31-JANUARY-2021 EVENING

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 137🌹  
13) 🌹. శివ మహా పురాణము - 337🌹 
14) 🌹 Light On The Path - 90🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 222🌹 
16) 🌹 Seeds Of Consciousness - 286 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 161🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 17 / Lalitha Sahasra Namavali - 17🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 17 / Sri Vishnu Sahasranama - 17 🌹
20) శ్రీ గురు పాదుకా స్తవము

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -137 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 22

*🍀. 20. స్థిర చైతన్యము - ఇంద్రియ సుఖములు, యింద్రియ భోగములు మొదలు సుఖము కలిగించినను, తరువాత దుఃఖము కలిగించగలవు. అవి అంతవంతములని తెలిసి బ్రహ్మజ్ఞాని వానియందు రమించడు. త్రిగుణాత్మకమగు ప్రకృతి సహజ లక్షణము మార్పు. అష్ట ప్రకృతులు ఎప్పుడును మార్పు చెందుచునే యుండును. మూల ప్రకృతి మార్పు చెందకయుండు వెలుగు. అది తొమ్మిదవది. ఆ స్థిరమగు వెలుగున కాధారము దాని కావలయున్న బ్రహ్మతత్వము. ఈ తత్వము నాశ్రయించినపుడు మనయందలి చైతన్యమను వెలుగు స్థిరముగ నుండును. స్థిరచైతన్యము ఆనంద దాయకము. 🍀*

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।

ఇంద్రియ సుఖములు, యింద్రియ భోగములు మొదలు సుఖము కలిగించినను, తరువాత దుఃఖము కలిగించగలవు. అవి అంతవంతములని తెలిసి బ్రహ్మజ్ఞాని వానియందు రమించడు. 

త్రిగుణాత్మకమగు ప్రకృతి సహజ లక్షణము మార్పు. అష్ట ప్రకృతులు ఎప్పుడును మార్పు చెందుచునే యుండును. మూల ప్రకృతి మార్పు చెందకయుండు వెలుగు. అది తొమ్మిదవది. 

ఆ స్థిరమగు వెలుగున కాధారము దాని కావలయున్న బ్రహ్మతత్వము. ఈ తత్వము నాశ్రయించినపుడు మనయందలి చైతన్యమను వెలుగు స్థిరముగ నుండును. స్థిరచైతన్యము ఆనంద దాయకము. 

అది పూర్ణము కూడ. అష్ట ప్రకృతులలోని చైతన్యము మార్పుకు నిరంతరము గురియగు చుండును. పంచేంద్రియములు, రజస్తమస్తత్వములు సన్నివేశములను బట్టి, కాలమును బట్టి, దేశమును బట్టి వివిధముగ అనుభవము కలిగించును. అవి సుఖము కలిగించునట్లుగ అనిపించునుగాని, ఆ సుఖమును అందీ అందనట్లు అనుభవింప చేయుచుండును. 

తిథులకు గురియైన చంద్రుడు ఎట్లు హాని వృద్ధులను అనుభవించునో, మానవుడు కూడ అట్లే ద్వంద్వము లందు ఊగిసలాడు చుండును. ప్రకృతి విలాసమును  దాటి, స్థిరముగ నుండి ప్రకృతి క్రీడను చూచుట మహదానంద దాయకము.

నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుచున్నవాడు నదీ గమన మును గాని, పరిసరములగల ప్రకృతి రమ్యతనుగాని అనుభూతి చెందలేడు. స్థిరము, పటిష్ఠము అయిన నావయందు సుఖాసీనుడై, నదిపై పయనించు ప్రయాణికుడు ప్రవాహము యొక్క వేగమును, తీరమునందలి రమ్యమగు దృశ్యములను చూచి ఆనందించ గలడు. 

అట్లే సృష్టి రమ్యతను శాశ్వతముగ అనుభూతి చెందుటకు సృష్టి కధిష్ఠానమైన తత్వమున స్థిరపడుట తెలివి. ఇట్టి తెలివి బ్రహ్మజ్ఞానికి మాత్రమే యుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 338 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
85. అధ్యాయము - 40

*🌻. శివదర్శనము -2 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు దేవతలు మొదలగు వారితో గూడియున్న బ్రహ్మను (నన్ను) ఇట్లు ఆదేశించి, దేవతలతో గూడి శివుని పర్వతమునకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను (21). విష్ణువు దేవతలతో మునులతో దిక్పాలకులతో ఇతరులతో గూడి తన ధామము నుండి బయలుదేరి మంగళకరము, శివుడు నివసించు పర్వత రాజము అగు కైలాసమునకు వెళ్లెను (22). కైలాసము శివప్రభునకు మిక్కిలి ప్రియమైనది. కింనరులు మొదలగు వారిచే సేవింపబడునది, అప్సరసలు మొదలగు దేవతాస్త్రీలచే మరియు యోగసిద్ధులచే సేవింపబడునది, మిక్కిలి ఎత్తైనది (23), అంతటా మణులు పొదిగిన అనేక శిఖరములతో ఒప్పారునది, అనేక ధాతువులతో రంగు రంగుల సానువులు గలది, అనేక విధముల చెట్లతో లతలతో దట్టముగా నిండియున్నది (24).

ఆ కైలాసము అనేక రకముల మృగముల గుంపులతో ఆవరింపబడియున్నది. అచట వివిధ రకముల పక్షులు ఉండెను. అనేక కొండకాలువలతో కూడియున్నది. దేవతాస్త్రీలు ప్రియులగు సురలతో గుడి వివిధ గుహలయందు (25) పర్వత సానువులయందు విహరించుచుండిరి. ఆ పర్వతము వెండి వలె కాంతులీనెను. అనేక వృక్ష జాతులతో ప్రకాశించెను (26). క్రౌర్యమును వీడిన వ్యాఘ్రము మొదలగు మహామృగములు అచట తిరుగాడుచుండెను. సమస్త శోభలతో గూడిన ఆ దివ్య పర్వతము గొప్ప అచ్చెరువును కలిగించుచుండెను (27). స్థానమహిమచే మరింత పుణ్యమగు ఉదకములు గలది, సర్వులను పావనము చేయునది, విష్ణు పాదముల నుండి పుట్టినది, పవిత్రమైనది అగు గంగచే చుట్టూవారబడియున్న ఆ పర్వతము నిర్మలముగ నుండెను (28).

శివునకు ప్రియమైన, కైలాసమని పేరు గాంచిన ఇట్టి పర్వతమును చూచి విష్ణువు మొదలగు దేవతలు మరియు మహర్షులు అచ్చెరువునందిరి (29). ఆ దేవతలు దాని సమీపమునందు శివమిత్రుడగు కుబేరుని అత్యంత దివ్యమైన, అలకయను పేర ప్రఖ్యాతి గాంచిన సుందరమగు పురమును చూచిరి (30). దాని సమీపములో సర్వ విధముల వృక్షములతో కూడిన సౌగింధికమను దివ్యవనమును చూచిరి. ఆ వనములోని పక్షుల ధ్వనులు అద్భుతముగ నుండెను (31). దానికి కొద్ది దూరములో దివ్యములు, మిక్కిలి పవిత్రమైనవి, దర్శనమాత్రముచే పాపములను పొగొట్టునవి అగు నంద, అలకనంద అనే సరస్సులు గలవు (32).

దేవతాస్త్రీలు ప్రతిదినము తమ లోకమునుండి అచటకు వచ్చి వాటిలోని నీటిని త్రాగెదరు. మన్మథ పీడితులగు వారలు తమ ప్రియులతో కలిసి వాటియందు జలక్రీడలాడెదరు (33). కుబేరుని నగరమును, సౌగంధిక వనమును దాటి ఆ దేవతలు కొద్ది దూరము వెళ్లి శంకరుని మర్రి చెట్టును చూచిరి (34). దాని ఊడల్నియు వేర్వేరు వృక్షములా అన్నట్లున్నవి. అది బహువిస్తారమగు తొలగిపోని నీడను ఇచ్చుచుండెను. దాని క్రింద చల్లగా నుండెను. అది వంద యోజనముల ఎత్తుండెను. దాని యందు పక్షుల గూళ్లు లేకుండెను (35). ఆ స్థలములో శంభుడు తపస్సును చేసెను. ఆ దివ్య స్థలము మహాపుణ్యాత్ములకు మాత్రమే చూడనగును. ఆ సుందర స్థలము పరమ పావనమైనది. మహోత్తరమగు ఆ స్థలమును యోగులు సేవించెదరు (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 90 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 8 🌻*

350. We can understand how these things work. A vibration is most easily received by that which is in tune with it. If a man feels very angry he is liable to stir up the emotion of anger in the astral bodies of other people around him. 

That will also disturb their lower thought; but it will not affect their higher thought, if they have any – most people have not as yet. One of the things we as students are trying to do in our thought and meditation is to awaken the higher parts of the mental body and bring them into working order. 

Those who meditate regularly on the Masters and on the things connected with Them, must be using the higher part of the mental body to some extent, and the more it is used, the more will our thought be unaffected by desires, passions and emotions. 

But since most people do not get so far as that, the great mass of thought in the world is very much coloured by desire, and most thought-forms that we see are loaded with astral as well as with mental matter.

351. We all live much too close together, with the consequence that even while other people may not be thinking of us they affect us. Of course we in turn affect them, and we should always definitely try to affect them for good. 

If we set ourselves to be a centre of uttermost peace and love we shall very greatly help all those around us, but while we are centres of desire and emotion and selfish feeling we make development impossible not only for ourselves but for all those near to us, and that is a very serious matter. Every aspirant ought to take to heart the fact that he is preventing the progress of others if he gives way to this personal desire.

352. The power of self-effacement is impossible of attainment until we have utterly weeded out all personal desire. We talk of our devotion to our work and to the Masters; surely that is not too much to do for Their sake. 

Even if a very great effort is necessary we ought to be willing to make it for the sake of these Great Ones who have done so much for us, through whom all the Theosophical teaching has come to us. 

It is not a question of affording Them gratification by doing these things – though surely They cannot but be pleased to see the progress of those whom They are trying to help – but it is also common sense. If we want to help in evolution, the first and most necessary thing to do is to take ourselves in hand. 

We must gain that control over the lower self which makes us appear as nothing in the eyes of men. Be it so; many of the great forces are working unseen. We may be among those forces, and as such we can afford to appear insignificant in the sight of the world.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 222 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. జైమినిమహర్షి - 7 🌻*

36. కర్మకర్మకు ఉన్న సంబంధంగురించి చెప్పాడు జైమిని. వైదిక కర్మమంతా కూడా తంత్రమే! ఆ తంత్రం చాలా కఠినంగా ఉంటుంది. పవిత్రగ్రంథి ఎంతఉండాలి వంటివి ఉంటాయి. దర్భపొడవు ప్రాదేశికమాత్రం అంటాడు. యజమానికి జానేడు అని అర్థం. అంతే తీసుకోవాలి. 

37. ప్రాదేశిసూత్రం జానెడు ముడివేసిన తరువాత, చివరినుండి ముడితో కలిపి జానెడు తీసుకోవాలి. దాన్నేమో ఛేధించాలి. ‘న నఖేన’, అంటే గోళ్ళతో కాదు అని చెప్తారు వెంటనే. అంటే గోరుతో తంపకూడదు దానిని. దానిని ఒక పాత్ర అంచు మీద ఉంచి తెంపాలి. ఇదంతా తంత్రం. ఇది జ్ఞానానికి గాని, భక్తికిగాని హేతువు కాజాలదు. కర్మయందు శ్రద్ధ ఉన్నప్పుడు, ఎక్కడో ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం అనే భావన పుట్టదు. అది అక్కడ అప్రస్తుతమవుతుంది. యజ్ఞం చూచేవారికి భక్తికి, ఈశ్వరధ్యానానికి అవకాశం ఉంది. 

38. ధ్యానం చేస్తే, వాళ్ళు నమస్కరిస్తూ ఉంటే, యజ్ఞపురుషుడికి – పరమేశ్వరుడో, విష్ణువో ఎవరైతే ఉన్నారో, యజ్ఞ స్వరూపుడయిన వాడెవడో, యజ్ఞం ఎవరినుంచీ పుట్టిందో, ఎవరి ఆజ్ఞానుసారంగా ఆ యజ్ఞం ఆ ఫలాన్ని ఇస్తుందో, అట్టి పరమేశ్వరునికి – ఈ ధ్యానం, నమస్కారం చెందుతాయి. కాబట్టి యజ్ఞం చూచేవారికైనా ఫలం వస్తుంది. 

39. చేసేవాడికి ధ్యానం ఎక్కడ ఉన్నది? దర్భలు మొత్తం 108 ఉన్నాయాలేవా అని లెక్కపెట్టుకోవటం వంటి శాస్త్రవిహితమైన విషయాలపైనే ఏకాగ్రత ఉంటుంది. యజ్ఞకర్తకు, యజమానికి భక్తిభావాలతో సంబంధంలేనటువంటి ఏకాగ్రత నూరుశాతం ఉంటే, ఎక్కడా పొరపాటు రాకుండా చూచుకోవచ్చు. ఎక్కడయినా కొంచెం పొరపాటు వచ్చిందా, ఆ కోరిన ఫలమ్రాదు. కాబట్టి కర్మకు, కర్మకు ఉండే సంబంధం, అలాగే ఎందుకు చెయ్యాలి? ఇటువంటివన్నీ ఆ సూత్రములలో చెప్పారు.

40. జైమినిమహర్షి దానం విషయంలో మరొకసూత్రం వ్రాసాడు, తనకు ఆపద్ధర్మంగా అత్యవసరంగా కావలసింది ఉంచుకోవచ్చు అన్నాడు. లేకపోతే పుత్రులను, భార్యను అందరినీ కూడా ఇవ్వవలసి వస్తుంది. భార్యను కూడా ఎవరింట్లోనైనా దాసీపని చేయమని దానమిచ్చే అవకాశం ఉంది. 

41. కాబట్టి ఉన్నదంతా దానం చెయ్యమనే ప్రస్తావన వచ్చినప్పుడు, ఏదీ మిగలదు, తన శరీరం తప్ప! కాబట్టి ఈ యుగంలో, ఈ కాలంలో, ఉన్నదంతా దానంచేయటమనేది పొసగదు. యావఛ్ఛక్తితో ఎంత దానం చేయగలిగితే అంతా దానంచేస్తే, ఈ ఫలం వస్తుందని జైమిని మహర్షియొక్క అభిప్రాయం. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 286 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 135. When this 'I am' or conscious presence merges in itself and disappears the state of 'Samadhi' ensues. 🌻*

You should be completely engulfed by the 'I am' or your conscious presence. In every way, in all directions, at all times the knowledge 'I am' must be infused into you. 

When you do this with earnestness and a tremendous intensity, the 'I am' merges into itself and disappears, When this happens it said that the state of 'Samadhi' ensues.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 161 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 6 🌻*

625. మానవునిలో నెలకొనిన భగవంతుని జీవితములో, ఆ మానవుడు భగవంతునిగా సహజ సమాధి యొక్క అనుభవమును పొందును. ఏ కొంచెము ప్రయాసము లేకుండా ఏకకాలమందే నిరంతరాయంగా సహజముగా అటు భగవంతుని అనంత జ్ఞాన, శక్తి, ఆనందములను ఇటు మానవజాతి యొక్క బలహీనతలను, బాధలను అనుభవించును. ఇవి-తన అనంత సర్వము నుండి పుట్టిన అభావజన్యములే యనియు,ఈయనుభవము మిథ్యానుభవమే ననియు ఎఱుంగును.

626.ఏక కాలమందే అటు భగవంతునిగను ఇటు మానవునిగను అనుభవించు స్థితియే పూరస్థితి.

627. ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో పూర్ణత్వము మూడు విధములుగా నుండును.

1. పరిపూర్ణ మానవుడు
2. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు
3. పరమ పరిపూర్ణుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 17 / Sri Lalita Sahasranamavali - Meaning - 17 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 17. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా |*
*మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ‖ 17 ‖ 🍀*

39) కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా -
 కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.

40) మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - 
మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 17 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 17. kāmeśa-jñāta-saubhāgya-mārdavoru-dvayānvitā |
māṇikya-mukuṭākāra-jānudvaya-virājitā || 17 ||🌻*

39) Kamesha gnatha sowbhagya mardworu dwayanvitha -   
She who has pretty and tender thighs known only to her consort, Kameshwara

40) Manikhya mukuta kara janu dwaya virajitha -   
She who has knee joints like the crown made of manikya below her thighs

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 17 / Sri Vishnu Sahasra Namavali - 17 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మృగశిర నక్షత్ర 1వ పాద శ్లోకం*

*🍀 17. ఉపెన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|*
*అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః|| 🍀*

🍀 151) ఉపేంద్రః - 
ఇంద్రునకు అధిపతి, ఇంద్రియములకు లొంగనివాడు. 

🍀 152) వామనః - 
ఎంతో చక్కని, చిన్నని రూపమున అవతరించినవాడు.

🍀 153) ప్రాంశుః - 
ఎంతో విస్తారమైన దేహంతో త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించినవాడు.

🍀 154) అమోఘః - 
ఆశ్చర్యపరిచే, కారణయుక్తమైన పనులు చేసెడివాడు.

🍀 155) శుచిః - 
ఎటువంటి మాలిన్యములు అంటనివాడు, జీవులను పవిత్రులుగా చేయువాడు.

🍀 156) ఊర్జితః - 
అత్యంత శక్తి సంపన్నుడు. 

🍀 157) అతీంద్రః - 
ఇంద్రియముల కంటే అధికుడు, మనసు కంటే శ్రేష్ఠుడు.

🍀 158) సంగ్రహః - 
సర్యమును తన అధీనములో నుంచుకొన్నవాడు. 

🍀 159) సర్గః - 
తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృష్టించుకొనువాడు.

🍀 160) ధృతాత్మా - 
అన్ని ఆత్మలకు (జీవులకు) ఆధారమైనవాడు. 

🍀 161) నియమః - 
నియమాలను ఏర్పరచి, వాటిని నియంత్రించి, సకలమును నడుపువాడు. 

🍀 162) యమః - 
సమస్తమును వశము చేసుకొన్నవాడు, జీవుల హృదయమందు వశించువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 17 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Mrugasira 1st Padam*

*🌻 17. upendrō vāmanaḥ prāṁśuramōghaḥ śucirūrjitaḥ |*
*atīndraḥ saṅgrahaḥ sargō dhṛtātmā niyamō yama || 17 || 🌻*

🌻 151) Upendraḥ: 
One born as the younger brother of Indra.

🌻 152) Vāmanaḥ: 
One who, in the form of Vamana (dwarf), went begging to Bali.

🌻 153) Prāṁśuḥ: 
One of great height.

🌻 154) Amoghaḥ: 
One whose acts do not go in vain.

🌻 155) Śuchiḥ: 
One who purifies those who adore and praise Him.

🌻 156) Ūrjitaḥ: 
One of infinite strength.

🌻 157) Atīndraḥ: 
One who is superior to Indra by His inherent attributes like omnipotence, omniscience etc.

🌻 158) Saṅgrahaḥ: 
One who is of the subtle form of the universe to be created.

🌻 159) Sargaḥ: 
The creator of Himself

🌻 160) Dhṛtātmā: 
One who is ever in His inherent form or nature, without the transformation involved in birth and death.

🌻 161) Niyamaḥ: 
One who appoints His creatures in particular stations.

🌻 162) Yamaḥ: 
One who regulates all, remaining within them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గురు పాదుకా స్తవము 🌹*
✍️. శ్రీమచ్చంకరాచార్య విరచిత 

*1) శ్లో|| శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశ మగోచరం|*
  *భేద వర్జిత మప్రమేయ మనన్త మాద్య మకల్మషం||*
  *నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్క్య మబోధకం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*

 *2)శ్లో|| నాదబిన్దు కళాత్మకం దశనాద భేద వినోదకం|*
  *మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాసితం||*
  *పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*

 *3)శ్లో|| వ్యోమ వద్బహిరన్తరస్థిత మక్షరం నిఖిలాత్మకం|*
  *కేవలం పరిశుద్ధ మేక మజన్మహి ప్రతి రూపకమ్‌||*
       *బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||* 

 *4)శ్లో|| బుద్ధిరూప మబుద్ధికం త్రితయైక కూట నివాసినం|*
  *నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్‌||*
  *పశ్చిమాన్తర ఖేలనం నిజశుద్ధ సంయమి గోచరం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*  

 *5)శ్లో|| హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం|*
  *నీల మధ్య సునీల సన్నిభ మాది బిన్దు నిజాం శుకమ్‌||*
  *సూక్ష్మ కర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||* 

 *6)శ్లో|| పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం|*
  *పంచభూత సకామ షట్క సవిూర శబ్ద ముఖేతరమ్‌||*
  *పంచ కోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*

 *7)శ్లో|| పంచ ముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం|*
  *విద్యుదాది ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్థనమ్‌||*
  *చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాస మమాయకం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*

 *8)శ్లో|| పంచ వర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్త్వ విచారణం|*
  *చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం||*
  *చిత్కళా పరిపూర్ణ మంతర చిత్‌ సమాధి నిరీక్షణం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||* 

 *9)శ్లో|| హంసచార మఖణ్డనాద మనేక వర్ణ మరూపకం|*
  *శబ్ద జాలమయం చరాచర జన్తు దేహ నివాసినమ్‌||*
  *చక్రరాజ మనాహతోద్భవ మేక వర్ణ మతః పరం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*       
                            
 *10)శ్లో|| జన్మకర్మ విలీన కారణ హేతుభూత మభూతకం|*
  *జన్మకర్మ నివారకం రుచి పూరకం భవతారకం||*
  *నామరూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*

 *11)శ్లో|| తప్తకాంచన దీప్యమాన మహాణు మాత్ర మరూపకం|*
  *చన్ద్రికాన్తర తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్‌||*
  *నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం|*
  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*

 *12)శ్లో|| స్థూల సూక్ష్మ సకారణాన్తర ఖేలనం పరిపాలనం|*
  *విశ్వతైజస ప్రాజ్ఞచేతస మన్తరాత్మ నిజాంశుకమ్‌||*
  *సర్వకారణ మీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్‌|*

  *ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||*
     
      *ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రీమద్గురు పాదుకాస్తవ స్సంపూర్ణం.*
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment