will be a great help to his getting over this transitional stage, where otherwise he might drop out of evolution for the time being. 

If the desire to please someone whom he admires should arise in his mind, he may use that to urge himself on until he is in a position to feel the impelling force of Ishvara’s Life, and thus use the emotion to carry him over and out of his condition of collapse.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 168 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కణ్వమహర్షి - 3 🌻*

14. భారతదేశంలో అనేక స్మృతులు, అనేక వేదశాఖలు ఉండేవి. వాటిలో చాలావరకు నశించాయి. అధర్వణజాతి ఎంతో ఉండేది కాశ్మీరులో. అయితే కాశ్మీరు ఇప్పుడు భారతదేసంలోనిదేనా అని సందేహపడే పరిస్థితి వచ్చింది. ఏమయిపోయింది మన సంస్కృతి! 

15. కాశ్మీరులో ఈనాడు అన్నీ మనం చూడగలమా? అక్కడ ఇప్పుడు హిందూమతమే లేదు. ఇక స్మృతులు ఎక్కడున్నాయి? వేదాలెక్కడున్నయి? ఏ శాఖలెక్కడున్నాయి? ఎక్కడా కనబడటంలేదు. ఆనవాలుకూడా లేదు అక్కడ. శివసూత్రములలో అక్కడ దొరికిన సూత్రములు కొన్ని ఉన్నాయి. లల్లాదేవి అనేటటువంటి ఒక శివయోగిని శివధర్మములు, సూత్రములు చెప్పింది.

 16. అవన్నీ ఒక గ్రంధరూపంలో ఉంది కాశ్మీరీభాషలో శారదా లిపిలో ఆ గ్రంథం ఒకటి ఉంది. శివయోగాన్ని గురించి ఎన్నోఅద్భుతాలను ఆవిడ చెప్పింది. శివయోగములు, పతంజలియోగము, ఇంకా అనేకమయిన మార్గములు సమన్వయపరచి చెప్పిందావిడ. అందులో శివాద్వైతాన్ని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన నిర్గుణమైన బ్రహ్మవస్తువుగా భావించింది.

17. పంచాక్షరీమంత్రమ్యొక్క అర్థం ఏమిటంటే, సృష్తి మొత్తంలో అమంగళకరమయినదంతా తీసేస్తే మంగళప్రదమయిన వస్తువు ఏది ఉందో, దేనివల్ల శాశ్వతమైన సుఖాన్ని బ్రహ్మాదులు కూడా పొందుతారో దాని పేరే ‘శివ’శబ్దం. ఆ ప్రతిపాదన అదే చెబుతోంది. మనస్సులో శివ శబ్దాన్ని ధరించి యోగాన్ని అనుసంధానంచేస్తే మోక్షం కరతలామలకం, అది ఈ జన్మలోనే కలుగుతుంది అని చెప్పింది లల్లాదేవి.

18. శ్రీనగర్ దగ్గర ఒక కొండమీద ఆదిశంకరులవారు తపస్సుచేసారు. ఆ శంకరతీర్థంలోనే ఆయన బోధ చేసాడు. శారదాపీఠం అక్కడే ఉండేది. సరస్వతీపీఠాన్ని అక్కడే అధిరోహించారని, కాశ్మీరులోని శ్రీనగర్‌లోనే సర్వజ్ఞపీఠాన్ని ఆయన అలంకరించారని చెపుతారు. ఆ సర్వజ్ఞపీఠాం ఏమిటో – అది ఎక్కడుండేదో, అక్కడ ఎవరు ఉండేవారో, ఆ పరిషత్తు ఏమిటో ఆ వివరాలేవీ నేడూ మనకు తెలియదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 232 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 81. With the transcendence of the knowledge 'I am', the Absolute prevails. The state is called Parabrahman, while the knowledge 'I am' is Brahman. 🌻*

It is very important to understand that the knowledge 'I am' is Brahman. When you transcend the 'I am' you transcend the Brahma state and prevail as the Parabrahman or Absolute. 

The Brahman is both with qualities ('Saguna' Brahman) and without qualities ('Nirguna' Brahman). With qualities it is the manifest world and without qualities it is the unmanifest world. 

The 'I am' and 'I am not', the 'knowing' and 'not-knowing', the 'being' and 'non-being' are all the same. They have simply been designated using opposite terms. The Absolute or Parabrahman state transcends both as there is no duality or opposite there.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 107 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 12 🌻*

448. కలలతో పోల్చి చూచినచో, మానవుని భౌతిక జీవితము యదార్ధము. అట్లే,
ఆధ్యాత్మికమార్గముతో పోల్చినచో, ప్రపంచము-ప్రపంచ జీవితము ఒక కల.
భగవంతునితో పోల్చినచో, ఆధ్యాత్మికమార్గము మరియొక కల.

449. ప్రపంచము, ప్రపంచానుభవములు అయదార్థమైన మాయ.

450. ఆధ్యాత్మిక మార్గం యదార్థమైన మాయ, రెండును మాయలే. భగవంతుడే ఏకైక సత్యము.

451. ఆరవభూమిక యందున్న మానవాత్మ సద్గురు సహాయము లేనిదే స్వయం కృషిచే ఆరవభూమికను దాటి సప్తమభూమికను చేరుట కేవలము అసాధ్యము.

452. ఆరవభూమిక యందున్న మానవాత్మకు మానసిక చైతన్యము నుండి విడివడి, తన అనంత స్థితి యందు ఏకత్వానుభూతి నొందుటకును అనంత ఆనందమును ఎఱుకతో అనుభవించుటకును, తాను శాశ్వతముగా అనంతములోనే యున్నానెడి అనుభూతి నొందుటలో సహాయ పడుటకును ఇచ్చట సద్గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasra Namavali - 71 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*జ్యేష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 71.బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |*
*బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ‖ 71 ‖ 🍀*

🍀 661) బ్రహ్మణ్య: - 
బ్రహ్మను అభిమానించువాడు.

🍀 662) బ్రహ్మకృత్ - 
తపస్సు మొదలైనవిగా తెలియ జేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.

🍀 663) బ్రహ్మా - 
బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.

🍀 664) బ్రహ్మ - 
బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.

🍀 665) బ్రహ్మవివర్థన: - 
తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.

🍀 666) బ్రహ్మవిత్ - 
బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.

🍀 667) బ్రాహ్మణ: - 
వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.

🍀 668) బ్రహ్మీ - 
తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.

🍀 669) బ్రహ్మజ్ఞ: - 
వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.

🍀 670) బ్రాహ్మణప్రియ: - 
బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 70 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Jeshta 3rd Padam*

*🌻 brahmaṇyō brahmakṛdbrahmā brahma brahmavivardhanaḥ |*
*brahmavidbrāhmaṇō brahmī brahmajñō brāhmaṇapriyaḥ || 71 || 🌻*

🌻 661. Brahmaṇyaḥ: 
The Vedas, Brahmanas and knowledge are indicated by the word Brahma. As the Lord promotes these, He is called Brahmanya.

🌻 662. Brahmakṛt: 
One who performs Brahma or Tapas (austerity).

🌻 663. Brahmā: 
One who creates everything as the creator Brahma. 

🌻 664. Brahma: 
Being big expanding, the Lord who is known from indications like Satya (Truth), is called Brahma. Or Brahma is Truth, Knowledge and Infinity!

🌻 665. Brahma-vivardhanaḥ: 
One who promotes Tapas (austerity), etc.

🌻 666. Brahmavid: 
One who knows the Vedas and their real meaning.

🌻 667. Brāhmaṇaḥ: 
One who, in the form of Brahmana, instructs the whole world, saying, 'It is commanded so and so in the Veda'.

🌻 668. Brahmī: 
One in whom is established such entities as Tapas, Veda, mind, Prana etc. which are parts of Brahma and which are also called Brahma.

🌻 669. Brahmajñaḥ: 
One who knows the nature of Brahman.

🌻 670. Brāhmaṇapriyaḥ: 
One to whom holy men are devoted.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment