✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 9. బిందువు 🌻
శుద్ధచైతన్యము నుండి సంకల్ప ముద్భవించు క్షణమున చైతన్యమే బిందువుగ నేర్పడును. అనగా సంకల్ప బీజముగ తాను మొత్తము చైతన్యము నుండి వేరగును. బిందువేర్పడిన తక్షణమే దానికి పరిధి ఏర్పడును. అనగా సంకల్ప బిందువునకు కాలపరిమితి ఏర్పడును.
సృష్టియందు మానవుని యందుకూడ ఇట్లే సంకల్పము లేర్పడుచుండును. మరల శుద్ధచైతన్యమున లీనమగుచుండును. కేంద్రమునుండి పరిధికి గల దూరము సంకల్పము యొక్క వైశాల్యమును నిర్ణయించినది. ఒక సంకల్పము నిర్వర్తింపబడు లోపల అందులో అంతర్భాగముగ మరియొక సంకల్పము మొలకెత్తును.
అనగా ఆదిసంకల్పములలోని వివరములే అనుగత సంకల్పములుగ దిగి వచ్చుచుండును. ఈ అనుగత సంకల్పములన్నియు ఆది సంకల్పము వశమున నుండును.
స్థూలముగ ఆది సంకల్పము నుండి ఏర్పడు అనుగత సంకల్పములు ఏడుగ పెద్దలు వర్గీకరింతురు. సూక్ష్మముగ మానవ మేధస్సునకు అందని వర్గీకరణము లున్నవి. ఆదిసంకల్పమునే మహా సంకల్పమని కూడ అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
31 Jan 2021
No comments:
Post a Comment