భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 107
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 107 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 12 🌻
448. కలలతో పోల్చి చూచినచో, మానవుని భౌతిక జీవితము యదార్ధము. అట్లే,
ఆధ్యాత్మికమార్గముతో పోల్చినచో, ప్రపంచము-ప్రపంచ జీవితము ఒక కల.
భగవంతునితో పోల్చినచో, ఆధ్యాత్మికమార్గము మరియొక కల.
449. ప్రపంచము, ప్రపంచానుభవములు అయదార్థమైన మాయ.
450. ఆధ్యాత్మిక మార్గం యదార్థమైన మాయ, రెండును మాయలే. భగవంతుడే ఏకైక సత్యము.
451. ఆరవభూమిక యందున్న మానవాత్మ సద్గురు సహాయము లేనిదే స్వయం కృషిచే ఆరవభూమికను దాటి సప్తమభూమికను చేరుట కేవలము అసాధ్యము.
452. ఆరవభూమిక యందున్న మానవాత్మకు మానసిక చైతన్యము నుండి విడివడి, తన అనంత స్థితి యందు ఏకత్వానుభూతి నొందుటకును అనంత ఆనందమును ఎఱుకతో అనుభవించుటకును, తాను శాశ్వతముగా అనంతములోనే యున్నానెడి అనుభూతి నొందుటలో సహాయ పడుటకును ఇచ్చట సద్గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment