శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 195 / Sri Lalitha Chaitanya Vijnanam - 195


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 195 / Sri Lalitha Chaitanya Vijnanam - 195 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ‖ 51 ‖



🌻195. 'దోషవర్జితా' 🌻

శ్రీమాత దోషములు వర్ణించినదని అర్థము.

సృష్టికార్యము ఒక అగ్నికార్యము. అట్టి కార్యమున కొన్ని మలినముల పుట్టుక తప్పదు. ఆ మలినములను ఆమె విసర్జించి అమలగా సృష్టియందు విస్తరించి యుండును. అట్టి మలినముల నుండియే దోషములు పుట్టును. మలిన దోషముల యందు ఆమె ఉండదు.

అన్నము, అశుద్ధము అనునవి గమనించినపుడు, అన్నము నందామె యుండును. అశుద్ధమున యుండదు. అశుద్ధము విసర్జించ వలసినదే. అన్నము వండినపుడు పొగ, మసి ఏర్పడును. పొగను పీల్చరాదు. మసిని పూసుకొనరాదు. పొగ, మసి వచ్చునని అన్నము వండుట మానరాదు. అశుద్ధము లేర్పడునని అన్నము తినుట, నీరు త్రాగుట మానుట వివేకము కాదు.

అన్నమును, నీటిని గొని, మలమూత్రములను విసర్జించుట ప్రాణికోటికి సహజము. సృష్టి త్రిగుణాత్మకమగుటచే సత్వగుణమున కెంత ప్రాధాన్యత ఉన్నదో, రజోగుణమునకు, తమోగుణమునకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. మూడు గుణముల నుండి దోషములు పుట్టు చున్నవి. రజోగుణము లేనిదే ఎవ్వరునూ కార్యోన్ముఖులు కాలేరు.

అట్లే తమోగుణము లేనిదే విశ్రాంతి, నిద్ర యుండవు. సత్వ గుణము లేనిచో స్థిమిత ముండదు. మూడు గుణములూ ఆవశ్యకమే. మూడునూ దివ్యగుణములే. అవి శ్రీమాతనుండి ఉద్భవించినవి కదా! ఈ గుణములు నిర్వర్తింప బడుచున్నప్పుడు, అన్ని దోషములు కూడా ఏర్పడుచుండును. దోషములు ఎప్పటికప్పుడు నిర్మూలించుకొన వలెను.

దోష విసర్జనము చేయనిచో దోషములు బలమై గుణములు మసకబారును. ప్రతినిత్యము శరీర మలినములు నిర్మూలించు కొననిచో శరీరము రోగగ్రస్తమగును కదా!

అట్లే వాక్కు, ఇంద్రియములు, మనస్సులను వినియోగించు చున్నపుడు కూడ దోషములు ఏర్పడవచ్చును.

దోషములేని భాషణము, ఇంద్రియ పరితృప్తి, మనో భాపన కలిగియున్నవాడు పూర్ణానందమును పొందగలడు. ఇట్లు మూడు లోకముల దోషములను నిత్యమూ విసర్జించుచూ జీవించువాడు దేవీ ప్రకాశము కలిగి విరాజిల్లును.

అద్దమున్న చాలడు. దానిని నిత్యమూ పరిశుభ్రము చేసుకొను చుండవలెను. అప్పుడే ప్రతిబింబము స్పష్టముగా గోచరించును. జీవుడు దేవుని ప్రతిబింబమే. తనయందలి దైవము తనకు నిత్యమూ గోచరించవలెనన్నచో మనో ఇంద్రియ శరీరములందలి దోషములను నిత్యమూ విసర్జించు చుండవలెను. శ్రీమాత పరిపూర్ణ దోషవర్ణిత. అందువలన ఆమెయందు శివతత్త్వము పరిపూర్ణముగ ప్రతిబింబించ వచ్చును. అందులకే ఆమె 'శివా' అయినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 195 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Doṣa-varjitā दोष-वर्जिता (195) 🌻

She is devoid of blemishes, yet another quality of the Brahman. Blemish arises out of hatred, desire, etc. Here, blemish refers to mind and not the gross body. She does not have any blemish and this has been discussed in earlier nāma-s in this Sahasranāma.

With this nāma the effects of worshipping Her formless form (nirguna Brahman) ends. Nāma-s 196 to 248 discuss about Her various forms known as saguṇa Brahman or the Brahman with attributes. Worshipping God without form is called nirguṇa worship and considered as superior. Worshipping God in various forms is called saguṇa worship. Religious faiths are based on saguṇa worship (with forms and attributes).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2021

No comments:

Post a Comment