భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 161


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 161 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 6 🌻


625. మానవునిలో నెలకొనిన భగవంతుని జీవితములో, ఆ మానవుడు భగవంతునిగా సహజ సమాధి యొక్క అనుభవమును పొందును. ఏ కొంచెము ప్రయాసము లేకుండా ఏకకాలమందే నిరంతరాయంగా సహజముగా అటు భగవంతుని అనంత జ్ఞాన, శక్తి, ఆనందములను ఇటు మానవజాతి యొక్క బలహీనతలను, బాధలను అనుభవించును. ఇవి-తన అనంత సర్వము నుండి పుట్టిన అభావజన్యములే యనియు,ఈయనుభవము మిథ్యానుభవమే ననియు ఎఱుంగును.

626.ఏక కాలమందే అటు భగవంతునిగను ఇటు మానవునిగను అనుభవించు స్థితియే పూరస్థితి.

627. ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో పూర్ణత్వము మూడు విధములుగా నుండును.

1. పరిపూర్ణ మానవుడు

2. పరిపూర్ణ మానవ శ్రేష్టుడు

3. పరమ పరిపూర్ణుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2021

No comments:

Post a Comment